అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతాన్ని అన్నిరంగా ల్లో అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో మంగళవారం సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. ప్రధాన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ, బొందలగడ్డలా మారుతున్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం, సింగరేణి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆక్రమిత సింగరేణి స్థలాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. కూరగాయల మా ర్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతామని అభయం ఇచ్చారు. వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్, ఆర్జీ –1 జీఎం లలిత్‌కుమార్, నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్ తదితరులు ఉన్నారు.
స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం
కోల్‌సిటీ(రామగుండం): ఆధునిక యంత్రాలతో పా రిశుధ్య పనులు చేపట్టి రామగుండాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రా జ్‌ఠాకూర్ అన్నారు. రూ.76 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన రెండు బ్యాక్ హో లోడర్ యంత్రాలతోపాటు రూ.4.70 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 8 హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలను కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడా రు. అధికారులు రామన్, నాగభూషణం, కుమారస్వామి, నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ముస్తఫా, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
బాధితురాలికి చేయూత
రామగుండం: మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంతర్గాం మండలం ఆకెనపల్లికి చెంది న నంది లావణ్య వైద్యం కోసం ఎమ్మెల్యే ఠాకూర్ రూ.4 లక్షల ఎల్‌వోసీ ఇప్పించారు. రామునిగుండా ల కొండపై చేపట్టిన శ్రీఆంజనేయస్వామి విగ్రహం ఎదుట ఎమ్మెల్యే దంపతులు పూజలు చేశారు. 150 అడుగుల ఎత్తుతో చేపట్టిన పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు పర్యవేక్షించారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment