కాంగ్రెస్ హయాంలోనే రోడ్ల నిర్మాణం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
ఓదెల(పెద్దపల్లి): కాంగ్రెస్ హయాంలోనే సీసీ రోడ్ల నిర్మాణం సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శానగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, పొత్కపల్లి గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్లెల్లోని అన్ని వాడల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో అద్దంలా మెరిసిపోతున్నాయన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గంలో నాలుగేళ్లలో 14వేల ఇళ్లు మంజూరవుతాయని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అంబాల కొమురయ్య, నాయకులు రెడ్డి రజనీకాంత్, చొక్కారావు, సమ్మిరెడ్డి, తిరుపతి, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment