బొండపల్లిలో ఒకేషనల్ జవాబు పత్రాల మూల్యాంకనం
సీతంపేట: ఉత్తరాంధ్రంలోని ఇంటర్మీడియట్ వృత్తివిద్యా కోర్సు విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం విజయనగరం జిల్లా బొండపల్లిలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి మూల్యాంకనం జరగనుంది. గతంలో విశాఖపట్నం జైలు రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించేవారు. జనరల్ సబ్జెక్టుల మూల్యాంకనం యథావిధిగా పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 14న మెరిట్ జాబితా విడుదల
విజయనగరం ఫోర్ట్: వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో 91 పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఏప్రిల్ 14న ప్రకటిస్తామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న ప్రకటించిన ప్రొవి జినల్ జాబితాలో అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తెలియజేయాలన్నారు. ఎంపికై న అబ్యర్థులకు ఏప్రిల్ 20వ తేదీన కౌన్సెలింగ్ చేసి నియామకపత్రం అందజేస్తామని పేర్కొ న్నారు.
రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు
చీపురుపల్లిరూరల్ (గరివిడి): తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించా లని గరివిడి వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల విద్యార్థులు కోరారు. కళాశాలకు వీసీఐ గుర్తింపు, స్టైఫండ్ రూ.25వేలకు పెంచాలని 41 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడంపై మండిపడ్డారు. దీనికి నిరసనగా గరివిడి–విజయనగరం ప్రధాన రోడ్డు పై శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద కాసేపు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
నేడు ఎఫ్‌ఆర్‌ఓ ఉద్యోగాలకు రాతపరీక్ష
● పకడ్బందీగా ఏర్పాట్లు: డీఆర్‌ఓ
విజయనగరం అర్బన్: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే రాతపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే, ఈ నెల 17న జరగనున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తన చాంబర్‌లో పరీక్ష ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలోని చింతలవలస వద్ద ఉన్న ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు, వివిధ శాఖల ప్రతినిధులు, ఏపీపీఎస్‌సీ అధికారులు పాల్గొన్నారు.
బొండపల్లిలో ఒకేషనల్ జవాబు పత్రాల మూల్యాంకనం
Comments
Please login to add a commentAdd a comment