వైభవంగా శత చండీ మహా యాగం
సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవీ ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య శ్రీ హనుమత్ స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురు వందనం, ప్రధాన దేవతా ఆర్చణ, శత చండీ హోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్ర పుష్పం, అమ్మవార్లకు దశ విధ అభిషేకాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. బగలాముఖి, రాజశ్యామల, వారాహి హోమాలు, యోగిని మండప హోమాలు నిర్వహించారు.గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 6న ప్రారంభమైన పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారంతో ముగియనుంది. ఆఖరి రోజు శనివారం సర్వతోభద్ర మండల హోమాలు, ప్రాయశ్చిత హోమాలు, శాంతి హోమాలు, మహా పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం, ప్రోక్షణ, వేదఆశీర్వచనం, పండితుల సత్కారాలు, అన్నదానం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హజరుకానున్నట్లు ధర్మకర్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment