శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
రాష్ట్రం మొత్తం
మీ వైపు చూస్తోంది
పాలకొండ: గంజాయి వనంలో తులసి మొక్కల వలే నిలబడ్డారు... రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తోంది.. పార్టీ ప్రతిష్టను పెంచారు... ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పాలకొండ నగరపంచాయతీ కౌన్సిలర్లను అభినందిస్తూనే భరోసా ఇచ్చారు. పాలకొండలోని పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నగర పంచాయతీ కౌన్సిలర్లతో కాసేపు మాట్లాడారు. ఇటీవల నగరపంచాయతీ చైర్మన్ ఎన్నికలో కూటమి నాయకుల ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్ కౌన్సిలర్లు పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడిన తీరును అభినందించారు. బలంలేకపోయినా చైర్మన్ కుర్చీకోసం కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలను అడ్డుకుని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లందరూ ఏకతాటిపై నిలబడడం గర్వంగా ఉందన్నారు. కౌన్సిలర్లతో సెల్ఫీలు దిగి వారిని ఉత్సాహపరిచారు. సాక్షాత్తు జగన్‌మోహన్‌రెడ్డి కౌన్సిలర్లను, పార్టీ నాయకులను పేరుపేరున పలుకరించడం, భరోసా కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
శివరాత్రికి జిల్లా నుంచి
55 బస్సులు
పార్వతీపురంటౌన్: శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా నుంచి 55 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా శాఖాధికారి కె. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో గల శైవ క్షేత్రాలకు మూడు డిపోల నుంచి బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 26,27 తేదీల్లో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి కొమరాడ మండలం గుంప సోమేశ్వర ఆలయానికి 10 బస్సులు ఏర్పాటు చేశామని, చార్జీ రూ. 20గా నిర్ణయించినట్లు తెలి పారు. సాలూరు డిపో నుంచి పారమ్మ కొండకు 25బస్సులు ఏర్పాటు చేశామని, చార్జీ రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు. పాలకొండ నుంచి రామతీర్థం క్షేత్రానికి 20బస్సులు ఏర్పాటు చేశామని, చార్జీ రూ.30గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులంతా ఆర్టీసీ సర్వీ సులను వినియోగించుకోవాలని తెలిపారు.
రెచ్చగొట్టేలా పోస్టులు
పెడితే చర్యలు
● ఎస్పీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ వ్యక్తులు, మహిళలు, పిల్లలు, సంస్థలపై హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు రోలింగ్ చేసినా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టిన, షేర్‌చేసేవారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత అనవసర పోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు.
నాటిక పోటీలు ప్రారంభం
నెల్లిమర్ల: జరజాపుపేటలో నల్లి సూరిబాబు స్మారక కళాప్రాంగణంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రదర్శించిన రైతే రాజు, ఎడారిలో వాన చినుకు నాటికలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ప్రారంభోత్సవంలో చనమల్లు వెంకటరమణ, సువ్వాడ రవిశేఖర్, పలువురు కళాకారులు పాల్గొన్నారు.
పాలకొండలో ప్రజలకు అభివాదం చేస్తున్న
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ/పాలకొండ రూరల్: అభిమానం ఎక్కడికీ పోలేదు.. మమకారం ఇసుమంతైనా తగ్గలేదు.. ఆప్యాయత అణువంతైనా మారలేదు. మన్యం ప్రజలకు, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మధ్య విడదీయరాని అనుబంధం పాలకొండ సాక్షిగా గురువారం నిరూపితమైంది. జగన్‌మోహన్ రెడ్డిపై తమ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న మమకారం ఆయన పర్యటనలో కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు, కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పాలకొండ రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.
అడుగడుగునా అభిమాన వర్షం
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయన... విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వీరఘట్టం రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు ఆయనకు అక్కడ ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వాహన శ్రేణి వెంట రాగా.. రోడ్డు మార్గంలో రాజాం జంక్షన్, కోటదుర్గ జంక్షన్ గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాలకొండలోని పాలవలస ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర అభిమానులు ద్విచక్ర వాహనాలతో ఆయన వెంట హుషారుగా కదిలారు. మార్గమధ్యంలో పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల జగన్ ఎక్కడా వాహనం దిగనప్పటికీ... మధ్యమధ్యలో ప్రజల అభిమానంతో కారు మీద నుంచే ఆగి, అభివాదం చేసుకుంటూ వెళ్లారు.
పాలకొండ పట్టణంలోని పాలవలస విక్రాంత్ ఇంటి వద్దకు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.45 సమయంలో అక్కడకు చేరుకున్న జగన్.. తొలుత దివంగత పాలవలస రాజశేఖరం చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖరం సతీమణి ఇందుమతి చేతిలో చేయివేసి ధైర్యం చెప్పారు. రాజశేఖరం కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పిరియా విజయ, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్బాబు, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, కుంభా రవిబాబు, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, గొర్లె కిరణ్‌కుమార్, గొండు కృష్ణమూర్తి, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, నాయకులు తలేరాజేష్, పేరాడ తిలక్, గొడ్డేటి మాధవి, జమ్మాన ప్రసన్న కుమార్, జయమణి, రేగాన శ్రీనివాస్, నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్య నారాయణరాజు, అంధవరపు సూరిబాబు, పిరియా సాయిరాజ్, ధర్మాన కృష్ణ చైతన్య, కరిమి రాజేశ్వరరావు, మెంటాడ పద్మావతి, చింతాడ రవికుమార్, కిల్లి సత్యనారాయణ, పాలిన శ్రావణి, దుంపల లక్ష్మణరావు, చెట్టి వినయ్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి ఎన్ని కను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్‌ఎస్‌ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్: జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలను రానున్న రెండు మాసాల్లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలోని రెండు యూపీహెచ్‌సీలు ఈ నెలాఖరులోగా పూర్తిచే యాలన్నారు. సాలూరులోని యూపీహెచ్‌సీ మార్చి చివరనాటికి, పాలకొండ యూపీహెచ్‌సీ ఏప్రిల్ మాసాంతానికి సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూపీహెచ్‌సీలపై వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల సేవల కసం మంజూరైన యూపీహెచ్‌సీలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. మురుగునీటి వ్యవస్థను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బెలగాంలోని యూపీహెచ్‌సీ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సెప్టిక్ ట్యాంక్ పనులు పెండింగ్ ఉండటంపై కలెక్టర్ ఆరా తీశారు. పూర్తి చేసిన పనులకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల అవుతున్నందున త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సాలూరు తెలగ వీధిలోని యూపీహెచ్‌ఈ, పాలకొండ యూపీహెచ్‌సీలకు ప్లోరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పెండింగ్ ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని, మెంటాడ వీధిలోని యూపీహెచ్‌సీ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. యూపీహెచ్‌సీ నిర్మాణ పనులన్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కావాలని, ప్రతివారం ప్రగతి ఫొటోలను తమకు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎంఎస్‌ఎంఈల సర్వే మరింత వేగవంతం చేసి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మున్సిపాల్టీతో పాటు చుట్టు పక్కల పంచాయతీలను స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మాస్టర్ ట్రైనీలకు శిక్షణ
స్వచ్ఛ సుందర పార్వతీపురంపై మార్చి 1వ తేదీ నుంచి మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తామని, అందుకు తగిన పేర్లను సూచించాలని కలెక్ట్ తెలిపారు. రోజూ రెండు పూటలా పారిశుద్ధ్యం చేపట్టేలా ప్రణాళికలు చేయాలని, చెత్తను సేకరించేందుకు వీలుగా తగిన సిబ్బంది, వాహనాలను సిద్ధం చేసుకోవాలని వివరించారు. సమావేశంలో వైద్యాధికారి టి.జగన్‌మోహన్‌రావు పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్: సమావేశంలో
మాట్లాడుతున్న కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
న్యూస్‌రీల్
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పార్టీ ప్రతిష్ట నిలిపారు..
మీ అందరికీ అండగా ఉంటా..
కౌన్సిలర్లను అభినందించిన జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లోనూ
నూతనోత్సాహం
పాలవలస కుటుంబానికి
మాజీ ముఖ్యమంత్రి
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ
వైఎస్సార్ సీపీ అధినేతకు అపూర్వ
ఆదరణ
గుండెల్లో పెట్టుకున్న ఏజెన్సీ ప్రజానీకం
హెలిప్యాడ్ నుంచి పాలవలస ఇంటి వరకూ దారి పొడవునా తోడ్కొని వెళ్లిన నాయకులు, అభిమానులు
సీఎం
సీఎం...
పల్లె పండగ పనులపై దృష్టి సారించండి
జిల్లాలో పల్లె పండగ కింద మంజూరైన పనులపై దృష్టి సారించి శతశాతం పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పల్లె పండగ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె పండగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. పూర్తి చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా మంజూరైన, పూర్తయిన పనులు, బిల్లులు మంజూరు, పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి మాసాంతానికి శతశాతం పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కురుపాంలో మందకొడిగా పనులు
కురుపాంలో పనులు వేగవంతం కావడం లేదని, దానిపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌ను రద్దుచేసి, వేరే కాట్రాక్టర్‌తో పనులు చేపట్టాలని కలెక్టర్ వివరించారు. ఫిబ్రవరి మాసాంతంలోగా పనులు పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైతే అదనపు పనివారిని ఏర్పాటు చేసుకుని, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఉపాధిహామీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి
జాతీయ ఉపాధిహామీ కింద జిల్లాలో చేపట్టిన పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం ఉపాధిహామీ పనులపై ఎంపీడీఓలతో కలెక్టర్‌ర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మినీ గోకులాలు, ప్రహరీలు, ఫారంపాండ్స్, ఫిష్ పాండ్స్, రహదారులు తదితర పనుల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఉపాధిహామీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఉపాధి కింద చేపడుతున్న పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, బిల్లులను పంపాలని సూచించారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల కుమారుడి కష్టా న్ని పాలకొండకు చెందిన ముదిల జ్యోతి జగన్‌మోహన్‌రెడ్డికి వివరించగా.. చిన్నారి ఆరోగ్య బాధ్యతను మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు.
జగన్‌తో సెల్ఫీలు దిగేందు కు మహిళ లు, వృద్ధు లు, యువకులు, విద్యార్థులు అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారూ పోటీ పడ్డారు. గోడలు, గేట్లు గెంతారు. జగనన్నను చూసేందుకు పాలకొండ రో డ్డులో దారి పొడవునా జనం వేచిచూశారు. ఇళ్ల డాబాపైకి ఎక్కి ఆశగా చూశారు. అభిమాను లు అడుగడుగునా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. సుమా రు మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగన్‌మోహన్ రెడ్డి పాలకొండ చేరుకున్నారు. సాయంత్రం 4.15 నిమిషాలకు తిరు గు ప్రయాణమయ్యారు. దాదాపు గంట సమయం పాలవలస ఇంటిలోనే గడిపారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల ముఖ్య నేత లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు ఆయనను కలిశారు. పట్టణంలో పలువురు చిన్నారులను ఆయన దగ్గరకు తీసుకోవడంతో తల్లిదండ్రులు మురిసిపోయారు.
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment