పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లిరూరల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీ ఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. నియోజకవర్గంలోని 86మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ (రూ.86.60లక్షలు), 471మందికి సీఎంఆర్‌ఎఫ్ (రూ.కోటి 27 లక్షల) విలువైన చెక్కులను జిలాల కేంద్రంలో మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ చూపారని అన్నారు. ఇళ్లులేని పేదల గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా గ్రంఽథాల య సంస్థ చైర్మన్ అన్నయ్య, నాయకులు సుమన్‌రెడ్డి, సంపత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, రామ్మూర్తి, శంకర్, సురేందర్ పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు
సుల్తానాబాద్(పెద్దపల్లి): త్వరలోనే అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 38 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.38,04,408 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 6, ఏడో వార్డుల్లో రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, మున్సిపల్ కమిషనర్ నియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో ఇన్‌చార్జి శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి
ఓదెల(పెద్దపల్లి): సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అద్దంలా మెరుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. ఓదెల, ఇందుర్తిలో చే పట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీల పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాయకులు ఆళ్ల సుమన్‌రెడ్డి, మూల ప్రేంసాగర్‌రెడ్డి, గోపు నారాయణరెడ్డి, చీకట్ల మొండయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
వ్యాన్ అసోసియేషన్ ఆఫీసు ప్రారంభం
మండల కేంద్రంలోని వ్యాన్ అసోసియేషన్ ఆఫీసు ను ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment