‘ఎల్‌ఆర్‌ఎస్’లో 25 శాతం రాయితీ
● గడువులోగా ఫీజు చెల్లిస్తేనే వర్తింపు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: గడువులోగా ఎల్‌ఆర్‌ఎస్ రు సుం చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని, 24 గంటల్లోగా ప్రొసీడింగ్స్ జారీచేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్థానిక మున్సిపల్ కా ర్యాలయంలో సోమవారం ఎల్‌ఆర్‌ఎస్, లే ఔట్ క్రమబద్ధీకరణపై డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. జిల్లాలో 16వేల స్థలాల క్రమబద్ధీకరణ కోసం యజమానులకు ఫీజు వివరాలు అందించామని అన్నారు. ఇప్పటివరకు 400మంది మాత్రమే స్పందించారని ఆయన పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం మున్సిపల్ ఆఫీసులో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. క్రమబద్ధీకరణ పూర్తికాని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లింక్ చేశామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
అధికారులతోనూ సమావేశం..
అంతకుముందు కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారుల తో సమావేశమై అక్రమ లేఔట్లపై సమీక్షించారు. లే ఔట్ నిబంధనలు పాటించని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించారు. ఆర్డీవోలు గంగ య్య, సురేశ్, కమిషనర్లు వెంకటేశ్, మనోహర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో 2డీ ఎకో సేవలు..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా 2డీ ఎకో సేవలు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్లినికల్ కార్డియాలజిస్ట్‌గా నియమితులైన ప్రియాంక కలెక్టర్‌ను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment