కూటమి తూట్లు
సర్పంచ్‌ల హక్కులకు..
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా.. వెండర్ విధానం ద్వారా పనులు చేయించడం సర్పంచ్‌ల హక్కులు కాలరాయడమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వెండర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ను సోమ వారం కలిసి వినతిపత్రం అందజేశారు. వెండర్ విధానాకి విరుద్ధంగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను జతపరిచారు. అంతకుముందు పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సర్పంచులతోపా టు మన్యం జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన జోగారావు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఉపాధిహామీ పథకం–2005 చట్టానికి విరుద్ధంగా గ్రామంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులకు తెలియకుండా.. వారి తీర్మానాలు లేకుండా వెండర్ విధానం ద్వారా కూటమి ప్రభు త్వం తమ అనుచరులకు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సర్పంచుల హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. చట్టానికి విరుద్ధంగా నేడు గ్రామాలలో పనులు చేపట్టడం సర్పంచులను తీవ్రంగా అవమాన పరచడమేనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పార్టీ అధిష్టానం సూచన ల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు సారఽథ్యంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు సమక్షంలో చర్చించి, కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం అక్కడ నుంచి ప్రజాప్రతినిధులంతా కోర్టు తీర్పు కాపీలను జత చేసి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉపాధి హామీ పను లు చట్టానికి విరుద్ధంగా జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచుల హక్కులను కాదని వెండర్ విధానం ద్వారా పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సర్పంచుల హక్కులు, అధికారాలు కాపాడాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షు లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పల్లెల్లో కూటమి ప్రభుత్వ ప్రత్యేక చట్టం అమలు
వెండర్ విధానంలో ఉపాధిహామీ పనులు
సర్పంచ్‌ల తీర్మానానికి చెల్లు
హైకోర్టు తీర్పు ఉన్నా బేఖాతరు
ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ
ప్రజాప్రతినిధులు
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు ఫిర్యాదు
పవన్ కళ్యాణ్ స్పందించాలి...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు తగిన ప్రాధాన్యమిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆచరణలో అది అమలు కావడం లేదు. ఆయన స్పందించాలి. సర్పంచ్‌ల ఆమోదం, తీర్మానం లేకుండా గ్రామంలో పనులు జరుగుతున్నాయి. ఎందుకూ పనికి రాని కూటమి కార్యకర్తలు సర్పంచ్‌ల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై హక్కులను మాకు కల్పించాలని కోరుతున్నాం.
– జి.సతీష్, పుట్టూరు గ్రామ సర్పంచ్.
సర్పంచ్ అంటే సుప్రీం అన్నారు..
సర్పంచ్ అంటే సుప్రీం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ ఆనాడు చెప్పారు.. నేడు అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంది. కనీసం ఒక మనిషిగానూ మమ్మల్ని గౌరవించడం లేదు. మా హక్కులు మేం పొందలేకపోతున్నాం. మాకు సంబంధించిన పనులు సర్పంచ్‌లకు చెప్పే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు వినతిపత్రం ఇచ్చాం.
– బంకురు రవికుమార్, పంచాయతీరాజ్‌విభాగం అధ్యక్షుడు, పార్వతీపురం నియోజకవర్గం
మా హక్కులను కాలరాస్తున్నారు..
కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. 86 శాతం ఉన్న వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ల ను పక్కన పెట్టారు. నెత్తి మీద రూపాయి పెట్టినా పనికిరాని వారితో గ్రామాల్లో పనులు చేయించుకుంటున్నారు. ప్రోటోకాల్ పక్కన పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలేవీ అమలు కావడం లేదు. మా హక్కులను కాలరాస్తున్నారు. – కురిటి మోహనరావు, సర్పంచ్,
పి.చాకరాపల్లి, బలిజిపేట మండలం
కూటమి తూట్లు
కూటమి తూట్లు
కూటమి తూట్లు
కూటమి తూట్లు
Comments
Please login to add a commentAdd a comment