పిల్లలు తల్లిదండ్రుల ప్రతిబింబాలు
విజయనగరం అర్బన్: విద్యార్థులు బాల్యంలో తమ తల్లిదండ్రులను అనుకరిస్తారని వారికి మంచి విద్య ద్వారానే వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ పాఠశాలలో ఆదివారం జరిగిన 27వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువలతో కూడిన అత్యుత్తమ విద్యను అందించడానికి విద్యాసంస్థలు ఉత్తమ నిర్వహణతో పాటు విద్యార్థి వ్యక్తిత్వపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం అవసరమన్నారు. విద్యార్థి దశ నుంచి విద్యతోపాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కళాప్రదర్శన, చిన్నారుల ఆటపాటలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. పాఠశాల కరెస్పాండెంట్ స్వరూప ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, రిటైర్డ్ డీఈఓ అరుణకుమారి, పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎంవీఆర్‌కృష్ణాజీ, ప్రధానోపాధ్యాయుడు పూడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ యూ.మాణిక్యం నాయుడు
Comments
Please login to add a commentAdd a comment