
‘ఎనీమియా’ను నియంత్రిస్తాం
● బాధితులకు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి
సాక్షి: ఎనీమియా బారిన ఎవరు పడతారు?
డీఎంహెచ్‌వో: మనిషిలోని అవయవాలను పనిచేయించే ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే ఎనీమియా బారినపడతారు. అన్ని వయస్సుల వారిలో ఇది కనిపిస్తుంది.
సాక్షి: జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది బాధితులను గుర్తించారు?
డీఎంహెచ్‌వో: కేంద్ర ప్రభుత్వం ఎనీమియాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం మా సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో 1,43,159మంది మహిళలు, 10 నుంచి 19ఏళ్లలోపు వయస్సుగల పిల్లలు 1,56,580 మంది వరకు ఉన్నారు. 6 నుంచి 59 నెలలోపు వయసుగల వారు 95,309 మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసు గలవారు 78,290మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వరకు ఎనీమియాతో బాధపడుతున్నారని మా సర్వేలో తేలింది.
సాక్షి: మందులు అందుబాటులో ఉన్నాయా?
డీఎంహెచ్‌వో: గతంలో మందుల కొరత ఉండేది. ఇప్పుడు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ఎనీమియా ముక్త్‌భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అవసరాలకు అనుగుణంగా పీహెచ్‌సీల స్థాయిలోనూ మందులు పంపిణీ చేస్తున్నాం. 6నుంచి 59నెలల పిల్లలకు ఏడాదికి రెండు సిరప్ బాటిళ్లు అవసరం. ఇక పాఠశాలల్లో చదివే వారికి వీక్లీ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ అందిస్తున్నాం.
పెద్దపల్లిరూరల్: ‘మనిషికి
అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు దోహదపడే హిమోగ్లోబిన్ శాతం పడిపోవడమే ఎనీమియా.. దీనిబారిన పడుతున్న వారిని గుర్తించి మందులు, సిరప్ అందిస్తున్నాం.. ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. జిల్లాలో 13,935మంది గర్భిణులు, 12,540 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారని, వీరిలో 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు. పిల్లలు, మహిళల్లో ఇది అధికంగా కనిపిస్తోందన్నారు. బాధితులను గుర్తించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ అందిస్తూ ఎనీమియా నియంత్రణకు పాటుపడుతున్నామన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో
ఉంచామని అన్నారు. ‘సాక్షి’తో
ఇంటర్వ్యూ వివరాలు..
సాక్షి: ఎనీమియా నియంత్రణపై సిబ్బందికి అవగాహన ఉందా?
డీఎంహెచ్‌వో: ఎనీమియా ముక్త్‌భారత్ అమలు తీరు, సాధించాల్సిన లక్ష్యం, అనుసరించాల్సిన పద్ధతులపై ఫార్మసిస్ట్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. బాధితులను గుర్తించి సకాలంలో మందులు అందేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. వయసును బట్టి మోతాదు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment