దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
గుర్ల: మండలంలోని పెనుబర్తికి చెందిన 15 మంది, గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన 30 మంది తమిళనాడులోని రామేశ్వరం దైవదర్శనానికి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందా రు. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రయాణికుల బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి బస్సు వెనుక భాగంలో ఉన్న కూర్చున్న మహిళలు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుర్ల మండలంలోని పెనుబర్తికి చెందిన రౌతు సూరప్పమ్మ (60), గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన మీసాల అప్పలనారాయణమ్మ (50) ఉన్నారు. అలాగే పెనుబర్తి గ్రామానికి చెందిన బెల్లాన జగన్నాథం, సుంకరి రామలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి.
బావిలో పడి ఒకరు...
పార్వతీపురం రూరల్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి నేలబావిలో శవమై తేలా డు. ఈ మేరకు స్థానిక రూరల్ ఎస్సై బి.సంతో షి గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సారిక వీధికి చెందిన మజ్జి సత్యనారాయణ(54)ఈనెల 18న ఆస్పత్రికి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పరిసర గ్రామాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు భార్య పార్వతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం పార్వతీపురం రూరల్ పరిధిలో ఉన్న బ్యాంక్‌ఆఫ్ బరోడా సమీపంలో నేలబావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మృతదేహాన్ని సత్యనారాయణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాలుగు నెలల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరు మరణించడంతో మనస్తాపానికి గురై సత్యనారాయణ మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
Comments
Please login to add a commentAdd a comment