గోదావరిఖనిటౌన్: గోదావరిఖని ఆర్టీసీ డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సెల్ నం.99592 25922కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలపాలని పేర్కొన్నారు.
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
జ్యోతినగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల తేదీలను విడుదల చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఆర్డినేటర్ చలువాజి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి 26 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కొనసాగుతాయని అన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సీపీని కలిసిన
ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు
జ్యోతినగర్: రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిశోర్ ఝాను గురువారం ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, గోపాల్‌రావు, సంపత్, మల్లేశ్, బొద్దున రాజేశం, శ్రీనివాస్, భూమల్ల చందర్ తదితరులున్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ
ముత్తారం: మండలంలోని ఖమ్మంపల్లిలో గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గోదావరిఖని ఏసీపీ మడుత రమేశ్ విచారణ జరిపారు. గ్రామానికి చెందిన సముద్రాల రమేశ్ తనను కులం పేరుతో దూషించాడని మెంత్రి ఓదెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులను విచారించారు. ఆయన వెంట ఎస్సై గోపతి నరేశ్ ఉన్నారు.
మొల్లమాంబ జయంతి ఉత్సవాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో గురువారం మొల్లమాంబ జయంతి నిర్వహించారు. శాలివాహన (కుమ్మరి)సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి కటికనపల్లి రవికుమార్, నాయకులు రాయమల్లు, వీరప్రసాద్, రమేశ్, శ్రీధర్, సదయ్య, తిరుపతి, ఓదెలు, రాకేశ్, రమేశ్ ఉన్నారు.
పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ తనిఖీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డీసీపీగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ గురువారం పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెద్దపల్లి ప్రాంత పరిస్థితులు, నేరాల నమోదు తదితర వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావులను అడిగి తెలుసుకున్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నేడు డయల్ యువర్ డీఎం
నేడు డయల్ యువర్ డీఎం