నూతన పారిశ్రామిక చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ఎంఎస్‌ఎంఈ ఏడీ డాక్టర్ కె.ఎల్.ఎస్.రెడ్డి
బాపట్ల: నూతన పారిశ్రామిక విధానాలపై అవగాహన కలిగి ఉండి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను, సహకారాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించవచ్చని ఎంఎస్‌ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెఎల్‌ఎస్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులు, వాటిపై అవలంబించాల్సిన విధానాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను స్థాపించేందుకు కావాల్సిన వనరులపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి తెలుసుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు తక్కువ పెట్టుబడి వ్యయంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని నాణ్యతతో కూడిన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలలో సబ్సిడీలను కూడా తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో–ఆర్టినేటర్ పి.వీరయ్య, బాపట్ల జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిశెట్టి రత్నగుప్తా, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment