
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పలు పార్టీల వివరాలను గురువారం తమ వెబ్‌సైట్‌లో పొందు పరిచింది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌కు చెందిన వాడుక రాజగోపాల్ ఈసీఐకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుపై ఈ నెల 16వ తేదీలోగా వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.
చదవండి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుంది: ఢిల్లీ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment