
ఉగ్రవాదుల దాడులు హేయం
మాచర్ల: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు 28 మందిని దారుణంగా హతమార్చడం అత్యంత హేయమైన ఘటన అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) పేర్కొన్నారు. బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు వందలాది మందితో మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నల్లబ్యాడ్జీలు ధరిస్తూ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే అంశమని, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి.. ఉగ్రవాదులను తరిమికొడదాం. సమైఖ్యంగా ఉందాం.. జై భారత్, జై జై భారత్ అంటూ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మాచర్ల ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, జెడ్పీటీసీ మండ్లి పెద మల్లుస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, మాజీ జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల నాయకుడు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీను, మంచికల్లు చంద్రారెడ్డి, సర్పంచ్ గొట్టం బ్రహ్మారెడ్డి, నాయకులు బూడిద సైదులు, నవులూరి చెన్నారెడ్డి, పఠాన్ సత్తార్ ఖాన్, షేక్ నాగూర్, కౌన్సిలర్‌లు మందా సంతోష్, మాచర్ల సుందరరావు, దుర్గి మండల నాయకులు ఉన్నం వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయ్), షేక్ మస్తాన్, కో–ఆప్షన్ మెంబర్ అల్లి జీవన్, మైనార్టీ నాయకులు సయ్యద్ బాషా, షేక్ ఉస్మాన్, షేక్ జాని, సయ్యద్ బాబా వలి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
కశ్మీర్ మృతుల ఆత్మశాంతి కోరుతూ ర్యాలీ
అమరావతి: కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్రవాదుల చేతిలో బలైన 28 మంది పర్యాటకుల ఆత్మశాంతికి బుధవారం అమరావతిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమరేశ్వరాలయం నుంచి నల్ల బ్యాడ్జిలు ధరించి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకుడు కోలా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈర్యాలీ మెయిన్ రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్, దుర్గావిలాస్ సెంటర్‌ల మీదుగా మద్దూరు డౌన్ సెంటర్ వరకు సాగింది. బీజేపీ నాయకులు మద్ది ధాత్రినారాయణ, రమణ, నేరెళ్ల హనుమంతరావు, మేకల శివశంకర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఉగ్రవాదుల దాడులు హేయం