అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి
ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి. కాశీం
ఏఎన్‌యూ: అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘రోల్ ఆఫ్ బాబూ జగ్జీవన్‌రామ్ ఇన్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభలో ఆచార్య కాశీం కీలకోసన్యాసం చేశారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ లక్ష్యం ఒక్కటేనన్నారు. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కోటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎస్.సరళా వందనం, విశ్రాంత ఐఆర్‌టీఎస్ అధికారి ఎ.భరత్‌భూషణ్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆలోచనా విధానాలను వివరించారు. వీసీ ఆచార్య కె. గంగాధరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, కావలి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ కళాశాల కామర్స్ విభాగాధిపతి ఆచార్య సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ నివేదిక సమర్పించారు. అనంతరం సదస్సు పరిశోధనా పత్రాల సావనీర్‌ను, బాబూ జగ్జీవన్‌రామ్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. ఆనందబాబు రాసిన కర్మయోగి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ పుస్తకాన్ని అతిఽథులు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment