అక్కడే కాల్చేస్తున్నారు..
గ్రామాల రూపురేఖలు మార్చేందుకు పడేసిన వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలని గత ప్రభుత్వం సేంద్రియ ఎరువు తయారీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పల్లె శివారుల్లో డంపింగ్ యార్డులు నిర్మించింది. ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారుచేసి రైతులకు విక్రయించాలని నిర్ణయించింది. కానీ, అమలులో ఇప్పటికీ సాధ్యం కావడంలేదు. తడి, పొడి చెత్తను వేరు చేయకపోగా పంచాయతీ సిబ్బంది ఎక్కడికక్కడే కాల్చివేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే పెద్దబొంకూర్ డంపింగ్ యార్డు వద్ద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చివేస్తున్నారు. ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
అక్కడే కాల్చేస్తున్నారు..
Comments
Please login to add a commentAdd a comment