సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

Published Mon, Mar 24 2025 6:40 AM | Last Updated on Mon, Mar 24 2025 11:23 AM

సోమవా

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

అన్నదాతకు కూటమి పాలనలో అన్నీ కష్టాలే.. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూటమి నేతలు కబుర్లు చెప్పారు. తీరా రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో వాణిజ్య పంటల్లో ఒకటైన కోకో సాగు చేశారు. తీరా దిగుబడులు వచ్చేసరికి తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా కోకో

గింజల కొనుగోలులో కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి రైతులను నష్టాల నట్టేట ముంచేస్తున్నాయి. అయినా కూటమి పాలకులకు చీమ కుట్టినట్టైన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.

పార్వతీపురం టౌన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వాణిజ్య పంటల సాగును పెంచండి.. ఆర్థికంగా ఎదగండి అంటూ పిలుపునిచ్చింది. తీరా వాణిజ్య పంటలను సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాణిజ్య పంటల్లో ఒకటైన కోకో రైతుల్లో ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోంది. కోకో సాగు తరువాత వచ్చిన గింజలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో కోకో గింజలను రైతుల వద్దే నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కంపెనీలు వీటిని సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గింజల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు.

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి

ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కోకో రైతులకు న్యాయం చేయకపోతే కంపెనీల మోసాలకు గురై పెద్ద ఎత్తున నష్టపోయి అప్పులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యాన శాఖాధికారులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు అనుగుణంగా రూ.900 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో మరింత ఆలస్యం అయితే కోకో రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో 600 హెక్టార్లలో..

జిల్లాలో ఎక్కువగా గిరిజన, మైదాన ప్రాంతాల్లో కోకో పంటను పండిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 600 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో దళారుల హవా నడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.900 ధర పలుకుతుండగా దళారులు రూ.500 నుంచి 550కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మరీ డిమాండ్‌ చేస్తే రూ.600 దాటడం లేదు. ఓ వైపు ప్రభుత్వం వాణిజ్య పంటలు పండించాలంటూ ప్రకటనలు చేస్తుందని, పంటలు పండించిన తరువాత గిట్టుబాటు ధర లేకుండా దళారుల పాలవ్వడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

నాణ్యత ప్రమాణాలు పాటించాలి

ధర లేక దిగాలు..!

పడిపోయిన ధర

అంతర్రాష్ట్ర మార్కెట్‌లో కిలో రూ.900

స్థానిక మార్కెట్‌లో రూ.600లే..

జిల్లాలో 600 హెక్టార్లలో పంట సాగు

రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి

కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను నష్టపరుస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని అరికట్టాలి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కొనుగోలు చేయాలి. రూ.900లకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలి.

– ఎస్‌.సత్యనారాయణ, సుంకి గ్రామం,

గరుగుబిల్లి మండలం

ప్రభుత్వం కొనుగోలు చేయాలి

కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కోకో గింజల కొనుగోలు కంపెనీలతో అధికారుల సమక్షంలో కోకో రైతులు, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలి. దళారుల చేతికి పంట వెళ్లకుండా ప్రభుత్వం రూ.900లకే కొనుగోలు చేయాలి.

– ఎం.సత్యంనాయుడు,

పార్వతీపురం

కోకో పంట దిగుమతులు వచ్చే సమయంలో రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. జిల్లాలో 600 హెక్టార్లలో ప్రస్తుతం పంట సాగవుతుంది. ధర హెచ్చతగ్గుల విషయంలో అధికారులు కమిటీ వేశారు. కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా ధర ఉంటుంది. రైతులకు మేలు చేకూరేలా పంట కొనుగోలు చేసేలా చర్యలు చేపడతాం.

– శ్యామల,

జిల్లా ఉద్యాన శాఖాధికారిని,

పార్వతీపురం మన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20251
1/5

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20252
2/5

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20253
3/5

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20254
4/5

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20255
5/5

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement