చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
పార్వతీపురటౌన్: వేసవి వేడిమి దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లాలో చలివేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. వేసవి వేడిమి, పీజీఆర్‌ఎస్ తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేడిమి పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకురావాలని, తెల్లని వదులు దుస్తులు వేసుకోవడం మంచిదని చెప్పారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో నీడ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేతనదారులకు నీరు అందుబాటులో ఉంచాలని, ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో పనివేళలో మార్పులు చేసుకోవాలని సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న వేడిమి దృష్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొబ్బరి బొండాలు, పానీయాలు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ హేమలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment