● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని: కొత్త బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని గుర్తింపు కార్మి క సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే–11గనిపై మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత గనులు మరో పదేళ్లలో మూతపడతాయని, కొత్త గనుల కోసం సింగరేణి వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడ్డ రూ.33 వేల కోట్లను వెంటనే చెల్లించాలని విన్నవించామని ఆయన వెల్లడించారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదని అన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, రాజు, మహేశ్, రంగు శ్రీను, ఎస్.వెంకట్‌రెడ్డి, నాయిని శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment