ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్‌ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్‌సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు.
అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment