మంథని/పాలకుర్తి/రామగుండం: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. గురువారం మంథని మండలం గుంజపడుగు, నాగారం, మల్లేపల్లి, ఎక్లాస్‌పూర్, సూరయ్యపల్లి, పాలకుర్తి మండలం కన్నాల, జీడీనగర్, బసంత్‌నగర్, జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్, అంతర్గాం మండలం ఎగ్లాస్‌పూర్, ఆకెనపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరాను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి నాణ్యమైన కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా పంచాయతీ కార్యదర్శులు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 20 వరకు వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఆర్జీదారులతో వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారి సతీశ్‌కుమార్, మండల పంచాయతీ అఽధికారి శేషయ్య, మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈతో పాటు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.