
1994 ఎన్నికలలో అన్ని సామాజికవర్గాలలో టీడీపీదే ఆధిక్యత. 1994లో ఎన్.టి రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉమ్మడి ఎపిలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా టీడీపీ మెజార్టీ సీట్లు సాదించింది.అన్ని సామాజికవర్గాలలో కూడా టీడీపీదే పై చేయి అయింది. ఎపిలోని కోస్తా, రాయలసీమలలో నలభై మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే అందులో ఇరవై ఐదు మంది టీడీపీ తరపున, పన్నెండు మంది కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒకరు సీపీఎమ్ తరపున గెలిచారు.కమ్మ నేతలు రికార్డు స్థాయిలో నలభైఏడు మంది గెలవగా, ముప్పై తొమ్మిది మంది టీడీపీ పక్షాన, ఇద్దరు మాత్రం కాంగ్రెస్ తరపున గెలిచారు.
ఇండిపెండెంట్లుగా నలుగురు (వారిలో ముగ్గురికి కూడా టీడీపీ మద్దతు ఇచ్చింది) ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం ల పక్షాన గెలిచారు. కాపు సామాజికవర్గం నేతలు 21 మంది గెలవగా, టీడీపీ నుంచి పదిహేడు మంది, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు, ఒక ఇండిపెండెంట్ నెగ్గారు. బీసీల నుంచి 32 మంది గెలిస్తే ముప్పైమంది టీడీపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ తరుపున గెలిచారు. ఎస్సీ నేతలు 22 మందికిగాను పదహారుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు సీపీఎం, ఒకరు సీపీఐ నుంచి ఎన్నికయ్యారు.గిరిజనుల నుంచి ఎనిమిదికి గాను ఏడుగురు టీడీపీ, ఒకరు సీపీఐ నుంచి గెలిచారు. క్షత్రియులు తొమ్మిది మంది గెలవగా, ఆరుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐకి చెందినవారు. ముస్లీంలు నలుగురికి గాను ముగ్గురు టీడీపీ, ఒకరు సీపీఐ పక్షాన గెలిచారు. ముగ్గురు వెలమలు, వైశ్య ఒకరు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో టీడీపీ, సీపీఐ, సీపీఎం లు కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. కోస్తా, రాయలసీమల నుంచి బిజెపి పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదు.
రికార్డు సంఖ్యలో కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు
1994 శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు రికార్డు స్తాయిలో ఎన్నికయ్యారు. మొత్తం నలభై ఏడు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు. వీరు కాక టీడీపీ మద్దతు ఇచ్చిన ముగ్గురు ఉన్నారు. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలకు చెందినవారు ఒక్కొక్కరు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెట్ ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ గన్నవరం నుంచి టీడీపీపై గెలిచి, ఆ తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. కాగా కోస్తా నుంచి ముప్పై ఆరు మంది గెలవగా, రాయలసీమ నుంచి తొమ్మిది మంది ఎన్నికయ్యారు. కాగా ఎన్. రామారావు కోస్తాలోని టెక్కలి నుంచి, రాయలసీమలోని హిందుపూర్ నుంచి పోటీచేసి రెండు చోట్ల గెలిచారు.
తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు 39
ఎన్.టి రామారావు-టెక్కలి, గద్దె బాబూరావు-చీపురుపల్లి, బి.భాస్కర రామారావు-పెద్దాపురం, వివిఎస్ చౌదరి -ఆలమూరు,కెవి రామకృష్ణ- బూరుగుపూడి, జి.బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి, పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు, ఎమ్.వి.కృష్ణారావు-తణుకు, కె.విశ్వనాదం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, రావి శోభనాద్రి-గుడివాడ, వై.సీతాదేవి-ముదినేపల్లి, ఎ.బాబూరావు- ఉయ్యూరు, డి.రాజశేఖర్-కంకిపాడు, జె.రమేష్ బాబు-మైలవరం, డివి రమణ-నందిగామ, నెట్టెం రఘురాం-జగ్గయ్యపేట, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్రప్రసాద్-వేమూరు, ఎమ్.వెంకటసుబ్బయ్య- రేపల్లె, రావి రవీంద్రనాద్-తెనాలి.
ముప్పలనేని శేషగిరిరావు-బాపట్ల, మాకినేని పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, యరపతినేని శ్రీనివాసరావు-గురజాల, చప్పిడి వెంగయ్య-కంభం, ఈదర హరిబాబు-ఒంగోలు,దివి శివరాం-కందుకూరు, దామచర్ల ఆంజనేయులు-కొండపి, కె.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు, కె.మీనాక్షి నాయుడు-ఆదోని, పయ్యావుల కేశవ్-ఉరవకొండ, ఎన్.టి రామారావు-హిందుపూర్, పరిటాల రవీంద్ర-పెనుగొండ, సి.వెంకట రాముడు-దర్మవరం, ఆర్.కృస్ణసాగర్-మదనపల్లె, ఎన్. రామ్మూర్తి నాయుడు-చంద్రగిరి, జి.ముద్దుకృష్ణమ నాయుడు-పుత్తూరు, ఎన్.చంద్రబాబు నాయుడు-కుప్పం.
కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు.. 2
- వంగవీటి రత్నకుమారి-విజయవాడ-రెండు
- సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట.
రెడ్డిసామాజికవర్గం ఎమ్మెల్యేల విశ్లేషణ-40
మొత్తం నలభై మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, టీడీపీ పక్షాన ఇరవై ఐదు మంది గెలిచారు. కాంగ్రెస్ తరపున పన్నెండు మంది, సీపీఎం నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు.తెలుగుదేశం నుంచి గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా నుంచి పదహారు మంది రాయలసీమ నుంచి గెలిచారు. కాంగ్రెస్ కు చెందినవారిలో ముగ్గురు కోస్తా నుంచి తొమ్మిది మంది రాయలసీమ నుంచి విజయం సాదించారు.సీపీఎం నుంచి గెలిచిన నేత, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇద్దరు కోస్తా నుంచి నెగ్గారు.
తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-25
- ఎన్.మూలారెడ్డి-అనపర్తి
- చల్లా వెంకట కృష్ణారెడ్డి-గుంటూరు-రెండు
- కె.పున్నారెడ్డి-మాచర్ల
- పీ.రాంభూపాల్ రెడ్డి-గిద్దలూరు
- ఎమ్.కాశిరెడ్డి-కనిగిరి
- ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు, టి.రమేష్ రెడ్డి-నెల్లూరు, ఇ.శ్రీనివాసులురెడ్డి-రాపూరు, ఎస్.చంద్రమోహన్ రెడ్డి-సర్వేపల్లి, బి.వీరారెడ్డి-బద్వేలు, జి.ద్వారకానాధ్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, జి.వీరశివారెడ్డి-కమలాపురం, పీ.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు, భూమా నాగిరెడ్డి-ఆళ్లగడ్డ, బైరెడ్డి రాజశేఖరరెడ్డి-నందికోట్కేరు,కె.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, ఎస్.వి.సుబ్బారెడ్డి-ప్రత్తికొండ, బి.వి.మోహన్ రెడ్డి-ఎమ్మిగనూరు,వై.టి ప్రభాకరరెడ్డి-మడకశిర, టిడి.నాగరాజరెడ్డి-నల్లమడ, లక్ష్మీదేవమ్మ-తంబళ్లపల్లె, జివి.శ్రీనాదరెడ్డి-పీలేరు, చింతల రామచంద్రారెడ్డి-వాయల్పాడు, ఎన్.రామకృష్ణారెడ్డి-పుంగనూరు, బి.గోపాలకృస్ణారెడ్డి-శ్రీకాళహస్తి.
కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు..12
- గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల
- గాదె వెంకటరెడ్డి-పర్చూరు
- కె. యానాదిరెడ్డి-కావలి
- ఎమ్. నారాయణరెడ్డి-రాయచోటి
- వై.ఎస్. వివేకానందరెడ్డి-పులివెందుల
- ఎన్. వరదరాజులురెడ్డి-ప్రొద్దుటూరు
- డి.ఎల్. రవీంద్రరెడ్డి-మైదుకూరు
- ఇ. ప్రతాపరెడ్డి-ఆత్మకూరు
- కె. రాంభూపాల్ రెడ్డి-పాణ్యం
- కోట్ల విజయభాస్కరరెడ్డి-డోన్
- జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి
- సికె. జయచంద్రారెడ్డి-చిత్తూరు.
ఇతరులు..3
- జక్కా వెంకయ్య-అల్లూరు-సీపీఎం
- జంకె వెంకటరెడ్డి-మార్కాపురం-ఇండి
- కె.విజయరామిరెడ్డి-ఉదయగిరి- ఇండి( ఈ ఇద్దరు ఇండిపెండెంట్లకు కూడా టీడీపీ మద్దతు లభించింది.)
కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-21
కాపు సామాజికవర్గం నుంచి 21 మంది ఎన్నిక కాగా పదహారు మంది టీడీపీ నుంచి గెలిచారు. వీరిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారే. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల నుంచి ఎన్నికైన వారు కూడా కోస్తా ప్రాంతం వారే.
టీడీపీ కాపు ఎమ్మెల్యేలు-17
- పీ.చలపతిరావు-యలమంచిలి
- పర్వత సుబ్బారావు-ప్రత్తిపాడు
- వి.నాగేశ్వరరావు-పిఠాపురం
- చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, వడ్డి వీరభద్రరావు-కడియం, జెవి అప్పారావు(నెహ్రూ) -జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, పీ.కనక సుందరరావు-తాడేపల్లిగూడెం, అంబటి బ్రాహ్మణయ్య-మచిలీపట్నం, సింహాద్రి సత్యనారాయణ-అవనిగడ్డ, ఎన్.శ్రీరాములు-దర్శి, పీ.బ్రహ్మయ్య-రాజంపేట, బి.(బలిజ)హూలికుంటప్ప-రాయదుర్గం(బలిజ) ఎ.మోహన్-తిరుపతి (బలిజ)
కాంగ్రెస్-1
కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు
సీపీఐ-1
వంకా సత్యనారాయణ-పెనుగొండ
సీపీఎం-1
పుతుంబాక భారతి-సత్తెనపల్లి
ఇండి..1
తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం
బీసీ వర్గాల ఎమ్మల్యేలు 31
బీసీ వర్గాల ఎమ్మెల్యేలు మొత్తం 31 మంది ఎన్నికైతే ఐదుగురుతప్ప మిగిలి నవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారు.వీరిలో అత్యధికం ఉత్తరాంద్ర జిల్లాలలో ఎన్నికయ్యారు.ఇరవై ఒక్క మంది శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాల నుంచి ఎన్నికయ్యారు. ఇక రాయలసీమ నుంచి ఐదుగురుఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ముప్పై మంది, సీపీఐ నుంచి ఒకరు ఎన్నిక కాగా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరే ఎన్నికయ్యారు. బీసీలలో ఆయా సామాజికవర్గాలను పరిశీలిస్తే కొప్పుల వెలమ అత్యధికంగా తొమ్మిది మంది గెలుపొందారు. తూర్పు కాపులు ఐదుగురు, యాదవ నలుగురు,గౌడ ముగ్గురు, పొలినాటి వెలమ ముగ్గురు, పద్మశాలి ఇద్దరు, రెడ్డిక, కాళింగ, గవర, మత్సకార, బోయ ఒక్కొక్కరు గెలుపొందారు. మొత్తం పదకుండు కులాల వారు గెలిచారు.
టీడీపీ బీసీ ఎమ్మెల్యేలు-29
- డి.అచ్యుతరామయ్య-ఇచ్చాపురం-రెడ్డిక
- గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ
- కె.మోహన్ రావు-పాతపట్నం-తూర్పు కాపు
- జిఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ
- తమ్మినేని సీతారామ్-ఆముదాలవలస-కాళింగ, బగ్గు లక్ష్మణ రావు-నరసన్నపేట-పీ.వెలమ, కె.ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రాపురం-పీ.వెలమ, ఎర్రా కృష్ణమూర్తి-పార్వతీపురం-కె. వెలమ, ఎస్సీ.వి అప్పలనాయుడు-బొబ్బిలి-కె.వెలమ, తెంటు జయప్రకాష్-తెర్లాం-కొప్పుల వెలమ, పడాల అరుణ-గజపతి నగరం-తూర్పుకాపు, కె.అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కె.వెలమ, పీ.సూర్య నారా యణ-సతివాడ-తూర్పుకాపు, పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పు కాపు, పల్లా సింహాచలం-విశాఖ-రెండు-యాదవ, బి.సత్యనారాయణమూర్తి-పరవాడ-కొప్పుల వెలమ, జి.ఎర్రునాయుడు-చోడవరం-కె.వెలమ, రెడ్డి సత్య నారాయణ-మాడుగుల -కొప్పుల వెలమ, దాడి వీరభద్రరావు-అనకాపల్లి-గవర, సి.హెచ్.అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు-తుని-యాదవ, టి.ఎస్.ఎల్.నాయకర్-సంపర-మత్స్యకార, మరడాని రంగారావు-ఏలూరు-కొప్పుల వెలమ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం-గౌడ, ఇ.సీతారావమ్మ-కూచినపూడి-గౌడ, పీ.రామారావు-చీరాల-యాదవ, గాది లింగప్ప-గుత్తి-బోయ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి, జె.సూర్యనారాయణ-కదిరి-పద్మశాలి.
కాంగ్రెస్ -1
పీ.రాజశేఖరం-ఉణుకూరు-తూర్పుకాపు
ఇతరులు-1
కె.రామకృష్ణ-అనంతపురం-సీపీఐ-యాదవ
షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు-22
షెడ్యూల్ కులాలకు చెందిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో పదహారు మంది తెలుగుదేశం పార్టీవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ,ముగ్గురు సీపీఎం, ఒకరుసీపీఐ కి చెందినవారు.
ఎస్సీ.టీడీపీ ఎమ్మెల్యేలు..16
- కె.ప్రతిభా భారతి-ఎచ్చెర్ల
- టి.భద్రయ్య-పాలకొండ
- కె.నూకరాజు-పాయకరావుపేట
- ఉండ్రు కృష్ణారావు-నగరం
- ఎజెబి ఉమామహేశ్వరరావు-అల్లవరం
- జె.బాబాజీరావు-గోపాలపురం
- ఎన్.స్వామిదాస్-తిరువూరు
- బి.దుర్గాప్రసాదరావు-గూడూరు
- పివి రత్నయ్య-సూళ్లూరుపేట
- వడ్డి చిన్నయ్య-రైల్వేకోడూరు
- మసాల ఈరన్న-ఆలూరు
- కె.జయరాం-శింగనమల
- బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం
- ఎమ్.సురాజన్-సత్యవేడు
- ఆర్.గాందీ-వేపంజేరి
- పీ.సుబ్బయ్య-పలమనేరు.
కాంగ్రెస్-2
బత్తిన సుబ్బారావు-ముమ్మడివరం, ఎమ్.శిఖామని-కొడుమూరు.
ఇతర పార్టీలు -4
- డి.రాజగోపాల్-ఆచంట-సీపీఎం
- పీ.రామయ్య-నిడుమోలు-సీపీఎం
- తవనం చెంచయ్య-సంతనూతలపాడు-సీపీఎం
- జిఎమ్.ఎన్.వి ప్రసాద్-తాడికొండ-సీపీఐ
షెడ్యూల్ జాతులు(ఎస్.టి)-8
ఎనిమిది మంది షెడ్యూల్ జాతులకు చెందిన ఎమ్మెల్యేలకు గాను ఏడుగురు టీడీపీవారు,ఒకరు సీపీఐకి చెందినవారు.కాంగ్రెస్ కు ఎస్టి స్థానాలలో ఒక్కటి కూడా రాలేదు.
ఎస్.టి.టీడీపీ ఎమ్మెల్యేల వివరాలు..7
- నిమ్మక గోపాలరావు-కొత్తూరు
- నిమ్మక జయరాజు-నాగూరు
- ఆర్.పీ.భంజదేవ్-సాలూరు
- ఎల్.బి.దుక్కు-ఎస్.కోట
- కె.చిట్టి నాయుడు-పాడేరు
- ఎస్.వెంకటేశ్వరరావు-రంపచోడవరం
- పీ.సింగన్నదొర-పోలవరం
సీపీఐ-1: 1.జి.దేముడు-చింతపల్లి
క్షత్రియ ఎమ్మెల్యేలు..9
క్షత్రియ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది గెలవగా వారిలో ఆరుగురు టీడీపీ కి చెందినవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ వారు.
టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-6
- పీ.అశోక్ గజపతిరాజు-విజయనగరం
- ఆర్‌ఎస్ డి అప్పల నరసింహరాజు-భీమిలి
- ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు
- పివి నరసింహరాజు-భీమవరం
- కె.రామచంద్రరాజు-ఉండి
- వి.దొరస్వామిరాజు-నగరి.
కాంగ్రెస్-2
కనుమూరి బాపిరాజు-అత్తిలి, ఎన్.వెంకట్రామరాజు-కైకలూరు
సీపీఐ-1
కె.సుబ్బరాజు-విజయవాడ-1
ముస్లీం-5
ముస్లీంలు ఐదుగురు ఎన్నిక కాగా నలుగురు టీడీపీ వారుకాగా, ఒకరు సీపీఎం నుంచి ఎన్నికయ్యారు.
టీడీపీ ముస్లీం ఎమ్మెల్యేలు-4
- రెహమాన్-విశాఖ-ఒకటి
- జియావుద్దీన్ -గుంటూరు-1
- ఖలీల్ భాష-కడప
- ఎన్.ఎమ్.డి ఫరూఖ్-నంద్యాల
సీపీఎం-1
అబ్దుల్ గఫూర్-కర్నూలు
ఇతర వర్గాలకు చెందినవారిలో వెలమ సామాజికవర్గం నుంచి ముగ్గురు, వైశ్య ఒకరు నెగ్గారు.వెలమ నేతలు ముగ్గురూ టీడీపీవారు
వెలమ-3
- కె.విద్యాదరరావు-చింతలపూడి-వెలమ-టీడీపీ
- కె.హనుమంతరావు-నూజివీడు-వెలమ-టీడీపీ
- వివికె యాచేంద్ర-వెంకటగిరి-వెలమ-టీడీపీ
వైశ్య-1:
ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ- వైశ్య
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment