Caste Equations
-
2019 AP : కులం చుట్టూ రాజకీయం
తెలుగు రాష్ట్రాలలోనే కాదు..దేశంలోనే ఒక సంచలనంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. తొమ్మిదేళ్ల పోరాటం, ఏడాది నాలుగునెలల ప్రజా సంకల్పయాత్ర... ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కష్టార్జితం 2019 ఎన్నికల ఫలితం. అదే సమయంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి రోజు నుంచే తప్పులు చేయడం ఆరంభించి, చివరకి తాను ఏమి చేస్తున్నది తనకే తెలియని రీతిలో భ్రమలలో పడి పోయి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. గతంలో ఎన్నడూ టీడీపీకి ఇంతటి దారుణమైన ఓటమి ఎదురు కాలేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు స్వయంకృతం. పార్టీని రాజకీయ పార్టీగా కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చి, టీడీపీ కార్యకర్తలంటే మాఫియా లీడర్లు అన్నంతగా తయారుచేసి, ప్రజలను డబ్బుతో కొనేసి గెలవవచ్చనుకున్న చంద్రబాబు నాయుడి ప్లాన్‌ను ప్రజలు తిప్పి కొట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి అయినా చంద్రబాబు ప్రభుత్వ ఓటమి ఒక గుణపాఠం అంటే ఆశ్చర్యం కాదు. ఇదే సమయంలో గతంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన దాదాపు అన్ని సామాజికవర్గాలలో పూర్తి మార్పు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు తెలియచేస్తాయి. ప్రాంతాల వారీగా చూసినా, సామాజికవర్గాల వారీగా పరిశీలించినా టీడీపీ ఎంతగా ప్రజలలో వ్యతిరేకత తెచ్చుకుంది అర్ధం అవుతుంది.రాయలసీమలో ఏభై రెండు సీట్లు ఉంటే కేవలం మూడు సీట్లనే టీడీపీ గెలుచుకుంటే,వైఎస్ ఆర్ కాంగ్రెస్ మొత్తం 49 నియోజకవర్గాలలో పాగా వేయగలిగింది. కడప,కర్నూలలో ఒక్క సీటు కూడా టీడీపీకి రాలేదు. అలాగే కోస్తాలో విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కూడా మొత్తం అన్ని స్థానాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ వే.ఉభయ గోదావరి జిల్లాలలో గత సారి కాపు సామాజికవర్గం టీడీపీకి అండగా ఉండగా,ఈసారి ఆ పరిస్థితి లేదు. ఉభయ గోదావరి జిల్లాలలో కలిపి ముప్పై నాలుగు సీట్లు ఉంటే కేవలం ఐదు సీట్లే టీడీపీకి వచ్చాయి. కమ్మ ప్రాబల్యం ఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాలలో టీడీపీ గెలిచిందా అంటే అదీ లేదు. ఈ జిల్లాలలో కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ దే హవా అయింది.ఉత్తరాంధ్రలో గతసారి టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఈసారి దారుణంగా ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి సామాజికవర్గాల సమీకరణ పూర్తిగా మారిపోవడం, అత్యధిక సామాజికవర్గాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డాయని చెప్పవచ్చు. రెడ్డి సామాజికవర్గం నుంచి నలభై ఎనిమిది మంది గెలిస్తే వారంతా ఒక్క వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచే కావడం విశేషం. టీడీపీ పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కమ్మ సామాజికవర్గం కు చెందినవారు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో రెండుపార్టీలలో కలిపి కేవలం పదిహేడు మంది మాత్రమే గెలిచారు. టీడీపీ నుంచి పదకుండు మంది, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఆరుగురు గెలుపొందారు. కాపులలో గతసారి వైసీపీ పక్షాన కేవలం ముగ్గురు మాత్రమే గెలిస్తే ఈసారి ఇరవై ఇద్దరు గెలిచారు. టీడీపీ నుంచి ముగ్గురే నెగ్గారు. బీసీలు మొత్తం ముప్పై నాలుగు మంది గెలిస్తే వారిలో ఇరవై ఎనిమది మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారే. ముస్లింలు, ఎస్టిలు మొత్తం వైసీపీ నుంచే గెలిచారు. షెడ్యూల్ కులాల వారు మొత్తం ఇరవై తొమ్మిది మందికి గాను ఇరవైఏడు చోట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయపతాకం ఎగురవేస్తే, టీడీపీ ఒక చోట, జనసేన ఒక చోట గెలిచాయి. ఇతర సామాజికవర్గాల వారు పది మంది గెలిస్తే వారిలో ఇద్దరు మాత్రమే టీడీపీ వారు. జనసేన పక్షాన కేవలం ఒక్కరే అధి కూడా ఒక ఎస్సి ఎమ్మెల్యే విజయం సాదించారు. గతంలో ప్రధానంగా కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేసి టీడీపీ విజయానికి దోహదపడిన జనసేన ఈసారి ఆ వర్గం ఓట్లను కూడా పూర్తిగా పొంద లేకపోయింది. 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పక్షాన కాపు ఎమ్మెల్యేలు ఆంద్ర ప్రాంతంలో పది మంది గెలిస్తే, ఈసారి జనసేన పక్షాన ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం విశేషం. చివరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి పరాజయం చెందారు. 2019 ఎన్నికలు జగన్ వేవ్‌తో ఏక పక్ష ఎన్నికలుగా మారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అఖండ విజయం సాదించిందని చెప్పవచ్చు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
2019 AP : ఏ సామాజికవర్గం నుంచి ఎందరు గెలిచారు?
2019లో రికార్డు స్థాయిలో రెడ్డి ఎమ్మెల్యేల విజయం విభజిత ఆంద్రప్రదేశ్‌లో రెడ్డి సామాజికవర్గం నేతలు 48 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన రెడ్డి నేతలలో ఒక్కరు తప్ప అంతా విజయం సాదించడం కూడా ఒక ప్రత్యేకత. ఉరవకొండ నుంచి పోటీచేసిన విశ్వేశ్వరరెడ్డి తప్ప మిగిలిన వారంతా గెలిచారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన 48 మంది గెలవగా, టీడీపీ పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదు.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇలా ఒక్క రెడ్డి ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ పక్షాన లేకుండా పోవడం ఇదే తొలిసారి. రాయలసీమ నుంచి ముప్పైఒక్క మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిస్తే, పదిహేడు మంది కోస్తా నుంచి విజయం సాధించారు. తూర్పు గోదావరి లో ముగ్గురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, నెల్లూరులో ఏడుగురు, కడపలో ఏడుగురు, కర్నూలులో పది మంది, అనంతపురంలో ఏడుగురు, చిత్తూరు జిల్లాలో ఏడుగురు రెడ్డి నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో మరోసారి విజయం సాధించారు. ఆయన కుటుంబం ఇక్కడ 1978 నుంచి అంటే నాలుగు దశాబ్దాలుగా ఎన్నికవుతూ వస్తోంది.ఇది కూడా ఒక రికార్డు అని చెప్పాలి. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆరోసారి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు మహేష్ రెడ్డి గుంటూరు జిల్లా గురజాల నుంచి విజయం సాదించారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆరోసారి విజయం సాదించారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు మూడు నియోజకవర్గాల నుంచి గెలవడం విశేషం. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, ఆదోనిలో సాయి ప్రసాద్‌రెడ్డి గుంతకల్లులో వెంకట్రామిరెడ్డిలు గెలుపొందారు. రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు.. 48- అంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారే ఎన్.సూర్యనారాయణరెడ్డి-అనపర్తి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి-కాకినాడ సిటీ, చిర్ల జగ్గారెడ్డి-కొత్తపేట, ఆళ్ల రామకృష్ణారెడ్డి- మంగళగిరి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి-నరసరావుపేట, కాసు మహేశ్ రెడ్డి-గురజాల, పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి- మాచర్ల, బాలినేని శ్రీనివాసరెడ్డి-ఒంగోలు, ఎమ్.మహీదరరెడ్డి-కందుకూరు, కె.నాగా ర్జునరెడ్డి-మార్కాపురం, ఆర్.ప్రతాప్ రెడ్డి-కావలి, మేకపాటి గౌతం రెడ్డి-ఆత్మకూరు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి- కోవూరు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి-నెల్లూరు రూరల్, కాకాణి గోవర్దన్ రెడ్డి-సర్వేపల్లి, ఆనం రామనారాయణ రెడ్డి-ఆత్మకూరు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి-ఉదయగిరి, మేడా మల్లిఖార్జున రెడ్డి-రాజంపేట, గడికోట శ్రీకాంతరెడ్డి-రాయచోటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి-పులివెందుల, పి.రవీంద్రనాద్ రెడ్డి-కమలాపురం, ఎమ్.సుదీర్ రెడ్డి-జమ్మలమడుగు, రాచమల్లు శివప్రసాదరెడ్డి-ప్రొద్దుటూరు, ఎన్.రఘురామి రెడ్డి-మైదుకూరు, గంగుల విజయేందర్ రెడ్డి-ఆళ్లగడ్డ, శిల్పా చక్రపాణిరెడ్డి-శ్రీశైలం, కాటసాని రాంభూపాల్ రెడ్డి-పాణ్యం, శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి-నంద్యాల, కాటసాని రామిరెడ్డి-బనగానపల్లె, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి-డోన్, కె.శ్రీదేవి-ప్రత్తి కొండ, కె.చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు, వై.బాలనాగిరెడ్డి-మంత్రాలయం, వై.శివ ప్రసాదరెడ్డి-ఆదోని, వై.వెంకట్రామిరెడ్డి-గుంతకల్లు, కె.పెద్దారెడ్డి-తాడిపత్రి, అనంత వెంకట్రామిరెడ్డి-అనంతపురం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి-రాప్తాడు, కె.వెంకట రమణారెడ్డి-దర్మవరం, డి.శ్రీదర్ రెడ్డి-పుట్టపర్తి, సిద్దారెడ్డి-కదిరి, పెద్దిరెడ్డి ద్వారకా నాదరెడ్డి- తంబళ్లపల్లె, చింతల రామచంద్రారెడ్డి-పీలేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పుంగనూరు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి-చంద్రగిరి, భూమన కరుణాకరరెడ్డి-తిరుపతి, బియ్యపు మదుసూదనరెడ్డి-శ్రీకాళహస్తి, ఆర్.కె.రోజా-నగరి, వీరిలో ముగ్గురు అన్నదమ్ములు మూడు నియోజకవర్గాల నుంచి గెలవడం విశేషం. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లుల నుంచి గెలుపొందిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతం రెడ్డి, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లు మంత్రులు అయ్యారు. 2019లో కమ్మలు పదిహేడు మంది మాత్రమే ఎన్నిక కాగలిగారు. 1994లో అత్యధికంగా 47 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో ఆరుగురు అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు చెందినవారు కాగా, మిగిలిన 11మంది టీడీపీకి చెందినవారు. 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మంత్రి పదవిలో ఉంటూ మంగళగిరిలో పోటీ చేసి ఎన్నికలలో ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. గతంలో ఎనిమిదిసార్లు గెలిచిన విజయనగరం జిల్లా నేత పి.సాంబశివరాజు రికార్డుతో సమం అయ్యారు. చంద్రబాబు చంద్రగిరిలో ఒకసారి, కుప్పం నుంచి ఏడు సార్లు విజయం సాదించారు. కాగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కాని, విభజిత ఏపీలో కాని రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన నేతగా, రికార్డు స్థాయిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చరిత్ర చంద్రబాబుకు దక్కింది. కొడాలినాని ఈసారి వైఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. కమ్మ ఎమ్మెల్యేల వివరాలు- 17- వైఎస్ ఆర్ కాంగ్రెస్ -6, టీడీపీ -11 వైఎస్ఆర్ కాంగ్రెస్ - 6 కొటారు అబ్బయ్య చౌదరి-దెందులూరు కొడాలి నాని-గుడివాడ వసంత కృష్ణ ప్రసాద్-మైలవరం నంబూరి శంకరరావు- పెదకూరపాడు, అన్నాబత్తుని శివకుమార్-తెనాలి, బొల్లా బ్రహ్మనాయుడు-వినుకొండ. టీడీపీ-11 వెలగపూడి రామకృష్ణ-విశాఖపట్నం తూర్పు, వేగుళ్ల జోగేశ్వరరావు-మండపేట, గోరంట్ల బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి రూరల్, వల్లభవనేని వంశీ-గన్నవరం, గద్దె రామ్మోహన రావు-విజయవాడ తూర్పు, ఏలూరి సాంబశివరావు-పర్చూరు, గొట్టిపాటి రవికుమార్-అద్దంకి, కరణం బలరాం-చీరాల, పయ్యావుల కేశవ్-ఉరవకొండ, నందమూరి బాలకృష్ణ - హిందూపూర్, నారా చంద్రబాబు నాయుడు-కుప్పం. బీసీ ఎమ్మెల్యేలు-34- వైఎస్ ఆర్ కాంగ్రెస్ -28, టీడీపీ 6 ఏపీ అసెంబ్లీలో వెనుకబడిన తరగతుల వారు ముప్పై నలుగురు ఎన్నికయ్యారు. వారిలో ఇరవై ఎనిమిది మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నిక కాగా, టీడీపీ తరపున ఆరుగురు మాత్రమే గెలుపొందారు. 2014లో బీసీలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన కేవలం ముగ్గురే విజయం సాదించగా, ఈసారి ఇరవై ఎనిమిదికి పెరగడం విశేషం. ప్రజలలోని బీసీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారారని అర్దం అవుతుంది. బీసీలలో వేర్వేరు సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే , పొలినాటి వెలమ, కొప్పుల వెలమ కలిపి తొమ్మిది మంది గెలిచారు. వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు గెలిచారు. వారిద్దరూ కూడా సమీప బందువులు కావడం విశేషం. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, ఆయన అన్న ఎర్రనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందారు. వీరిద్దరూ పోలినాటి వెలమ. కాగా ఈ సమాజికవర్గం నుంచి ఇద్దరు నేతలు దర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లు గెలుపొందారు వీరిద్దరు సోదరులు.ఈసారి కకృష్ణదాస్ మంత్రి కూడా అయ్యారు.కొప్పుల వెలమ నుంచి ఐదుగురు గెలవగా వారంతా వైసీపీ వారే. ఆ తర్వాత తూర్పు కాపు వర్గం నుంచి ఐదుగురు విజయం సాదించారు.అంతా వైసీపీవారే.వీరిలో ముగ్గురు బొత్స సత్యనారాయణ సమీప బందువులు కావడం ఒక ప్రత్యేకత. ఆయన సోదరుడు అప్పలనరసయ్య, సమీప బందువు అప్పలనాయుడు కూడా గెలుపొందారు. బొత్స మంత్రి పదవి పొందారు. కాళింగ వర్గం నుంచి ఇద్దరు తమ్మినేని సీతారామ్, బెందాళం అశోక్ లు గెలిచారు. అయితే సీతారామ్ కింతలి కాళింగ కాగా, అశోక్ బూరగాని కాళింగ వర్గం వారు. సీతారామ్ వైసీపీ పక్షాన, అశోక్ టీడీపీ తరపున ఎన్నికయ్యారు. సీతారామ్ స్పీకర్ స్థానాన్ని పొందడం విశేషం. యాదవ నుంచి నలుగురు గెలిచారు. వారిలో ఒకరు అనిల్ యాదవ్ మంత్రి అయ్యారు. వీరంతా వైసీపీవారే. గౌడ నుంచి ముగ్గురు గెలుపొందగా, ఇద్దరు వైసీపీవారు. మత్సకార వర్గం నుంచి ముగ్గురు గెలవగా, వారిలో ఇద్దరు వైసీపీ, ఒకరు టీడీపీ వారు. కాగా రేపల్లె నుంచి పోటీచేసి ఓడిపోయిన మోపిదేవి వెంకట రమణరావును మంత్రివర్గంలోకి తీసుకోవడం విశేషం. రెడ్డిక ఒకరు, శెట్టిబలిజ ఒకరు వైసీపీ నుంచి గెలవగా, గవర వర్గం నుంచి ఒకరు టీడీపీ పక్షాన గెలిచారు. రజన ఒకరు, బోయ ఒకరు, లింగాయత్ ఒకరు, కురుబ నుంచి ఇద్దరు గెలిచారు. వీరంతా వైసీపీ వారే.శెట్టి బలిజ సామాజికవర్గం నేత పిల్లి సుభాస్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేశారు. కాగా బోయ వర్గం ఎమ్మెల్యే గుమ్మలూరు జయరాం, కురుబ వర్గం ఎమ్మెల్యే శంకర నారాయణలు కూడా మంత్రులు అయ్యారు. బీసీ ఎమ్మెల్యేలు-34- వైఎస్ ఆర్ కాంగ్రెస్ -28, టీడీపీ 6 పొలినాటి వెలమ-4- ఇద్దరు వైసీపీ , ఇద్దరు టీడీపీ వైసిసి -ధర్మాన ప్రసాదరావు-శ్రీకాకుళం , ధర్మానకకృష్ణ దాస్ -నరసన్నపేట. టీడీపీ -కింజారపు అచ్చెన్నాయుడు -టెక్కలి, ఆదిరెడ్డి భవాని-రాజమండ్రి సిటీ కొప్పుల వెలమ-5- అంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ శంభంగి చిన అప్పలనాయుడు-బొబ్బిలి, కె.శ్రీనివాస్ - ఎస్.కోట, బి.ముత్యాలనాయుడు-మాడుగుల, అన్నంరెడ్డి అదీప్ రాజ్-పెందుర్తి, పి.ఉమాశంకర్ గణేష్ -నర్సీపట్నం తూర్పు కాపు-5- అంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారే రెడ్డి శాంతి-పాతపట్నం, గొర్లె కిరణ్ కుమార్ -ఎచ్చెర్ల, బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి, బొత్స అప్పల నరసయ్య-గజపతినగరం, బడుకొండ అప్పలనాయుడు-నెల్లిమర్ల యాదవ-4- అంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కారుమూరు నాగేశ్వరరావు-తణుకు, కె.పార్దసారధి-పెనమలూరు,బుర్రా ముదసూదన్ యాదవ్-కనిగిరి, అనిల్ కుమార్ యాదవ్-నెల్లూరు సిటీ గౌడ- 3- వైఎస్ ఆర్ కాంగ్రెస్ -2, టీడీపీ -1 వైఎస్ ఆర్ కాంగ్రెస్ - జోగి రమేష్ -పెడన,ఎన్.వెంకటేష్ గౌడ్-పలమనేరు టీడీపీ-అనగాని సత్యప్రసాద్-రేపల్లె మత్సకార-3, వైసీపీ-2, టీడీపీ -1 వైఎస్ ఆర్ కాంగ్రెస్ -సీదిరి అప్పలరాజు- పలాస, పి.వి.సతీష్ కుమార్ -ముమ్మడివరం వాసుపల్లి గణేష్ కుమార్ -విశాఖ దక్షిణ కాళింగ- 2-వైసీపీ-1, టీడీపీ -1 వైసీపీ- తమ్మినేని సీతారామ్-ఆముదాల వలస టీడీపీ- బెందాళం అశోక్ -ఇచ్చాపురం కురుబ- 2-ఇద్దరూ వైసీపీ కెవి ఉశశ్రీ చరణ్-కళ్యాణ దుర్గం, ఎమ్. శంకరనారాయణ-పెనుకొండ శెట్టిబలిజ-1- వైసీపీ-1 శ్రీనివాస వేణుగోపాలకృష్ణ- రామచంద్రపురం గవర- 1-టీడీపీ -1 పివిజిఆర్ నాయుడు- విశాఖ -పశ్చిమ రెడ్డిక-1- వైసీపీ- 1 - తిప్పల నాగిరెడ్డి- గాజువాక బోయ- 1- వైసీపీ -1 - గుమ్మలూరు జయరాం- ఆలూరు లింగాయత్-1- వైఎస్ ఆర్ కాంగ్రెస్ -1 - కాపు రామచంద్రారెడ్డి-రాయదుర్గం రజక-1 వైఎస్ ఆర్ కాంగ్రెస్ -1 - విడదల రజనీకుమారి- చిలకలూరిపేట 2019 కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం -25: వైఎస్ ఆర్ కాంగ్రెస్ -22, టీడీపీ-3 ఈ ఎన్నికలలో కాపు సామాజికవర్గం తరపున పోటీచేసిన అభ్యర్దులు అత్యధికం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 2104 ఎన్నికలలో వైసీపీకి కేవలం ముగ్గురు మాత్రమే కాపు ఎమ్మెల్యేలు ఉండగా, ఈ ఎన్నికలలో టీడీపీకి అదే సంఖ్య రావడం ఒక ప్రత్యేకగా భావించాలి.22 మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలవగా, ముగ్గురు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. నిడదవోలు, పొన్నూరు వంటి టీడీపీ బలమైన నియోజకవర్గాలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం సాదించడం గమనించవలసిన అంశం. జనసేన అధినేతకు కాపు సామాజికవర్గం కొంత భాగం అండగా నిలిచినా, ఆయన పూర్తిగా టీడీపీకి వ్యతిరేకం కాదన్న భావన ప్రబలడంతో ఆయనకు నష్టం జరిగిందని చెప్పాలి. జనసేన నుంచి ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా నెగ్గలేదు. అయితే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో టీడీపీకి ఈ పార్టీ బాగా డామేజీ చేసిందని అనుకోవచ్చు. గత ఎన్నికలలో ఈ రెండు జిల్లాలలో కలిపి టీడీపీకి 29 సీట్లు రాగా, ఈసారి కేవలం ఐదే దక్కాయి. అదే సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు ఇరవె ఎనిమది స్థానాలు వచ్చాయి. ఒకటి జనసేనకు వచ్చింది.ఈ వర్గం నుంచి గెలిచినవారిలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రి కాగా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మంత్రి అయ్యారు.కన్నబాబు గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు.టీడీపీ ఎమ్.పి పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చి భీమిలి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ కూడా మంత్రి అయ్యారు.కకృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి గెలుపొందిన పేర్ని నాని మంత్రి అయ్యారు. కాపు ఎమ్మెల్యేల వివరాలు : వైఎస్ ఆర్ కాంగ్రెస్ -22: అవంతి శ్రీనివాస్- భీమిలి, కరణం ధర్మశ్రీ- చోడవరం, గుడివాడ అమరనాద్- అనకాపల్లి, దాడిశెట్టి రాజా-తుని, పూర్ణచంద్రప్రసాద్-ప్రత్తిపాడు, పెండెం దొరబాబు -పిఠాపురం, కె.కన్నబాబు-కాకినాడ రూరల్, జక్కంపూడి రాజా- రాజానగరం, జ్యోతుల చంటిబాబు- జగ్గంపేట, జిఎస్.నాయుడు- నిడదవోలు, గ్రంది శ్రీనివాస్- భీమవరం, కొట్టు సత్యనారాయణ-తాడేపల్లిగూడెం, పుప్పాల శ్రీనివాసరావు-ఉంగుటూరు, ఆళ్ల నాని-ఏలూరు, డి.నాగేశ్వరరావు-కైకలూరు, పేర్ని నాని-మచిలీపట్నం, సింహాద్రి రమేష్-అవనిగడ్డ, సామినేని ఉదయభాను-జగ్గయ్యపేట, కిలారు రోశయ్య-పొన్నూరు, అంబటి రాం బాబు- సత్తెనపల్లి, మేడిశెట్టి వేణుగోపాల్-దర్శి, జె.శ్రీనివాసులు-చిత్తూరు(బలిజ). టీడీపీ-3: గంటా శ్రీనివాసరావు- విశాఖ ఉత్తరం, నిమ్మకాయల చినరాజప్ప- పెద్దాపురం, నిమ్మల రామానాయుడు-పాలకొల్లు. 2019 ఎస్.సి ఎమ్మెల్యేలు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ -27, టీడీపీ -1, జనసేన-1 2014 ఎన్నికలలో ఎస్.సి ఎమ్మెల్యేలు టీడీపీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు సరి సమానంగా ఉండగా, 2019 ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఏకపక్షంగా ఎన్నికయ్యరు. మొత్తం 29 రిజర్వుడ్ నియోజకవర్గాలకు గాను 27 చోట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలవగా, తెలుగుదేశం పార్టీ ఒకే చోట విజయం సాదించగలిగింది. జనసేన రాష్టరలో గెలిచిన ఏకైక సీటు కూడా ఎస్.సి ది కావడం విశేషం. ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే కె.నారాయణ స్వామికి ముఖ్యమంత్రి జగన్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కూడా విశేషం. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా కొండపి రిజర్వుడ్ నియోజకవర్గాన్ని, జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా రాజోలు రిజర్వుడ్ నియోజకవర్గాన్ని దక్కిం చుకున్నాయి. కాగా ఎస్.సిలలో మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్ లు మంత్రి పదవులు పొందారు. విశ్వరూప్ గతంలో జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మంత్రి పదవి వదలుకుని వచ్చారు. అలాగే సురేష్, సుచరితలు కూడా అప్పట్లో కాంగ్రెస్‌ను వదలి జగన్ కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మంత్రులు అయ్యారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ -27: కంభాల జోగులు-రాజాం, అలజంగి జోగారావు-పార్వతీపురం, గొల్ల బాబూరావు-పాయకరావుపేట, పినిపే విశ్వరూప్ -అమలాపురం, కొండేటి చిట్టిబాబు-పి.గన్నవరం, తానేటి వనిత-కొవ్వూరు, తలారి వెంకటరావు-గోపాలపురం, వి.ఆర్.ఎలీజా-చింతలపూడి, కె.రక్షణనిది- తిరువూరు, కె.అనిల్ కుమార్-పామర్రు, మొండితోక జగన్మోహన రావు-నందిగామ, ఉండవల్లి శ్రీదేవి- తాడికొండ, మేరుగ నాగార్జున- వేమూరు, మేకతోటి సుచరిత-ప్రత్తిపాడు, ఎ.సురేష్-ఎర్రగొండపాలెం, టి.సుదాకర్ బాబు-సంత నూతలపాడు, వరప్రసాద్-గూడూరు, కలివేటి సంజీవయ్య-సూళ్లూరుపేట, జి.వెంటకసుబ్బయ్య-బద్వేలు, కె.శ్రీనివాసులు- రైల్వే కోడూరు, ఆర్ధర్-నందికోట్కూరు, డాక్టర్ సుధాకర్ బాబు-కొడుమూరు, జె.పద్మావతి-శింగనమల, ఎమ్. తిప్పేస్వామి-మడకశిర, కె.ఆదిమూలం-సత్యవేడు, కె.నారాయణస్వామి-గంగాధరనెల్లూరు, ఎమ్.ఎస్.బాబు-పూతలపట్టు. టీడీపీ: బాలవీరాంజనేయ స్వామి-కొండపి జనసేన: రాపాక వరప్రసాద్-రాజోలు గిరిజన ఎమ్మెల్యేలు- మొత్తం వైసీపీనే... వైసీపీ-7, టీడీపీ-0 గత ఎన్నికల మాదిరే 2019 ఎన్నికలలో కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గాలను స్వీప్ చేసింది.కిందటిసారి టీడీపీకి ఒక స్థానం రాగా, ఈసారి అధికూడా దక్కలేదు.మొత్తం ఏడు నియోజకవర్గాలు వైసీపీకే వచ్చాయి. ఎస్.టి.ఎమ్మెల్యేల వివరాలు (అంతా వైసీపీనే) విశ్వాసరాయ కళావతి- పాలకొండ, పాముల పుష్పశ్రీవాణి-కురుపాం, చీడిక రాజన్నదొర-సాలూరు, చెట్టి ఫల్గుణ-అరకు, కొట్టుగుళ్లి భాగ్య లక్ష్మి-పాడేరు, నాగుల పల్లి ధనలక్ష్మి-రంపచోడవరం, తెల్లం బాలరాజు-పోలవరం. ముస్లింలు-4 అంతా వైసీపీనే.. ముస్లిం వర్గాలకు చెందిన వారు నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే వారంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచే గెలుపొందారు. వారిలో ఒకరు అంజాద్ భాషా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లావారు అయినా, అదే జిల్లాకు చెందిన భాషా కూడా ఉప ముఖ్యమంత్రి అవడం విశేషం. ఇది అరుదైన విషయమే. హిందూపూర్ నుంచి పోటీచేసిన మహ్మద్ ఇక్బాల్ మాత్రమే ఓడి పోియారు. ఆయనకు ఎమ్మెల్పీ పదవినీ జగన్ ఇచ్చారు. ముస్తాఫా-గుంటూరు తూర్పు, అంజాద్ భాషా-కడప, హఫీజ్ ఖాన్ -కర్నూలు, నవాజ్ భాషా-మదనపల్లె. ఇతర వర్గాలు..11- వైఎస్ ఆర్ కాంగ్రెస్ -9, టీడీపీ-2 క్షత్రియ-4: వైసీపీ-3, టీడీపీ-1 వైశ్య-4: వైసీపీ-3, టీడీపీ -1 బ్రాహ్మణ-2: వైసీపీ-2 వెలమ-1: వైసీపీ-1 క్షత్రియులలో నలుగురు ఎమ్మెల్యేలు కాగా వారిలో ఒకరు మాత్రమే టీడీపీ వారు. ఆచంట నుంచి గెలుపొందిన శ్రీరంగనాదరాజు మంత్రి కూడా ఆయ్యారు. రమణమూర్తిరాజు-యలమంచిలి, ముదునూరి ప్రసాదరాజు-నరసాపురం, శ్రీరంగనాదరాజు-ఆచంట. మంతెన రామరాజు-ఉండి వైశ్యులు నలుగురు ఎన్నిక కాగా ముగ్గురు వైసీపీవారు. వీరిలో వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి అయ్యారు.2014 లో ఈ వర్గం నుంచి ఒక్కరు కూడా వైసీపీ పక్షాన నెగ్గలేదు.కాని ఈసారి ముగ్గురు గెలిచారు. కోలగట్ల వీరభద్రస్వామి-విజయనగరం, వెల్లంపల్లి శ్రీనివాస్-విజయవాడ పశ్చిమ, అన్నా రాంబాబు-గిద్దలూరు. మద్దాల గిరి-గుంటూరు పశ్చిమ బ్రాహ్మణ- ఇద్దరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. రఘుపతి 2014 లో కూడా గెలిచారు. గత రెండుసార్లుగా టీడీపీ నుంచి ఒక్క బ్రాహ్మణ నేత కూడా ఎన్నిక కాలేదు. మల్లాది విష్ణు-విజయవాడ సెంట్రల్, కోన రఘుపతి-బాపట్ల. వెలమ-1-వైసీపీ వెలమ సామాజికవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఎన్నిక కాగా ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. నూజివీడు నుంచి సీనియర్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మరోసారి గెలిచారు. వెలమ-1-వైసీపీ- మేకా ప్రతాప అప్పారావు-నూజివీడు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
2014 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
2014 ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. పరిస్థితి అంత అనుకూలంగా లేదని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే పొత్తుల పంథాను అనుసరించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ను, అక్కడ బీజేపీ వెంట పడి పొత్తులు కలిపేసుకున్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 102 స్థానాలు దక్కగా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 67 స్థానాలు వచ్చాయి. బీజేపీకి నాలుగు స్థానాలు, ఇద్దరు స్వతంత్రులు గెలిపారు. సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్డి నేతలు 40 మంది గెలుపొందగా, కమ్మవర్గం వారు ముప్పై ఒక్క మంది విజయం సాదించారు. కాపు సామాజికవర్గం నేతలు ఇరవై మంది, బీసీలు ముప్పై రెండు మంది నెగ్గారు. ముస్లీంలు నలుగురు, ఇతర వర్గాల వారు పది మంది ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు అత్యధికంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ముప్పై ఒక్క మంది విజయం సాదించారు. టీడీపీ తరపున తొమ్మిది మంది గెలిచారు. కమ్మ సామాజికవర్గ నేతలు అత్యధికంగా ఇరవై ఎనిమిది మంది టీడీపీ తరపున గెలిస్తే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ముగ్గురే గెలిచారు. కాగా కాపులలో పద్నాలుగు మంది టీడీపీ, ముగ్గురు వైసిపి, ఇద్దరు బిజేపి, ఇండిపెండెంటుగా ఒకరు గెలిచారు. వెనుకబడిన తరగతులలో ఇరవై ఎనిమిది మంది టీడీపీ నుంచి నలుగురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఎస్సీలలో పదహారు మంది టీడీపీ, పదమూడు మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులలో ఒకరు మాత్రమే టీడీపీ నుంచి గెలవగా, మిగిలిన ఆరుగురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ముస్లీంలు నలుగురు వైసిపివారే కావడం విశేషం.ఐదుగురు క్షత్రియ సామాజికవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక కాగా ముగ్గురు టీడీపీ, కరు బీజేపీ, మరొకరు స్వతంత్రుడిగా గెలుపొందారు. ఇద్దరు వైశ్యులు టీడీపీ పక్షాన నెగ్గారు. ఇద్దరు వెలమ నేతలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి విజయం సాదించారు. ఒక బ్రాహ్మణ నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. బీసీ వర్గాలలో ఆయా సామాజికవర్గాలు రెడ్డి నేతలు - శాసనసభకు మొత్తం నలభై మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.వారిలో తెలుగుదేశం కు చెందినవారు తొమ్మిది మంది అయితే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందినవారు ముప్పై ఒక్క మంది ఉన్నారు. వైసిపి ఎమ్మెల్యేలలో ఏడుగురుపార్టీ ఫిరాయించారు.టీడీపీ నుంచి ఎన్నికైన రెడ్డిఎమ్మెల్యేలలో ముగ్గురు కోస్తా నుంచి ఆరుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పది మంది కోస్తా నుంచి గెలుపొందగా, ఇరవై ఒక్క మంది రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ..9 ఎన్.రామకృష్ణారెడ్డి-అనపర్తి ఎమ్.వేణుగోపాలరెడ్డి-గుంటూరు పశ్చిమ పి.శ్రీనివాసరెడ్డి-కోవూరు ఎమ్ మల్లిఖార్జున రెడ్డి రాజంపేట బి.సి. జనార్దనరెడ్డి- బనగానపల్లె జయనాగేశ్వరరెడ్డి-ఎమ్మిగనూరు జెసి ప్రభాకరరెడ్డి-తాడిపత్రి పి.రఘునాదరెడ్డి-పుట్టపర్తి బి.గోపాలకకృష్ణారెడ్డి-శ్రీకాళహస్తి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ..31 సి.జగ్గారెడ్డి-కొత్తపేట, ఎ.రామకకృష్ణారెడ్డి-మంగళగిరి, జి.శ్రీనివాసరెడ్డి-నరసరావుపేట, పి.రామకృష్ణారెడ్డి-మాచర్ల, జె.వెంకటరెడ్డి-మార్కాపురం, అశోక్ రెడ్డి-గిద్దలూరు, ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి-కావలి, ఎమ్.గౌతం రెడ్డి-ఆత్మకూరు, కె.శ్రీధర్ రెడ్డి-నెల్లూరు రూరల్, కె.గోవర్దనరెడ్డి-సర్వేపల్లి, జి.శ్రీకాంత రెడ్డి-రాయచోటి, వైఎస్ .జగన్మోహన్ రెడ్డి-పులివెందుల, పి.రవీంద్రనాద్ రెడ్డి-కమలాపురం, ఆదిఆనారాయణరెడ్డి-జమ్మలమడుగు, ఆర్.శివప్రసాదరెడ్డి-ప్రొద్దుటూరు, రఘురామిరెడ్డి-మైదుకూరు, భూమా శోభానాగిరెడ్డి(పోలింగ్ కు ముందే మరఠణించారు) ఆళ్లగడ్డ, భి.రాజశేఖరరెడ్డి-శ్రీశైలం, ఎస్.వి.మోహన్ రెడ్డి-కర్నూలు, గౌరు చరిత-పాణ్యం, బి.నాగిరెడ్డి-నంద్యాల (2017లో మరణించారు), బి.రాజేంద్రనాద్ రెడ్డి- డోన్, బాలనాగిరెడ్డి-మంత్రాలయం, సాయిప్రసాదరెడ్డి-ఆదోని, విశ్వేశ్వర్ రెడ్డి-ఉరవకొండ, సి.రామచంద్రారెడ్డి-పీలేరు, దేశాయ్ తిప్పారెడ్డి-మదనపల్లె, పి.రామచంద్రారెడ్డి-పుంగనూరు, సి.భాస్కరరెడ్డి-చంద్రగిరి, ఆర్.కె. రోజా-నగరి, అమరనాథ్ రెడ్డి-పలమనేరు. ఉప ఎన్నికలు: ఆళ్లగడ్డ-భూమ అఖిలప్రియ- వైఎస్ఆర్ కాంగ్రెస్ నంద్యాల-భూమా బ్రహ్మానందరెడ్డి -టీడీపీ వైసిపి నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు-7 అశోక్ రెడ్డి-గిద్దలూరు ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు బి.రాజశేఖరరెడ్డి-శ్రీశైలం భూమా అఖిలప్రియ-ఆళ్లగడ్డ భూమా నాగిరెడ్డి-నంద్యాల(మరణించారు) ఎస్.వీ.మోహన్ రెడ్డి-కర్నూలు అమరనాదరెడ్డి-పలమనేరు. వీరిలో అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమరనాదరెడ్డిలు మంత్రులు అవడం కూడా విశేషం. కమ్మ ఎమ్మెల్యేలు..33 ఏపీలో కమ్మ నేతలు మొత్తం ముప్పై మూడు మంది గెలిచారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై తొమ్మిది మంది, ముగ్గురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి , ఒకరు బీజేపీ నుంచి గెలుపొందారు. టీడీపీ నుంచి గెలిచిన కమ్మ నేతలలో ఇరవై రెండు మంది కోస్తా జిల్లాల నుంచి ఎన్నిక కాగా, ఏడుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు.వైసిపి నుంచి గెలిచినవారిలో ముగ్గురు కోస్తావారే. వైసిపి నుంచి గెలిచినవారిలో ఇద్దరు పార్టీ ఫిరాయించారు. కమ్మ టీడీపీ ఎమ్మెల్యేలు- 29 వి.రామకృష్ణబాబు - విశాఖ తూర్పు పీ.వెంకటేష్-రాజానగరం జీ.బుచ్చయ్య చౌదరి - రాజమండ్రి రూరల్ వి.జోగేశ్వరరావు బి.శేషారావు-నిడదవోలు ఏ.రాదాకృష్ణ - తణుకు జీ.వీరాంజనేయులు - ఉంగుటూరు సీ.ప్రభాకర్-దెందులూరు వల్లభనేని వంశి - గన్నవరం బోడె ప్రసాద్ -పెనమలూరు గద్దె రామ్మోహన్ -విజయవాడ తూర్పు దేవినేని ఉమామహేశ్వరరావు-మైలవరం కె.శ్రీధర్-పెదకూరపాడు డి.నరేంద్ర-పొన్నూరు ఎ.రాజేంద్రప్రసాద్-తెనాలి, పి.పుల్లారావు - చిలకలూరిపేట, కోడెల శివప్రసాదరావు - సత్తనపల్లి, జీవీ ఆంజనేయులు-వినుకొండ, వై.శ్రీనివాసరావు - పిడుగురాళ్ల, వై.సాంబశివరావు-పర్చూరు, డి.జనార్దన్-ఒంగోలు, బి.రామారావు-ఉదయగిరి, వి.ప్రభాకర చౌదరి-అనంతపురం, పరిటాల సునీత - రాప్తాడు, నందమూరి బాలకృష్ణ-హిందూపూర్, జి.సూర్యనారాయణ-దర్మవరం, వి.హనుమంతరావయ చౌదరి-కళ్యాణ దుర్గం, కె.రామకృస్ణ-వెంకటగిరి, ఎన్.చంద్రబాబు నాయుడు-కుప్పం. కమ్మ బీజేపీ ఎమ్మెల్యే-1 కామినేని శ్రీనివాస్-కైకలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-3 కొడాలి వెంకటేశ్వరరావు( నాని)-గుడివాడ గొట్టిపాటి రవికుమార్-అద్దంకి పి.రామారావు-కందుకూరు వీరిలో ఇద్దరు రవికుమార్, రామారావులు టీడీపీలోకి ఫిరాయించారు. కాపు ఎమ్మెల్యేలు..20 కాపు, బలిజ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆంద్ర ప్రదేశ్ లో ఇరవై మంది ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ నుంచి పద్నాలుగు మంది, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు గెలపొందారు.కాపులు,బలిజ వర్గాల నుంచి ఎన్నికైన వారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాల నంచి ఎన్నికయ్యారు.కాగా వైసిపి నుంచి గెలిచివనవారిలో ఇద్దరు పిరాయించి టీడీపీలో చేరిపోయారు. తెలుగుదేశం తరపున ఎన్నికైన కాపు ఎమ్మెల్యేలు-14 గంటా శ్రీనివాసరావు-భీమిలి పి.సత్యనారాయణ-అనకాపల్లి పి.రమేష్ బాబు-యలమంచిలి నిమ్మకాయల చినరాజప్ప-పెద్దాపురం తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం నిమ్మల రామానాయుడు-పాలకొల్లు బి.మాధవ నాయుడు-నరసాపురం రామాంజనేయులు-భీమవరం బి.కె.రామారావు-ఏలూరు మండలి బుద్ద ప్రసాద్- అవనిగడ్డ బి.ఉమామహేశ్వరరావు-విజయవాడ సెంట్రల్ కదిరి బాబూరావు- కనిగిరి ఎమ్.వెంకటరమణ-తిరుపతి(బలిజ) ( మరణించారు) కె. సత్యప్రభ-చిత్తూరు (బలిజ). ఉప ఎన్నిక- సుగుణమ్మ-తిరుపతి(బలిజ) బీజేపీ కాపు ఎమ్మెల్యేలు -2 ఆకుల సత్యనారాయణ-రాజమండ్రి సిటీ పి మాణిక్యాలరావు-తాడేపల్లిగూడెం ఇతరులు...(కాపు)-1 ఆమంచి కృష్ణమోహన్ - చీరాల (నవోదయ పార్టీ పేరుతో గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు) వైఎస్ ఆర్ కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు-3 దాడిశెట్టి రాజా-తుని, వరుపుల సుబ్బారావు-ప్రత్తిపాడు జె.వి.అప్పారావు- (నెహ్రూ)-జగ్గంపేట వీరిలో ఇద్దరు నెహ్రూ, సుబ్బారావులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. బీసీ ఎమ్మెల్యేలు 32 మంది.. ఏపీలో మొత్తం ముప్పై ఒక్క మంది బీసీ ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో ఇరవైఎనిమిది మంది టీడీపీ పక్షాన, నలుగురు మాత్రమే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. వీరిలో గౌడ వర్గం నుంచి ఐదుగురు, తూర్పుకాపు వర్గీయులు ఐదుగురు,కాళింగ ఇద్దరు, పోలినాటి వెలమ ముగ్గురు, కొప్పుల వెలమ ముగ్గురు, మత్సకార ముగ్గురు, యాదవ ఇద్దరు, శెట్టి బలిజ ఇద్దరు, గవర, బోయ, కురబ వర్గాల వారు ఒక్కొక్కరు గెలుపొందారు.ఆరుగురు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాల వారే.వైసిపి నుంచి గెలుపొందినవారిలో ఒకరు తూర్పు కాపు, ఒకరు కొప్పుల వెలమ, ఒకరు యాదవ, ఒకరు బోయ ఉన్నారు. వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు-28 బెందాళం అశోక్- ఇచ్చాపురం-కళింగ, గౌతు శివాజి-పలాస-గౌడ-సిగిడి, కె.అచ్చెన్నాయుడు-టెక్కలి -పోలినాటి వెలమ, గూండా లక్ష్మీదేవి-శ్రీకాకుళం-పోలినాటి వెలమ, కె.రవికుమార్- ఆముదాలవలస-కాళింగ, కె. కళావెంకటరావు- ఎచ్చెర్ల-తూర్పుకాపు, బగ్గు రమణమూర్తి- నరసన్నపేట-పోలినాటి వెలమ, కిమిడి మృణాళిని-చీపురుపల్లి-తూర్పు కాపు, కె.అప్పల నాయుడు-గజపతినగరం-తూర్పుకాపు, పి.నారాయణస్వామి నాయుడు-నెల్లిమర్ల-తూర్పు కాపు, మీసాల గీత-విజయనగరం-తూర్పు కాపు, కె.లలితకుమారి-శృంగవరపు కోట-కొప్పుల వెలమ, వి.గణేష్ కుమార్ -విశాఖ దక్షిణం,-మత్సకార, పివిజిఆర్ నాయుడు-విశాఖ పశ్చిమ-గవర, పల్లా శ్రీనివాస్-గాజువాక-యాదవ, బండారు సత్యనారాయణమూర్తి-పెందుర్తి-కొప్పుల వెలమ, అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కొప్పుల వెలమ, వి.వెంకటేశ్వరరావు-కాకినాడ సిటీ- మత్స్యకార, పిల్లి అనంతలక్ష్మి- కాకినాడ రూరల్-శెట్టి బలిజ, పితాని సత్యనారాయణ - ఆచంట-శెట్టి బలిజ, కె.వెంకట్రావు- పెడన-గౌడ, కొల్లు రవీంద్ర-మచిలీపట్నం-మత్స్యకార, ఎ.సత్యప్రసాద్-రేపల్లె-గౌడ, కె.ఇ. కృష్ణమూర్తి-ప్రత్తికొండ - గౌడ, కాల్వ శ్రీనివాసులు-రాయదుర్గం-బోయ, జితేందర్ గౌడ్-గుత్తి-గౌడ, కె.పార్దసారది-పెనుకొండ-కురుబ, శంకర్ యాదవ్- తంబళ్లపల్లె-యాదవ్ వైసిపి నుంచి ఎన్నికైన బీసీ ఎమ్మెల్యేలు-4 కె.వెంకటరమణ-పాతపట్నం-తూర్పుకాపు బి.ముత్యాల నాయుడు-మాడుగుల-కొప్పుల వెలమ అనిల్ కుమార్ యాదవ్-నెల్లూరు రూరల్- యాదవ్ జీ.జయరాం- ఆలూరు-బోయ వీరిలో వెంకటరమణ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ పక్షాన గెలుపొందిన ఎస్సీ ఎమ్మెల్యేలు-16 చిరంజీవులు - పార్వతిపురం, వి.అనిత-పాయకరావుపేట, ఎ. ఆనందరావు-అమలాపురం, జి. సూర్యారావు- రాజోలు, పి.నారాయణమూర్తి-పి.గవన్నవరం, కెఎస్ జవహర్-కొవ్వూరు, ఎమ్.వెంకటేశ్వరరావు-గోపాలపురం, పి.సుజాత-చింతలపూడి, టి.ప్రభాకరరావు -నందిగామ, టి.శ్రావణకుమార్-తాడికొండ, నక్కా ఆనంద్ బాబు- వేమూరు, రావెల కిషోర్ బాబు-ప్రత్తిపాడు, డాక్టర్ స్వామి-కొండపి, యామిని బాల-సింగనమల, కె.ఈరన్న- మడకశిర, టి.ఆదిత్య-సత్యవేడు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
2009 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
2009 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ కు బొటాబొటీ మజార్టీనే వచ్చింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 156 సీట్లు కాంగ్రెస్ కు రాగా, 91 స్థానాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈ ఎన్నికలలో విభజిత ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పక్షాన 106 మంది గెలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున ఏభై మూడు, మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున పదహారు మంది ఎన్నికయ్యారు. 2009లో రెడ్డి, కమ్మ, కాపుల మధ్య పోటీ ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే స్వతంత్ర కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై 31 మంది రెడ్లు, ఇరవై మూడు మంది బిసిలు, ఇరవై రెండు మంది ఎస్.సిలు, ఏడుగురు కాపులు, నలుగురు కమ్మ, ఆరుగురు ఎస్టి.లు,నలుగురు క్షత్రియ ముస్లింలు ముగ్గురు, వైశ్యులు ముగ్గురు, బ్రాహ్నణులు ఇద్దరు గెలిచారు. కాగా తెలుగుదేశం పక్షాన 19 మంది కమ్మ, ఎనిమిది మంది రెడ్లు, పది మంది బిసిలు, ఏడుగురు ఎస్సిలు, ఒక ఎస్టి, ఇద్దరు కాపు, ముగ్గురు క్షత్రియ, ఒక ముస్లిం, ఇద్దరు వైశ్యులు గెలపొందారు. ప్రజారాజ్యం పక్షాన పది మంది కాపులు, ముగ్గురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వైశ్యులు ఎన్నికయ్యారు. బిసిలలో కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు, శెట్టి బలిజ ఇద్దరు,పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ కురుమ లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. 42 మంది రెడ్డి ఎమ్మెల్యేల గెలుపు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎన్నిక కాగా వారిలో ముప్పై ఒక్క మంది కాంగ్రెస్ వారే. వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాలకు చెందినవారైతే, మిగిలిన పదిహేడు మంది రాయలసీమకు చెందినవారు. తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది ఎన్నిక కాగా, వారిలో ఇద్దరు కోస్తావారు, మిగిలినవారు రాయలసీమ నుంచి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరుకోస్తా, ఇద్దరు రాయలసీమ వారు. మొత్తం మీద రాయలసీమ నుంచి ఇరవైఐదు మంది రెడ్లు గెలుపొందగా, ఆంద్ర జిల్లాల నుంచి పదిహేడు మంది గెలిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత ఆయన సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా గెలుపొందారు. తిరిగి కడప ఎమ్.పిగా ఉన్న వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి, తిరిగి పోటీచేసినప్పుడు విజయమ్మ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీచేశారు.ఉప ఎన్నికలలో వీరిద్దరూ ఘన విజయం సాదించారు. 2009 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలలో డి.చంద్ర శేఖరరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, శివప్రసాదరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఎ. అమరనాద్ రెడ్డి, గడికోట శ్రీకాంతరెడ్డి, చెన్నకేశవరెడ్డి, గురునాదరెడ్డి, వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చి పదవులు వదులుకొని తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచారు. అనర్హతకు గురైనవారిలో పెద్దిరెడ్డి రామచంద్రరరెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి వీరు అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి నుంచి గెలిచినవారిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు టిడిపి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రసన్నకుమార్‌రెడ్డి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. కాగా మిగిలిన ఇద్దరు అనర్హత వేటుకు గురైయ్యారు. ప్రజారాజ్యం నుంచి గెలిచినవారిలో శోభానాగిరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు. ప్రజారాజ్యం మరో ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. రెడ్డి సామాజికవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు-31 ఎన్.శేషారెడ్డి- అనపర్తి డి.చంద్రశేఖర రెడ్డి - కాకినాడ సిటి గాదె వెంకటరెడ్డి- బాపట్ల కాసు వెంకట కృష్ణారెడ్డి- నరసరావుపేట వై. వెంకటేశ్వ రరరెడ్డి - సత్తెనపల్లి పి.రామకృష్నారెడ్డి - మాచర్ల శివప్రసాదరెడ్డి- దర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి- ఒంగోలు ఎమ్.మహీదర్ రెడ్డి-కందుకూరు ఉగ్ర నరసింహారెడ్డి-కనిగిరి, ఆనం రామనారాయణరెడ్డి- ఆత్మకూరు, ఆనం వివేకా నందరెడ్డి- నెల్లూరు రూరల్, ఆదాల ప్రభాకరరెడ్డి- సర్వేపల్లి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి, ఎ. అమరనాదరెడ్డి-రాజంపేట, గడికోట శ్రీకాంత రెడ్డి - రాయచోటి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి - పులివెందుల, జి.వీరశివారెడ్డి-కమ లాపురం, సి.ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు, డిఎల్. రవీంద్రరెడ్డి - మైదుకూరు, ఇ.ప్రతాపరెడ్డి - శ్రీశైలం, కె.రాంభూపాల్ రెడ్డి - పాణ్యం, శిల్పా మోహన్ రెడ్డి - నంద్యాల, చెన్నకేశవరెడ్డి - ఎమ్మిగనూరు, నీరజారెడ్డి - ఆలూరు, జె.సి.దివాకరరెడ్డి - తాడిపత్రి, గురునాదరెడ్డి - అనంతపురం, కె.వెంకట రామిరెడ్డి - ధర్మవరం, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి - పీలేరు, పి.రామచంద్రారెడ్డి - పుంగనూరు, కె.జయచంద్రారెడ్డి - చిత్తూరు. ఉప ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలిచినవారు పి.రామకృష్ణారెడ్డి-మాచర్ల బాలినేని శ్రీనివాసరెడ్డి-ఒంగోలు మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి ఎ.అమరనాదరెడ్డి-రాజంపేట గడికోట శ్రీకాంతరెడ్డి-రాయ చోటి వైఎస్ విజయమ్మ-పులివెందుల చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు గురు నాదరెడ్డి-అనంతపురం. తిరుపతి - భూమన కరుణాకరరెడ్డి (చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది) అనర్హత వేటుకు గురైన వారు డి.చంద్రశేఖరరెడ్డి-కాకినాడ శివప్రసాదరెడ్డి-దర్శి కె.వెంకటరామిరెడ్డి-ధర్మవరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పుంగనూరు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-8 కె.నారాయణరెడ్డి- మార్కాపురం ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు ఎమ్.లింగారెడ్డి-ప్రొద్దుటూరు వై.బాలనాగిరెడ్డి- మంత్రాలయం పి.రఘునాదరెడ్డి-పుట్టపర్తి ఎ.ప్రవీణ్ రెడ్డి-తంబళ్లపల్లె బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి పి.అమరనాదరెడ్డి- పలమనేరు ఉప ఎన్నికలు.. ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు అనర్హత వేటుకు గురైనవారు వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం ఎ.ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంభళ్లపల్లి ప్రజారాజ్యం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు-3 ఎ.శ్రీధర్ కృష్ణారెడ్డి- నెల్లూరు సిటీ-పిఆర్పి భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ-పిఆర్పి కె.రామిరెడ్డి- బనగానపల్లె- పిఆర్పి ఉప ఎన్నిక - భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ కమ్మ ఎమ్మెల్యేలు-24 2004 లో కాంగ్రెస్ పక్షాన 19 మందిఎమ్మెల్యేలు కమ్మ సామాజికవర్గం నుంచి గెలుపొందినా, 2009లో మాత్రం కాంగ్రెస్ లో ఆ వర్గం ఎమ్మెల్యేలు బాగా తగ్గిపోయారు.కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందగా, ఒకరు ప్రజారాజ్యం పక్షాన గెలిచారు. మిగిలిన 19 మంది కమ్మ ఎమ్మెల్యేలు టిడిపి తరపున గెలిచారు.వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాల నుంచి గెలుపొందగా, రాయలసీమలో ఐదుగురుగెలిచారు. టిడిపి ఎమ్మెల్యేలలో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లారు.ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానం లో టిడిపి విప్ కు విరుద్దంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.ప్రజారాజ్యం తరుపున గెలిచిన యలమంచిలి రవి ఆ పార్టీ విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2009 కమ్మ సామాజికవర్గ టిడిపి ఎమ్మెల్యేలు-19 వి.రామకృష్ణబాబు- విశాఖ తూర్పు వి.జోగేశ్వరరావు- మండపేట పి.వెంకటేష్- రాజానగరం- రాజానగరం బి.శేషారావు- నిడదవోలు చింతమనేని ప్రభాకర్- దెందులూరు డి.బాలవర్ధనరావు- గన్నవరం కొడాలి నాని-గుడివాడ దేవినేని ఉమామహేశ్వరరావు-మైలవరం కొమ్మాలపాటి శ్రీదర్-పెదకూరపాడు ధూళిపాళ్ల నరేంద్ర-పొన్నూరు ప్రత్తిపాటి పుల్లారావు-చిలకలూరిపేట జి.ఆంజనేయులు- వినుకొండ వై.శ్రీనివాసరావు- గురజాల కె.రామకృష్ణ - వెంకటగిరి కె. మీనాక్షి నాయుడు- ఆదోని పి.కేశవ్- ఉరవకొండ పరిటాల సునీత- రాప్తాడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు- నగరి నారా చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-4 దగ్గుబాటి వెంకటేశ్వరరావు - పర్చూరు-కాంగ్రెస్ గొట్టిపాటి రవికుమార్-అద్దంకి - కాంగ్రెస్ నాదెండ్ల మనోహర్ - తెనాలి-కాంగ్రెస్ గల్లా అరుణకుమారి - చంద్రగిరి - కాంగ్రెస్ 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ,తెలంగాణ ప్రకటన వంటి అంశాల నేపద్యంలో గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన అనర్హత వేటుకు గురయ్యారు. ప్రజారాజ్యం యలమంచిలి రవి - విజయవాడ తూర్పు - పిఆర్పి( ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు) 2009 కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-19 ప్రజారాజ్యం స్థాపనతో కాపు సామాజికవర్గం ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ఈ పార్టీకి ఓట్ల పరంగా గణనీయంగా ఓట్లు లభించినా, సీట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. కేవలం పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉమ్మడి రాష్ట్రంలో గెలుపొందగా, పదహారు సీట్లను ఎపి, రాయలసీమలలో గెలిచింది. అందులో పది సీట్లు కాపు నేతలే గెలుచుకున్నారు. 2004 లో కాపు సామాజికవర్గం వారు కాంగ్రెస్ నుంచి పదహారు మంది గెలవగా, 2009 లో ఏడుగురే గెలిచారు.ఇక తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయం అయింది. కేవలం ఇద్దరే గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ పక్షాన పది మంది విజయం సాదించారు. చిరంజీవి రెండు చోట్ల పోటీచేసి సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓడిపోవడం విశేషం. తిరుపతిలో ఆయన గెలిచారు. ఆ తర్వాత పరిణామాలలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. దాంతో వీరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యారు.చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన భూమన కరుణాకరరెడ్డి గెలుపొందారు. అవనతి గడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అస్వస్థతతో మరణించగా, ఆయన కుమారుడు హరి ప్రసాద్ గెలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆయనకు పోటీ పెట్టలేదు. ప్రజారాజ్యం పక్షాన గెలిచిన కాపు నేతలు ఎమ్. శ్రీనివాసరావు- భీమిలి సిహెచ్. వెంకటరామయ్య - గాజువాక గంటా శ్రీనివాసరావు - అనకాపల్లి పి.రమేష్ బాబు-పెందుర్తి ఈలి మధు సూదనరావు - టి.పిగూడెం వి.గీత-పిఠాపురం కె.కన్నబాబు - కాకినాడ రూరల్ పి.గాంధీ మోహన్-పెద్దాపురం బి. సత్యానాందరావు- కొత్తపేట కొణిదెల చిరంజీవి- తిరుపతి. కాంగ్రెస్‌కు చెందిన కాపు ఎమ్మెల్యేలు.. 7 తోట నరసింహం- జగ్గంపేట పి.రామాంజనేయులు-భీమవరం వట్టి వసంతకుమార్-ఉంగుటూరు- కాంగ్రెస్ ఎ.కె.శ్రీనివాస్- ఏలూరు పేర్ని వెంకట్రామయ్య(నాని) -బందరు కన్నా లక్ష్మీనారాయణ- గుంటూరు పశ్చిమ - కాంగ్రెస్ ఎ. కృష్ణమోహన్ -చీరాల కాంగ్రెస్ రాజకీయ పరిణామాలలో ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అనర్హత వేటుకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ కాపు ఎమ్మెల్యేలు-2 పి.సత్యనారాయణమూర్తి- ప్రత్తిపాడు అంబటి బ్రాహ్మణయ్య- అవనిగడ్డ. ఉప ఎన్నిక అవనిగడ్డ- అంబటి హరి ప్రసాద్-టిడిపి ఉప ఎన్నికలు రామచంద్రపురం-తోట త్రిమూర్తులు-కాంగ్రెస్ నరసాపురం- కొత్తపల్లి సుబ్బరాయుడు-కాంగ్రెస్ 2009లో ఎన్నికైన బిసి ఎమ్మెల్యేలు-33 ఈ ఎన్నికలలో ముప్పై మూడు మంది బిసి వర్గాలకు చెందిన వారు శాసనసభకు ఎన్నిక కాగా వారిలో పది మంది టిడిపికి చెందినవారు. మిగిలిన ఇరవై మూడు మంది కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఇచ్చాపురం, ఎస్.కోట, మాడ్గుల, కావలి, డోన్ , ప్రత్తికొండ, రాజమండ్రి రూరల్, కైకలూరు, పెనుకొండ, కదిరిలలో మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందగా, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, బీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విశాఖ-ఉత్తరం, విశాఖ-పశ్చిమ, నర్సీపట్నం, రాజమండ్రిసిటి, రామచంద్రాపురం, ముమ్మడివరం, ఆచంట, తణుకు, పెడన, పెనమలూరు, మంగళగిరి, రేపల్లె, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గంలలో కాంగ్రెస్ గెలిచింది. కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు,శెట్టి బలిజ ఇద్దరు, పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ, కురుమ, లింగాయత్‌లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు దర్మాన కృష్ణప్రసాద్, పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపు రామచంద్రరెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి తిరిగి పోటీ చేశారు.అయితే ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి తిరిగి గెలుపొందగా, సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. కాగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టెక్కలి ఎమ్మెల్యే కె.రేవతిపతి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు.టిడిపి ఎమ్మెల్యేలలో ఇచ్చాపురం ఎమ్మెల్యే పి.సాయిరాజ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి అనర్హత వేటుకు గురయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన బిసి ఎమ్మెల్యేలు.. 23 కె.రేవంతిపతి - టెక్కలి-కాళంగ బి.సత్యవతి - ఆముదాలవలస - కాళంగ ధర్మాన ప్రసాదరావు - శ్రీకాకుళం-పొలినాటి వెలమ ధర్మాన కృష్ణదాస్ - నరసన్నపేట పొలినాటి వెలమ ముత్యాలపాప - నర్సీపట్నం - కాంగ్రెస్ - కొప్పుల వెలమ, విజయకుమార్ - విశాఖ ఉత్తర - కొప్పుల వెలమ, ఎమ్. నీలకంఠం - ఎచ్చెర్ల - తూర్పు కాపు బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి - తూర్పుకాపు బి.అప్పలనరసయ్య-గజపతినగరం-తూర్పుకాపు బి.అప్పలనాయుడు- నెల్లిమర్ల- కాంగ్రెస్- తూర్పుకాపు, ఆర్. సూర్యప్రకాశరావు-రాజమండ్రి-కాంగ్రెస్- తూర్పుకాపు ఎమ్.విజయప్రసాద్-విశాఖ పశ్చిమ-కాంగ్రెస్-గవర జె.జగన్నాయకులు-పలాస-కాంగ్రెస్- మత్సకార సతీష్ కుమార్- ముమ్మడివరం-కాంగ్రెస్- మత్సకార ఎమ్.వి.రమణరావు- రేపల్లె- కాంగ్రెస్-మత్సకార కె.వి.నాగేశ్వరరావు- తణుకు- కాంగ్రెస్-యాదవ, కె.పార్దసారది- పెనమలూరు- కాంగ్రెస్-యాదవ ఎన్.రఘువీరారెడ్డి- కళ్యాణదుర్గం- కాంగ్రెస్- యాదవ జోగి రమేష్- పెడన- కాంగ్రెస్-గౌడ పి.సుభాష్ చంద్రబోస్- రామచంద్రాపురం-కాంగ్రెస్- శెట్టి బలిజ పి.సత్యనారాయణ- ఆచంట-కాంగ్రెస్- శెట్టి బలిజ కోండ్రు కమల-మంగళగిరి-కాంగ్రెస్-పద్మశాలి కాపు రామచంధ్రారెడ్డి రాయదుర్గం. ఉప ఎన్నికలు టెక్కలి- కె.భారతి`కాంగ్రెస్, నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్`వైఎస్ఆర్ కాంగ్రెస్ రాయదుర్గం`కాపు రామచంధ్రారెడ్డి`వైఎస్ఆర్ కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్నికైన బిసి నేతలు-10 పి.సాయిరాజ్- ఇచ్చాపురం- కాళింగ కె.లలితకుమారి- ఎస్.కోట- కొప్పుల వెలమ జి. రామానాయుడు మాడ్గుల కొప్పుల వెలమ జె.వెంకటరమణ-కైకలూరు-వడ్డి బి.మస్తాన్ రావు - కావలి- యాదవ కె.ఇ.కృష్ణమూర్తి-డోన్ - గౌడ కె.ఇ.ప్రభాకర్- పత్తికొండ- గౌడ బి.కె.పార్దసారది-పెనుకొండ - కురుమ చందన రమేష్- రాజమండ్రి రూరల్ -దేవాంగ వెంకట ప్రసాద్-కదిరి-పద్మశాలి. 2009 ఎస్.సి సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం 29 ఎస్.రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో కాంగ్రెస్ కు ఇరవై రెండు స్థానాలు, తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు దక్కాయి. వారి వివరాలు.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు(వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి తిరిగి ఉప ఎన్నికలలో గెలుపొందారు కాగా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి ఎమ్మెల్యేలలో గోపాలపురం ఎమ్మెల్యే వనిత కూడా అనర్హత వేటుకు గురయ్యారు). కాంగ్రెస్ ఎస్.సి ఎమ్మెల్యేలు-22 కె.మురళీమోహన్ - రాజాం ఎస్.జయమణి - పార్వతిపురం జి.బాబూరావు - పాయకరావుపేట పి.విశ్వరూప్- అమలాపురం ఆర్.వరప్రసాదరావు-రాజోలు పి.రాజేశ్వరీదేవీ-పి.గన్నవరం, రాజేష్ కుమార్-చింతలపూడి డి.పద్మజ్యోతి- తిరువూరు డి.వై.దాస్-పామర్రు డి.ఎమ్.వరప్రసాద్- తాడికొండ ఎమ్.సుచరిత-ప్రత్తిపాడు ఎ.సురేష్-ఎర్రగొండపాలెం బి.ఎస్. విజయకుమార్ -సంతనూతలపాడు జి.వి.శేషు- కొండపి కమలమ్మ-బద్వేల్ కె.శ్రీనివాసులు-ర్వేల్వే కోడూరు ఎల్.వెంకటస్వామి-నందికోట్కూరు, మురళీకృష్ణ-కొడుమూరు ఎస్.శైలజానాధ్-శింగనమల కె.సుధాకర్- మడకశిర జి.కుతూహలమ్మ- గంగాధర నెల్లూరు పి.రవి-పూతల్ పట్టు. ఉప ఎన్నికలు.. పాయకరావుపేట-జి.బాబూరావు ఎమ్.సుచరిత-ప్రత్తిపాడు శ్రీనివాసులు-రైల్వే కోడూరు – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
2004 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. విబజిత ఏపీలో కాంగ్రెస్ కు 139 స్థానాలలో విజయం సిద్దించగా, తెలుగుదేశంపార్టీకి ముప్పైఏడు స్థానాలే దక్కాయి. బిజెపికి ఒకటి, సీపీఐకి రెండు, సీపీఎం కు మూడు, నలుగురు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు.అప్పట్లో ఏపీలోని ఆంద్ర, రాయలసీమలలో కలిపి 187 నియోజకవర్గాలు ఉండేవి. సామా జికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 49 మంది, కమ్మ 32 మంది, కాపు, తెలగ, బలిజ వర్గాలకు చెందినవారు 23 మంది, బీసీలు ముప్పై నాలుగు మంది ఎస్సీ లు 22 మంది, ఎస్టీలు ఎనిమిది మంది గెలిచారు. క్షత్రియలు ఏడుగురు, ముస్లింలు నలుగురు, వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణ ఒకరు, క్రిస్టియన్ ఒకరు, అగర్వాల్ ఒకరు గెలుపొందారు. బీసీ వర్గాల విశ్లేషణ తూర్పు కాపు-7 యాదవ- 5 కొప్పుల వెలమ-4 శెట్టి బలిజ-4, పొలినాటి వెలమ-3,పద్మశాలి-3, కాళింగ-2,గవర-1,రెడ్డిక-1,మత్సకార-1, వడ్డీ-1, బోయ-1, గౌడ-1(మొత్తం పదమూడు బీసీ కులాల నుంచి ముప్పైనాలుగు మంది ఎన్నికయ్యారు) 2004-రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ కు అదికారంలోకి రాగా,అత్యధిక సంఖ్యలో 49 మంది రెడ్డినేతలు శాసనసభకు ఎన్నికయ్యారు.వీరిలో కాంగ్రెస్ పక్షాన నలభై నాలుగు మంది,టీడీపీ తరుపున నలుగురు, ఇండిపెండెంటు ఒకరు ఎన్నిక య్యారు. వీరిలో ఇరవై మంది కోస్తా జిల్లాల నుంచి ఇరవై మంది ఎన్నిక కాగా, మిగిలిన ఇరవైనాలుగు మంది రాయలసీమ నుంచి గెలుపొందారు.టీడీపీ తరపున కేవలం నలుగురే గెలుపొందారు.గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మంది రెడ్లు టీడీపీ తరపున గెలవలేదు. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు.. 44 టి.రామారెడ్డి-అనపర్తి చిర్ల జగ్గారెడ్డి-కొత్తపేట బుల్లబ్బాయిరెడ్డి-సంపర గాదె వెంకటరెడ్డి-బాపట్ల గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల కాసు కృష్ణారెడ్డి-నరసరావుపేట వై.వెంకటేశ్వరరెడ్డి-సత్తెనపల్లి పీ.లక్ష్మారెడ్డి-మాచర్ల వి.శ్రీనివాసులురెడ్డి-కంభం బి.శ్రీనివాసరెడ్డి-ఒంగోలు, బి.మహీధర్ రెడ్డి-కందుకూరు, కే.పెదకొండారెడ్డి-మార్కాపురం, మాగుంట పార్వతమ్మ-కావలి, పీ.శ్రీనివాసులురెడ్డి-కోవూరు, ఎ.వివేకానందరెడ్డి-నెల్లూరు, ఎ.రామ నారాయణరెడ్డి-రాపూర, ఎ.ప్రభాకరరెడ్డి-సర్వేపల్లి, కే.విష్ణువర్ధనరెడ్డి-అల్లూరు, ఎన్.రాజ్యలక్ష్మి-వెంకటగిరి, ఎమ్.చంద్రశేఖరరెడ్డి-ఉదయగిరి, డి.సి. గోవిందరెడ్డి-బద్వేల్, కే.ప్రభావతమ్మ-రాజంపేట, జి.మోహన్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి-పులివెందుల, సి.ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు, ఎన్.వరదరాజులరెడ్డి-ప్రొద్దుటూరు, డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి-మైదుకూరు, జి.ప్రతాపరెడ్డి-ఆళ్లగడ్డ, ఇ.ప్రతాపరెడ్డి-ఆత్మకూరు, గౌరు చరిత-నందికోట్కూరు, కే.రాంభూపాల్ రెడ్డి-పాణ్యం, ఎస్.మోహన్ రెడ్డి-నంద్యాల, చల్లా రామకృష్ణారెడ్డి-కోయిలకుంట్ల, కోట్ల సుజాత-డోన్, కే.చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు, వై.సాయి ప్రసాదరెడ్డి-ఆదోని, బి.నారాయణరెడ్డి-అనంతపురం, డాక్టర్ కే.మోహన్ రెడ్డి-నల్లమడ, జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి, పీ.రవీంద్రరెడ్డి-గోరంట్ల, కే.ప్రభాకరరెడ్డి-తంబళ్లపల్లె, పీ.రామచంద్రారెడ్డి-పీలేరు, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి-వాయల్పాడు 44.ఆర్.చెంగారెడ్డి-నగరి. రెడ్డి ఎమ్మెల్యేలు- తెలుగుదేశం-4 జి.వీరశివారెడ్డి-కమలాపురం ఎస్.వి.సుబ్బారెడ్డి-పత్తికొండ బి.గోవిందరెడ్డి-రాయదుర్గం ఎన్.అమరనాధ్ రెడ్డి-పుంగనూరు ఇండిపెండెంట్ రెడ్డి ఎమ్మెల్యే -1 బి.సుబ్బారెడ్డి-దర్శి కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు- 2004 2004లో కాంగ్రెస్ తరపున కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికవడం విశేషం. మొత్తం 32 మంది ఎన్నిక కాగా, వారిలో కాంగ్రెస్ తరపున 21 మంది, టీడీపీ పక్షాన పది మంది ఉండగా, ఒక కమ్మ నేత ఇండిపెండెంటుగా కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేల వివరాలు-21 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కు కమ్మ సామాజికవర్గం నుంచి ఇంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం ఇదే అని చెప్పాలి.మొత్తం 32 మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందగా,వారిలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ నుంచి పది మంది టీడీపీ నుంచి గెలవగా, ఒకరు ఇండిపెండెంటుగా గెలిచారు.వీరిలో పద్దెనిమిది మంది కోస్తా జిల్లాల నుంచి కాగా, ముగ్గురు రాయలసీమ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన పది మంది లోఐదుగురు కోస్తా జిల్లాల నుంచి , ఐదుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు బి.కృస్ణార్జున చౌదరి-ఆలమూరు సిహెచ్ రవీంద్ర-బూరుగుపూడి చిట్టూరి బాపినీడు-తణుకు మాగంటి వెంకటేశ్వరరావు-దెందులూరు, ఘంటా మురళరామకృష్ణ-చింతలపూడి, వై.రాజారామచందర్- కైకలూరు, పిన్నమనేని వెంకటేశ్వరరావు- ముదినేపల్లి, దేవినేని రాజశేఖర్-కంకిపాడు, చనుమోలు వెంకటరావు-మైలవరం, డి.మల్లిఖార్జునరావు-రేపల్లె, నాదెండ్ల మనోహర్-తెనాలి, రావి వెంకటరమణ-పత్తిపాడు, మర్రి రాజశేఖర్- (కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్), ఎమ్.మల్లిఖార్జునరావు-వినుకొండ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు, గొట్టిపాటి రవికుమార్-మార్టూరు, పోతుల రామారావు-కండపి, ఐ.తిరుపతి నాయుడు-కనిగిరి, గల్లా అరుణకుమారి-చంద్రగిరి, ఎస్.సి.వి.నాయుడు-శ్రీకాళహస్తి, జి.ముద్దుకృష్ణమనాయుడు- పుత్తూరు. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు..10 పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు కొడాలి వెంకటేశ్వరరావు-గుడివాడ డి. ఉమా మహేశ్వరరావు-నందిగామ డి.నరేంద్ర కుమార్-పొన్నూరు కరణం బలరాం-అద్దంకి పీ.కేశవ్-ఉరవకొండ పరిటాల రవీంద్ర-పెనుకొండ జి.జయలక్ష్మమ్య-ధర్మవరం డి.రమేష్-మదనపల్లె చంద్రబాబు నాయుడు -కుప్పం. ఇండిపెండెంట్-1 కే.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు.. 23 కాపు సామాజకవర్గం ఎమ్మెల్యేలు 2004 లో ఇరవై మూడు మంది ఎన్నికైతే వారిలో పదహారు మంది కాంగ్రెస్ నుంచి, ఆరుగురు టీడీపీ నుంచి, ఒకరు బిజెపి పక్షాన ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పక్షాన గెలిచినవారిలో కోస్తా జిల్లాల నుంచి పదహేను మంది , రాయలసీమ నుంచి ఒకరు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురిలో నలుగురు కోస్తా జిల్లాల వారు కాగా, ఇద్దరు రాయలసీమ వారు. కాంగ్రెస్ కాపు,బలిజ ఎమ్మెల్యేలు-16 కరణం ధర్మశ్రీ-మాడుగుల తోట గోపాలకృష్ణ-పెద్దాపురం జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం తోట నరసింహం-జగ్గంపేట గ్రంది శ్రీనివాస-భీమవరం కే.సత్యనారాయణ-తాడేపల్లిగూడెం వట్టి వసంతకుమార్-ఉంగుటూరు ఎ.కే.శ్రీనివాస్-ఏలూరు బి.వేదవ్యాస్-మల్లేశ్వరం పేర్ని నాని-మచిలీపట్నం మండలి బుద్ద ప్రసాద్-అవనిగడ్డ వంగవీటి రాదాకృష్ణ-విజయవాడ సామినేని ఉదయభాను-జగ్గయ్యపేట కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు పగడాల రామయ్య-గిద్దలూరు (బలిజ) ఎమ్.వెంకటరమణ-తిరుపతి.(బలిజ) తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-6 గంటా శ్రీనివాసరావు-చోడవరం పర్వత సత్యనారాయణమూర్తి-ప్రత్తిపాడు సి.హెచ్. సత్యనారాయణమూర్తి-పాలకొల్లు కే.సుబ్బారాయుడు-నరసాపురం ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి ఎ.ఎస్.మనోహర్-చిత్తూరు (బలిజ). బారతీయ జనతా పార్టీ 1. పీ.దొరబాబు-పిఠాపురం వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్యేలు(బీసీ)-34 ఏపీలో 2004 లో ముప్పై నాలుగు మంది బీసీ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో కాంగ్రెస్ పక్షాన గెలిచినవారు ఇరవై రెండు మంది కాగా, టీడీపీ తరపున పది మంది నెగ్గారు. ఇద్దరు ఇండిపెండెంట్లుగా విజయం సాదించారు. ఆయా కులాల వారీగా పరిశీలిస్తే కాళింగ ఇద్దరు( కాంగ్రెస్) పొలినాటి వెలమ ముగ్గురు, కొప్పుల వెలమ నలుగురు కలిపి ఏడుగురు( నలుగురు కాంగ్రెస్ ,ముగ్గురు టీడీపీ), తూర్పుకాపులు ఏడుగురు( ముగ్గురు కాంగ్రెస్ ,నలుగురు టీడీపీ), గవర ఒకరు (కాంగ్రెస్), రెడ్డిక ఒకరు (కాంగ్రెస్), శెట్టిబలిజలు నలుగురు (ముగ్గురు కాంగ్రెస్, ఒకరు ఇండిపెండెంట్), యాదవ ఐదుగురు( ముగ్గురు కాంగ్రెస్, ఒకరు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్), బోయ ఇద్దరు( ఒకరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ), పద్మశాలి ముగ్గురు( ఇద్దరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ), మత్స్యకార, వడ్డీ ఒక్కొక్కరు(కాంగ్రెస్) గౌడ ఒకరు(టీడీపీ) ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు.. 22 అప్పయ్యదొర-టెక్కలి-కాళింగ డి.ఫ్రసాదరావు-శ్రీకాకుళం-పొలినాటి వెలమ బోడ్డేపల్లి సత్యవతి-ఆముదాలవలస-కాళింగ డి.కృష్ణదాస్-నరసన్నపేట-పొలినాటి వెలమ బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి-తూర్పు కాపు పీ.మంగపతిరావు-ఉత్తరాపల్లి- కొప్పుల వెలమ, కే.సీతారామ్-భీమిలి-తూర్పుకాపు, గండి బాబ్జి-కొప్పుల వెలమ, కొణతాల రామకృష్ణ-గవర, పీ. గురుమూర్తి రెడ్డి-పెందుర్తి-రెడ్డి, డి.వెంకటేశ్వర్లు-తాళ్లరేవు-శెట్టి బలిజ, పిల్లి సుభాష్ చంద్రబోస్-రామచంద్రపురం-శెట్టి బలిజ, రౌతు సూర్యప్రకాష్ రావు-రాజమండ్రి-తూర్పుకాపు, పితాని సత్యనారాయణ-ఆచంట-శెట్టి బలిజ, కే.పార్దసారధి- ఉయ్యూరు-యాదవ, ఎమ్.హనుమంతరావు-మంగళగిరి-పద్మశాలి, మోపిదేవి వెంకటరమణ-కూచినపూడి-మత్స్యకార, టి.వెంకట్రావు-గుంటూరు-2-వడ్డీ, జె.కృష్ణమూర్తి-గురజాల-యాదవ, ఎన్.నీలావతి-గుత్తి-బోయ, ఎన్.రఘువీరారెడ్డి -మడకశిర-యాదవ, జొన్నా రామయ్య-కదిరి-పద్మశాలి. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 10 గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కే.మోహన్ రావు-పాతపట్నం-తూర్పుకాపు కే.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పొలినాటి వెలమ కే.కళావెంకట్రావు- ఉణుకూరు-తూర్పుకాపు తెంటు జయప్రకాష్-తెర్లాం-కొప్పుల వెలమ పడాల అరుణ- గజపతినగరం-తూర్పుకాపు పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు సి.హెచ్. అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కొప్పుల వెలమ యనమల రామకృష్ణుడు-తుని-యాదవ పీ.రంగనాయకులు -హిందూపూర్-పద్మశాలి. ఇండిపెండెంట్లు.. 2 కుడిపూడి చిట్టబ్బాయి-అమలాపురం-శెట్టిబలిజ ఎమ్.వెంకటేశ్వరరావు-గన్నవరం-యాదవ. 2004 ఎస్.సి ఎమ్మెల్యేల వివరాలు ఈ ఎన్నికలలో పదహారు మంది కాంగ్రెస్ తరపున,ఐదుమంది టీడీపీ పక్షాన, ఒకరు సీపీఎం తరపున గెలిచారు.వారి వివరాలు.. కాంగ్రెస్ ఎస్.సి ఎమ్మెల్యేలు.. 16 కే. మురళీమోహన్-ఎచ్చెర్ల పీ. విశ్వరూప్-అమలాపురం పీ. రాజేశ్వరదేవి-నగరం జి.సూర్యారావు-అల్లవరం, మద్దాల సునీత-గోపాలపురం, కోనేరు రంగారావు -తిరువూరు, డి.మాణిక్ వర ప్రసాద్-తాడికొండ, దారా సాంబయ్య-సంతనూతలపాడు, పీ.ప్రకాశ్ రావు-గూడూరు, ఎన్.సుబ్రహ్మణ్యం-సూళ్లూరుపేట, జి.వెంకటేశ్వర ప్రసాద్-కోడూరు, పీ.మురళికృష్ణ-కొడుమూరు, ఎమ్.మారెప్ప-ఆలూరు, ఎస్.శైలజానాద్-శింగనమల, కే.నారాయణస్వామి-సత్యవేడు, జి.కుతూహలమ్మ-వేపంజేరి. టీడీపీ ఎస్.సి. ఎమ్మెల్యేలు-5 కే.జోగులు-పాలకొండ చెంగల వెంకట్రావు-పాయకరావుపేట పీ.సుజాత-ఆచంట ఎల్.లలిత కుమారి-పలమనేరు బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం సీపీఎం..1 పాటూరు రామయ్య-నిడుమోలు 2004 - షెడ్యూల్ జాతుల ఎమ్మెల్యేలు-8 ఎస్టీవర్గాలకు చెందినవారు కాంగ్రెస్ పక్షాన నలుగురు, టీడీపీ తరపున ఇద్దరు, ఒకరు సీపీఐ,ఒకరు సీపీఎం పక్షాన గెలిచారు. వారి వివరాలు. కాంగ్రెస్ జన్నిమినతి గోమాంగో-కొత్తూరు కుంభా రవి-ఎస్.కోట పీ.బాలరాజు-పాడేరు టి.బాలరాజు- పోలవరం. రాజన్నదొర-సాలూరు (2007 లో కోర్టు ద్వారా ఎన్నికయ్యారు) తెలుగుదేశం ఆర్.భంజ్ దేవ్-సాలూరు (2007లో ఈయన గిరిజనుడు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది). సి.రమేష్-ఎల్లవరం ఇతరులు.. కే.లక్ష్మణమూర్తి- నాగూరు-సీపీఎం సి.దేముడు-చింతపల్లి-సీపీఐ క్షత్రియ ఎమ్మెల్యేలు-7 క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు ఏడుగురు ఎన్నిక కాగా, అంతా కాంగ్రెస్ కు చెందినవారే కావడం విశేషం. వారి వివరాలు.. ఎస్.విజయరామరాజు-పార్వతీపురం పీ.సాంబశివరాజు-సతివాడ ఎస్. రంగరాజు-విశాఖ-రెండు యువి రమణమూర్తి రాజు-యలమంచిలి ఎ. కృష్ణంరాజు-రాజోలు సి.రంగనాదరాజు-అత్తిలి పీ.సర్రాజు-ఉండి. ముస్లింలు-4 నలుగురు ముస్లింలు ఎన్నిక కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం పక్షాన గెలుపొందారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు కూటమిగా పోటీచేశాయి. షేక్ నాజర్ వలి-విజయవాడ-ఒన్-సీపీఐ షేక్ సుబాని-గుంటూరు -ఒన్-కాంగ్రెస్ అహ్మదుల్లా-కడప-కాంగ్రెస్ ఎమ్.ఎ.గపూర్- కర్నూలు- సీపీఎం ఇతర సామాజికవర్గాలలో వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణులు ఒకరు, అగర్వాల ఒకరు ఉన్నారు.ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు. వారి వివరాలు. ఒక్కరు తప్ప వీరందరూ కాంగ్రెస్ పక్షానే ఎన్నికయ్యారు. ఒకరు మాత్రం ఇండిపెండెంట్ గా నెగ్గారు. ద్రోణం రాజు సత్యనారాయణ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్దిగా ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు. వైశ్య-3 (ఇద్దరు కాంగ్రెస్ -ఒకరు ఇండి) వీరభద్రస్వామి- విజయనగరం-వైశ్య- ఇండి ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ-వైశ్య-కాంగ్రెస్ కొణిజేటి రోశయ్య-చీరాల- వైశ్య-కాంగ్రెస్. వెలమ-2(ఇద్దరు కాంగ్రెస్) సుజయ కృష్ణ రంగారావు- బొబ్బిలి-వెలమ-కాంగ్రెస్ ఎమ్.వి. ప్రతాప అప్పారావు- నూజివీడు- వెలమ- కాంగ్రెస్ బ్రాహ్మణ-1(కాంగ్రెస్) ద్రోణంరాజు సత్యనారాయణ-విశాఖ-1-బ్రాహ్మణ-కాంగ్రెస్, ఉప ఎన్నిక విశాఖ-1- ద్రోణం రాజు శ్రీనివాస్ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1999 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తిరిగి అదికారంలోకి వచ్చింది. బీజేపీ పొత్తుతో ఎన్నికలలో పోటీచేసిన తెలుగుదేశం పార్టీ ఆంద్ర ప్రాంతంలో 130 నియోజకవర్గాలలో గెలుపు సాధించింది.ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు నలభై తొమ్మిది సీట్లు రాగా, బీజేపీ కి నాలుగు దక్కాయి. ఇండిపెండెంట్లు నలుగురు నెగ్గారు. సామాజికవర్గాల విశ్లేషణ చూస్తే రెడ్డి సామాజికవర్గం వారు 44 మంది గెలవగా,వారిలో తెలుగుదేశం పక్షాన 21 మంది, కాంగ్రెస్ పార్టీ తరపున 23 మంది నెగ్గారు. కమ్మ సామాజికవర్గం వారు నలభై మంది గెలవగా, టీడీపీ నుంచి 34 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. కాపు సామాజికవర్గం వారు 22 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో టీడీపీపద్నాలుగు మంది, ఆరుగురు కాంగ్రెస్ వారు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీసీలు ముప్పై నాలుగు మందికిగాను టీడీపీ24, కాంగ్రెస్ నుంచి పది మంది గెలిచారు. ఎస్.సిలు ఇరవై రెండు మందికి గాను పదహారు మంది టీడీపీ, నలుగురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ,ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు.క్షత్రియలు ఎనిమిది మంది గెలిస్తే, ఏడుగురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ వారు ఉన్నారు.ఎస్.టిలు ఎనిమిది మందికిగాను ఏగుగురు తెలుగుదేశం వారే. ఒకరు కాంగ్రెస్ నుంచి నెగ్గారు. కాగా ముస్లింలు ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ నుంచి నెగ్గారు. ఇతరులు నలుగురు టీడీపీవారే. బీసీ వర్గాల విశ్లేషణ- కొప్పుల వెలమ-7 యాదవ- 5 తూర్పు కాపు-4 గౌడ-4 మత్సకార-3 పొలినాటి వెలమ-3 కాళింగ- 2 గవర- 2 పద్మశాలి-2 శెట్టి బలిజ-1 రెడ్డి ఎమ్మెల్యేల విశ్లేషణ-44 1999లో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చినా , రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున కొద్దిగా ఎక్కువగా గెలవడం విశేషం.టీడీపీపక్షాన 21 మంది రెడ్లు గెలిస్తే, 23 మంది రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. కోస్తాలో ఎనిమిది మంది కాంగ్రెస్ పక్షాన, ఎనిమిది మంది టీడీపీనుంచి గెలిచారు. రాయలసీమ నుంచి పదిహేను మంది కాంగ్రెస్ పక్షాన రెడ్లు ఎన్నిక కాగా, టీడీపీతరపున పదమూడు మంది గెలిచారు. తెలుగుదేశం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు.. 21 ఎన్. మూలారెడ్డి - అనపర్తి, జె. దుర్గాంబ-మాచర్ల పి. విజయ్ కుమార్ రెడ్డి-గిద్దలూరు వి. వేణుగోపాలరెడ్డి-కావలి, ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి- కోవూరు, ఎస్.చంద్రమోహన్ రెడ్డి-సర్వేపల్లి, ఎ.ప్రభాకరరెడ్డి-అల్లూరు, కె.విజయరామిరెడ్డి- ఉదయగిరి, కె.వీరారెడ్డి- బద్వేల్, ఆర్ రమేష్ కుమార్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, పి.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు,ఎస్.రఘురామిరెడ్డి- మైదుకూరు, బి.శోబా నాగిరెడ్డి- ఆళ్లగడ్డ, బి.సీతారామిరెడ్డి-ఆత్మకూరు, బి.రాజశేఖరరెడ్డి-నందికోట్కూరు, బి.పార్ధసారధిరెడ్డి- పాణ్యం, ఎస్.వి.సుబ్బారెడ్డి- ప్రత్తికొండ, బివి మోహన్ రెడ్డి- ఎమ్మిగనూరు, పి.రఘునాదరెడ్డి-నల్లమడ, బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి, ఆర్.రాజశేఖరరెడ్డి- పుత్తూరు. ఉప ఎన్నిక.. గిద్దలూరు - సాయికల్పన రెడ్డి - టీడీపీ కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు- 23 గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల కె. నాగార్జునరెడ్డి-కంభం ఎస్. పిచ్చిరెడ్డి-దర్శి బి. శ్రీనివాసరెడ్డి- ఒంగోలు, కె.పి. కొండారెడ్డి- మార్కాపురం, ఆనం వివేకానందరెడ్డి- నెల్లూరు, ఆనం రామనారాయణరెడ్డి- రాపూరు, ఎన్.రాజ్యలక్ష్మి- వెంకటగిరి, వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల, ఎమ్.వి. మైసూరారెడ్డి- కమలాపురం, ఎన్.వరదరాజులు రెడ్డి -ప్రొద్దుటూరు, చల్లా రామకృష్ణారెడ్డి- కోయిలకుంట్ల, వి.వేణుగోపాలరెడ్డి- రాయదుర్గం, వై.శివరామిరెడ్డి- ఉరవకొండ, జెసి దివాకరరెడ్డి- తాడిపత్రి, బి.నారాయణరెడ్డి- అనంతపురం, కె.సూర్యప్రతాపరెడ్డి- ధర్మవరం, కె.ప్రభాకరరెడ్డి- తంబళ్లపల్లె, పి.రామచం్షరెడ్డి-పీలేరు, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి- వాయల్పాడు, ఎన్.శ్రీధర్ రెడ్డి-పుంగనూరు, ఆర.చెంగారెడ్డి-నగరి, సి.కె.జయచంద్రారెడ్డి-చిత్తూరు. కమ్మ సామాజికవర్గం విశ్లేషణ- 40 కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం నలభై మంది ఎన్నిక కాగా, వారిలో ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి విజయం సాదించారు. ఒకరు బీజేపీ నుంచి గెలవగా ,మరొకరు ఇండిపెండెంటుగా నెగ్గారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారిలో ఇరవై తొమ్మిది మంది కోస్తా జిల్లాల నుంచి గెలవగా, ఐదుగురు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచివనారిలో ముగ్గురు కోస్తా నుంచి ఒకరు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ, ఇండిపెండెట్లు కూడా కోస్తా జిల్లాలవారే. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు-34 ఎమ్.వి. కృష్ణారావు-ఇచ్చాపురం గద్దె బాబూరావు-చీపురుపల్లి బి. భాస్కర రామారావు-పెద్దాపురం వివిఎస్ చౌదరి-ఆలమూరు, కె.అచ్చమాంబ-బూరు గుపూడి, జి.బుచ్చయ్యచౌదరి-రాజమండ్రి, వై.టి .రాజా- తణుకు, కె.విశ్వనాధం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, డి.బాలవర్దనరావు- గన్నవరం, రావి హరగోపాల్-గుడివాడ, అన్నె బాబూరావు- ఉయ్యూరు, వై. నాగేశ్వరరావు- కంకిపాడు, వడ్డే శోభ నాద్రీశ్వరరావు-మైలవరం, డి.ఉమా మహేశ్వరరావు-నందిగామ, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్ర ప్రసాద్- వేమూరు, ఎమ్.వెంక టసుబ్బయ్య- రేపల్లె, గోగినేని ఉమ- తెనాలి, ఎమ్.పెద రత్తయ్య- ప్రత్తి పాడు, పి. పుల్లారావు-చిలకలూరిపేట, కె.శివ ప్రసాదరావు-నరసరావుపేట, వై.వీరాంజనేయులు- సత్తెనపల్లి, వి.యల్లమందారావు-వినుకొండ, జె.లక్ష్మీ పద్మావతి -పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, జి.నరసయ్య-మా ర్టూరు, దివి శివరామ్-కందు కూరు, డి.ఆంజనేయులు-కొండపి, కె.మీనాక్షి నాయుడు- ఆదోని, సిసి వెంకట్రా ముడు-హిందూపూర్, పి.రవీంద్ర-పెనుకొండ, ఆర్.శోభ-మదన పల్లె, చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-4 పి. వెంకటేశ్వరరావు-ముదినేపల్లి ఇ. తిరుపతి నాయుడు-కనిగిరి బి. కృష్ణయ్య- ఆత్మకూరు(నెల్లూరు జిల్లా) జి. అరుణకుమారి- చంద్రగిరి. ఇతర కమ్మ ఎమ్మెల్యేలు.. కె.హరిబాబు- విశాఖపట్నం ఒకటి -బీజేపీ వై.రాజా రామచందర్- కైకలూరు- ఇండి కాపు ఎమ్మల్యేలు-22 1999లో ఇరవై రెండు మంది కాపు నేతలు ఎమ్మెల్యేలుగా గెలవగా, వారిలో టీడీపీనుంచి పద్నాలుగు, ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. టీడీపీనుంచి గెలిచినవారిలో ముగ్గురు తప్ప మిగిలినవారంతా కోస్తాజిల్లాలవారే. కాంగ్రెస్ లో గెలిచినవారంతా కోస్తావారే. టీడీపీకాపు ఎమ్మెల్యేలు.. 14 పి. చలపతిరావు-యలమంచిలి పర్వత బాపనమ్మ-ప్రత్తిపాడు సి. రామచంద్రరావు-తాళ్లరేవు తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, జెవి అప్పారావు(నెహ్రూ)- జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, ఎర్రా నారాయణ స్వామి- తాడేపల్లిగూడెం, ఎస్.అరుణ-గుంటూరు-2, పి.బ్రహ్మయ్య-రాజంపేట, (బలిజ) ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి,(బలిజ) చదలవాడ కృష్ణమూర్తి-తిరుపతి(బలిజ) కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు-6 బలిరెడ్డి సత్యారావు-చోడవరం జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం జి.ఎస్.రావు -కొవ్వూరు మండలి బుద్దప్రసాద్-అవనిగడ్డ ఎస్.ఉదయభాను-జగ్గయ్యపేట కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు ఇండిపెండెంట్ కాపు ఎమ్మెల్యేలు.. 2 ఎస్.వీరభద్రరావు-పిఠాపురం-ఇండి కె.వి.రాఘవేంద్రరావు-పెనుగొండ-ఇండి బీసీ ఎమ్మెల్యేలు- 33 1999 ఎన్నికలలో బీసీ ఎమ్మెల్యేలు మొత్తం ముప్పైనాలుగు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీవారు ఇరవైనాలుగు మంది, కాంగ్రెస్ వారు పది మంది. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలలో పదిహను మంది ఉత్తరాంద్ర నుంచి గెలుపొందడం విశేషం.ఐదుగురు మిగిలిన కోస్తా జిల్లాలవారు కాగా,నలుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పక్షాన గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా జిల్లాల వారు(ఆరుగురు ఉత్తరాంద్ర నుంచి ),ఒకరు రాయలసీమకు చెందినవారు. బీసీలలో ఒక్కో కులం వారీగా చూస్తే ఏడుగురు కొప్పుల వెలమ,ఐదుగురు యాదవ, నలుగురు గౌడ, తూర్పు కాపు నలుగురు,పొలినాటి వెలమ ముగ్గురు, మత్సకార ముగ్గురు, గవర ఇద్దరు, కాళింగ ఇద్దరు, పద్మశాలి ఇద్దరు , శెట్టి బలిజ ఒకరుగెలుపొందారు. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 24 గైతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కె. రేవతిపతి-టెక్కలి-కాళింగ కె. మోహన్‌రావు- పాతపట్నం-తూర్పుకాపు,జి.ఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం- పి.వెలమ, తమ్మినేని సీతారామ్ -ఆముదాల వలస-కాళింగ, కె.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పి.వెలమ, కె.గణపతిరావు- ఉణుకూరు- తూర్పుకాపు, కె.అప్పల నాయుడు-ఉత్తరాపల్లి-కొప్పుల వెలమ, పి.నారాయణస్వామి నాయుడు- భోగాపురం- తూర్పుకాపు, పిన్నింటి వరలక్ష్మి-విశాఖ2, -యాదవ, బి.సత్య నారాయ ణమూర్తి-పరవాడ, -కె.వెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కొప్పుల వెలమ, దాడి వరభధ్రరావు -అనకాపల్లి-గవర, పి.గణబాబు-పెందుర్తి-గవర, అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు- తుని-యాదవ, వి.వెంకటేశ్వరరావు -కాకినాడ-మత్సకార, పి.అనంతలక్ష్మి- తాళ్లరేవు-శెట్టిబలిజ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం- గౌడ, ఎన్.నరసింహరావు-మచిలీ పట్నం-మత్స కార, పి.రామారావు-చీరాల-యాదవ,కె.ఇ.ప్రభాకర్-ఢోన్-గౌడ, ఆర్.సాయినాద్ గౌడ్-గుత్తి, -గౌడ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-9 ధర్మాన ప్రసాదరావు-నరసన్నపేట-పి.వెలమ ఎమ్. శివున్నాయుడు-పార్వతి పురం-కె.వెలమ పి.జగన్మోహన్ రావు-బొబ్బిలి-కె.వెలమ వాసిరెడ్డి వరద రామారావు-తెర్లాం -కె.వెలమ టిఎస్ఎ నాయుడు- గజపతినగరం-తూర్పుకాపు ఎమ్. హను మంతరావు-మంగళగిరి-పద్మశాలి ఎమ్.వెంకటరమణ-కూచినపూడి-మత్యకార జె.కృష్ణమూర్తి- గురజాల-యాదవ ఎన్.రఘువీరారెడ్డి-మడకశిర-యాదవ. టీడీపీక్షత్రియ ఎమ్మెల్యేలు..7 పి.అశోక్ గజపతిరాజు-విజయనగరం ఆర్ఎస్ డిపి నరసింహరాజు-భీమిలి ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు డి. శివరామరాజు-అత్తిలి పివి. నరసింహరాజు-భీమవరం కె.రామచంద్రరాజు-ఉండి మంతెన అనంతవర్మ-బాపట్ల కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యే-1 పి.సాంబశివరాజు- సతివాడ ముస్లిం ఎమ్మెల్యేలు.. నలుగురు ఎన్నిక కాగా వారిలో ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ కు చెందినవారు. టీడీపీ..3 ఎస్.జియావుద్దీన్-గుంటూరు-1, ఖలీల్ భాషా-కడప, ఎన్.ఎమ్.డి ఫరూక్-నంద్యాల కాంగ్రెస్-1 జలీల్ ఖాన్-విజయవాడ 1 ఇతర సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు..6 (నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ) వైశ్యులు ముగ్గురు, ఇద్దరు వెలమ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందనవారు గెలిచారు. వైశ్య-3 అంబికా కృష్ణ-ఏలూరు-టీడీపీ టిజి వెంకటేష్- కర్నూలు-టీడీపీ ఎమ్.ఎస్. పార్ధసారది-కదిరి-బీజేపీ వెలమ-2 కె. విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ కె. హనుమతరావు-నూజివీడు-టీడీపీ. బ్రాహ్మణ కోట శ్రీనివాసరావు-విజయవాడ తూర్పు-బీజేపీ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1994 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1994 ఎన్నికలలో అన్ని సామాజికవర్గాలలో టీడీపీదే ఆధిక్యత. 1994లో ఎన్.టి రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉమ్మడి ఎపిలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా టీడీపీ మెజార్టీ సీట్లు సాదించింది.అన్ని సామాజికవర్గాలలో కూడా టీడీపీదే పై చేయి అయింది. ఎపిలోని కోస్తా, రాయలసీమలలో నలభై మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే అందులో ఇరవై ఐదు మంది టీడీపీ తరపున, పన్నెండు మంది కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒకరు సీపీఎమ్ తరపున గెలిచారు.కమ్మ నేతలు రికార్డు స్థాయిలో నలభైఏడు మంది గెలవగా, ముప్పై తొమ్మిది మంది టీడీపీ పక్షాన, ఇద్దరు మాత్రం కాంగ్రెస్ తరపున గెలిచారు. ఇండిపెండెంట్లుగా నలుగురు (వారిలో ముగ్గురికి కూడా టీడీపీ మద్దతు ఇచ్చింది) ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం ల పక్షాన గెలిచారు. కాపు సామాజికవర్గం నేతలు 21 మంది గెలవగా, టీడీపీ నుంచి పదిహేడు మంది, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు, ఒక ఇండిపెండెంట్ నెగ్గారు. బీసీల నుంచి 32 మంది గెలిస్తే ముప్పైమంది టీడీపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ తరుపున గెలిచారు. ఎస్సీ నేతలు 22 మందికిగాను పదహారుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు సీపీఎం, ఒకరు సీపీఐ నుంచి ఎన్నికయ్యారు.గిరిజనుల నుంచి ఎనిమిదికి గాను ఏడుగురు టీడీపీ, ఒకరు సీపీఐ నుంచి గెలిచారు. క్షత్రియులు తొమ్మిది మంది గెలవగా, ఆరుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐకి చెందినవారు. ముస్లీంలు నలుగురికి గాను ముగ్గురు టీడీపీ, ఒకరు సీపీఐ పక్షాన గెలిచారు. ముగ్గురు వెలమలు, వైశ్య ఒకరు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో టీడీపీ, సీపీఐ, సీపీఎం లు కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. కోస్తా, రాయలసీమల నుంచి బిజెపి పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదు. రికార్డు సంఖ్యలో కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు 1994 శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు రికార్డు స్తాయిలో ఎన్నికయ్యారు. మొత్తం నలభై ఏడు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు. వీరు కాక టీడీపీ మద్దతు ఇచ్చిన ముగ్గురు ఉన్నారు. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలకు చెందినవారు ఒక్కొక్కరు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెట్ ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ గన్నవరం నుంచి టీడీపీపై గెలిచి, ఆ తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. కాగా కోస్తా నుంచి ముప్పై ఆరు మంది గెలవగా, రాయలసీమ నుంచి తొమ్మిది మంది ఎన్నికయ్యారు. కాగా ఎన్. రామారావు కోస్తాలోని టెక్కలి నుంచి, రాయలసీమలోని హిందుపూర్ నుంచి పోటీచేసి రెండు చోట్ల గెలిచారు. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు 39 ఎన్.టి రామారావు-టెక్కలి, గద్దె బాబూరావు-చీపురుపల్లి, బి.భాస్కర రామారావు-పెద్దాపురం, వివిఎస్ చౌదరి -ఆలమూరు,కెవి రామకృష్ణ- బూరుగుపూడి, జి.బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి, పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు, ఎమ్.వి.కృష్ణారావు-తణుకు, కె.విశ్వనాదం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, రావి శోభనాద్రి-గుడివాడ, వై.సీతాదేవి-ముదినేపల్లి, ఎ.బాబూరావు- ఉయ్యూరు, డి.రాజశేఖర్-కంకిపాడు, జె.రమేష్ బాబు-మైలవరం, డివి రమణ-నందిగామ, నెట్టెం రఘురాం-జగ్గయ్యపేట, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్రప్రసాద్-వేమూరు, ఎమ్.వెంకటసుబ్బయ్య- రేపల్లె, రావి రవీంద్రనాద్-తెనాలి. ముప్పలనేని శేషగిరిరావు-బాపట్ల, మాకినేని పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, యరపతినేని శ్రీనివాసరావు-గురజాల, చప్పిడి వెంగయ్య-కంభం, ఈదర హరిబాబు-ఒంగోలు,దివి శివరాం-కందుకూరు, దామచర్ల ఆంజనేయులు-కొండపి, కె.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు, కె.మీనాక్షి నాయుడు-ఆదోని, పయ్యావుల కేశవ్-ఉరవకొండ, ఎన్.టి రామారావు-హిందుపూర్, పరిటాల రవీంద్ర-పెనుగొండ, సి.వెంకట రాముడు-దర్మవరం, ఆర్.కృస్ణసాగర్-మదనపల్లె, ఎన్. రామ్మూర్తి నాయుడు-చంద్రగిరి, జి.ముద్దుకృష్ణమ నాయుడు-పుత్తూరు, ఎన్.చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు.. 2 వంగవీటి రత్నకుమారి-విజయవాడ-రెండు సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట. రెడ్డిసామాజికవర్గం ఎమ్మెల్యేల విశ్లేషణ-40 మొత్తం నలభై మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, టీడీపీ పక్షాన ఇరవై ఐదు మంది గెలిచారు. కాంగ్రెస్ తరపున పన్నెండు మంది, సీపీఎం నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు.తెలుగుదేశం నుంచి గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా నుంచి పదహారు మంది రాయలసీమ నుంచి గెలిచారు. కాంగ్రెస్ కు చెందినవారిలో ముగ్గురు కోస్తా నుంచి తొమ్మిది మంది రాయలసీమ నుంచి విజయం సాదించారు.సీపీఎం నుంచి గెలిచిన నేత, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇద్దరు కోస్తా నుంచి నెగ్గారు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-25 ఎన్.మూలారెడ్డి-అనపర్తి చల్లా వెంకట కృష్ణారెడ్డి-గుంటూరు-రెండు కె.పున్నారెడ్డి-మాచర్ల పీ.రాంభూపాల్ రెడ్డి-గిద్దలూరు ఎమ్.కాశిరెడ్డి-కనిగిరి ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు, టి.రమేష్ రెడ్డి-నెల్లూరు, ఇ.శ్రీనివాసులురెడ్డి-రాపూరు, ఎస్.చంద్రమోహన్ రెడ్డి-సర్వేపల్లి, బి.వీరారెడ్డి-బద్వేలు, జి.ద్వారకానాధ్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, జి.వీరశివారెడ్డి-కమలాపురం, పీ.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు, భూమా నాగిరెడ్డి-ఆళ్లగడ్డ, బైరెడ్డి రాజశేఖరరెడ్డి-నందికోట్కేరు,కె.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, ఎస్.వి.సుబ్బారెడ్డి-ప్రత్తికొండ, బి.వి.మోహన్ రెడ్డి-ఎమ్మిగనూరు,వై.టి ప్రభాకరరెడ్డి-మడకశిర, టిడి.నాగరాజరెడ్డి-నల్లమడ, లక్ష్మీదేవమ్మ-తంబళ్లపల్లె, జివి.శ్రీనాదరెడ్డి-పీలేరు, చింతల రామచంద్రారెడ్డి-వాయల్పాడు, ఎన్.రామకృష్ణారెడ్డి-పుంగనూరు, బి.గోపాలకృస్ణారెడ్డి-శ్రీకాళహస్తి. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు..12 గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల గాదె వెంకటరెడ్డి-పర్చూరు కె. యానాదిరెడ్డి-కావలి ఎమ్. నారాయణరెడ్డి-రాయచోటి వై.ఎస్. వివేకానందరెడ్డి-పులివెందుల ఎన్. వరదరాజులురెడ్డి-ప్రొద్దుటూరు డి.ఎల్. రవీంద్రరెడ్డి-మైదుకూరు ఇ. ప్రతాపరెడ్డి-ఆత్మకూరు కె. రాంభూపాల్ రెడ్డి-పాణ్యం కోట్ల విజయభాస్కరరెడ్డి-డోన్ జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి సికె. జయచంద్రారెడ్డి-చిత్తూరు. ఇతరులు..3 జక్కా వెంకయ్య-అల్లూరు-సీపీఎం జంకె వెంకటరెడ్డి-మార్కాపురం-ఇండి కె.విజయరామిరెడ్డి-ఉదయగిరి- ఇండి( ఈ ఇద్దరు ఇండిపెండెంట్లకు కూడా టీడీపీ మద్దతు లభించింది.) కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-21 కాపు సామాజికవర్గం నుంచి 21 మంది ఎన్నిక కాగా పదహారు మంది టీడీపీ నుంచి గెలిచారు. వీరిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారే. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల నుంచి ఎన్నికైన వారు కూడా కోస్తా ప్రాంతం వారే. టీడీపీ కాపు ఎమ్మెల్యేలు-17 పీ.చలపతిరావు-యలమంచిలి పర్వత సుబ్బారావు-ప్రత్తిపాడు వి.నాగేశ్వరరావు-పిఠాపురం చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, వడ్డి వీరభద్రరావు-కడియం, జెవి అప్పారావు(నెహ్రూ) -జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, పీ.కనక సుందరరావు-తాడేపల్లిగూడెం, అంబటి బ్రాహ్మణయ్య-మచిలీపట్నం, సింహాద్రి సత్యనారాయణ-అవనిగడ్డ, ఎన్.శ్రీరాములు-దర్శి, పీ.బ్రహ్మయ్య-రాజంపేట, బి.(బలిజ)హూలికుంటప్ప-రాయదుర్గం(బలిజ) ఎ.మోహన్-తిరుపతి (బలిజ) కాంగ్రెస్-1 కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు సీపీఐ-1 వంకా సత్యనారాయణ-పెనుగొండ సీపీఎం-1 పుతుంబాక భారతి-సత్తెనపల్లి ఇండి..1 తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం బీసీ వర్గాల ఎమ్మల్యేలు 31 బీసీ వర్గాల ఎమ్మెల్యేలు మొత్తం 31 మంది ఎన్నికైతే ఐదుగురుతప్ప మిగిలి నవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారు.వీరిలో అత్యధికం ఉత్తరాంద్ర జిల్లాలలో ఎన్నికయ్యారు.ఇరవై ఒక్క మంది శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాల నుంచి ఎన్నికయ్యారు. ఇక రాయలసీమ నుంచి ఐదుగురుఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ముప్పై మంది, సీపీఐ నుంచి ఒకరు ఎన్నిక కాగా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరే ఎన్నికయ్యారు. బీసీలలో ఆయా సామాజికవర్గాలను పరిశీలిస్తే కొప్పుల వెలమ అత్యధికంగా తొమ్మిది మంది గెలుపొందారు. తూర్పు కాపులు ఐదుగురు, యాదవ నలుగురు,గౌడ ముగ్గురు, పొలినాటి వెలమ ముగ్గురు, పద్మశాలి ఇద్దరు, రెడ్డిక, కాళింగ, గవర, మత్సకార, బోయ ఒక్కొక్కరు గెలుపొందారు. మొత్తం పదకుండు కులాల వారు గెలిచారు. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలు-29 డి.అచ్యుతరామయ్య-ఇచ్చాపురం-రెడ్డిక గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కె.మోహన్ రావు-పాతపట్నం-తూర్పు కాపు జిఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ తమ్మినేని సీతారామ్-ఆముదాలవలస-కాళింగ, బగ్గు లక్ష్మణ రావు-నరసన్నపేట-పీ.వెలమ, కె.ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రాపురం-పీ.వెలమ, ఎర్రా కృష్ణమూర్తి-పార్వతీపురం-కె. వెలమ, ఎస్సీ.వి అప్పలనాయుడు-బొబ్బిలి-కె.వెలమ, తెంటు జయప్రకాష్-తెర్లాం-కొప్పుల వెలమ, పడాల అరుణ-గజపతి నగరం-తూర్పుకాపు, కె.అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కె.వెలమ, పీ.సూర్య నారా యణ-సతివాడ-తూర్పుకాపు, పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పు కాపు, పల్లా సింహాచలం-విశాఖ-రెండు-యాదవ, బి.సత్యనారాయణమూర్తి-పరవాడ-కొప్పుల వెలమ, జి.ఎర్రునాయుడు-చోడవరం-కె.వెలమ, రెడ్డి సత్య నారాయణ-మాడుగుల -కొప్పుల వెలమ, దాడి వీరభద్రరావు-అనకాపల్లి-గవర, సి.హెచ్.అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు-తుని-యాదవ, టి.ఎస్.ఎల్.నాయకర్-సంపర-మత్స్యకార, మరడాని రంగారావు-ఏలూరు-కొప్పుల వెలమ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం-గౌడ, ఇ.సీతారావమ్మ-కూచినపూడి-గౌడ, పీ.రామారావు-చీరాల-యాదవ, గాది లింగప్ప-గుత్తి-బోయ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి, జె.సూర్యనారాయణ-కదిరి-పద్మశాలి. కాంగ్రెస్ -1 పీ.రాజశేఖరం-ఉణుకూరు-తూర్పుకాపు ఇతరులు-1 కె.రామకృష్ణ-అనంతపురం-సీపీఐ-యాదవ షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు-22 షెడ్యూల్ కులాలకు చెందిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో పదహారు మంది తెలుగుదేశం పార్టీవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ,ముగ్గురు సీపీఎం, ఒకరుసీపీఐ కి చెందినవారు. ఎస్సీ.టీడీపీ ఎమ్మెల్యేలు..16 కె.ప్రతిభా భారతి-ఎచ్చెర్ల టి.భద్రయ్య-పాలకొండ కె.నూకరాజు-పాయకరావుపేట ఉండ్రు కృష్ణారావు-నగరం ఎజెబి ఉమామహేశ్వరరావు-అల్లవరం జె.బాబాజీరావు-గోపాలపురం ఎన్.స్వామిదాస్-తిరువూరు బి.దుర్గాప్రసాదరావు-గూడూరు పివి రత్నయ్య-సూళ్లూరుపేట వడ్డి చిన్నయ్య-రైల్వేకోడూరు మసాల ఈరన్న-ఆలూరు కె.జయరాం-శింగనమల బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం ఎమ్.సురాజన్-సత్యవేడు ఆర్.గాందీ-వేపంజేరి పీ.సుబ్బయ్య-పలమనేరు. కాంగ్రెస్-2 బత్తిన సుబ్బారావు-ముమ్మడివరం, ఎమ్.శిఖామని-కొడుమూరు. ఇతర పార్టీలు -4 డి.రాజగోపాల్-ఆచంట-సీపీఎం పీ.రామయ్య-నిడుమోలు-సీపీఎం తవనం చెంచయ్య-సంతనూతలపాడు-సీపీఎం జిఎమ్.ఎన్.వి ప్రసాద్-తాడికొండ-సీపీఐ షెడ్యూల్ జాతులు(ఎస్.టి)-8 ఎనిమిది మంది షెడ్యూల్ జాతులకు చెందిన ఎమ్మెల్యేలకు గాను ఏడుగురు టీడీపీవారు,ఒకరు సీపీఐకి చెందినవారు.కాంగ్రెస్ కు ఎస్టి స్థానాలలో ఒక్కటి కూడా రాలేదు. ఎస్.టి.టీడీపీ ఎమ్మెల్యేల వివరాలు..7 నిమ్మక గోపాలరావు-కొత్తూరు నిమ్మక జయరాజు-నాగూరు ఆర్.పీ.భంజదేవ్-సాలూరు ఎల్.బి.దుక్కు-ఎస్.కోట కె.చిట్టి నాయుడు-పాడేరు ఎస్.వెంకటేశ్వరరావు-రంపచోడవరం పీ.సింగన్నదొర-పోలవరం సీపీఐ-1: 1.జి.దేముడు-చింతపల్లి క్షత్రియ ఎమ్మెల్యేలు..9 క్షత్రియ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది గెలవగా వారిలో ఆరుగురు టీడీపీ కి చెందినవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ వారు. టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-6 పీ.అశోక్ గజపతిరాజు-విజయనగరం ఆర్ఎస్ డి అప్పల నరసింహరాజు-భీమిలి ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు పివి నరసింహరాజు-భీమవరం కె.రామచంద్రరాజు-ఉండి వి.దొరస్వామిరాజు-నగరి. కాంగ్రెస్-2 కనుమూరి బాపిరాజు-అత్తిలి, ఎన్.వెంకట్రామరాజు-కైకలూరు సీపీఐ-1 కె.సుబ్బరాజు-విజయవాడ-1 ముస్లీం-5 ముస్లీంలు ఐదుగురు ఎన్నిక కాగా నలుగురు టీడీపీ వారుకాగా, ఒకరు సీపీఎం నుంచి ఎన్నికయ్యారు. టీడీపీ ముస్లీం ఎమ్మెల్యేలు-4 రెహమాన్-విశాఖ-ఒకటి జియావుద్దీన్ -గుంటూరు-1 ఖలీల్ భాష-కడప ఎన్.ఎమ్.డి ఫరూఖ్-నంద్యాల సీపీఎం-1 అబ్దుల్ గఫూర్-కర్నూలు ఇతర వర్గాలకు చెందినవారిలో వెలమ సామాజికవర్గం నుంచి ముగ్గురు, వైశ్య ఒకరు నెగ్గారు.వెలమ నేతలు ముగ్గురూ టీడీపీవారు వెలమ-3 కె.విద్యాదరరావు-చింతలపూడి-వెలమ-టీడీపీ కె.హనుమంతరావు-నూజివీడు-వెలమ-టీడీపీ వివికె యాచేంద్ర-వెంకటగిరి-వెలమ-టీడీపీ వైశ్య-1: ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ- వైశ్య – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1989 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1989లో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. అన్ని వర్గాలలో కాంగ్రెస్ ఆధిక్యం. ఆంద్ర, రాయలసీమలలో ఉన్న 187 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 124 స్థానాలు రాగా, తెలుగుదేశం పార్టీకి ఏభై ఐదు, సీపీఎంకు ఇద్దరు, ఇండిపెండెంట్లు ఆరుగురు ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 53 మంది ఎన్నిక కాగా వారిలో కాంగ్రెస్‌కు చెందినవారు 44 మంది ఉన్నారు. టీడీపీ నుంచి ఏడుగురు గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. కమ్మ సామాజికవర్గం నుంచి ముప్పైమూడు మంది గెలవగా, వారిలో కాంగ్రెస్ నుంచి 19, టీడీపీ పక్షాన 14 మంది ఉన్నారు. కాపు సామాజికవర్గం నుంచి 24 మందికి గాను కాంగ్రెస్ తరుపున పదిహేడు, టీడీపీ నుంచి ఆరుగురు, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. బీసీలు మొత్తం 30 మంది గెలవగా, కాంగ్రెస్ 13, టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. షెడ్యూల్ కులాలలో 23 మందికి గాను కాంగ్రెస్ పదిహేను, టీడీపీ ఐదుగురు, సీపీఎం ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. కాగా ఎస్సీ సీట్లు ఇరవై రెండుసీట్లు ఉండగా, మరొక ఎస్సీ. నేత జనరల్ సీటులో నెగ్గారు. ఎస్టీలలో ఎనిమిది మందికి గాను ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీ వారు. క్షత్రియలు ఎనిమిది మందికి గాను నలుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీకి చెందిన వారు. వైశ్య ఇద్దరు, ముస్లీం ముగ్గురు, బ్రాహ్మణ ఒకరు గెలవగా, వారంతా కాంగ్రెస్ వారే. వెలమ నుంచి ఒకరు నెగ్గగా ఆయన టీడీపీ వారు. 1989 ఎన్నికలు- రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు-53 1989లో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. ఆ తరుణంలో ఎపిలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి ఏభై మూడు మంది రెడ్డి నేతలు రికార్డు స్థాయిలో ఎన్నికయ్యారు.వీరిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా నలబై నాలుగు మంది ఎన్నిక కాగా,టీడీపీనుంచి ఏడుగురు, ఇద్దరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు-44 కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎన్నికలలో 44 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలోఇరవై మంది కోస్తా జిల్లాల నుంచి గెలవగా, మిగిలిన ఇరవై నాలుగు మంది రాయలసీమ ప్రాంతం నుంచి గెలుపొందారు. కాంగ్రెస ఎమ్మెల్యేల వివరాలు..44 టీఎస్ఎన్ రెడ్డి-విశాఖ-2 టీ.రామారెడ్డి-అనపర్తి సీ.సోమసుందరరెడ్డి-కొత్తపేట ఎసివై రెడ్డి-రాజమండ్రి ఎ.బుల్లబ్బాయిరెడ్డి-సంపర సీ.గోవర్దనరెడ్డి-బాపట్ల గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల డి.బాలకోటి రెడ్డి-సత్తెనపల్లి కే.వి.నర్సిరెడ్డి-గురజాల కెనాగార్జున రెడ్డి-కంభం, ఎస్.పిచ్చిరెడ్డి-దర్శి, ఎమ్.మఠహీదర్ రెడ్డి-కందుకూరు, కే.పీ.కొండారెడ్డి-మార్కాపురం, వై.వెంకటరెడ్డి-గిద్దలూరు, కే.యానాది రెడ్డి-కావలి, బీ.సుందరరామిరెడ్డి-ఆత్మకూరు, ఎన్.శ్రీనివాసులురెడ్డి-కోవూరు, సీ.వి. శేషారెడ్డి-సర్వేపల్లి, కే.విష్ణువర్ధన్‌రెడ్డి-అల్లూరు, నేదురుమల్లి జనార్దనరెడ్డి-వెంకటగిరి, కే.మదన్ మోహన్ రెడ్డి-రాజంపేట, కే.శివానందరెడ్డి-కడప, ఎమ్.నారాయణరెడ్డి-రాయచోటి, ఆర్.రాజగోపాలరెడ్డి- లక్కిరెడ్డిపల్లి, వైఎస్ వివేకానందరెడ్డి-పులివెందుల, ఎమ్.వి.మైసూరారెడ్డి-కమలాపురం, ఎన్.వరదరాజులు రెడ్డి-ప్రొద్దుటూరు, డి.ఎల్. రవీంద్ర రెడ్డి-మైదుకూరు, బీ.వెంగళరెడ్డి-ఆత్మకూరు, బీ.శేషశయనరెడ్డి-నంది కోట్కూరు, కే.రాంభూపాల్ రెడ్డి-పాణ్యం, వి.రామనాదరెడ్డి-నంద్యాల, పీ.శేషిరెడ్డి-ప్రత్తికొండ, పీ.వేణుగోపాలరెడ్డి-రాయదుర్గం, జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి, బీ.నారా యణరెడ్డి-అనంతపురం, ఎస్.చెన్నారెడ్డి-పెనుకొండ, పీ.రవీంద్ర రెడ్డి-గోరంట్ల, పీ.రామచంద్రారెడ్డి-పీలేరు, ఆవుల మోహన్ రెడ్డి-మదనపల్లె, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి-వాయల్పాడు, మబ్బు రామిరెడ్డి-తిరుపతి, ఆర్.చెంగారెడ్డి-నగరి, సీ.కే. జయ చంద్రారెడ్డి-చిత్తూరు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-7 పీ.శివారెడ్డి-జమ్మలమడుగు బీ.శేఖర్ రెడ్డి-ఆళ్లగడ్డ కర్రా సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల బివి మోహన్ రెడ్డి-ఎమ్మిగనూరు జీ.నాగిరెడ్డి-దర్మవరం ఎన్.రామకృస్ణారెడ్డి-పుంగనూరు బీ.గోపాలకృష్ణారెడ్డి-శ్రీకాళహస్తి ఇండిపెండెంట్లు..2 జె.కోదండరామిరెడ్డి-నెల్లూరు కే.ప్రభాకరరెడ్డి-తంబళ్లపల్లె 1989-కమ్మ ఎమ్మెల్యేల విశ్లేషణ-33 1989లో మొత్తం ముప్పై మూడు మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి కూడా కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు గణనీయంగానే ఎన్నికయ్యారు. 19 మంది కాంగ్రెస్ నుంచి ఎన్నిక కాగా, టీడీపీ నుంచి 14 మంది నెగ్గారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో 17 మంది కోస్తా జిల్లాల నుంచి కాగా, ఇద్దరు రాయలసీమ నుంచి ఉన్నారు.తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వారిలో 11 మంది కోస్తా నుంచి ముగ్గురు రాయలసీమ నుంచి నెగ్గారు.కాగా కోస్తాప్రాంతానికి చెందిన ఎన్.టీ.రామారావు రాయలసీమలోని హిందుపూర్ లో గెలిచారు. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు...19 చావా రామకృష్ణ-ఉంగుటూరు ఎమ్. రవీంద్ర నాద్ చౌదరి-దెందులూరు పాలడుగు వెంకట్రావు-నూజివీడు ముసునూరు రత్నబోస్-గన్నవరం పిన్నమనేని వెంకటేశ్వరరావు-ముదినేపల్లి వి.రత్నకుమారి-విజయవాడ-2 కే.బాస్కరరావు-మైలవరం ఎమ్.వెంకటేశ్వరరావు-నందిగామ చిట్టినేని వెంకటరావు-పొన్నూరు ఆలపాటి ధర్మారావు-వేమూరు నాదెండ్ల భాస్కరరావు-తెనాలి నన్నపనేని రాజకుమారి-వినుకొండ పీ.రాఘవరావు-అద్దంకి జీ.అచ్యుతకుమార్-కొండపి ఇ.తిరుపతి నాయుడు-కనిగిరి ఎన్.వెంకటరత్నం నాయుడు-రాపూరు మాదాల జానకీరామ్-ఉదయగిరి వి.రాంభూపాల్ చౌదరి-కర్నూలు గల్లా అరుణకుమారి-చంద్రగిరి తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు-14 ఎమ్.వి.కృష్ణారావు-ఇచ్చాపురం పివి కృష్ణారావు-కోవ్వూరు ఎమ్.వి.కృష్ణారావు-తణుకు డి.రాజశేఖర్-కంకిపాడు ఎన్.రఘురాం-జగ్గయ్యపేట ఎమ్.పెదరత్తయ్య-ప్రత్తిపాడు కే.జయమ్మ-చిలకలూరిపేట కే.శివప్రసాదరావు-నరసరావుపేట ఎన్.శివరామప్రసాద్-మాచర్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు కే.బలరాం-మార్టూరు ఎన్.టీ.రామారావు-హిందూపూర్ జీ.ముద్దుకృష్ణమనాయుడు-పుత్తూరు ఎన్.చంద్రబాబు నాయుడు-కుప్పం 1989- కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేల విశ్లేషణ-24 ఈ ఎన్నికలలో ఇరవై నాలుగు మంది కాపు సామాజికవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 17 మంది, టీడీపీ పక్షాన ఆరుగురు గెలవగా, ఒకరు ఉండిపెండెంటుగా నెగ్గారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో ఒక్కరు తప్ప అంతాకోస్తా జిల్లాల నుంచే గెలిచారు. తెలుగుదేశం తరుపున గెలిచినవారిలో వారు కూడా కోస్తావారే. (రాయలసీమలో బలిజలుగా పరిగణిస్తారు). కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు..17 ఈటి విజయలక్ష్మి-విశాఖ-1-తెలగ జీ.గురునాదరావు-పెందుర్తి(తెలగ) బలిరెడ్డి సత్యారావు-చోడవరం ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు కెసిహెచ్ మోహన్ రావు-పిఠాపురం పంతం పద్మనాభం-పెద్దాపురం ఎమ్.గంగయ్య-రాజోలు సంగీత వెంకటరెడ్డి-ఆలమూరు బదిరెడ్డి అప్పన్నదొర-బూరుగుపూడి జె.శ్రీరంగనాయకులు-పెనుకొండ హరిరామజోగయ్య-పాలకొల్లు బూరగడ్డ వేదవ్యాస్-మల్లేశ్వరం పేర్ని కృష్ణమూర్తి- మచిలీపట్నం వి.చలపతిరావు-ఉయ్యూరు కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు అంబటి రాంబాబు-రేపల్లె బీ.బాలయ్య-ఒంగోలు(బలిజ) తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు..6 పీ.చలపతిరావు-యలమంచిలి చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు తోట సుబ్బారావు-జగ్గంపేట కొత్తపల్లి సుబ్బరాయుడు-నరసాపురం పీ.కనకసుందరరావు-తాడేపల్లిగూడెం సింహ్దా సత్యనరాయాణ-అవనిగడ్డ ఇండిపెండెంట్-1 జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం 1989-బీసీ వర్గాల ఎమ్మెల్యేల విశ్లేషణ..30 ఈ ఎన్నికలలో ముప్పై మంది బీసీ వర్గాల ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 13 మంది, తెలుగుదేశం పక్షాన పదిహేను మంది గెలుపొందారు.ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు..కొప్పుల వెలమ నుంచి ఆరుగురు, తూర్పు కాపు నుంచి దుగురు, పొలినాటి వెలమ ముగ్గురు, యాదవ ముగ్గురు, గౌడ ముగ్గురు, కాళింగ ఇద్దరు, శెట్టిబలిజ ఇద్దరు, పద్మశాలి ఇద్దరు, మత్సకార,కళావంతుల, కురుబ, గవర ల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-13 పదమూడు మంది బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా వీరిలో తొమ్మిది మంది కోస్తా జిల్లాలలోను, మిగిలిన నలుగురు రాయలసీమ నుంచి గెలిచారు. పైడి శ్రీరామమూర్తి-ఆముదాలవలస-కాళింగ దర్మాన ప్రసాదరావు-నరసన్నపేట-పీ.వెలమ పీ.జగన్మోహన్ రావు-బొబ్బిలి- కే.వెలమ మల్లాడి స్వామి-కాకినాడ-మత్స్యకార పీ.సుభష్ చంద్రబోస్-రామచంద్రపురం-శెట్టిబలిజ కుడిపూడి ప్రభా కరరావు-అమలాపురం-శెట్టిబలిజ కే.ఈశ్వర్ కుమార్-గుడివాడ-యాదవ జీ.వీరాంజనేయులు-మంగళగిరి-పద్మశాలి సిహెచ్ జయరాంబాబు-గుంటూరు-2-కళావంతుల లేదా సూర్య బలిజ కే.ఇ.కృష్ణమూర్తి-డోన్-గౌడ గోపినాద్-ఉరవకొండ-కురుబ, ఎన్.రఘువీరారెడ్డి యాదవ్-మడకశిర-యాదవ అగిశం వీరప్ప-నల్లమడ-పద్మశాలి తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు..15 అదికారం రాకపోయినా బీసీలలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ తరపున గెలిచారు. మత్తం పదిహేను మంది బీసీ ఎమ్మెల్యేలు కోస్తా జిల్లాలవారే. డి.నాగావళి-టెక్కలి-కాళింగ కే.మోహన్ రావు-పాతపట్నం-తూర్పు కాపు జీ.ఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ కే.కళా వెంకట్రావు-ఉణుకూరు-తూర్పుకాపు ఇ.కృష్ణమూర్తి-పార్వతిపురం-కే.వెలమ తెంటు జయప్రకాష్-తెర్లాం-కే.వెలమ టీ.సరస్వతమ్మ-చీపురుపల్లి-తూర్పు కాపు పీ.అరుణ-గజపతినగరం-తూర్పు కాపు కే.అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కొప్పుల వెలమ నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు బండారు సత్యనారాయణమూర్తి-పరవాడ-కే.వెలమ రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కే.వెలమ దాడి వీరభద్రరావు-అన కాపల్లి-గవర వై.రామకృష్ణుడు-తుని-యాదవ ఇ.సీతారావమ్మ-కూచినపూడి-గౌడ. ఇండిపెండెంట్లు-2 గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కింజారపు ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రపురం-పీ.వెలమ 1989-షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు..23 కోస్తా-రాయలసీమలతో కలిపి 22 రిజర్వ్డ్ సీట్లు ఉన్నా, ఒక జనరల్ సీటు లో కూడా ఎస్సీ అభ్యర్ది గెలిచారు. కాంగ్రెస్ నుంచి పదహారు మంది, టీడీపీ నుంచి ఐదుగురు, సీపీఎం పక్షాన ఇద్దరు, ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారి వివరాలు.. కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు-15 పీజే.అమృతకుమారి-పాలకొండ బత్తిన సుబ్బారావు-ముమ్మడివరం ఎన్.గణపతిరావు-నగరం పివి రాఘవులు-అల్లవరం కోనేరు రంగారావు-తిరువూరు టీ.వెంకయ్య-తాడికొండ జివి శేషు-సంతనూతలపాడు పీ.ప్రకాశ్ రావు-గూడూరు పీ.పెంచలయ్య-సూళ్లూరుపేట జీ.లోక్ నాధ్-ఆలూరు ఎ.జగదీష్-గుత్తి (జనరల్ సీటు) పిశమంతకమణి-శింగనమమల ఎమ్.లక్ష్మీదేవి-కళ్యాణదుర్గం సీ.దాస్-సత్యవేడు జీ.కుతూహలమ్మ-వేపంజేరి. టీడీపీ ఎస్సీ-ఎమ్మెల్యేలు-5 కే.ప్రతిభా భారతి-ఎచ్చర్ల కే.నూకరాజు-పాయకరావుపేట కే.వివేకానంద-గోపాలపురం టీ.పెంచలయ్య-రైల్వే కోడూరు పీ.సుబ్బయ్య-పలమనేరు సీపీఎం ఎస్సీ-ఎమ్మెల్యేలు- 2 డి.రాజగోపాల్-ఆచంట పీ.రామయ్య-నిడుమోలు ఇండి పెండెంట్-1 మదన్ గోపాల్-కొడుమూరు ఎస్టీ.ఎమ్మెల్యేలు-8 కోస్తా-రాయలసీమలలో ఎనిమిది మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు కాంగ్రెస్ ఐ నుంచి ముగ్గురు టీడీపీ పక్షాన గెలిచారు. వారి వివరాలు.. కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలు..5 ఎస్.చంద్రశేఖరరాజు-నాగూరు ఎల్.ఎన్.సన్యాసిరాజు-సాలూరు పీ.బాలరాజు-పాడేరు ఎమ్.బాలరాజు-చింతపల్లి బీ.దుర్గారావు-పోలవరం టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు-3 నిమ్మక గోపాలరావు-కొత్తూరు ఎల్.బీ.దుక్కు-ఎస్.కోట ఎస్.వెంకటేశ్వరరావు-ఎల్లవరం క్షత్రియ ఎమ్మెల్యేలు-8 ఎనిమిది మంది క్షత్రియ ఎమ్మెల్యేలు గెలవగా నలుగురు కాంగ్రెస్ నుంచి నలుగురు టీడీపీ నుంచి గెలిచారు కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యేలు-4 పీ.సాంబశివరాజు-సతివాడ ఎస్.కృష్ణమూర్తిరాజు-నర్సీపట్నం ఎ.సుభాష్ చంద్రబోస్-భీమవరం కే.బాపిరాజు-కైకలూరు టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-4 పీ.అశోక్ గజపతిరాజు-విజయవగరం ఆర్.డి.ఎ.నరసింహరాజు-భీమిలి డి.శివరామరాజు-అత్తిలి కే.రామచంద్రరాజు-ఉండి ఇతర సామాజికవర్గాలు..8 ఇతరసామాజికవర్గాలలో ముస్లీంలు ముగ్గురు ఉండగా, వారంతా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. వైశ్యులు ముగ్గురు గెలవగా వారు కూడా కాంగ్రెస్ వారే. ఒక బ్రాహ్మణ నేత గెలిచారు. ఆయన కాంగ్రెస్ నేతే. కాగా వెలమ వర్గం నుంచిగెలిచిన ఒకరు మాత్రం టీడీపీకి చెందినవారు. వారి వివరాలు.. ముస్లీం-3 ఎమ్.కే.బేగ్-విజయవాడ-1-కాంగ్రెస్ ఎమ్.డి.జాని-గుంటూరు-1-కాంగ్రెస్ షాకీర్-కదిరి-కాంగ్రెస్. వైశ్య-3 నేరెళ్ల రాజా-ఏలూరు-కాంగ్రెస్, కే.రోశయ్య-చీరాల-కాంగ్రెస్.రాయచోటి రామయ్య-ఆదోని-కాంగ్రెస్ బ్రాహ్మణ-1 శివరామకృష్ణరావు-బద్వేల్-కాంగ్రెస్. వెలమ-1 కోటగిరి విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1985 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1985 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాదించింది. 1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు నేపద్యంలో శాసనసభను రద్దు చేసి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో కోస్తా, రాయలసీమలలో కలిపి తెలుగుదేశం పార్టీకి 146 స్థానాలు వస్తే, కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు స్థానాలే వచ్చాయి. సీపీఐకి నాలుగు, సీపీఎంకు మూడు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. సామాజికవర్గాల వారీ చూస్తే రెడ్లు 38 మంది గెలవగా, వారిలో ఇరవై రెండు మంది టీడీపీ పక్షాన, పద్నాలుగు మంది కాంగ్రెస్ తరపున గెలిచారు. కమ్మ సామాజికవర్గం అత్యదిక స్థానాలలో నలభై నాలుగు చోట్ల విజయం సాదించింది. ఇందులో టీడీపీ పక్షాన ముప్పై ఏడు సీట్లు, కాంగ్రెస్ తరపున ఐదు సీట్లు వచ్చాయి. సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. కాపు సామాజికవర్గం నుంచి ఇరవై రెండు మంది గెలవగా, ఇరవై మంది టీడీపీవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ వారు. బీసీలలో కూడా ముప్పై నాలుగు మంది గెలవగా వారిలో ముప్పై మంది టీడీపీవారే. నలుగురు కాంగ్రెస్ వారు. షెడ్యూల్ కులాల వారిలో పదిహేడు మంది టీడీపీ, కాగా కాంగ్రెస్ఐ ఇద్దరు, సీపీఐ ఇద్దరు, సీపీఎం ఒకరు ఉన్నారు. గిరిజనులలో ఆరుగురు టీడీపీ,ఇద్దరు కాంగ్రెస్ కు చెందినవారు. క్షత్రియ సామాజికవర్గం నుంచి పది మంది గెలవగా టీడీపీ ఏడు కాంగ్రెస్ ఇద్దరు ఉన్నారు. ఇతర వర్గాలలో ముస్లీంలు ఇద్దరు టీడీపీ, ఒకరుకాంగ్రెస్ కాగా, వెలమ ముగ్గురు టీడీపీ వారే. వైశ్యులు ఇద్దరు టీడీపీ వారే. రెడ్డి ఎమ్మెల్యేలు-38 బహుశా ఇతర సామాజికవర్గాలకన్నా,ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం కన్నా రెడ్డి ఎమ్మెల్యేలు తక్కువగా ఎన్నికవడం విశేషం. రెడ్డి ఎమ్మెల్యేలు మొత్తం 38 మంది ఎన్నికైతే, కమ్మ ఎమ్మెల్యేలు 43మందిఎన్నికయ్యారు. తెలుగుదేశం నుంచే ఈ రెండు సామాజికవర్గాల ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలవడం మరో విశేషం.తెలుగుదేశం పక్షాన గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలలో ఏడుగురు కోస్తావారు కాగా, ఇరవై ఒక్క మంది రాయలసీమ నుంచి గెలిచారు. వారి వివరాలు. టీడీపీ రెడ్డి ఎమ్మెల్యేలు..22 ఎన్.మూలారెడ్డి-అనపర్తి ముత్యం అంకిరెడ్డి-గురజాల ఉడుముల వెంకటరెడ్డి-కంభం ముక్కు కాశిరెడ్డి-కనిగిరి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి-కోవూరు ఆనం రామ నారాయణరెడ్డి-రాపూరు ఇ.రామకృష్ణారెడ్డి-సర్వేపల్లి బీ.వీరారెడ్డి-బద్వేల్ ఆర్.రాజగోపాలరెడ్డి-లక్కిరెడ్డిపల్లి పీ.శివారెడ్డి-జమ్మలమడుగు, ఎన్.వరదరాజులురెడ్డి-ప్రొద్దుటూరు, ఎస్.రఘురామిరెడ్డి-మైదుకూరు, బీ.వెంగళరెడ్డి-ఆత్మకూరు, ఇ.తిమ్మా రెడ్డి-నందికోట్కూరు, కే.రాంభూపాల్ రెడ్డి-పాణ్యం, కే.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, బివి మోహన్ రెడ్డి-ఎమ్మిగనూరు, ఎస్.వెంకటరెడ్డి-నల్లమడ, జీ.నాగిరెడ్డి-ధర్మవరం, ఎవి లక్ష్మీదేవమ్మ-తంబళ్లపల్లె, సీ.ప్రబాకరరెడ్డి-పీలేరు, ఎన్.రామకృష్ణారెడ్డి-పుంగనూరు కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు..14 ఎమ్.ఆదినారాయణరెడ్డి-కందుకూరు కెపి కెండారెడ్డి-మార్కాపురం కే.యానాదిరెడ్డి-కావలి బీ.సుందరరామిరెడ్డి-ఆత్మకూరు కేవి సుబ్బారెడ్డి-నెల్లూరు ఎమ్.రాజమోహన్ రెడ్డి-ఉదయగిరి ఎమ్.నాగిరెడ్డి-రాయచోటి వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల ఎమ్.వి.మైసూరారెడ్డి-కమలాపురం జీ.ప్రతాపరెడ్డి-ఆళ్లగడ్డ జేసీ దివాకరరెడ్డి-తాడి పత్రి ఎన్.అమరనాదరెడ్డి-వాయల్పాడు ఎమ్.రామిరెడ్డి-తిరుపతి ఆర్. చెంగారెడ్డి-నగరి ఇతరులు-2 పిడతల రంగారెడ్డి-గిద్దలూరు- ఇండి జక్కా వెంకయ్య-అల్లూరు-సీపీఎం 1985 కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేల విశ్లేషణ-44 ఈ ఎన్నికలలో తెలుగుదేశం గెలవడం ఒక విషయం అయితే, కమ్మ వర్గం ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్యను మించి ఉండడం మరో ఆసక్తికరమైన విషయం అవుతుంది. మొత్తం నలభై మూడు మంది కమ్మ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో తెలుగుదేశంకు చెందినవారు ముప్పై ఆరు మంది కాగా, కాంగ్రెస్ తరపున ఐదుగురు ఎన్నికయ్యారు. ఒకరు సీపీఐ పక్షాన, మరొకరు సీపీఎం పక్షాన గెలిచారు. ఇరవై ఆరు మంది టీడీపీ ఎమ్మెల్యేలు కోస్తా ప్రాంతం నుంచి, మిగిలిన ఏడుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌లో నలుగురు కోస్తా, ఒకరు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాగా ఎన్టీరామారావు గుడివాడ, హిందుపూర్ రెండు చోట్ల నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ తెలంగాణలోని నల్గొండ నుంచి కూడా గెలుపొంది ఒకేసారి మూడు చోట్ల పోటీచేసి విజయం సాదించిన ఏకైక నేతగా రికార్డు సాదించారు. తెలగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు...37 ఎమ్.వి.కృష్ణారావు-ఇచ్చాపురం ఎ.రామచంద్రరావు-పెందుర్తి బలుసు రామారావు-పెద్దాపురం వి.నారాయణమూర్తి-ఆలమూరు ఎమ్.వి.వి రామారావు-రామచంద్రపురం పీ.సాంబశివరావు-బూరుగుపూడి జీ.బుచ్చయ్యచౌదరి-రాజమండ్రి పీవి కృష్ణారావు-కొవ్వూరు ఎమ్.వి.కృష్ణారావు-తణుకు కంటమని శ్రీనివాసరావు-ఉంగుటూరు గారపాటి సాంబశివరావు-దెందులూరు, మూల్పూరు బాలకృష్ణారావు-గన్నవరం, ఎన్టీరామారావు-గుడివాడ, ఎర్నేని సీతాదేవి-ముదినేపల్లి, అన్నె బాబూరావు-ఉయ్యూరు, దేవినేని రాజశేఖర్-కంకిపాడు, వసంత నాగేశ్వరరావు-నందిగామ, నెట్టెం రఘురాం-జగ్గయ్యపేట, కే.సదాశివరావు-పెదకూరపాడు, ఎమ్.ఎస్.ఎస్.కోటేశ్వరరావు-మంగళగిరి, దూళిపాళ్ల వీరయ్య చౌదరి-పొన్నూరు, కొడాలి వీరయ్య-వేమూరు, యడ్ల వెంకట్రావు-రేపల్లె, అన్నాబత్తుని సత్యనారాయణ-తెనాలి, ఎమ్.పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, కే.బలరాం-మార్టూరు, పీ.కోటేశ్వరరావు-ఒంగోలు, ఎస్.నారాయణప్ప-ఉరవకొండ, ఎన్టీరామారావు-గుడివాడ, వేలూరి కేశన్న-గోరంట్ల, ఆర్.నారాయణరెడ్డి-మదనపల్లె, జయదేవనాయుడు-చంద్రగిరి, జీ.ముద్దుకృస్ణమ నాయుడు-పుత్తూరు, ఎన్.రంగస్వామి నాయుడు-కుప్పం కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-5 చనుమోలు వెంకటరావు-మైలవరం ఆలపాటి ధర్మారావు-దుగ్గిరాల సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట జీ.అచ్యుతకుమార్-కొండపి వి.రాంభూపాల్ చౌదరి-కర్నూలు ఇతర పార్టీలు..2 పుతుంబాక వెంకటపతి-సత్తెనపల్లి-సీపీఎం గంగినేని వెంకటేశ్వరరావు-వినుకొండ-సీపీఐ 1985 కాపు, బలిజ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది గెలుపొందగా, వారిలో ఇరవై మంది టీడీపీకి చెందినవారే. ఇద్దరు మాత్రం కాంగ్రెస్ నుంచి గెలిచారు.టీడీపీ ఎమ్మెల్యేలలో పదిహేను మంది కోస్తా నుంచి ఎన్నిక కాగా, ఐదుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో ఒకరు కోస్తా నుంచి ,ఇద్దరు రాయలసీమ నుంచి గెలిచారు. తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-20 పీ.చలపతిరావు-యలమంచిలి ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు వి.నాగేశ్వరరావు-పిఠాపురం చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు మెట్ల సత్య నారాయణ-అమలాపురం వడ్డి వీరభద్రరావు-కడియం తోట సుబ్బారావు-జగ్గం పేట పీ.మణెమ్మ-పెనుకొండ ఎవి సత్యనారాయణ-పాలకొల్లు చేగొండి వెంకట హరిరామజోగయ్య-నర్సాపురం ఎర్రా నారాయణస్వామి-తాడేపల్లిగూడెం వడ్డి రంగా రావు-మచిలీపట్నం సింహాద్రి సత్యనారాయణ-అవనిగడ్డ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు-బాపట్ల ఎన్. శ్రీరాములు-దర్శి బీ.రత్న సభాపతి-రాజంపేట సీ.రామచంద్రయ్య-కడప(బలిజ) బీ. హూలి కుంటప్ప-రాయదుర్గం(బలిజ) ఎన్.రామకృష్ణ-అనంతపురం (బలిజ) ఎస్.ముని రామయ్య-శ్రీకాళహస్తి(బలిజ) కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు-2 వంగవీటి మోహన రంగారావు- విజయవాడ-2 ఆర్.గోపినాద్-చిత్తూరు (బలిజ) బీసీ వర్గాల ఎమ్మెల్యేలు..34 ఈ ఎన్నికలలో బీసీ వర్గాల ఎమ్మెల్యేలు 34 మంది ఎన్నిక కాగా వారిలో ముప్పై మంది టీడీపీ వారు కాగా, నలుగురు మాత్రమే కాంగ్రెస్‌కు చెందినవారు. టీడీపీ ఎమ్మెల్యేలలో ఇరవైఐదు మంది కోస్తా ప్రాంతం నుంచి నలుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాగా కాంగ్రస్ ముగ్గురు ఎమ్మెల్యేలు కోస్తావారే. తూర్పు కాపుల నుంచి అత్యధికంగా పదకుండు మంది ఎన్నికవడం విశేషం.గౌడ వర్గీయులు ఐదుగురు, పొలినాటి వెలమ నలుగురు , తూర్పుకాపు ముగ్గురు, కాళింగ ఇద్దరు, యాదవ ఇద్దరు, కళావంతుల ఇద్దరు, గవర, మత్సకార, దేవాంగ, బోయ, కురుబ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు-30 గౌతు శివాజీ-సోంపేట-గౌడ వరద సరోజ-టెక్కలి-కాళింగ జీ.ఎ. సూర్య నారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ తమ్మినేని సీతారాం-ఆముదాల వలస-కాళింగ ఎస్.ప్రభాకరరావు-నరసన్నపేట-పీ.వెలమ కే.ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రపురం-పీ.వెలమ కే.కళా వెంకటరావు-ఉణుకూరు-తూర్పుకాపు ఎమ్.వెంకట్రామ నాయుడు-పార్వతీపురం-కే.వెలమ ఎస్సీవి అప్పలనాయుడు-బొబ్బిలి-కే.వెలమ టి.జయప్రకాష్-తెర్లాం-కే.వెలమ కే.రామ్మోహన్ రావు-చీపురుపల్లి-తూర్పు కాపు కోళ్ల అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కే.వెలమ పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పు కాపు, అల్లు భానుమతి-విశాఖ-1-కొప్పుల వెలమ,రాజాన రమణి-విశాఖ-2-యాదవ, పైల అప్పలనాయుడు-పరవాడ-కే.వెలమ, జీ.ఎర్రు నాయుడు-చోడవరం-కే.వెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కే.వెలమ, దాడి వీరభద్రరావు-అనకాపల్లి-గవర, సిహెచ్. అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కే.వెలమ, వై.రామకృష్ణుడు-తుని-యాదవ, టిఎస్ఎల్ నాయకర్-సంపర-మత్స్యకార, ఎమ్. రంగారావు-ఏలూరు-కొప్పుల వెలమ, కాగిత వెంకట్రావు-మల్లేశ్వరం-గౌడ, ఇ.సీతా రావమ్మ-కూచినపూడి-గౌడ, ఎస్.చంద్రమౌళి-చీరాల-దేవాంగ, కే.ఇ.కృష్ణమూర్తి-డోన్-గౌడ, గాది లింగప్ప-గుత్తి-బోయ, హెచ్.నర్సేగౌడ-మడకశిర-గౌడ, ఎస్.రామ చంద్రారెడ్డి-పెనుకొండ-కురబ. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-4 డీ.నారాయణరావు-పాతపట్నం-పీ.వెలమ వి.ఎస్.అప్పలనాయుడు-గజపతినగరం-కే.వెలమ సిహెచ్ జయరాంబాబు-గుంటూరు-2-కళావంతుల నట్టువకృష్ణమూర్తి-మాచర్ల-కళావంతుల. ఎస్సీ ఎమ్మెల్యేలు-22 షెడ్యూల కులాల ఎమ్మెల్యేలలో తెలుగుదేశం నుంచి పదిహేడు మంది గెలవగా,కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. సీపీఐ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఇద్దరు గెలిచారు. తెలుగుదేశం ఎస్సీ ఎమ్మెల్యేలు-17 కే.ప్రతిభా భారతి-ఎచ్చెర్ల టీ.భద్రయ్య-పాలకొండ కే.నూకరాజు-పాయకరావుపేట పండు కృష్ణమూర్తి-ముమ్మడివరం ఉండ్రు కృష్ణారావు-నగరం గొల్లపల్లి సూర్యారావు-అల్లవరం కే.వివేకానంద-గోపాలపురం పీ.వెంకటరత్నం-తిరువూరు జె.ఆర్.పుష్పరాజ్-తాడికొండ ఎస్.ఆదెన్న-సంతనూతలపాడు బీ.దుర్గాప్రసాదరావు-గూడూరు ఎమ్.మణెయ్య-సూళ్లూరుపేట టి.పెంచలయ్య-కోడూరు ఎమ్. శిఖామణి-కొడుమూరు కెజయరాం-శింగనమల ఎమ్.సురాజన్-సత్యవేడు పీ.సుబ్బయ్య-పలమనేరు. కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు..2 మసాల ఈరన్న-ఆలూరు జీ.కుతూహలమ్మ-వేపంజేరి ఇతర పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలు..3 ఎ.చిత్తరంజన్-ఆచంట-సీపీఎం పీ.రామయ్య-నిడుమోలు-సీపీఎం పకీరప్ప-కళ్యాణదుర్గం-సీపీఐ ఎస్టి ఎమ్మెల్యేలు-8 ఎస్టి. ఎమ్మెల్యేలలో ఆరుగురు టీడీపీకి చెందినవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ వారు టీడీపీ ఎస్టి ఎమ్మెల్యేలు..6 బీ.రాజయ్య-సాలూరు ఎల్.బీ.దుక్కు-ఎస్.కోట ఎమ్.వి.వి.సత్యనారాయణ-చింతపల్లి కే.చిట్టినాయుడు-పాడేరు సీ.జోగారావు-ఎల్లవరం ఎమ్.లక్ష్మణరావు-పోలవరం కాంగ్రెస్ ..2 విశ్వాసరాయ నరసింహారావు-కొత్తూరు శత్రుచర్ల విజయరామరజాజు-నాగూరు క్షత్రియ ఎమ్మెల్యేలు-10 క్షత్రియ సామాజికవర్గం ఎమ్మెల్యేలు పది మంది గెలవగా, వారిలో ఏడుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐకి చెందినవారు టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-7 పీ.అశోక్ గజపతిరాజు-విజయనగరం ఆర్ఎస్ డిపిఎ నరసింహరాజు-భీమిలి ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు ఐ.ఎస్.రాజు-కొత్తపేట,వేగేశ్న కనక రాజు-అత్తిలి పీవి నరసింహరాజు-భీమవరం కలిదిండి రామచంద్రరాజు-ఉండి కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యేలు-2 పీ.సాంబశివరాజు-సతివాడ కనుమూరి బాపిరాజు-కైకలూరు ఇతర పార్టీలు-1 యు.రామచంద్రరాజు-సీపీఐ ముస్లీం-3, టీడీపీ-2, కాంగ్రెస్ -1 ఎమ్.డి జాని-గుంటూరు-1-కాంగ్రెస్ ఎన్.ఎమ.డి ఫరూఖ్-నంద్యాల-టీడీపీ రసూల్-కదిరి-టీడీపీ వెలమ-టీడీపీ-3 కోటగిరి విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ-వెలమ కే.హనుమంతరావు-నూజివీడు-టీడీపీ-వెలమ సాయికృష్ణ యాచేంద్ర-వెంకటగిరి-టీడీపీ -వెలమ వైశ్య- టీడీపీ-2,కాంగ్రెస్ -1 ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ-టీడీపీ మహాబలేశ్వరగుప్త-ప్రత్తికొండ-టీడీపీ రాయచోటి రామయ్య-ఆదోని-కాంగ్రెస్. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1982లో ప్రఖ్యాత నటుడుగా ఉన్న ఎన్టీ. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 ఎన్నికలలో ఘన విజయం సాదించారు. అంతవరకు అదికారంలో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో టీడీపీకి, కోస్తా, రాయలసీమలలో 160 సీట్లు రావడం ఒక రికార్డుగా భావించాలి. ఈ ఎన్నికల నుంచి రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఆరంభమైంది ఈ ఎన్నికలలోనే. కాంగ్రెస్-ఐకి పదిహేడుసీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి ఒకటి, ఇండిపెండెంట్లు తొమ్మిది మంది గెలిచారు. (వీరిలో ఒకరు ఐసిజె పార్టీ తరపున గెలిచారు) సామాజిక వర్గాల విశ్లేషణను పరిశీలిస్తే కమ్మ సామాజికవర్గానికి చెందినవారు నలభై నాలుగు మంది ఎన్నికయ్యారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి నలభైఒక్క మంది ఎన్నిక కాగా, కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు నెగ్గారు. రెడ్డి సామాజికవర్గం నుంచి నలభై మూడు మంది ఎన్నిక కాగా, వారిలో టీడీపీ పక్షాన ముప్పై ఒక్క మంది, కాంగ్రెస్ తరుపున ఏడుగురు, ఇండిపెండెంట్లుగా ఐదుగురు గెలిచారు. కాపు వర్గం నుంచి పదిహేను మంది గెలవగా, వారిలో పదమూడు మంది టీడీపీ వారే. కాంగ్రెస్ నుంచి ఒకరు ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. బీసీలు ముప్పై ఇద్దరు విజయం సాదించగా, వారిలో ఇరవైతొమ్మిది మంది టీడీపీ నుంచి ముగ్గురు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఎస్సీలలో 22 మందికి గాను 21 మంది టీడీపీ, ఒకరు కాంగ్రెస్ వారు. ఎస్టీలలో ఆరుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. క్షత్రియులు పద్నాలుగు మంది ఎన్నిక కాగా, పన్నెండు మంది టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్ వారు. ఇతర సామాజికవర్గాలలో ఏడుగురు టీడీపీ నుంచి ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలిచారు. వీరిలో వైశ్యులు ముగ్గురు, ఒక అగర్వాల్, ముస్లింలు ఇద్దరు, ఒక క్రిస్టియన్ గెలిచారు. వీరంతా టీడీపీ పక్షానే విజయం సాదించారు. ఇద్దరు వెలమ నేతలు ఇండిపెండెంట్లుగా గెలిచారు. కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు...44 ఎన్టీఆర్.రాజకీయ పార్టీని పెట్టడం, ఆయన కమ్మ సామాజికవర్గం వారు కావడంతో ఈ వర్గం అంతా టీడీపీకి బాగా అండగా నిలిచంది.అన్ని వర్గాల వారి మద్దతు లభించినా, వీరు అధికంగా ఓన్ చేసుకున్నారు. అంతేకాక గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా టిక్కెట్లు పొందారు. నలభై మూడు మంది గెలవగా,వారిలో నలభై మంది టీడీపీవారే అయ్యారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాగా బీజేపీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ఒక ఇండిపెండెంట్ నెగ్గగా, ముప్పై ఒక్కరు కోస్తా నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్‌గా గెలిచినవారు కూడా కోస్తావారే. తొమ్మిది మంది రాయలసీమకు చెందినవారు .తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ.రామారావు రెండుచోట్ల నుంచి గుడివాడ, తిరుపతిల నుంచి గెలుపొందారు. టీడీపీ కమ్మ ఎమ్మెల్యేలు-41 ఎమ్.వి.కృష్ణారావు-ఇచ్చాపురం బలుసు రామారావు-పెద్దాపురం వి.నారాయణ మూర్తి-ఆలమూరు పీ.సాంబశివరావు-బూరుగుపూడి జీ.బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి పీవి.కృష్ణారావు-కొవ్వూరు చిట్టూరి వెంకటేశ్వరరావు-తణుకు కే.శ్రీని వాసరావు- ఉంగుటూరు, గారపాటి సాంబశివరావు-దెందులూరు, ముసునూరు రత్నబోస్-గన్నవరం, నందమూరి తారక రామారావు- గుడివాడ, దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)-కంకిపాడు, అడుసుమిల్లి జయప్రకాష్-విజయవాడ తూర్పు, ఎన్.సత్యనారాయణ-మలవరం, వసంత నాగేశ్వరరావు-నందిగామ, అక్కినేని లోకే శ్వరరావు-జగ్గయ్యపేట, ఎమ్.ఎస్.ఎస్.కోటేశ్వరరావు- మంగగిరి, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి-పొన్నూరు, నాదెండ్ల భాస్కరరావు-వేమూరు, యడ్ల వెంకటరావు-రేపల్లె, అన్నాబత్తుని సత్యనారాయణ-తెనాలి, మాకినేని పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కాజ కృష్ణమూర్తి-చిలకలూరిపేట, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, నన్నపనేని రాజకుమారి-సత్తెనపల్లి, కే.సుబ్బారావు-మాచర్ల, కాటూరి నారాయణస్వామి-దర్శి, దగ్గుబాటి చౌదరి-పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, గొట్టిపాటి హనుమంతరావు-మార్టూరు, పీ.కోటేశ్వరరావు-ఒంగోలు, పీ.వెంగళరావు-కావలి, వి.రాంభూపాల్ చౌదరి, డీ.నారాయణస్వామి-అనంతపురం, వేలూరి కేశన్న-గోరంట్ల, ఆర్.నారాయణరెడ్డి-మదనపల్లె, ఎమ్.వెంకట్రామనాయుడు-చంద్రగిరి, ఎన్టీ.రామారావు-తిరుపతి, ఝాన్సీలక్ష్మి-చిత్తూరు, గాలి ముద్దుకృష్ణమనాయుడు-పుత్తూరు, ఎన్.రంగస్వామి నాయుడు-కుప్పం. కాంగ్రెస్ -1 పిన్నమనేని కోటేశ్వరరావు-ముదినేపల్లి. బీజేపీ-1 ముప్పవరపు వెంకయ్య నాయుడు-ఉదయగిరి ఇండి-1 గంగినేని వెంకటేశ్వరరావు-వినుకొండ 1983- రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు-43 ఈ ఎన్నికలలో రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు కూడా నలభై మూడు మంది ఎన్నికయ్యారు. వారిలో ముప్పై ఒక్క మంది టీడీపీ పక్షాన కాగా ఏడుగురు కాంగ్రెస్ నుంచి గెలిచారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఒకరు ఐసిజె అనేపార్టీ నుంచి గెలిచారు.టీడీపీ నుంచి ఎన్నికైనవారిలోపద్నాలుగు మంది కోస్తా జిల్లాల నుంచి గెలుపొందగా, పదిహేడు మంది రాయలసీమ నుంచి గెలిచారు.కాంగ్రెస్ లో గెలిచినవారిలో ఒకరు కోస్తా,ఆరుగురు రాయలసీమవారు.ఇతరులలో కూడా ఒకరు మాత్రం కోస్తావారు. మిగిలిన నలుగురు రాయలసీమ నుంచే గెలిచారు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-31 ఎన్.మూలారెడ్డి-అనపర్తి సీ.సోమసుందరరెడ్డి-కొత్తపేట వి.శివరామకృష్ణారెడ్డి-దుగ్గిరాల జూలకంటి నాగిరెడ్డి-గురజాల వి.నారాయణరెడ్డి-మార్కాపురం ఎమ్.పిరారెడ్డి-గిద్దలూరు ముక్కు కాశిరెడ్డి-కనిగిరి ఆనం వెంకటరెడ్డి-ఆత్మకూరు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి-కోవూరు, ఆనం రామనారాయణరెడ్డి-నెల్లూరు, ఎమ్.ఆదినారాయణరెడ్డి-రాపూరు, పెంచల్ రెడ్డి చెన్నారెడ్డి-సర్వేపల్లి, బెజవాడ పాపిరెడ్డి-అల్లూరు, నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి-వెంకటగిరి, ఎస్.రామమునిరెడ్డి-కడప, ఆర్.రాజగోపాలరెడ్డి-లక్కిరెడ్డిపల్లి, వి.వెంకటరెడ్డి-కమలాపురం, పీ.శివారెడ్డి-జమ్మలమడుగు, ఎమ్.వి.రమణారెడ్డి-ప్రొద్దుటూరు, ఎస్.వి.సుబ్బారెడ్డి-ఆళ్లగడ్డ, బి.వెంగళరెడ్డి-ఆత్మకూరు, సీ.రామకృష్ణారెడ్డి-పాణ్యం, సంజీవరెడ్డి-నంద్యాల, బి.నరసింహారెడ్డి-కోయిలకుంట్ల, వై.బి.రెడ్డి-ఉరవకొండ, ఎమ్.కేశవరెడ్డి-తాడిపత్రి, కే.రామచంద్రారెడ్డి-నల్లమడ,జీ.నాగిరెడ్డి-ధర్మవరం, సీ.ప్రభాకరరెడ్డి-పీలేరు, చింతల సురేంద్రరెడ్డి-వాయల్పాడు,ఎ.దశరదరామిరెడ్డి-శ్రీకాళహస్తి. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు-7 కే.నాగార్జునరెడ్డి-కంభం, కే.ప్రభావతమ్మ-రాజంపేట, వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల,డీ.ఎల్.రవీంద్ర రెడ్డి-మైదుకూరు, ఎమ్.తిమ్మారెడ్డి-ప్రత్తికొండ, కోట్ల విజయభాస్కరరెడ్డి-ఎమ్మిగనూరు, వై.సీ.తిమ్మారెడ్డి-మడకశిర ఇతరులు..ఇండి-4,ఐసిజె-1 ఎమ్.ఆదినారాయణరెడ్డి-కందుకూరు బిజివేముల వీరారెడ్డి-బద్వేల్-ఐసిజె బి.శేషశయనరెడ్డి-నందికోట్కూరు పీ.వేణుగోపాలరెడ్డి-రాయదుర్గం టీ.ఎస్. శ్రీనివాసరెడ్డి-తంబళ్లపల్లె కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు..15 కాపు సామాజికవర్గం నుంచి పదిహేను మంది గెలుపొందగా వారిలో పదమూడు మంది టీడీపీవారే.వీరంతా కోస్తా ప్రాంతం వారే. కాంగ్రెస నుంచి గెలిచిన ఒకరు కూడా కాంగ్రెస్ కాగా,ఇండిపెండెంట్ గా నెగ్గిన ఒకరు మాత్రం రాయలసీమ వారు. తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-13 ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు వి.నాగేశ్వరరావు-పిఠాపురం చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు మెట్ల సత్యనారాయణరావు-అమలాపురం జీ. వెంకటస్వామి నాయుడు-కడియం తోట సుబ్బారావు-జగ్గంపేట పీ.మణెమ్మ-పెను గొండ ఎవి సత్యనారాయణ-పాలకొల్లు చేగొండి హరిరామజోగయ్య-నరసాపురం ఈలి ఆంజనేయులు-తాడేపల్లిగూడెం సీహెచ్.రంగారావు-ఏలూరు ఎ.విశ్వేశ్వ రరావు-పెదకూరపాడు నిశ్శంకరరావు వెంకటరత్నం-గుంటూరు-2 కాంగ్రెస్ -1 మండలి వెంకట కృష్ణారావు-అవనిగడ్డ. ఇండి-1 ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటీ. బీసీ సామాజికవర్గాల ఎమ్మెల్యేలు-32 ఆంద్ర, రాయలసీమలలో కలిపి బీసీ వర్గాల నుంచి 32 మంది ఈ ఎన్నికలలో గెలుపొందగా, వారిలో ఇరవై తొమ్మిది మంది టీడీపీ నుంచే గెలిచారు.వీరిలో ఇరవైఆరుగురు మంది కోస్తా నుంచి కాగా, ముగ్గురు రాయలసీమకు చెందినవారు.కాంగ్రెస్ పక్షాన ముగ్గురు గెలవగా ఇద్దరు కోస్తా, ఒకరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు.బీసీ వర్గాల విశ్లేషణ-కొప్పుల వెలమ-8, యాదవ-6, పొలినాటి వెలమ-5,తూర్పుకాపు-3, గౌడ-3, కాళింగ-2, గవర-1,మత్సకార-1, పద్మశాలి-1, కురుబ-1, గాండ్ల-1. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలు- 29 ఎ.జనార్దనరావు-టెక్కలి-పోలినాటి వెలమ టీడీ నాయుడు-పాతపట్నం-పోలినాటి వెలమ తంగి సత్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ తమ్మినేని సీతారామ్-ఆముదాలవలస-కాళింగ ఎస్.ప్రభాకరరావు-నరసన్నపేట-పీ.వెలమ కే.ఎర్ర న్నాయుడు- హరిశ్చంద్రపురం-పీ.వెలమ కే.కళా వెంకట్రావు-ఉనుకూరు-తూర్పుకాపు ఎమ్.వెంకట్రామనాయుడు-పార్వతిపురం-కే.వెలమ ఎస్సీ.వి అప్పల నాయుడు- బొబ్బిలి-కే.వెలమ తెంటు జయప్రకాష్-తెర్లాం-కే.వెలమ త్రిపురాన వెంకటరత్నం- చీపురుపల్లి-తూర్పుకాపు కోళ్ల అప్పలనాయుడు-ఉత్తరాపల్లి- కే.వెలమ, నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు, వాసుదేవరావు-విశాఖ-2-యాదవ, పైలా అప్పలనాయుడు-పరవాడ-కే.వెలమ, జీ.ఎర్రునాయుడు-చోడవరం-కెవెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కే.వెలమ, పీ.అప్పల నరసింహం-పెందుర్తి-గవర, చింతకాయల అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కే.వెలమ, యనమల రామకృష్ణుడు-తుని-యాదవ, టిఎస్ఎల్ నాయకర్-సంపర-మత్స్యకార, అంకెం ప్రభాకరరావు-మల్లేశ్వరం-గౌడ, బి.వెంకటస్వామి-మచిలీ పట్నం-యాదవ, ఎమ్.నాగబూషణం-కూచినపూడి-గౌడ, చిమటా సాంబు-చీరాల-యాదవ, ఎమ్.మాలకొండయ్య-కొండపి-యాదవ, పీ.రంగనాయకులు-హిందుపూర్ -పద్మశాలి, ఎస్.రామచంద్రారెడ్డి-పెనుకొండ-కురుబ, బగ్గిడిగోపాల్-పుంగనూరు-గాండ్ల. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-3 మజ్జి నారాయణరావు-సోంపేట-కాళింగ కే.పీ.రెడ్డయ్య -ఉయ్యూరు-యాదవ కే.ఇ.కృష్ణమూర్తి-డోన్ -గౌడ 1983 -ఎస్.సి ఎమ్మెల్యేలు-22 ఈ ఎన్నికలలో 22 ఎస్.సి నియోజకవర్గాలకు గాను, ఇరవై ఒక్క చోట్ల తెలుగుదేశం విజయం సాధించడం విశేషం.ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ ఎస్.సి ఎమ్మెల్యేలు-21 కే.ప్రతిభాభారతి-ఎచ్చెర్ల శ్యామారావు-పాలకొండ గంటెల సుమన-పాయకరావుపేట వి.రాజా సక్కుబాయి-ముమ్మడివరం ఉండ్రు కృష్ణారావు-నగరం ఎజెబి ఉమామహేశ్వరరావు-అల్లవరం కే.భాస్కరరావు-ఆచంట కారుపాటి వివేకానంద-గోపాలపురం మిర్యాల పూర్ణానంద్-తిరువూరు జీ.మల్లి ఖార్జునరావు-నిడుమోలు జెఆర్ పుష్పరాజ్-తాడికొండ ఆరేటి కోటయ్య-సంతనూతలపాడు జోగి మస్తానయ్య-గూడూరు ఎస్.ప్రకాశం-సూళ్లూరుపేట ఎస్.శ్రీనివాసులు-రైల్వే కోడూరు కే.బసప్ప-ఆలూరు పీ.గురుమూర్తి-శింగనమల టీసీ. మారెప్ప-కళ్యాణ దుర్గం టీ.మనోహర్-సత్యవేడు టీ.రుద్రయ్య-వేపంజేరి ఆంజనేయులు-పలమనేరు. కాంగ్రెస్ ఎస్.పి ఎమ్మెల్యే-1 దామోదరం మునుస్వామి-కొడుమూరు. ఎస్టీ.ఎమ్మెల్యేలు-8 గిరిజన శాసనసభ్యులు ఎఇమిది మందికిగాను ఇద్దరు తప్ప మిగిలినవారంతా తెలుగుదేశం నుంచి ఎన్నికైనవారే. టీడీపీ ఎస్టి ఎమ్మెల్యేలు-6 నిమ్మక గోపాలరావు-కొత్తూరు, బి.రాజయ్య-సాలూరు ఎల్ బి దుక్కు-శృంగవరపుకోట కే.వెంకటరత్నం-చింతపల్లి చిన్నం జోగారావు-ఎల్లవరం ముడియం లక్ష్మణరావు-పోలవరం. కాంగ్రెస్ ఎస్టి ఎమ్మెల్యే-2 ఎస్.విజయరామరాజు-నాగూరు టీ.చిట్టినాయుడు-పాడేరు. క్షత్రియ సామాజికవర్గం ఎమ్మెల్యేలు-14 క్షత్రియ సామాజికవర్గం నుంచి ఈసారి అత్యధిక సంఖ్యలో పద్నాలుగు మంది శాసనసభకు ఎన్నికయ్యారు.వారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా తెలుగుదేశం పార్టీవారే కావడం విశేషం. తెలుగుదేశం క్షత్రియ ఎమ్మెల్యేలు-12 జెఎస్ రాజు-గజపతినగరం పూసపాటి అశోక్ గజపతిరాజు-విజయనగరం పూసపాటి ఆనంద గజపతిరాజు- భీమిలి రాజా కన్నబాబు-అనకాపల్లి కెకెవిఎస్ రాజు-యలమంచిలి రామచంద్రరాజు-రామచంద్రపురం ఎవి సూర్య నారాయణరాజు-రాజోలు వి.కనకరాజు-అత్తిలి పివి నరసింహరాజు-భీమవరం కలిందిండి రామచంద్రరాజు-ఉండి సీ.విజయరామరాజు-బాపట్ల ఇవి గోపాల రాజు-పుత్తూరు కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యేలు-2 పెనుమత్స సాంబశివరాజు-సతివాడ కనుమూరి బాపిరాజు-కైకలూరు వైశ్య-3: ముగ్గురూ తెలుగుదేశం పార్టీకి చెందినవారే. గ్రంధి మాదవి-విశాఖపట్నం ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ పీ.రాజగోపాల్-గుత్తి మార్వాడి-1(టీడీపీ) ప్రకాష్ జైన్-ఆదోని-టీడీపీ-మార్వాడి వెలమ- 2: ఇద్దరూ ఇండిపెండెంట్లు... కోటగిరి విధ్యాధరరావు-చింతలపూడి కే.హనుమంతరావు-నూజివీడు ముస్లింలు-2: ఇద్దరూ టీడీపీవారే. యుకే. పఠాన్-గుంటూరు మహ్మద్ షాకీర్-కదిరి క్రిస్టియన్ -1: బిఎస్ జయరాజ్-విజయవాడ- టీడీపీ. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1978 శాసనసభ ఎన్నికలు-సామాజికవర్గాల విశ్లేషణ
1978 శాసనసభ ఎన్నికలలో అప్పటి మాజీ ప్రధాని ఇందరాగాందీ నాయకత్వంలో ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టం కట్టింది. ఏపీలో అదికారంలో ఉన్న రెడ్డికాంగ్రెస్ కేవలం ముప్పైసీట్లకే పరిమితం కాగా, 1977 ఎన్నికలలో కొత్తగా ఆవిర్భవంచిన జనతా పార్టీకి అరవై స్థానాలు దక్కాయి. అయితే ఈ రెండు పార్టీల నుంచి మెజార్టీ సభ్యులు ఇందిరా కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఇక సామాజికవర్గాలను విశ్లేషిస్తే రెడ్డి సామాజికవర్గం నేతలు కోస్తా, రాయలసీమలలో 41 మంది గెలిచారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఇరవైఏడు మంది, జనతా పార్టీ నుంచి ఎనిమిది మంది, కాంగ్రెస్ ఆర్ నుంచి ముగ్గురు ఉన్నారు. సీపీఎం ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. కమ్మ సామాజికవర్గంకు చెందినవారు ముప్పైనాలుగు మంది గెలిచారు. వారిలో22 మంది కాంగ్రెస్ ఐ కాగా, ఎనిమిది మంది జనతా, కాంగ్రెస్ ఆర్ ఇద్దరు, సీపీఎం ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. కాపు సామాజికవర్గం నేతలు 21 మంది గెలిచారు. వారిలో పది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది జనతా, ఇద్దరు కాంగ్రెస్ ఆర్, ఒకరు సీపీఐ ఉన్నారు. బీసీలు ఇరవైఎనిమిది మంది నెగ్గగా, పదమూడు మంది కాంగ్రెస్, పదిమంది జనతా, ఇద్దరు కాంగ్రెస్ ఆర్ నుంచి గెలుపొందారు. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. ఎస్సీసీట్లు ఇరవైరెండే అయినా,ఒక ఎస్సీ నేత జనరల్ సీటు నుంచి గెలిచారు. దాంతో ఇరవైమూడు మంది అయ్యారు. కాంగ్రెస్ నుంచి పదహారు, జనతా ఆరు, సీపీఎం ఒకరు ఉన్నారు. ఎస్టీలు నలుగురు కాంగ్రెస్ఐ, ముగ్గురు జనతా, ఒకరు సీపీఐ నుంచి ఎన్నికయ్యారు. క్షత్రియులలో పన్నెండు మంది గెలిచారు. కాంగ్రెస్ ఐ ఏడు, జనతా ఇద్దరు, కాంగ్రెస్ ఆర్ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. ముస్లీంలు నలుగురు కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. బ్రాహ్మణులు ఏడుగురు గెలిస్తే వారిలో ముగ్గురు కాంగ్రెస్ ఐ, ముగ్గురు జనతా, ఒకరు కాంగ్రెస్ ఆర్కు చెందినవారు. ఇతరులు ఐదుగురు కాంగ్రెస్ ఐవారే. 1978 రెడ్డిసామాజికవర్గం ఎమ్మెల్యేలు-38 ఈ ఎన్నికలలో రెడ్డి ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎన్నికైతే,వారిలో అత్యదికులు 25 మంది కాంగ్రెస్ ఐవారే. జనతా పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. కోస్తా జిల్లాల నుంచి కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు పది మంది గెలిస్తే, రాయలసీమ నుంచి పదిహేను మంది నెగ్గారు. జనతా పార్టీ పక్షాన గెలిచినవారిలో ముగ్గురు కోస్తావారు, మిగిలిన ఐదుగురు రాయలసీమవారు. కాంగ్రెస ఆర్ నుంచి గెలిచిన ముగ్గురు లో ఇద్దరు రాయలసీమ కాగా ఒకరు కోస్తావారు. కాంగ్రెస్ఐ రెడ్డి ఎమ్మెల్యేలు..25 కే.లక్ష్మీనారాయణరెడ్డి-ప్రత్తిపాడు చల్లా నారపరెడ్డి-మాచర్ల కే.ఓబుల్ రెడ్డి-కంభం బీ.రామసుబ్బారెడ్డి-కనిగిరి కే.యానాదిరెడ్డి-కావలి బీ.సుందరరామిరెడ్డి-ఆత్మకూరు పీ.రామచంద్రారెడ్డి-కోవూరు కెవిసుబ్బారెడ్డి-నెల్లూరు, సీవి శేషారెడ్డి-సర్వేపల్లి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి-వెంకటగిరి, గజ్జెల రంగారెడ్డి-కడప, జీ.రామసుబ్బారెడ్డి-లక్కిరెడ్డిపల్లె, సీ.ఓబుల్ రెడ్డి రామిరెడ్డి-ప్రొద్దుటూరు, గంగుల తిమ్మారెడ్డి-ఆళ్లగడ్డ, ఎ.వెంగళరెడ్డి-ఆత్మకూరు, బీ.శేషశయనరెడ్డి-నందికోట్కూరు, హనుమంతరెడ్డి-ఎమ్మిగనూరు, డి.వెంకటరెడ్డి-తాడిపత్రి, వైసి తిమ్మారెడ్డి-మడకశిర, ఎస్. నారాయణరెడ్డి-పెనుకొండ, పీ.బయ్యపురెడ్డి-గోరంట్ల, ఆవుల మోహన్ రెడ్డి-తంబళ్లపల్లె, ఎన్.అమరనాదరెడ్డి-వాయల్పాడు, ఎ.ఈశ్వరరెడ్డి-తిరుపతి, ఆర్. చెంగారెడ్డి-నగరి. జనతా పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు-7 పీ.అమ్మిరెడ్డి-అనపర్తి గణపా రామస్వామిరెడ్డి-పెదకూరపాడు పిడతల రంగారెడ్డి-గిద్దలూరు సీ.ఎమ్.రామనాధరెడ్డి-జమ్మలమడుగు ఇ.అయ్యపురెడ్డి-పాణ్యం బీ.వెంకటరెడ్డి-నంద్యాల కే.అంకిరెడ్డి-కోయిలకుంట్ల కాంగ్రెస్ ఆర్..3 కాసు కృష్ణారెడ్డి-నరసరావుపేట కే.ప్రభావతమ్మ-రాజంపేట వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల సీపీఎం-1 పుచ్చలపల్లి సుందరయ్య-గన్నవరం ఇండిపెండెంట్లు-2 పీ.శివారెడ్డి-కమలాపురం డిఎల్.రవీంద్రారెడ్డి-మైదుకూరు కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు-36 కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు 36 మంది ఎన్నిక కాగా ,వారిలో కాంగ్రెస్ ఐ నుంచి ఇరవై నలుగురు ఉండగా, జతా పార్టీ నుంచి ఎనిమిది మంది ఉన్నారు. కాంగ్రెస్ ఆర్ ఇద్దరు, సీపీఎం ఒకరు,ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. కాంగ్రెస్ఐ నుంచి ఎన్నికైన వారిలో పదిహేడు మంది కోస్తా నుంచి, ఏడుగురు రాయలసీమ నుంచి నెగ్గారు. జనతా పార్టీ తరపున ఎన్నికైన కమ్మ ఎమ్మెల్యేలలో ఆరుగురు కోస్తావారు కాగా, ఇద్దరు రాయలసీమవారు. కాంగ్రెస్ ఐ కమ్మ ఎమ్మెల్యేలు-24 యు.నారాయణమూర్తి-పెద్దాపురం కంటిపూడి అప్పారావు-తణుకు కే.సత్యనారాయణ-ఉంగుటూరు గద్దె వెంకటేశ్వరరావు-చింతలపూడి పాలడుగు వెంకట్రావు-నూజివీడు నాదెండ్ల భాస్కరరావు-విజయవాడ తూర్పు బొద్దులూరి రామారవు-జగ్గయ్యపేట గోగినేని నాగేశ్వరరావు-పొన్నూరు, యడ్లపాటి వెంకటరావు-వేమూరు, సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట, రావెల వెంకటరావు-సత్తెనపల్లి, జీ.మల్లి ఖార్జునరావు-గురజాల, ఎమ్.నారాయణరావు-పర్చూరు, కరణం బలరామ కృష్ణమూర్తి-అద్దంకి, దివి కొండయ్యచౌదరి-కందుకూరు, జీ.పట్టాభి రామస్వామి చౌదరి-కొండపి, ఎన్.వెంకటరత్నం నాయుడు-రాపూరు, రాయల వేమన్న-ఉరవకొండ, బిటిఎల్ ఎన్ చౌదరి-అనంతపురం,జీ.అనంతరెడ్డి-దర్మవరం, జివి నారా యణరెడ్డి-మదనపల్లె, ఎన్.చంద్రబాబు నాయుడు-చంద్రగిరి, వి.సుబ్రహ్మణ్యం నాయుడు-శ్రీకాళహస్తి, బిఆర్ దొరస్వామి నాయుడు-కుప్పం జనతా పార్టీ కమ్మ ఎమ్మెల్యేలు..8 వడ్డే శోభనాద్రీశ్వరరావు-ఉయ్యూరు మొక్కపాటి వెంకటేశ్వరరావు-నందిగామ జివి రత్తయ్య-మంగళగిరి దొడ్డపనేని ఇందిర-తెనాలి జాగర్లమూడి చంద్రమౌళి-మార్టూరు ముప్పవరపు వెంకయ్య నాయుడు-ఉదయగిరి ఎన్.బీ.వెంకటేశ్వర చౌదరి-చిత్తూరు కెబి సిద్దయ్య-పుత్తూరు కాంగ్రెస్ ఆర్-2 బీపిన్నమనేని కోటేశ్వరరావు-ముదినేపల్లి చనుమోలు వెంకటరావు-మైలవరం సీపీఎం-1 కొరటాల సత్యనారాయణ-రేపల్లె ఇండి-1 ఆవుదారి వెంకటేశ్వర్లు-వినుకొండ కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు-22 కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎన్నికైతే,వారిలో కాంగ్రెస్ పక్షాన పదకొండు మంది, జనతా పార్టీ తరపున ఏడుగురు, కాంగ్రెస్ తరపున ఇద్దరు, సీపీఐ నేత ఒకరు ఉన్నారు. వీరిలో ఒకరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారే. కాపు కాంగ్రెసు ఎమ్మెల్యేలు...11 ఆళ్వార్ దాస్-విశాఖ-తెలగ జీ.అప్పన్న-పెందుర్తి కెసిహెచ్ మోహన్ రావు-పిఠాపురం పంతం పద్మనాభం-జగ్గంపేట సంగీత వెంకటరెడ్డి-ఆలమూరు వి.పద్మరాజు-బూరుగుపూడి ఎమ్.వెంకటరమణ-సంపర వర్ధినీడిసత్యనారాయణ-పాలకొల్లు లింగంశెట్టి ఈశ్వరరావు-గుంటూరు-2 జీ.సుందరరామయ్య-అల్లూరు కెవి పతి-పుంగనూరు జనతా పార్టీ కాపు ఎమ్మెల్యేలు-7 ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు బీ.సూర్యనారాయణ-తాళ్లరేవు పీవి శ్రీరామా రావు-అమలాపురం పీ.అమ్మిరాజు-కడియం బూరగడ్డ నిరంజనరావు-మల్లేశ్వరం వడ్డి రంగారావు-మచిలీపట్నం ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి కాంగ్రెస్ ఆర్-3 కే.అప్పడు దొర-భోగాపురం-తెలగదొర వి.సస్యాసి నాయుడు-యలమంచిలి మండలి వెంకట కృష్ణారావు-అవనిగడ్డ సీపీఐ-1 పూల సుబ్బయ్య-మార్కాపురం 1978- బీసీ ఎమ్మెల్యేలు..28 ఈ ఎన్నికలలో బీసీ వర్గాల నుంచి 28ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ ఐ నుంచి పదమూడు మంది, జనతా పార్టీ నుంచి పది మంది,కాంగ్రెస్ ఆర్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలుపొందారు.కాంగ్రెస్ ఐ లో ఏడుగురు మంది కోస్తా నుంచి ఆరుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. జనతా పార్టీలో గెలిచినవారంతా కోస్తావారే. కాంగ్రెస్ ఐ బీసీ ఎమ్మెల్యేలు...13 పీ. శ్రీరామమూర్తి-ఆముదాలవలస-కాళింగ డోల సీతారాములు-నరసన్నపేట-తూర్పు కాపు మల్లాడి స్వామి-కాకినాడ-మత్స్యకార జక్కంశెట్టి వెంకటేశ్వరరావు-పెనుకొండ-శెట్టి బలిజ ఎన్.సూర్యప్రకాశ్ రావు-ఏలూరు-విశ్వబ్రాహ్మణ కటారి సత్యనారాయణరావు-గుడివాడ-యాదవ పోతిన చిన్నా-విజయవాడ-1-నగరాలు ఎమ్.వెంకటేశ్వర్లు-చీరాల-పద్మశాలి-చేనేత కే.ఇ.కృష్ణమూర్తి-డోన్-గౌడ కే.బీ.నరసప్ప-ప్రత్తికొండ-కురుబ కెబి చినమల్లప్ప-రాయదుర్గం-కురుబ కే.తప్పేస్వామి-హిందుపూర్-కురుబ ఎ.వీరప్ప-నల్లమడ-పద్మశాలి జనతా పార్టీ బీసీ ఎమ్మెల్యేలు-10 గౌతు లచ్చన్న-సోంపేట-గౌడ బమ్మిడి నారాయణస్వామి-టెక్కలి-కాళింగ సీ.లక్మీ నారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ ఎమ్.బీ.పరాంకుశం-ఉణుకూరు-తూర్పుకాపు చీకటి పరుశురామానాయుడు-పార్వతీపురం-కే.వెలమ కేవికే నాయుడు-బొబ్బిలి-కే.వెలమ సీ.శ్యామలరావు-చీపురుపల్లి-కాళింగ వి.ఎస్. ఎ.నాయుడు -గజపతినగరం-కొప్పుల వెలమ ఎన్.ఎస్.ఎన్.రెడ్డి-విశాఖ-2 రెడ్డిక ఇ.సుబ్బారావు-కూచినపూడి-గౌడ కాంగ్రెస్ ఆర్ బీసీ ఎమ్మెల్యేలు-2 వాసిరెడ్డి వరదరామారావు-తెర్లాం-కే.వెలమ, గోపాత్రుడు బోలెం-నర్సీపట్నం-కే.వెలమ ఇండిపెండెంట్లు-3 కే.మోహన్ రావు-పాతపట్నం-తూర్పుకాపు కే.రామానాయుడు -మాడుగుల-కే.వెలమ పిల్లి అప్పారావు-రామచంద్రపురం-శెట్టి బలిజ షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు-26 ఏపీలోని కోస్తా,రాయలసీమలలో 22 ఎస్సీ రిజర్వుడ్ సీట్లుఉన్నా,నలుగురు జనరల్ సీట్ లో గెలిచారు.దాంతో 26 మంది గెలిచినట్లయింది. వీరిలో పందొమ్మిది మంది కాంగ్రెస్ ఐ పక్షాన, ఆరుగురు జనతా పార్టీ నుంచి గెలుపొందారు. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. కాంగ్రెస్ ఐ ఎస్సీ. ఎమ్మెల్యేలు 19 మారుతి ఆదెయ్య-పాయకరావుపేట ఎమ్.ఎస్.వి ప్రసాదరావు-ముమ్మడివరం ఎన్.గణపతిరావు-నగరం డి.వెంకటపతి-అల్లవరం కే.ధనరాజు-ఆచంట డి.సరోజినిదేవి-గోపాలపురం వక్కలగడ్డ ఆదాం-తిరువూరు కోనేరు రంగారావు-కంకిపాడు (జనరల్సీట్), టి.అమృతరావు-తాడికొండ, జీ.వేదాంతరావు-దుగ్గిరాల, (జనరల్), వి.ఎల్లయ్య-సంతనూతలపాడు,ఎన్.జీవరత్నం నాయుడు-ఒంగోలు (జనరల్) బర్రె జ్ఞానప్రకాశం-దర్శి, (జనరల్) పీ.ప్రకాష్ రావు-గూడూరు, పీ.వెంకటసుబ్బయ్య -సూళ్లూరుపేట, దామోదరం మునుస్వామి-కొడుమూరు, మసాలా ఈరన్న-ఆలూరు, సీ.దాస్-సత్యవేడు, ఎ.రత్నం-పలమనేరు. జనతా పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు-6 కే.నరసయ్య-ఎచ్చెర్ల కే.రాజారత్నం-పాలకొండ ఎన్.వెంకటసుబ్బయ్య-రైల్వే కోడూరు బీ.రుక్మిణిదేవి-శింగనమల హెచ్ .నరసప్ప-కళ్యాణదుర్గం బీ.ఆర్ముగం-వేపంజేరి సీపీఎం-1 జీ.బాపనయ్య-నిడుమోలు ఎస్.టీ.ఎమ్మెల్యేలు-కాంగ్రెస్ ఐ-3, జనతా- 3,కాంగ్రెస్ ఆర్ -1, సీపీఐ- 1. డి.సన్యాసిదొర-ఎస్.కోట జీ.ప్రకాష్ రావు-ఎల్లవరం రసపుత్ర నాగభూషణం-పోలవరం జనతా-3: వి.నరసింహారావు- కొత్తూరు, ఎస్.విజయరామరాజు- నాగూరు, జీ.అప్పలనాయుడు -పాడేరు కాంగ్రెస్ ఆర్-1..డి.కొండలరావు - చింతపల్లి సీపీఐ-1..ఎస్.ఆర్.టిపి రాజు-సాలూరు క్షత్రియ ఎమ్మెల్యేలు-12 క్షత్రియ ఎమ్మెల్యేలు పన్నెండు మంది గెలవగా, ఏడుగురు కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. ఇద్దరు జనతా, ఇద్దరు కాంగ్రెస్ ఆర్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. కాంగ్రెస్ ఐ-7 కేపీఆర్‌ఎస్ పద్మనాభరాజు-ఉత్తరాపల్లి పీ.సాంబశివరాజు-సతివాడ డి.జగ న్నాధరాజు -భీమిలి ఐ రామకృష్ణంరాజు-అత్తిలి కెవి.నరసింహారాజు-భీమవరం జీ.రామ చంద్రరాజు-ఉండి సిహెచ్ విపి మూర్తి రాజు-తాడేపల్లిగూడెం జనతా-2: పీ.అశోక్ గజపతిరాజు-విజయనగరం, ఎమ్.వి.ఎస్.సుబ్బరాజు-కొత్తపేట. కాంగ్రెస్ ఆర్-2: ఎమ్.విజయలక్ష్మీదేవి-తుని, రుద్రరాజు రామలింగరాజు-రాజోలు. ఇండి-1: కనుమూరి బాపిరాజు-కైకలూరు. ముస్లీం-4 ఎమ్.ఎ. అజీజ్ -కొవ్వూరు ఇబ్రహింఖాన్ -కర్నూలు నిజాం వలీ-కదిరి సైపుల్లా బేగ్ -పీలేరు బ్రాహ్మణ-10 కాంగ్రెస్ఐ-4: బీకే.ఎ.భుక్త-హరిశ్చంద్రపురం, పరకాల శేషావతారం-నరసాపురం, కోన ప్రభాకరరావు-బాపట్ల, జీ.వీరాంజనేయ శర్మ-గుంటూరు- 2. జనత...3: బివి శర్మ-ఇచ్చాపురం, ఈ.సీతారామశాస్త్రి-చోడవరం, వి.శివ రామకృష్ణారావు-బద్వేల్, హెచ్.సత్యనారాయణ-ఆదోని కాంగ్రెస్ ఆర్-1: భాట్టం శ్రీరామమూర్తి-పరవాడ. సీపీఐ-1: కొటికలపూడి గోవిందరావు-అనకాపల్లి వైశ్య-2: తటవర్తి సత్యవతి-రాజమండ్రి, కే.వెంకట్రామయ్య-గుత్తి. ఇతరులు-1: నీలం చార్లెస్-దెందులూరు(క్రిస్టియన్) – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1972 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభంజనం వీచింది. ఆంద్ర, రాయలసీమలలోని 186 సీట్లకు గాను 142 సీట్లు కాంగ్రెస్‌కు దక్కాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చీలి కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్‌గా ఏర్పడ్డాయి. ఇందిరాగాందీ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుతం ఉన్న ఏపీలో కమ్యూనిస్టు పార్టీకి నాలుగు స్థానాలు వస్తే, స్వతంత్ర పార్టీకి ఒక్క స్థానం మాత్రమే దక్కిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. అదేసమయంలో ఇండిపెండెంట్లు ముప్పై ఎనిమిది మంది గెలిచారు. సామాజికవర్గాల పరంగా చూస్తే రెడ్లు ముప్పై నాలుగు మంది గెలవగా, వారిలో కాంగ్రెస్ నుంచి ఇరవై ఒక్క మంది, సీపీఐ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు పన్నెండు మంది నెగ్గారు. ఇక కమ్మ వర్గంలో ముప్పై ఒక్క మంది గెలిస్తే, కాంగ్రెస్ పక్షాన 19 మంది, స్వతంత్రపార్టీ నుంచి ఒకరు, సీపీఐ పక్షాన ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్లు తొమ్మిది మంది గెలుపొందారు. కాపులలో 19 మందికిగాను పదిహేను మంది కాంగ్రెస్ వారే. బీసీలు ముప్పై మూడు మంది గెలవగా, వారిలో కాంగ్రెస్ నుంచి ఇరవై మూడు మంది, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు. ఎస్సీలు కాంగ్రెస్ నుంచి ఇరవైనాలుగు మంది గెలిస్తే ఇండిపెండెంట్‌గా ఒక్కరే గెలిచారు. బ్రాఆహ్మణ వర్గం వారు పదకుండు మంది కాంగ్రెస్ కాగా, ముస్లింలు ఏడుగురు కాంగ్రెస్ వారే, క్షత్రియులలో పదకుండు మంది కాంగ్రెస్ వారు కాగా ఒకరు ఇండిపెంటెండెంట్. వెలమ నుంచి ఇద్దరు, వైశ్య ఒకరు గెలిచారు. క్రిస్టియన్లు ముగ్గురు ఎన్నికయ్యారు.. రెడ్డి ఎమ్మెల్యేలు-34 రెడ్డి ఎమ్మెల్యేలు ముప్పైనాలుగుమంది ఎన్నిక కాగా వారిలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ వారు.ఈ ఎన్నికలలో తొమ్మిది మంది కోస్తా నుంచి పన్నెండు మంది రాయలసీమ నుంచి గెలుపొందారు.ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది గెలవగా,నలుగురు తప్ప మిగిలినవారంతా రాయలసీమవారు.అంటే రాయలసీమ నుంచి ఇరవై మంది నెగ్గారు.కోస్తా నుంచి పద్నాలుగు మంది గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు..21 డి.సత్యనారాయణరెడ్డి-రామచంద్రాపురం బి.గోపాలరెడ్డి-దుగ్గిరాల డి.కృష్ణారెడ్డి-నరసరావుపేట పీ.రంగారెడ్డి-గిద్దలూరు కె.ఓటుల్ రెడ్డి-ఎర్రగొండపాలెం డి. రాజగోపాలరెడ్డి-దర్శి పీ.రామచంద్రారెడ్డి-కోవూరు ఆనం వెంకటరెడ్డి-నెల్లూరు ఆర్.దశరధరామిరెడ్డి-అల్లూరు బి.వీరారెడ్డి-బద్వేలు గజ్జల రంగారెడ్డి-కడపి ఆర్. రాజగోపాలరెడ్డి-లక్కిరెడ్డిపల్లె పీ.బసిరెడ్డి-పులివెందుల ఎస్.పీ నాగిరెడ్డి-మైదుకూరు మద్దూరు సుబ్బారెడ్డి-నందికోట్కూరు ఇ.అయ్యపురెడ్డి-పాణ్యం బివి సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల ఎ. వెంకటరెడ్డి-అనంతపురం ఎస్.డి.నారాయణరెడ్డి-పెనుకొండ టి.ఎన్.అనసూయమ్మ-తంబళ్లపల్లె ఎన్.అమరనాధరెడ్డి-వాయల్పాడు సీపీఐ -1 మందపాటి నాగిరెడ్డి-గురజాల. ఇండిపెండెంట్లుగా ఎన్నికైన రెడ్డి ఎమ్మెల్యేలు..12 జూలకంటి నాగిరెడ్డి-మాచర్ల ఎమ్.ఆదినారాయణరెడ్డి-కందుకూరు ఎస్.పాపిరెడ్డి-కనిగిరి ఎన్.శ్రీనివాసులురెడ్డి-గూడూరు టి.నరసింహారెడ్డి-జమ్మలమడుగు ఎస్వి సుబ్బారెడ్డి-ఆళ్లగడ్డ బొజ్జా వెంకటరెడ్డి-నంద్యాల డి.కె.వెంకటరెడ్డి-గుత్తి టి.రంగారెడ్డి-శింగనమల పీ.రవీద్రరెడ్డి-గోరంట్ల సి.నారాయణరెడ్డి-కదిరి ఎ.బలరామిరెడ్డి-శ్రీకాళహస్తి కమ్మ ఎమ్మెల్యేలు-31 కమ్మ ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో పదిహేను మంది కోస్లా జిల్లాల నుంచి కాగా, నలుగురు రాయలసీమ నుంచి ఉన్నారు. మిగిలిన పన్నెండు మంది కూడా కోస్తా జిల్లాల వారే. అంటే మొత్తం ఇరవై ఏడు మంది కోస్తా నుంచి గెలుపొందారన్నమాట. కాంగ్రెస్ తరపున ఎన్నికైన కమ్మ ఎమ్మెల్యేలు..19 అప్పసాని అప్పన్నదొర-విజయనగరం కొండపల్లి కృష్ణమూర్తి-పెద్దాపురం వి.రామకృష్ణచౌదరి-అనపర్తి కె.రామచంద్రరావు-బూరుగుపూడి జి.సత్యనారాయణమూర్తి-తణుకు ఎమ్.రామ్మోహన్ రావు-దెందులూరు కాజ రామనాధం-ముదినేపల్లి కాకని వెంకటరత్నం-ఉయ్యూరు అక్కినేని భాస్కరరావు-కంకిపాడు చనుమోలు వెంకటరావు-మైలవరం వసంత నాగేశ్వరరావు-నందిగామ జీ.వి.రత్తయ్య-తాడికొండ బి.సత్యనారాయణ-చిలకరూరిపేట భవనం జయప్రద-వినుకొండ కె.శ్రీహరి నాయుడు-ఆత్మకూరు చల్లా సుబ్బారాయుడు-తాడిపత్రి పీవి చౌదరి-ధర్మవరం కిలారి గోపాలనాయుడు-నగరి డి.ఆంజనేయులు నాయుడు -చిత్తూరు స్వతంత్ర పార్టీ -1 యడ్లపాటి వెంకటరావు-వేమూరు సీపీఐ-2 వేములపల్లి శ్రీకృష్ణ-మంగళగిరి డి శంకరయ్య-కొండపి ఇండిపెండెంట్ కమ్మ ఎమ్మెల్యేలు-9 బి.గోపాలకృష్ణారావు-రాజోలు ఎ.హనుమంతరావు-కొవ్వూరు విజిఆర్కె ప్రసాద్-జగ్గయ్యపేట డి.రంగారావు-పొన్నూరు డి.ఇందిర-తెనాలి ఎమ్.నారాయణరావు-పర్చూరు కె.నారాయణ స్వామి-పొదిలి జి.కొండపనాయుడు-కావలి ఎన్ .వెంకటరత్నం నాయుడు-రాపూరు కాపు ఎమ్మెల్యేలు-19 కాపు ఎమ్మెల్యేలలో పదహారు మంది కోస్తా జిల్లాల వారు కాగా, ముగ్గురు మాత్రమే రాయలసీమ నుంచి గెలిచారు. కాంగ్రెస్ నంచి గెలిచిన పదిహేను మందిలో ఇద్దరు తప్ప మిగిలినవారు కోస్తావారు. కాపు ఎమ్మెల్యేలు -కాంగ్రెస్-15 లుకలాపు లక్ష్మణ దాస్- పొందూరు-తెలగ దొర కొమ్మూరు అప్పడు దొర-భోగాపురం-తెలగ దొర వి.జోగిరాజు-ప్రత్తిపాడు వైఎస్ఎన్ మూర్తి-పిఠాపురం పంతం పద్మనాభం-జగ్గంపేట జీ.కమలాదేవీ-ఆలమూరు పీ.వెంకట్రావు-చెయ్యేరు చేగొండి వెంకట హరిరామజోగయ్య-పాలకొల్లు డి.పేరయ్య-ఉండి మంగ తాయారమ్మ-కైకలూరు పీ.పమిడేశ్వరరావు-మల్లేశ్వరం ఎమ్.వి.కృష్ణారావు-అవనిగడ్డ ఎడం చెన్నయ్య-రేపల్లె జీ.సోమశేఖర్-హిందుపూర్-బలిజ ఎమ్.ఎమ్.రత్నం-బలిజ స్వతంత్ర-1 బండారు రత్న సభాపతి-రాజంపేట-బలిజ సీపీఐ-1 వంకా సత్యనారాయణ-పెనుగొండ ఇండిపెండెంట్ కాపు ఎమ్మెల్యేలు.. 2 ఈలి ఆంజనేయులు-తాడేపల్లి గూడెం నిశ్శంకరరావు వెంకటరత్నం-గుంటూరు-2 బీసీ ఎమ్మెల్యేలు-33 బీసీ ఎమ్మెల్యేలలో కొప్పుల వెలమ నుంచిఐదుగురు, పొలినాటి వెలమ నుంచి ముగ్గురు పద్మశాలి, దేవాంగ ల నుంచి నలుగురు, యాదవ ఇద్దరు, కాళింగ ముగ్గురు, తూర్పు కాపు ఇద్దరు, కళావంతుల వర్గం నుంచి ఇద్దరు, బోయ ఇద్దరు, కురుబ ఇద్దరు గెలుపొందారు. జంగమ, గాండ్ల, గవర, శెట్టిబలిజ, మత్సకార, గౌడ, రెడ్డిక, నగరాలు సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. బీసీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు: కాంగ్రెస్-23 బీసీ వర్గాలు కూడా అత్యధికం కోస్తా జిల్లాల నుంచి గెలుపొందారు. ముప్పై మూడు మందికిగాను ఏడుగురు రాయలసీమవారు.మిగిలిన ఇరవై ఆరు మంది కోస్లా జిల్లాలవారు.అందులోను ఉత్తరాంద్ర జిల్లాల నుంచి ఎక్కువగా పదహారు మంది గెలిచారు. యు.రంగబాబు-ఇచ్చాపురం-కాళింగ మజ్జి తులసీదాస్-సోంపేట-కాళింగ ఎస్.ఎల్.నాయుడు-టెక్కలి-పీ.వెలమ బి.సరోజనమ్మ-నరసన్నపేట-పొలినాటి వెలమ పీ.రుక్మిణమ్మ-ఉణుకూరు-తూర్పుకాపు జి.పైడపు నాయుడు-చీపురుపల్లి-తూర్పుకాపు, జి.కృష్ణంనాయుడు-గొంప-కొప్పలు వెలమ, వి.పాలవెల్లి-కొప్పుల వెలమ, బి.కళావతి-మాడుగుల-కొప్పుల వెలమ, పీవి రమణ-అనకాపల్లి-గవర, కుడిపూడి ప్రభాకరరావు-అమలాపురం, బి.మల్లిఖార్జునరావు-రాజమండ్రి-దేవాంగ, కటారి సత్యనారాయణరావు-గుడివాడ-యాదవ, పదసింగు లక్ష్మణరావు-మచి లీపట్నం-మత్స్యకార, అనగాని భగవంతరావు-కూచినపూడి-గౌడ, వి.రామానుజం-గుంటూరు-1-కళావంతుల, జి.కోటయ్య-చీరాల-పద్మశాలి, పీ.చెంచు రామయ్య-ఉదయగిరి-యాదవ, శేషన్న-డోన్-బోయ, కె.బినరసప్ప-ప్రత్తికొండ-కురుబ, పీ.సత్యనారాయణరాజు-ఎమ్మిగనూరు-బోయ, తిప్పేస్వామి-రాయదుర్గం-కురుమ, అగిశం వీరప్ప-నల్లమడ-పద్మశాలి. ఇండిపెండెంట్ బీసీ ఎమ్మెల్యేలు-10 సీ.శ్యామలరావు-శ్రీకాకుళం-పొలినాటి వెలమ పీ.శ్రీరామమూర్తి-నగరికటకం-కాళింగ బి.హరియప్పడురెడ్డి- ఎచ్చర్ల-రెడ్డిక చీకటిపరశు రామనాయుడు-పార్వతిపురం-కొప్పుల వెలమ టీఎల్ నాయుడు-పెదమానాపురం-కొప్పలు వెలమ పీ.సన్యాసిరావు-విశాఖ-2-నగరాలు సీవికె.రావు-కాకినాడ-కళావంతుల ఆమనగంటి శ్రీరాములు-ఏలూరు బసప్ప-ఉరవకొండ- జంగమ డి.వెంకటేశం-కుప్పం-గాండ్ల షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు-25 1972లో గెలిచిన ఎస్.సి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో ఒకరు తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ వారే కావడం విశేషం. సుక్క పగడాలు-పాతపట్నం కె.నరసయ్య-పాలకొండ జీ.సూర్యనారాయణ-పాయకరావుపేట జీ.మహాలక్ష్మి-నగరం ఎస్.సత్తిరాజు-తాళ్లరేవు ఎమ్.వి .ప్రసాదరావు-అల్లవరం, బత్తిన సుబ్బారావు-కడియం, జి.వెంకన్న-ఆచంట, కోట రామయ్య-తిరువూరు, కె.సోమేశ్వరరావు-నిడుమోలు,దాసరి ప్రకాశం-అద్దంకి (జనరల్) ఎస్.జీవరత్నంనాయుడు-ఒంగోలు, (జనరల్), ఆరేటి కోటయ్య-సంత నూతలపాడు, మంగళగిరి నానాదాస్-సర్వేపల్లి, పీ.వెంకటసుబ్బయ్య-సూళ్లూరుపేట, ఒ.వెంకట సుబ్బయ్య-వెంకటగిరి, గుంటి శ్రీరాములు-కోడూరు, డి.మునుస్వామి-కొడు మూరు, పీ.రాజరత్నరావు-ఆలూరు, ఎమ్.లక్ష్మీదేవి-కళ్యాణదుర్గం, ఎమ్. ఎల్లప్ప-మడకశిర, ఎమ్.మునుస్వామి-బంగారుపాళ్యం, సి.దాస్-సత్యవేడు, వి.మునిస్వామప్ప-వేపంజేరి ఇండి-1 ఎస్.వెంకటరావు-గోపాలపురం షెడ్యూల్ జాతులకు చెందిన ఎమ్మెల్యేలు..7 కాంగ్రెస్-5: జన్ని ముత్యాలు-సాలూరు,వి.రామన్న పడాల్-చింతపల్లి, టి.చిట్టినాయుడు-పాడేరు, టి.రత్నబాయి-ఎల్లవరం, కె.రాములు-పోలవరం. ఇండి-2: వి.నరసింహరావు-కొత్తూరు, వి.చూడామణి దేవ్-నాగూరు క్షత్రియ...10 కాంగ్రెస్: పీ.సాంబశివరాజు-సతివాడ, కెపిఆర్‌ఎస్ పద్మనాభ రాజు-ఎస్.కోట, డి.సూర్యనారాయణ-బీమిలి, రాజా సాగి సూర్యనారాయణరాజు-నర్సీపట్నం, ఎన్.విజయలక్ష్మి-తుని, కె.విజయనరసింహరాజు-అత్తిలి, బి.విజయకుమార్ రాజు-భీమవరం, సిహెచ్ విపి మూర్తిరాజు-ఉంగుటూరు, ఇవి గోపాలరాజు-నగరి, బి.సుందరమ్మాళ్-పుంగనూరు. ఇండి-2: ఎ.ఎస్.ఆర్.ఉప్పలపాటి-జామి,ఇండి-కెవి కాకర్లపూడి-యలమంచిలి ముస్లిం ఎమ్మెల్యేలు..7 కాంగ్రెస్: ఎమ.ఆర్.డీన్-విశాఖ-1, ఎ అసిఫ్ పాషా-విజయవాడ-1, పీ.ఉన్నీసాబేగం-పెదకూరపాడు, ఎమ్.ఎన్.బేగ్-మార్కాపురం, ఎమ్.హబీబుల్లా-రాయచోటి, రెహ్మాన్ ఖాన్-కర్నూలు, ఎమ్.సైఫుల్లా బేగ్-పీలేరు బ్రాహ్మణ వర్గం ఎమ్మెల్యేలు..11 కాంగ్రెస్: కె.ఎ.భుక్త-హరిశ్చంద్రపురం, భాట్టం శ్రీరామమూర్తి-పరవాడ, డి.భానుతిలకం-కొత్తపేట, చెరుకువాడ వెంకటరత్నం-సంపర, పరకాల శేషావతారం-నరసాపురం, డి.రామారావు-విజయవాడ తూర్పు, కోన ప్రభాకరరావు-బాపట్ల, గాదె వీరాంజనేయ శర్మ-గుంటూరు-2, ఆర్.సీతారామయ్య-కమలాపురం, హెచ్.సత్యనారాయణ-ఆదోని, ఎ.నర్సింగరావు-మదనపల్లె వెలమ..3 సీవి కృష్ణారావు-బొబ్బిలి, డి.కోనేశ్వరరావు-చింతలపూడి ఎమ్.రంగయ్యప్పారావు-నూజివీడు క్రిస్టియన్ ...3 కాంగ్రెస్-టి.ఎస్.ఆనందాబాయి-గన్నవరం, చుక్కా పీటర్ పాల్-ప్రత్తిపాడు, విజయశిఖామణి-తిరుపతి వైశ్య -1: కాంగ్రెస్- కొప్పరపు సుబ్బారావు-ప్రొద్దుటూరు – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1967 శాసనసభ సామాజిక వర్గాల విశ్లేషణ
ఈ ఎన్నికలలో ప్రతిపక్షాల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎక్కువగా గెలవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కోస్తా, రాయలసీమలలో అంటే ప్రస్తుత విభజిత ఆంద్రప్రదేశ్‌లో 101 సీట్లు గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా స్వతంత్ర పార్టీ ఇరవైతొమ్మిది సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల నాటికి కమ్యూనిస్టు పార్టీ రెండుగా సీపీఐ, సీపీఎం లుగా చీలి బాగా బలహీనపడ్డాయి. ఆంద్రప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలకు కలిపి పదకొండు సీట్లే దక్కాయి. కాగా ఇండిపెండెంట్లు నలభైఐదు మంది నెగ్గారు. మొత్తం 186 సీట్లకు గాను సామాజికవర్గాల పరంగా చూస్తే రెడ్డి, కమ్మ వర్గాలవారు సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెడ్లు ముప్పైఏడు మంది, కమ్మ ముప్పైఏడు మంది గెలిచారు. రెడ్లు రాయలసీమలో తమ ఆదిపత్యాన్ని నిలబెట్టుకుంటే, కమ్మ వర్గం కోస్తాలో పట్టు కొనసాగించింది. కాంగ్రెస్ పక్షాన రెడ్లు కోస్తాలో ఎనిమిది మంది గెలవగా, రాయలసీమలో పదహారు మంది నెగ్గారు. స్వతంత్ర పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరు కోస్తా, మరొకరు రాయలసీమ వారు. సీపీఎం నుంచి గెలిచిన ఇద్దరు రెడ్లు రాయలసీమవారే. ఇండిపెండెంట్లలో నలుగురు కోస్తావారు. ఐదుగురు రాయల సీమవారు. మొత్తం మీద ఇరవై నాలుగు మంది రెడ్లు రాయలసీమ నుంచి నెగ్గారు. ఇక కమ్మ వర్గం ఎమ్మెల్యేలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇరవైముడు, స్వతంత్ర పార్టీ నుంచి ఆరుగురు, కమ్యూనిస్టు పార్టీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్లు ఐదుగురు నెగ్గారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో నలుగురుతప్ప మిగిలిన 19 మంది కోస్తావారే. కమ్యూనిస్టు పార్టీ నుంచి విజయం సాదించినవారిలో ఇద్దరు కోస్తా, ఒకరు రాయలసీమవారు. స్వతంత్రపార్టీ వారు ఆరుగురు కోస్తాకు చెందినవారు. ఇండిపెండెంట్లలో ఐదుగురు కోస్తా జిల్లాలవారే. మొత్తం మీద చూస్తే ముప్పైరెండు మంది కోస్తాకు చెందినవారైతే, ఐదుగురు మాత్రం రాయలసీమవారన్నమాట. కాపు, తెలగ, బలిజ సామాజికవర్గాల నుంచి పందొమ్మిది మంది ఎన్నిక కాగా, ఏడుగురు కాంగ్రెస్, తొమ్మిది మంది ఇండిపెండెంట్లు గెలిచారు. స్వతంత్ర పార్టీ, సీపీఐ, సీపీఎం ల నుంచొ ఒక్కొక్కరు గెలిచారు. వీరిలో ఒకరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలవారే.అయితే అప్పట్లో ఎర్రగొండపాలెం కర్నూలు జిల్లాలో ఉండేది. తదుపరి ప్రకాశం జిల్లాలోకి మారింది. ఇక బిసి వర్గాల నుంచి ముప్పైరెండు మంది ఎన్నిక కాగా వారిలో పదకొండు మంది కాంగ్రెస్, పదకొండు మంది స్వతంత్ర పార్టీలకు చెందినవారు. సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్లు తొమ్మిది మంది గెలిచారు. వీరిలో ఏడుగురు రాయలసీమ, మిగిలినవారు కోస్తా జిల్లాల వారు.ఇందులో కూడా ఉత్తరాంద్ర నుంచి పద్దెనిమిది వంది ఎన్నికయ్యారు. ఎస్సి నియోజకవర్గాలో కాంగ్రెస్ నుంచి పదమూడు మంది గెలవగా, వారిలో ఒకరు అద్దంకి జనరల్ నుంచి ఎస్.సి నేత గెలవడం విశేషం.ఏడుగురు స్వతంత్ర పార్టీ నుంచి సీపీఐ, రిపబ్లికన్ పార్టీల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. మిగిలనవారు ఇండిపెండెంట్లు. బ్రాహ్మణులు ఎనిమిది గెలవగా, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఒకరు భారతీయ జనసంఘం నుంచి గెలిచారు. ఒకరు సీపీఐ, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. క్షత్రియులు పదకొండు మంది గెలవగా, వారిలో ఏడుగురు కాంగ్రెస్ వారు. ఒకరు సీపీఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు.వైశ్యులు ఆరుగురు గెలవగా, వారిలో నలుగురు కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర,ఒకరు భారతీయ జనసంఘం నుంచి గెలిచారు.ముస్లింలు ఇద్దరూ కాంగ్రెస్ వారే.వెలమలో ఒకరు కాంగ్రెస్ కాగా, మరొకరు ఇండిపెండెంట్. రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు –కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు..24 గణపా రామస్వామిరెడ్డి-పెదకూరపాడు, కాసు బ్రహ్మానందరెడ్డి-నరసరావుపేట, వి.లింగారెడ్డి-మాచర్ల, గాదె వెంకటరెడ్డి-పర్చూరు, సి.రామచంద్రారెడ్డి-ఒంగోలు, పులి వెంకటరెడ్డి-కనిగిరి, వి.వెంకురెడ్డి-కోవూరు, ఎసి సుబ్బారెడ్డి-రాపూరు, బి.వీరారెడ్డి-బద్వేలు, ఎమ్.కృష్ణారెడ్డి- రాయచోటి, ఆర్.రాజగోపాలరెడ్డి- లక్కిరెడ్డిపల్లె, పి.బసిరెడ్డి-పులివెందుల, ఆర్.రామసుబ్బారెడ్డి- ప్రొద్దుటూరు, ఎస్.పి నాగిరెడ్డి-మైదుకూరు, సి.రాంభూపాల్ రెడ్డి-నందికోట్కూరు, బి.వి.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, కె.రామచంద్రారెడ్డి-నల్లమడ, నారాయణరెడ్డి-పెనుకొండ, పద్మా భాస్కరరెడ్డి-గోరంట్ల, కెవి వేమారెడ్డి-కదిరి,టి.ఎన్.అనసూయమ్మ-తంబళ్లపల్లె, జివి.శ్రీనాదరెడ్డి-పీలేరు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి-వాయల్పాడు, వి.రామస్వామిరెడ్డి-పుంగనూరు. స్వతంత్ర పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు..2 పి.రామచంద్రారెడ్డి-ఆత్మకూరు, ఎ.ఈశ్వరరెడ్డి-తిరుపతి సీపీఎం రెడ్డి ఎమ్మెల్యేలు..2 పి.ఈశ్వరరెడ్డి-ప్రత్తికొండ,తరిమెల నాగిరెడ్డి-అనంతపురం ఇండిపెండెంట్ రెడ్డి ఎమ్మెల్యేలు..9 ఎ.రామిరెడ్డి-దుగ్గిరాల, డి.పాండురంగారెడ్డి-గిద్దలూరు, బెజవాడ పాపిరెడ్డి-అల్లూరు, వి.రామచంద్రారెడ్డి-గూడూరు, ఎన్.పుల్లారెడ్డి-కమలాపురం, గంగుల తిమ్మారెడ్డి-ఆళ్లగడ్డ, వెంకటరెడ్డి-పాణ్యం, కె. అంజనారెడ్డి-హిందుపూర్, ,బి.గంగసుబ్బరామిరెడ్డి-శ్రీకాళహస్తి. కమ్మ సమాజికవర్గ ఎమ్మెల్యేలు-37 –కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు..23 వి.రామన్నచౌదరి-అనపర్తి, కె.వీరన్న-బూరుగుపూడి,అల్లూరు కృష్ణారావు-తాడేపల్లిగూడెం, ఎమ్.రామ్మోహన్ రావు-ఉంగుటూరు, గద్దె విష్ణుమూర్తి-చింతలపూడి, వెలివెల సీతారామయ్య-గన్నవరం, ఎమ్.కస్తూరి దేవి-గుడివాడ, వై.శివరామప్రసాద్-అవనిగడ్డ, అక్కినేని భాస్కరరావు-కంకిపాడు, చనుమోలు వెంకటరావు-మైలవరం, ఎ.సూర్యనారాయణ-నందిగామ, జివి రత్తయ్య-తాడికొండ, పి. అంకినీడు ప్రసాదరావు-పొన్నూరు, డి.ఇందిర-తెనాలి, చేబ్రోలు హనుమయ్య-గుంటూరు-2, భవనం జయప్రద-వినుకొండ, చెంచురామా నాయుడు-కందుకూరు, సి.రోశయ్యనాయుడు-కొండపి, కాటూరి నారాయణస్వామి-పొదిలి, గుర్రం చిన వెంకన్న-ఉరవకొండ, చల్లా సుబ్బారాయుడు-తాడిపత్రి, కిలారు గోపాలనాయుడు-నగరి, డి.ఆంజనేయులు నాయుడు-చిత్తూరు స్వతంత్ర పార్టీ కమ్మ ఎమ్మెల్యేలు..6 యడ్లపాటి వెంకటరావు-వేమూరు ఎమ్.సి.నాగయ్య-ప్రత్తిపాడు కందిమళ్ల బుచ్చయ్య-చిలకలూరిపేట రావిపాటి మహానంద- ఎర్రగొండపాలెం జి.సుబ్బనాయుడు-కావలి ధనేకుల నరసింహం-ఉదయగిరి సీపీఐ కమ్మ ఎమ్మెల్యేలు..3 యు.నారాయణమూర్తి-పెద్దాపురం సిప్రభాకర చౌదరి-రాజమండ్రి జి.శివయ్య-పుత్తూరు ఇండిపెండెంట్ కమ్మ ఎమ్మెల్యేలు..5 కె.బుచ్చినాయుడు-కొవ్వూరు జి.సత్యనారాయణమూర్తి-తణుకు కాజ రామనాధం-ముదినేపల్లి కె.వెంకటేశ్వరరావు-ఉయ్యూరు చప్పిడి వెంగయ్య-మార్కాపురం కాపు, తెలగ, బలిజ ఎమ్మెల్యేలు-19; కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు...7 కె.అప్పడుదొర-భోగాపురం-తెలగ దొర వైఎస్ ఎన్ మూర్తి-పిఠాపురం నయనాల గణేశ్వరరావు-రాజోలు జవ్వాది లక్ష్మయ్య-పెనుకొండ మాలె వెంకట నారాయణ-ఏలూరు ఎడం చెన్నయ్య-రేపల్లె శనక్కాయల అరుణ గుంటూరు-1; సీపీఐ, సీపీఎం కాపు ఎమ్మెల్యేలు..2 పోలిశెట్టి శేషావతారం-పాలకొల్లు-సీపీఎమ్ పూల సుబ్బయ్య-ఎర్రగొండపాలెం (బలిజ)-సీపీఐ స్వతంత్ర-1 నిచ్చర్ల రాములు-టెక్కలి-తెలగ ఇండిపెండెంట్ కాపు ఎమ్మెల్యేలు..9 ఎన్.సత్యనారాయణ-యలమంచిలి ముద్రగడ వీరరాఘవరావు-ప్రత్తిపాడు నున్న వీర్రాజు-రామచంద్రపురం సంగీత వెంకటరెడ్డి-ఆలమూరు పంతం కామరాజు-జగ్గంపేట కె.కుసుమేశ్వరరావు-ఉండి సి.పాండురంగారావు-కైకలూరు బి.నిరం జనరావు-మల్లేశ్వరం బి.రత్నసభాపతి-రాజంపేట(బలిజ) – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు