‘శతర’ కవితా సంపుటి ఆవిష్కరణ
పార్వతీపురం: తాను రచించిన ‘శతర’ ఆదివాసీ కవితా సంపుటిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో నిర్వహించిన ద్వితీయ తెలుగు మహసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ.రమణ శనివారం ఆవిష్కరించారని ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలుగు మహసభల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. ‘శతర’ పుస్తకంలో అడవుల్లోని అందాలు, గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, విద్య, ఆరోగ్యం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గిరిజనుల విధానంలో మార్పు తదితర అంశాలను పొందుపరిచినట్లు వివరించారు. తాను రాసిన కవితా సంపుటికి దేశంలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment