నాలుగు రోజులకోసారి నీటి సరఫరా..
పార్వతీపురం టౌన్/రూరల్/బలిజిపేట: పార్వతీపురం పట్టణంలో నాలుగురోజులకోసారి కుళాయిల ద్వారా నీటి సరఫరా అవుతోంది. అది కూడా 20 నిమిషాల్లోపే. అరకొర నీరు ఎలా సరిపోతుందంటూ పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌కు ఆనుకుని ఉన్న వీధుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొద్దిరోజుల క్రితం పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలోనూ ఇదే సమస్యపై మహిళలు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో ధర్నాలు సైతం చేశారు. దీనికితోడు పలు వీధుల్లో కుళాయిల ద్వారా బురదనీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని డోకిశీల, గోచెక్క తదితర గిరిజన గ్రామాల్లో తాగునీరు సమయానికి సరఫరా చేయకపోవడంతో నూతులు, వాగులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బలిజిపేట మండలం తుమరాడ, బర్లి గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. మహిళలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పార్వతీపురం మండలంలో డోకిశీల గ్రామంలో తాగునీటి ఎద్దడి కారణంగా మహిళలు సమీపంలోఉన్న ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ప్రతి రోజూ తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment