ఖమ్మంపల్లి – భూపాలపల్లి రోడ్డుకు రూ.33.70 కోట్లు
ముత్తారం(మంథని): పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలిపేందుకు ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు డబుల్ రో డ్డు నిర్మాణానికి ప్రభుత్వం మంగళవారం రూ. 33.70కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో అటవీశాఖ అనుమతి రాక రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు చొరవతో జీవో నంబరు 113 ద్వారా నిధులు మంజూరు చే యించారు. ఈ రోడ్డు నిర్మాణంతో మంథని, ఖ మ్మంపల్లి నుంచి భూపాలపల్లికి సుమారు 20 కిలో మీటర్ల వరకు దూర భారం తగ్గుతుంది. ఖమ్మంపల్లి, తాడిచెర్ల వంతెన నిర్మాణం పూర్తయినా.. భూపాలపల్లి వరకు ప్రయాణం చేయడానికి రోడ్డు సౌక ర్యంలేక వావానాదారులు, ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఖమ్మంపల్లి నుంచి తాడిచెర్ల నాగులమ్మ, కాటారం నుంచి వెళ్లేవారు. ప్రస్తుతం ఖమ్మంపల్లి – భూపాలపల్లి మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరావడంతో తమ ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు సంబురపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment