రాజకీయాలకు అతీతంగా టీచర్లకు సేవలందిస్తా
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే అజెండాగా రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు ఉద్ఘాటించారు. పీఆర్‌టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తోటపాలెంలోని ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నికై న తరువాత ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆయన దృష్టికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలను తీసుకెళ్లానని వివరించారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధానకార్యదర్శి వి.రవీంద్రనాయుడు, ఆర్.రాంబాబు, బంకపల్లి శివప్రసాద్, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, శంకర్‌నాయుడు, వివిధ మండల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయంలో ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యా ప్రగతి ప్రధాన సంపాదకుడు జి.సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పి.ధనుంజయరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుసూదన రావు, డి.వెంకటనాయుడు, ఆరు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీఆర్‌టీయూ జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment