శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
పార్వతీపురం రూరల్: పోలీస్ సిబ్బంది విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను విజ్ఞాపనల ద్వారా స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తన కార్యాలయంలో పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది విన్నవించిన సమస్యల్లో సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తామని వెంటనే పరిష్కారం కాని సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. అలాగే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సిబ్బందికి వృత్తి, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ప్రత్యేకంగా గ్రీవెన్స్‌డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment