● 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు ● జిల్లా విద్యాధికా
టెన్త్ పరీక్షలకు 41 కేంద్రాలు
పెద్దపల్లిరూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సుమారు 7వేల మంది విద్యార్థుల కోసం 41 పరీ క్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వి ద్యాధికారి మాధవి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమ వారం అధికారులు, సూపరింటెండెంట్ ప్రకాశ్ తో కలిసి పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఈనె ల 21 నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏ ర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్ పరీక్షలకు 91మంది గైర్హాజరు
జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ వార్షిక పరీక్షలకు మొత్తం 91మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంగ్లిష్ పరీక్షకు 4,801మంది విద్యార్థులకు 4,710మంది హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరు శాతం 98.10శాతంగా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment