నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్‌డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment