ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడ కబ్జా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామ శివారులోని 56, 57 సర్వే నంబర్‌లో గల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఇవి యథేచ్ఛగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి..
సమాచార హక్కు చట్టం ద్వారా 2019లో అక్రమ నిర్మాణాలపై మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఐదో డివిజన్‌లో ఒక సర్వే నంబరులో 6.24 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లో 3.30 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచార ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వే నంబర్ 56, సర్వే నంబరు 57లో కొంత భూమి ఆక్రమించిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
నిర్లక్ష్యం మత్తులో బల్దియా అధికారులు
పరుల పాలవుతున్న సర్కారు స్థలాలు
Comments
Please login to add a commentAdd a comment