2వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలం●
● 4,240 హెక్టార్లలో అంతర పంటల సాగుకు ప్రణాళికలు
● సీఎం చంద్రబాబుకు వివరించిన
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లాలో రెండు వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ ఈ ఏడాది 1000 ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. వచ్చేఏడాది నాటికి 2 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రైతులు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుతో పాటు అంతర పంటలను సాగుచేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. ఆ దిశగా జిల్లాలోని రైతులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. 4,240 హెక్టార్లలో అంతర పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇతర పంటలను సాగు చేసుకునేలా ప్రోత్సహించేందుకు రైతులను ఎక్స్‌పోజర్ విజిట్‌కు తీసుకెళ్లినట్టు వివరించారు.
స్పందించిన అధికారులు
జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండల కేంద్రంలో తాగునీటి వెతలపై ఇటీవల ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా చేశారు. జిల్లాలో తాగునీటి వెతలపై ఇటీవల ‘ప్ర‘జల’ పాట్లు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తాగునీటి సరఫరాకు వీలుగా ఎంపీడీఓ ఎస్.రమేష్ స్థానిక హరిజనవాడ సమీపంలో రిగ్‌బోర్ తీయించారు.
2వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలం●
Comments
Please login to add a commentAdd a comment