
కలెక్టరేట్‌లో సందర్శకుల కష్టాలు
పెద్దపల్లిరూరల్: వివి ధ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే సందర్శ కులు తాగునీటికోసం తపిస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే (ఇన్‌వార్డు ఆఫీసు వద్ద)మార్గంలో వాటర్ కూ లర్ ఉన్నా.. అందులో నీళ్లు పోయడంలేదు. మండుతున్న ఎండలకు దాహం తీవ్రమవుతోంది. దాహం తీర్చుకునేందుకు సందర్శకులు రాజీవ్‌రోడ్డు సమీపంలోని హోటళ్లు, క్యాంటీన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. వృద్ధు లు, దివ్యాంగులు మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో వారు మెట్లు ఎక్కలేకపోతున్నా రు. అధికారులు స్పందించి లిఫ్ట్ మరమ్మతు చేయాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని సందర్శకులు కోరుతున్నారు.

కలెక్టరేట్‌లో సందర్శకుల కష్టాలు