పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

Published Mon, Mar 17 2025 12:31 AM | Last Updated on Mon, Mar 17 2025 12:32 AM

పేదల

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

ఆటోవాలా డీలా..!

ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వాలు తరచూ డీజిల్‌ ధరలు

పెంచుతూపోవడంతో తిప్పలు తప్పడం లేదు.

8లో

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడచినా ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఇతరత్రా కార్యకలాపాలకు ఇవి వినియోగమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటిి వరకు భవన నిర్మాణాలు పూర్తి చేసిన వాటిల్లో ఎంఎల్‌హెచ్‌పీ, వైద్యాధికారులు పర్యవేక్షణలో నిరంతరం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు సాధారణ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వైద్యసేవలు పొందుతున్న వారంతా మా గ్రామాల్లో కూడా విలేజ్‌ క్లినిక్‌ల భవనాలు నిర్మాణాలు పూర్తి చేసి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇంతలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో విలేజ్‌ క్లినిక్‌లు పని సామర్థ్యం, భవన నిర్మాణాల వసతుల పేరుతో మంగళం పాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విలేజ్‌ క్లినిక్‌లకు పూర్తి స్థాయిలో మందులు సమకూర్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని సంకల్పించినప్పటికీ కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయుష్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా విలేజ్‌ క్లినిక్‌లను ఆధునీకరించడానికి పరిశీలనలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విలేజ్‌ క్లినిక్‌లను త్వరలో పరిశీలించనున్నట్లు తెలియవచ్చింది.

పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం

పార్వతీపురం టౌన్‌: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధాన కారణం పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ జీకి ప్రియ శిష్యులని ఆయన పేర్కొన్నారు. సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత కలిగిన మహానుభావుడు శ్రీరాములు అని కొనియాడారు. శ్రీరాములు స్ఫూర్తి, అంకితభావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఆయన అడుగుజాడల్లో నడవటం ఆవశ్యకమన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్‌, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పరిధిలో

26 టెన్త్‌ పరీక్ష కేంద్రాలు

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో 26 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో 1791 మంది గిరిజన విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయనున్నట్టు ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర ఆదివారం తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సీతంపేట మండలంలో 8 కేంద్రాల్లో పరీక్షలు విద్యార్థులు రాయనున్నారన్నారు. సీతంపేట బాలికలు, బాలురు గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, హడ్డుబంగి, చిన్నబగ్గ, దోనుబాయి, మల్లి కేంద్రాల్లో విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు.

ఏపీ ట్రెజరీస్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఎన్నిక ఏకగ్రీవం

విజయనగరం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీటీఏఎస్‌ఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యు లు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ కాంప్లెక్స్‌ (ఐఎఫ్‌సీ) భవనంలో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంఘం రాష్ట్ర కోశాధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, కార్యదర్శిగా పి.శాంతి కిరణ్‌కుమార్‌, కోశాధికారిగా పి.వీరన్న దొర, సహాధ్యక్షులుగా ఎం.నూకరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వై.కృష్ణశ్రావణ్‌, ఉపాధ్యక్షులుగా పి.సురేష్‌బా బు, ఎస్‌.రామకృష్ణ, పి.వరలక్ష్మి, కార్యదర్శులు గా సీహెచ్‌ రమేష్‌బాబు, ఎం.దుర్గాప్రసాద్‌, వై.జయశ్రీ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి గా పీవీ నారాయణరావు నూతన కమిటీని ప్రకటించారు.

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న న్యాయమూర్తులు

చీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు న్యాయమూర్తులు ఆది వారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన జిల్లా అడిషనల్‌ జడ్జి(ఫ్యామిలీ కోర్టు) కె.విజయ కల్యాణి, చీపురుపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి వై.ప్రేమలతలకు దేవదాయ శాఖ ఈఓ బి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో ఆశీర్వాదాలు అందజేసిన అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

విజయనగరం ఫోర్ట్‌: పంటల సాగులో ఈ–క్రాప్‌ నమోదు చాలా ముఖ్యమైనది. పంటను విక్రయించుకోవాలన్నా, పంట నష్టం జరిగినప్పడు బీమా పొందాలన్నా ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి. ఈ– క్రాప్‌ నమోదు చేసుకున్న ప్రతీ రైతు ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ–క్రాప్‌, ఈకేవైసీ చేయించుకుంటేనే రైతులకు రావాల్సిన పథకాలు, సౌకర్యా లు అందుతాయి. లేదంటే అందవు. రబీ సీజనల్‌లో వేలాది మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ – క్రాప్‌ నమోదు చేయించుకున్నప్పటకీ ఈకేవైసీ మాత్రం చేసుకోలేదు.

రబీలో ఇలా..

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 61,324 మంది ఈ–క్రాప్‌ నమోదు చేసుకున్నారు. 56,406 మంది రైతులు ఈౖకేవేసీ చేయించుకున్నారు. 4,918 మంది ఈకేవైసీ చేయించుకోలేదు. 1,02,760 ఎకరాల్లో అన్ని రకాల పంటలకు ఈ–క్రాప్‌ నమోదు అయింది. 96,097 ఎకరాలకు ఈకేవైసీ జరిగింది. 6,673 ఎకరాలకు ఈకేవైసీ జరగ లేదు.

బీమా పంటలకు సంబంధించి ఈ–క్రాప్‌ ఇలా..

వరి, మినుము, పెసర, మొక్కజొన్న పంటలకు పంటల బీమా వర్తిస్తుంది. ఈ నాలుగు పంటలకు సంబంధించి 97,778 ఎకరాలకు ఈ–క్రాప్‌ నమోదు అయింది. ఇందులో ఈకేవైసీ 91,315 ఎకరాలకు అయింది. 6,463 ఎకరాలకు ఈకేవైసీ జరగలేదు. వరి పంటకు సంబంధించి 2279 ఎకరాలకు ఈ– క్రాప్‌ అయింది. ఈకేవైసీ 2052 ఎకరాలకు అయింది. 1594 మంది ఈ–క్రాప్‌ చేసుకోగా1452 మంది రైతులు ఈకేవైసీ చేయించుకున్నారు. మినుము పంటకు సంబంధించి 39,538 ఎకరాలకు ఈ–క్రాప్‌ నమోదు కాగా ఈకేవైసీ 37,073 ఎకరాలకు అయింది. 33,480 మంది రైతులు ఈ–క్రాప్‌ నమోదు చేసుకోగా ఈకేవైసీ 31082 మంది రైతులు చేసుకున్నారు. పెసర పంటలకు సంబంధించి 15,769 ఎకరాలకు ఈ–క్రాప్‌ నమోదు కాగా ఈకేవైసీ 14,813 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 17,593 మంది రైతులకు ఈ–క్రాప్‌ నమోదు కాగా ఈకేవైసీ 16,319 మంది రైతులు చేసుకున్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 40,191 ఎకరాలకు ఈ–క్రాప్‌ నమో దు కాగా ఈకేవైసీ 37,377 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 23,398 మంది రైతులు ఈ–క్రాప్‌ నమో దు కాగా ఈకేవైసీ మాత్రం 21,527 మంది రైతులు చేసుకున్నారు.

పార్వతీపురం టౌన్‌: ఎక్కడి వారికి అక్కడే వైద్యం అందించాలన్న గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌కు దిక్కు లేకుండా పోయింది. నేటికీ చాలా కార్యాలయ భవన నిర్మాణాలు పునాదులు, గోడలకే పరిమితమయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.30 లక్షల వ్యయంతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 162 గ్రామ పంచాయతీల్లో విలేజ్‌ క్లినిక్‌లు నిర్మించడానికి అనుమతులిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 16 భవన నిర్మాణాలు పూర్తి చేయగా, 176 భవన నిర్మాణాలు వివిధ స్థాయిల్లో ఉండగా పలు కారణాలతో 16 భవన నిర్మాణాలు ప్రారంభించలేదు. నిర్మాణాలకు అనుమతులతో పాటు భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేయడంతో పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల అక్కడ ఉన్న ముడిసరుకు ఆధారంగా పనులు పూర్తి చేయగా మరికొన్ని చోట్ల పునాదులు, గోడలు, శ్లాబ్‌ల పనులు వచ్చేసరికి ఎన్నికల కోడ్‌ రావడం వల్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలతో పాటు విలేజ్‌ క్లినిక్‌ భవనాలు మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత వాటి నిర్మాణ పనులు గాలికొదిలేసారు.

ఆవేదన వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు

పనులు పూర్తి చేసిన సకాలంలో బిల్లులు అందుతా

యన్న నమ్మకం లేక గత తొమ్మిది నెలలుగా పనులు ప్రారంభించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల దాదాపు పూర్తి కావచ్చిన భవనాలకు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అన్న సందేహంతో నిర్మాణ పనులు వదిలేశారు. నిర్మాణం పూర్తి చేసిన కొన్ని భవనాల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడంతో విలేజ్‌ క్లినిక్‌లకు తాళాలు వేసి ఉంచిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో రూ. 30లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించి రూ. 3.92కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి అప్పట్లోనే రూ.1.3కోట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో కేవలం బిల్లులు అందవన్న నమ్మకంతోనే పనులను మధ్యలో వదిలేసినట్లు కొంతమంది నిర్వాహకులు తెలుపుతున్నారు.

అందుబాటులోకి తీసుకువస్తాం

పూర్తయిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకువస్తాం. నిర్మాణ పనుల్లో ఉన్న భవనాల నివేదికలను అధికారులకు పంపించాం. నిధులు మంజూరు అయిన వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాం. హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో ప్రజలకు చేరువ చేస్తాం.

– చంద్రశేఖర్‌, పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారి

పార్వతీపురం: అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన అగ్నిగోల్డ్‌ బాధితుల కన్నీటి పాదయాత్రకు బాధితులు తరలి రావాలని అగ్రిగోల్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ స్థానిక కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ ఆర్థిక మోసాలకు పాల్పడి పదేళ్ల తొమ్మిది నెలలు గడిచినా... గతంలో తెలుగుదేశం ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసినప్పటికీ చెల్లింపు విషయంలో విఫలమైందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో కొట్లాదిగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొల్లగొట్టడంతో బాధితుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఆయన వెంట మన్యం జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీఎస్‌ కుమార్‌ ఉన్నారు.

తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ.2 లక్షల చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌

‘సాక్షి’లో ‘ది గోట్‌ లైఫ్‌’ శీర్షికన ప్రచురితమైన కథనం...

అప్పారావు ఆచూకీ కనుగొనేందుకు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు ‘సాక్షి’లోనూ ‘ది గోట్‌ లైఫ్‌’ శీర్షికన ఈ నెల 2న కథనం ప్రచురితమైంది. పలు ప్రసార మాధ్యమాల్లోనూ రావడంతో ఎట్టకేలకు ఈ నెల 11న అతని కుమార్తె దొంబుదొర సాయమ్మ, అల్లుడు చందు కలెక్టర్‌ను కలిశారు. తమది ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా బంధుగాం బ్లాక్‌ పెద వల్లాడ పంచాయతీ చిన వల్లాడ గ్రామమని.. ప్రస్తుతం పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ మునక్కాయవలస గ్రామంలో నివసిస్తున్నట్లు వివరించారు. తండ్రి తప్పిపోయిన తర్వాత.. దిగాలుతో తల్లి కూడా మరణించిందని కుమార్తె వివరించింది. తన తండ్రిని ఇక్కడకు రప్పించాలని, తమ బిడ్డలా చూసుకుంటామని చెప్పింది.

19న అగ్రిగోల్డ్‌ బాధితుల పాదయాత్ర

విజయవాడకు తరలిరండి

అగ్రిగోల్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు

ఈకేవైసీతో ప్రయోజనాలు

పంటల బీమా వర్తిస్తుంది.

పంట రుణాలు తీసుకోవచ్చు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందుకోవచ్చు.

పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.

94 శాతం పూర్తి

రబీ సీజన్‌లో అన్ని పంటలకు సంబంధించి ఈకేవైసీ 94 శాతం పూర్తయింది. 4,918 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ–క్రాప్‌, ఈకేవైసీపై ఈ నెల 17వతేదిన సోషల్‌ ఆడిట్‌ ప్రారంభం అవుతుంది. అంతవరకు ఈకేవైసీ చేయించుకోవచ్చు.

– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు 1
1/5

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు 2
2/5

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు 3
3/5

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు 4
4/5

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు 5
5/5

పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement