శక్తి మొబైల్ యాప్‌పై అవగాహన
విజయనగరం క్రైమ్: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన శక్తి (ఎస్‌ఓఎస్) మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, యువత తన మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం పిలుపునిచ్చారు. మహిళల మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఒక కుటుంబసభ్యుడు మీకు తోడు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో : శక్తి యాప్‌లోని ఎస్‌ఓఎస్ బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకుని రక్షణగా నిలుస్తారని చెప్పారు. రాత్రి సమయాల్లో మహిళలు నైట్ షెల్టర్లలో వేచి ఉండేందుకు దగ్గరలో ఉన్న నైట్ షెల్ట ర్ల వివరాలు, సమీపంలోని పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మొబైల్ యాప్ పై ‘శక్తి‘ బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్‌లు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వేస్టేషన్లు, ముఖ్యకూడళ్ళు, కళాశాలలు సందర్శించి, మహిళలు, విద్యార్ధినులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు.
కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment