నడవలేనివారు కొందరు... బంగురుతూ వచ్చేవారు మరికొందరు.. కర్రసాయంతో, మరొకరి తోడుతో ముందుకు సాగిన వారు ఇంకొందురు... ఒకరికి ఒకరు తోడుగా వెళ్లినవారు కొందరు... ఇలా.. పింఛన్ అర్హతల నిర్ధారణకు విజయనగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి వచ్చేందుకు దివ్యాంగులు అష్టకష్టాలు పడ్డారు. మండుతున్న ఎండలో రాకపోకలకు నరకయాతన అనుభవించారు. కొందరు సొమ్మసిల్లి రోడ్లమీదనే కూర్చొండిపోయారు. ఇవెక్కడి కష్టాలు ‘బాబూ’ అంటూ నిట్టూర్చారు. వైద్యుల వద్ద తమ అర్హతలను నిర్ధారించుకున్నాక మెల్లగా ఇంటిబాట పట్టారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
● పింఛన్ కోసం పాట్లు
● పింఛన్ కోసం పాట్లు