నాటక కళ పరిరక్షణ అందరి బాధ్యత
నగరంపాలెం: సర్వ కళా సమాహారం నాటకమని, ఇటువంటి కళను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళా వేదికపై కళా విపంచి (హైదరాబాద్), ఆరాధన ఆర్ట్స్ అకాడమి (గుంటూరు), నటరత్న ఎన్.టి.ఆర్. కళాపరిషత్ సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న రంగస్థల పురస్కారాల సభ గురువారం రాత్రి ప్రారంభమైంది. పిన్నమనేని మృత్యుంజయరావుకు గురజాడ పురస్కారం, బసవరాజు జయశంకర్‌కు బళ్లారి రాఘవ పురస్కారం, వైవీఆర్ ఆచార్యులకు పీఎస్‌ఆర్ రస్కారం, సుంకర కోటేశ్వరరావుకు గరికపాటి రాజారావు పురస్కారం, సురభి సంతోష్‌కు గోవిందరావు పురస్కారం, తిరుమలాబీకి రఘురామయ్య పురస్కారం, డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబుకి వై.కే.నాగేశ్వరరావు పురస్కారం, జ్యోతికి జామున రాయలు పురస్కారం, మల్లాది భాస్కర్‌కు జంధ్యాల పురస్కారం అందించి, సత్కరించారు. తొలుత ఆలాపన వెంకటేశ్వరరావు, మునిపల్లె రమణ సినీ భక్తి గీతాలు అలపించారు. రచయిత, సినీ నటుడు యు.సుబ్బరాయశర్మ, భారత మంత్రిత్వ శాఖ నిపుణులు డాక్టర్ ఎస్.రామచంద్రరావు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, కళా పోషకులు నూత లపాటి సాంబయ్య, ఉప కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. బొప్పన నరసింహారావు, డి.తిరుమలేశ్వరరావు, వెంకటేశ్వరరావు, భాగి శివశంకరశాస్త్రి, జీవీజీ శంకర్, జానీబాషా, మధుసూదనరావు పర్యవేక్షించారు.
మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు
పలువురికి రంగస్థల, ఉగాది పురస్కారాలు ప్రదానం