పది మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలి
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం విధుల్లో మినహాయింపు కోరిన ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వాలని పీఆర్‌టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ సభ్యులు ఈ మేరకు శనివారం డీఈఓ యు.మాణిక్యంనాయుడుని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పదో తరగతి సబ్జెక్టు టీచర్లను మూల్యాంకనం విధుల్లో వేసినపుడు తొలిత ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయాలని కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుమతి ఇస్తూ ఇంకా అవసరం ఉన్న పరిస్థితులను గుర్తించిన తరువాతే తప్పనిసరి విధులుగా కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న సీనియారిటీ అభ్యంతరాలను సమర్పించడానికి గడువు పెంచాలని కోరారు. డీఈఓని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్‌చార్జ్ బంకపల్లి శివప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్టణ, రెడ్డి శంకరరావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
డీఈఓకి పీఆర్‌టీయూ జిల్లా కమిటీ వినతి
Comments
Please login to add a commentAdd a comment