2019 AP : ఏ సామాజికవర్గం నుంచి ఎందరు గెలిచారు? | Caste Wise Winners In Andhra Pradesh 2019 Elections | Sakshi
Sakshi News home page

2019 AP : ఏ సామాజికవర్గం నుంచి ఎందరు గెలిచారు?

Published Fri, Mar 8 2024 9:51 PM | Last Updated on Thu, Mar 14 2024 1:48 PM

Caste Wise Winners In Andhra Pradesh 2019 Elections

2019లో రికార్డు స్థాయిలో రెడ్డి ఎమ్మెల్యేల విజయం
విభజిత ఆంద్రప్రదేశ్‌లో రెడ్డి సామాజికవర్గం నేతలు 48 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన పోటీచేసిన రెడ్డి నేతలలో ఒక్కరు తప్ప అంతా విజయం సాదించడం కూడా ఒక ప్రత్యేకత. ఉరవకొండ నుంచి పోటీచేసిన విశ్వేశ్వరరెడ్డి తప్ప మిగిలిన వారంతా గెలిచారు. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన 48 మంది గెలవగా, టీడీపీ పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదు.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇలా ఒక్క రెడ్డి ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ పక్షాన లేకుండా పోవడం ఇదే తొలిసారి. రాయలసీమ నుంచి ముప్పైఒక్క మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిస్తే, పదిహేడు మంది కోస్తా నుంచి విజయం సాధించారు.

తూర్పు గోదావరి లో ముగ్గురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, నెల్లూరులో ఏడుగురు, కడపలో ఏడుగురు, కర్నూలులో పది మంది, అనంతపురంలో ఏడుగురు, చిత్తూరు జిల్లాలో ఏడుగురు రెడ్డి నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పులివెందులలో మరోసారి విజయం సాధించారు. ఆయన కుటుంబం ఇక్కడ 1978 నుంచి అంటే నాలుగు దశాబ్దాలుగా  ఎన్నికవుతూ వస్తోంది.ఇది కూడా ఒక  రికార్డు అని చెప్పాలి.

చిత్తూరు జిల్లాలో సీనియర్‌ నేత పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆరోసారి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు మహేష్‌ రెడ్డి గుంటూరు జిల్లా గురజాల నుంచి విజయం సాదించారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆరోసారి విజయం సాదించారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు మూడు నియోజకవర్గాల నుంచి గెలవడం విశేషం. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, ఆదోనిలో సాయి ప్రసాద్‌రెడ్డి గుంతకల్లులో వెంకట్రామిరెడ్డిలు గెలుపొందారు.

రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు.. 48- అంతా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ వారే

  • ఎన్‌.సూర్యనారాయణరెడ్డి-అనపర్తి,
  • ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి-కాకినాడ సిటీ,
  • చిర్ల జగ్గారెడ్డి-కొత్తపేట,
  • ఆళ్ల రామకృష్ణారెడ్డి- మంగళగిరి,
  • గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి-నరసరావుపేట,
  • కాసు మహేశ్‌ రెడ్డి-గురజాల,
  • పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి- మాచర్ల,
  • బాలినేని శ్రీనివాసరెడ్డి-ఒంగోలు,
  • ఎమ్‌.మహీదరరెడ్డి-కందుకూరు,
  • కె.నాగా ర్జునరెడ్డి-మార్కాపురం,
  • ఆర్‌.ప్రతాప్‌ రెడ్డి-కావలి,
  • మేకపాటి గౌతం రెడ్డి-ఆత్మకూరు,
  • నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి- కోవూరు,
  • కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి-నెల్లూరు రూరల్‌,
  • కాకాణి గోవర్దన్‌ రెడ్డి-సర్వేపల్లి,
  • ఆనం రామనారాయణ రెడ్డి-ఆత్మకూరు,
  • మేకపాటి చంద్రశేఖరరెడ్డి-ఉదయగిరి,
  • మేడా మల్లిఖార్జున రెడ్డి-రాజంపేట,
  • గడికోట శ్రీకాంతరెడ్డి-రాయచోటి,
  • వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి-పులివెందుల,
  • పి.రవీంద్రనాద్‌ రెడ్డి-కమలాపురం,
  • ఎమ్‌.సుదీర్‌ రెడ్డి-జమ్మలమడుగు,
  • రాచమల్లు శివప్రసాదరెడ్డి-ప్రొద్దుటూరు,
  • ఎన్‌.రఘురామి రెడ్డి-మైదుకూరు,
  • గంగుల విజయేందర్‌ రెడ్డి-ఆళ్లగడ్డ,
  • శిల్పా చక్రపాణిరెడ్డి-శ్రీశైలం,
  • కాటసాని రాంభూపాల్‌ రెడ్డి-పాణ్యం,
  • శిల్ప రవిచంద్రకిషోర్‌ రెడ్డి-నంద్యాల,
  • కాటసాని రామిరెడ్డి-బనగానపల్లె,
  • బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి-డోన్‌,
  • కె.శ్రీదేవి-ప్రత్తి కొండ,
  • కె.చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు,
  • వై.బాలనాగిరెడ్డి-మంత్రాలయం,
  • వై.శివ ప్రసాదరెడ్డి-ఆదోని,
  • వై.వెంకట్రామిరెడ్డి-గుంతకల్లు,
  • కె.పెద్దారెడ్డి-తాడిపత్రి,
  • అనంత వెంకట్రామిరెడ్డి-అనంతపురం,
  • తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి-రాప్తాడు,
  • కె.వెంకట రమణారెడ్డి-దర్మవరం,
  • డి.శ్రీదర్‌ రెడ్డి-పుట్టపర్తి,
  • సిద్దారెడ్డి-కదిరి,
  • పెద్దిరెడ్డి ద్వారకా నాదరెడ్డి- తంబళ్లపల్లె,
  • చింతల రామచంద్రారెడ్డి-పీలేరు,
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పుంగనూరు,
  • చెవిరెడ్డి భాస్కరరెడ్డి-చంద్రగిరి,
  • భూమన కరుణాకరరెడ్డి-తిరుపతి,
  • బియ్యపు మదుసూదనరెడ్డి-శ్రీకాళహస్తి,
  • ఆర్‌.కె.రోజా-నగరి,

వీరిలో ముగ్గురు అన్నదమ్ములు మూడు నియోజకవర్గాల నుంచి గెలవడం విశేషం. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లుల నుంచి గెలుపొందిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతం రెడ్డి, బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లు మంత్రులు అయ్యారు.

2019లో కమ్మలు పదిహేడు మంది మాత్రమే ఎన్నిక కాగలిగారు. 1994లో అత్యధికంగా 47 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో ఆరుగురు అధికార వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌కు చెందినవారు కాగా, మిగిలిన 11మంది టీడీపీకి చెందినవారు. 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ మంత్రి పదవిలో ఉంటూ మంగళగిరిలో పోటీ చేసి ఎన్నికలలో ఓడిపోయారు.

చంద్రబాబు నాయుడు ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. గతంలో ఎనిమిదిసార్లు గెలిచిన విజయనగరం జిల్లా నేత పి.సాంబశివరాజు రికార్డుతో సమం అయ్యారు. చంద్రబాబు చంద్రగిరిలో ఒకసారి, కుప్పం నుంచి ఏడు సార్లు విజయం సాదించారు. కాగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కాని, విభజిత ఏపీలో కాని రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన నేతగా, రికార్డు స్థాయిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చరిత్ర చంద్రబాబుకు దక్కింది. కొడాలినాని ఈసారి వైఎస్‌ జగన్‌ క్యాబినెట్‌ లో మంత్రి అయ్యారు.

కమ్మ ఎమ్మెల్యేల వివరాలు- 17- వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -6, టీడీపీ -11

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ - 6

  • కొటారు అబ్బయ్య చౌదరి-దెందులూరు
  • కొడాలి నాని-గుడివాడ
  • వసంత కృష్ణ ప్రసాద్‌-మైలవరం
  • నంబూరి శంకరరావు- పెదకూరపాడు,
  • అన్నాబత్తుని శివకుమార్‌-తెనాలి,
  • బొల్లా బ్రహ్మనాయుడు-వినుకొండ.

టీడీపీ-11

  • వెలగపూడి రామకృష్ణ-విశాఖపట్నం తూర్పు,
  • వేగుళ్ల జోగేశ్వరరావు-మండపేట,
  • గోరంట్ల బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి రూరల్‌,
  • వల్లభవనేని వంశీ-గన్నవరం,
  • గద్దె రామ్మోహన రావు-విజయవాడ తూర్పు,
  • ఏలూరి సాంబశివరావు-పర్చూరు,
  • గొట్టిపాటి రవికుమార్‌-అద్దంకి,
  • కరణం బలరాం-చీరాల,
  • పయ్యావుల కేశవ్‌-ఉరవకొండ,
  • నందమూరి బాలకృష్ణ - హిందూపూర్‌,
  • నారా చంద్రబాబు నాయుడు-కుప్పం.

బీసీ ఎమ్మెల్యేలు-34- వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -28, టీడీపీ 6
ఏపీ అసెంబ్లీలో వెనుకబడిన తరగతుల వారు ముప్పై నలుగురు  ఎన్నికయ్యారు. వారిలో ఇరవై ఎనిమిది మంది వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన ఎన్నిక కాగా, టీడీపీ తరపున ఆరుగురు మాత్రమే గెలుపొందారు. 2014లో బీసీలు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన కేవలం ముగ్గురే విజయం సాదించగా, ఈసారి ఇరవై ఎనిమిదికి పెరగడం విశేషం. ప్రజలలోని బీసీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ కు అనుకూలంగా మారారని అర్దం అవుతుంది. బీసీలలో వేర్వేరు సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే , పొలినాటి వెలమ, కొప్పుల వెలమ కలిపి తొమ్మిది మంది గెలిచారు. వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు గెలిచారు. వారిద్దరూ కూడా సమీప బందువులు కావడం విశేషం.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, ఆయన అన్న ఎర్రనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందారు. వీరిద్దరూ పోలినాటి వెలమ. కాగా ఈ సమాజికవర్గం నుంచి ఇద్దరు నేతలు దర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌ లు గెలుపొందారు వీరిద్దరు సోదరులు.ఈసారి కకృష్ణదాస్‌ మంత్రి కూడా అయ్యారు.కొప్పుల వెలమ నుంచి ఐదుగురు గెలవగా వారంతా వైసీపీ వారే. ఆ తర్వాత తూర్పు కాపు వర్గం నుంచి ఐదుగురు విజయం సాదించారు.అంతా వైసీపీవారే.వీరిలో ముగ్గురు బొత్స సత్యనారాయణ సమీప బందువులు కావడం ఒక ప్రత్యేకత. ఆయన సోదరుడు అప్పలనరసయ్య, సమీప బందువు అప్పలనాయుడు కూడా గెలుపొందారు. బొత్స మంత్రి పదవి పొందారు. కాళింగ వర్గం నుంచి ఇద్దరు తమ్మినేని సీతారామ్‌, బెందాళం అశోక్‌ లు గెలిచారు. అయితే సీతారామ్‌ కింతలి కాళింగ కాగా, అశోక్‌ బూరగాని కాళింగ వర్గం వారు. సీతారామ్‌ వైసీపీ పక్షాన, అశోక్‌ టీడీపీ తరపున ఎన్నికయ్యారు.

సీతారామ్‌ స్పీకర్‌ స్థానాన్ని పొందడం విశేషం. యాదవ నుంచి నలుగురు గెలిచారు. వారిలో ఒకరు అనిల్‌ యాదవ్‌ మంత్రి అయ్యారు. వీరంతా వైసీపీవారే. గౌడ నుంచి ముగ్గురు గెలుపొందగా, ఇద్దరు వైసీపీవారు. మత్సకార వర్గం నుంచి ముగ్గురు గెలవగా, వారిలో ఇద్దరు వైసీపీ, ఒకరు టీడీపీ వారు. కాగా రేపల్లె నుంచి పోటీచేసి ఓడిపోయిన మోపిదేవి వెంకట రమణరావును మంత్రివర్గంలోకి తీసుకోవడం విశేషం. రెడ్డిక ఒకరు, శెట్టిబలిజ ఒకరు వైసీపీ నుంచి గెలవగా, గవర వర్గం నుంచి ఒకరు టీడీపీ పక్షాన గెలిచారు. రజన ఒకరు, బోయ ఒకరు, లింగాయత్‌ ఒకరు, కురుబ నుంచి ఇద్దరు గెలిచారు. వీరంతా వైసీపీ వారే.శెట్టి బలిజ సామాజికవర్గం నేత పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేశారు. కాగా బోయ వర్గం ఎమ్మెల్యే గుమ్మలూరు జయరాం, కురుబ వర్గం ఎమ్మెల్యే శంకర నారాయణలు కూడా మంత్రులు అయ్యారు.

బీసీ ఎమ్మెల్యేలు-34- వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -28, టీడీపీ 6

  • పొలినాటి వెలమ-4- ఇద్దరు వైసీపీ , ఇద్దరు టీడీపీ
  • వైసిసి -ధర్మాన ప్రసాదరావు-శ్రీకాకుళం , ధర్మానకకృష్ణ దాస్‌ -నరసన్నపేట.
  • టీడీపీ -కింజారపు అచ్చెన్నాయుడు -టెక్కలి, ఆదిరెడ్డి భవాని-రాజమండ్రి సిటీ
  • కొప్పుల వెలమ-5- అంతా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌
  • శంభంగి చిన అప్పలనాయుడు-బొబ్బిలి, కె.శ్రీనివాస్‌ - ఎస్‌.కోట, బి.ముత్యాలనాయుడు-మాడుగుల, అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌-పెందుర్తి, పి.ఉమాశంకర్‌ గణేష్‌ -నర్సీపట్నం
  • తూర్పు కాపు-5- అంతా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ వారే
  • రెడ్డి శాంతి-పాతపట్నం, గొర్లె కిరణ్‌ కుమార్‌ -ఎచ్చెర్ల, బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి, బొత్స అప్పల నరసయ్య-గజపతినగరం, బడుకొండ అప్పలనాయుడు-నెల్లిమర్ల
  • యాదవ-4- అంతా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ 
  • కారుమూరు నాగేశ్వరరావు-తణుకు, కె.పార్దసారధి-పెనమలూరు,బుర్రా ముదసూదన్‌ యాదవ్‌-కనిగిరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌-నెల్లూరు సిటీ
  • గౌడ- 3- వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -2, టీడీపీ -1
  • వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ - జోగి రమేష్‌ -పెడన,ఎన్‌.వెంకటేష్‌ గౌడ్‌-పలమనేరు
  • టీడీపీ-అనగాని సత్యప్రసాద్‌-రేపల్లె
  • మత్సకార-3, వైసీపీ-2, టీడీపీ -1
  • వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -సీదిరి అప్పలరాజు- పలాస, పి.వి.సతీష్‌ కుమార్‌ -ముమ్మడివరం
  • వాసుపల్లి గణేష్‌ కుమార్‌ -విశాఖ దక్షిణ 
  • కాళింగ- 2-వైసీపీ-1, టీడీపీ -1
  • వైసీపీ- తమ్మినేని సీతారామ్‌-ఆముదాల వలస
  • టీడీపీ- బెందాళం అశోక్‌ -ఇచ్చాపురం
  • కురుబ- 2-ఇద్దరూ వైసీపీ
  • కెవి ఉశశ్రీ చరణ్‌-కళ్యాణ దుర్గం,  ఎమ్‌. శంకరనారాయణ-పెనుకొండ
  • శెట్టిబలిజ-1- వైసీపీ-1
  • శ్రీనివాస వేణుగోపాలకృష్ణ- రామచంద్రపురం
  • గవర- 1-టీడీపీ -1 పివిజిఆర్‌ నాయుడు- విశాఖ -పశ్చిమ
  • రెడ్డిక-1- వైసీపీ- 1 - తిప్పల నాగిరెడ్డి- గాజువాక
  • బోయ- 1- వైసీపీ -1 - గుమ్మలూరు జయరాం- ఆలూరు
  • లింగాయత్‌-1- వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -1 - కాపు రామచంద్రారెడ్డి-రాయదుర్గం
  • రజక-1 వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -1 - విడదల రజనీకుమారి- చిలకలూరిపేట

2019 కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు
 

మొత్తం -25: వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -22, టీడీపీ-3
ఈ ఎన్నికలలో కాపు సామాజికవర్గం తరపున పోటీచేసిన అభ్యర్దులు అత్యధికం వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన గెలిచారు. 2104 ఎన్నికలలో వైసీపీకి కేవలం ముగ్గురు మాత్రమే కాపు ఎమ్మెల్యేలు ఉండగా, ఈ ఎన్నికలలో టీడీపీకి అదే సంఖ్య రావడం ఒక ప్రత్యేకగా భావించాలి.22 మంది వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన గెలవగా, ముగ్గురు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. నిడదవోలు, పొన్నూరు వంటి టీడీపీ బలమైన  నియోజకవర్గాలలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ విజయం సాదించడం గమనించవలసిన అంశం. జనసేన అధినేతకు కాపు సామాజికవర్గం కొంత భాగం అండగా నిలిచినా, ఆయన పూర్తిగా టీడీపీకి వ్యతిరేకం కాదన్న భావన ప్రబలడంతో ఆయనకు నష్టం జరిగిందని చెప్పాలి. జనసేన నుంచి ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా నెగ్గలేదు. అయితే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో టీడీపీకి ఈ పార్టీ బాగా డామేజీ చేసిందని అనుకోవచ్చు.

గత ఎన్నికలలో ఈ రెండు జిల్లాలలో కలిపి టీడీపీకి 29 సీట్లు రాగా, ఈసారి కేవలం ఐదే దక్కాయి. అదే సమయంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌కు ఇరవె ఎనిమది స్థానాలు వచ్చాయి. ఒకటి జనసేనకు వచ్చింది.ఈ వర్గం నుంచి గెలిచినవారిలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రి కాగా, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మంత్రి అయ్యారు.కన్నబాబు గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు.టీడీపీ ఎమ్‌.పి పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చి భీమిలి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్‌ కూడా మంత్రి అయ్యారు.కకృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి గెలుపొందిన పేర్ని నాని మంత్రి అయ్యారు.

కాపు ఎమ్మెల్యేల వివరాలు : వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -22:

  • అవంతి శ్రీనివాస్‌- భీమిలి,
  • కరణం ధర్మశ్రీ- చోడవరం,
  • గుడివాడ అమరనాద్‌- అనకాపల్లి,
  • దాడిశెట్టి రాజా-తుని,
  • పూర్ణచంద్రప్రసాద్‌-ప్రత్తిపాడు,
  • పెండెం దొరబాబు -పిఠాపురం,
  • కె.కన్నబాబు-కాకినాడ రూరల్‌,
  • జక్కంపూడి రాజా- రాజానగరం,
  • జ్యోతుల చంటిబాబు- జగ్గంపేట,
  • జిఎస్‌.నాయుడు- నిడదవోలు,
  • గ్రంది శ్రీనివాస్‌- భీమవరం,
  • కొట్టు సత్యనారాయణ-తాడేపల్లిగూడెం,
  • పుప్పాల శ్రీనివాసరావు-ఉంగుటూరు,
  • ఆళ్ల నాని-ఏలూరు,
  • డి.నాగేశ్వరరావు-కైకలూరు,
  • పేర్ని నాని-మచిలీపట్నం,
  • సింహాద్రి రమేష్‌-అవనిగడ్డ,
  • సామినేని ఉదయభాను-జగ్గయ్యపేట,
  • కిలారు రోశయ్య-పొన్నూరు,
  • అంబటి రాం బాబు- సత్తెనపల్లి,
  • మేడిశెట్టి వేణుగోపాల్‌-దర్శి,
  • జె.శ్రీనివాసులు-చిత్తూరు(బలిజ).

టీడీపీ-3:

  • గంటా శ్రీనివాసరావు- విశాఖ ఉత్తరం,
  • నిమ్మకాయల చినరాజప్ప- పెద్దాపురం,
  • నిమ్మల రామానాయుడు-పాలకొల్లు.

2019 ఎస్‌.సి ఎమ్మెల్యేలు - వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -27, టీడీపీ -1, జనసేన-1

2014 ఎన్నికలలో ఎస్‌.సి ఎమ్మెల్యేలు టీడీపీ, వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దాదాపు సరి సమానంగా ఉండగా, 2019 ఎన్నికలలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ కు ఏకపక్షంగా ఎన్నికయ్యరు. మొత్తం 29 రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు గాను 27 చోట్ల వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ గెలవగా, తెలుగుదేశం పార్టీ ఒకే చోట విజయం సాదించగలిగింది. జనసేన రాష్టరలో గెలిచిన ఏకైక సీటు కూడా ఎస్‌.సి ది కావడం విశేషం. ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా సీనియర్‌ ఎమ్మెల్యే కె.నారాయణ స్వామికి ముఖ్యమంత్రి జగన్‌ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కూడా విశేషం.

తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా కొండపి రిజర్వుడ్‌ నియోజకవర్గాన్ని, జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా రాజోలు రిజర్వుడ్‌ నియోజకవర్గాన్ని దక్కిం చుకున్నాయి. కాగా ఎస్‌.సిలలో మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్‌, పినిపే విశ్వరూప్‌ లు మంత్రి పదవులు పొందారు. విశ్వరూప్‌ గతంలో జగన్‌ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పుడు మంత్రి పదవి వదలుకుని వచ్చారు. అలాగే సురేష్‌, సుచరితలు కూడా అప్పట్లో కాంగ్రెస్‌ను వదలి జగన్‌ కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మంత్రులు అయ్యారు.

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -27:

  • కంభాల జోగులు-రాజాం,
  • అలజంగి జోగారావు-పార్వతీపురం,
  • గొల్ల బాబూరావు-పాయకరావుపేట,
  • పినిపే విశ్వరూప్‌ -అమలాపురం,
  • కొండేటి చిట్టిబాబు-పి.గన్నవరం,
  • తానేటి వనిత-కొవ్వూరు,
  • తలారి వెంకటరావు-గోపాలపురం,
  • వి.ఆర్‌.ఎలీజా-చింతలపూడి,
  • కె.రక్షణనిది- తిరువూరు,
  • కె.అనిల్‌ కుమార్‌-పామర్రు,
  • మొండితోక జగన్మోహన రావు-నందిగామ,
  • ఉండవల్లి శ్రీదేవి- తాడికొండ,
  • మేరుగ నాగార్జున- వేమూరు,
  • మేకతోటి సుచరిత-ప్రత్తిపాడు,
  • ఎ.సురేష్‌-ఎర్రగొండపాలెం,
  • టి.సుదాకర్‌ బాబు-సంత నూతలపాడు,
  • వరప్రసాద్‌-గూడూరు,
  • కలివేటి సంజీవయ్య-సూళ్లూరుపేట,
  • జి.వెంటకసుబ్బయ్య-బద్వేలు,
  • కె.శ్రీనివాసులు- రైల్వే కోడూరు,
  • ఆర్ధర్‌-నందికోట్కూరు,
  • డాక్టర్‌ సుధాకర్‌ బాబు-కొడుమూరు,
  • జె.పద్మావతి-శింగనమల,
  • ఎమ్‌. తిప్పేస్వామి-మడకశిర,
  • కె.ఆదిమూలం-సత్యవేడు,
  • కె.నారాయణస్వామి-గంగాధరనెల్లూరు,
  • ఎమ్‌.ఎస్‌.బాబు-పూతలపట్టు.

టీడీపీ: బాలవీరాంజనేయ స్వామి-కొండపి
జనసేన: రాపాక వరప్రసాద్‌-రాజోలు

గిరిజన ఎమ్మెల్యేలు- మొత్తం వైసీపీనే...
వైసీపీ-7, టీడీపీ-0
గత ఎన్నికల మాదిరే 2019 ఎన్నికలలో కూడా వైఎస్‌ ఆర్‌  కాంగ్రెస్‌ గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గాలను స్వీప్‌ చేసింది.కిందటిసారి టీడీపీకి ఒక స్థానం రాగా, ఈసారి అధికూడా దక్కలేదు.మొత్తం ఏడు నియోజకవర్గాలు  వైసీపీకే వచ్చాయి.

ఎస్‌.టి.ఎమ్మెల్యేల వివరాలు (అంతా వైసీపీనే)

  • విశ్వాసరాయ కళావతి- పాలకొండ,
  • పాముల పుష్పశ్రీవాణి-కురుపాం,
  • చీడిక రాజన్నదొర-సాలూరు,
  • చెట్టి ఫల్గుణ-అరకు,
  • కొట్టుగుళ్లి భాగ్య లక్ష్మి-పాడేరు,
  • నాగుల పల్లి ధనలక్ష్మి-రంపచోడవరం,
  • తెల్లం బాలరాజు-పోలవరం.

ముస్లింలు-4 అంతా వైసీపీనే..
ముస్లిం వర్గాలకు చెందిన వారు నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే వారంతా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ నుంచే గెలుపొందారు. వారిలో ఒకరు అంజాద్‌ భాషా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లావారు అయినా, అదే జిల్లాకు చెందిన భాషా కూడా ఉప ముఖ్యమంత్రి అవడం విశేషం. ఇది అరుదైన విషయమే. హిందూపూర్‌ నుంచి పోటీచేసిన మహ్మద్‌ ఇక్బాల్‌ మాత్రమే ఓడి పోియారు. ఆయనకు ఎమ్మెల్పీ పదవినీ జగన్‌ ఇచ్చారు.

  • ముస్తాఫా-గుంటూరు తూర్పు,
  • అంజాద్‌ భాషా-కడప,
  • హఫీజ్‌ ఖాన్‌ -కర్నూలు,
  • నవాజ్‌ భాషా-మదనపల్లె.

ఇతర వర్గాలు..11- వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ -9, టీడీపీ-2

  • క్షత్రియ-4: వైసీపీ-3, టీడీపీ-1
  • వైశ్య-4: వైసీపీ-3, టీడీపీ -1
  • బ్రాహ్మణ-2: వైసీపీ-2
  • వెలమ-1: వైసీపీ-1

క్షత్రియులలో నలుగురు ఎమ్మెల్యేలు కాగా వారిలో ఒకరు మాత్రమే టీడీపీ వారు. ఆచంట నుంచి గెలుపొందిన శ్రీరంగనాదరాజు మంత్రి కూడా ఆయ్యారు.

  • రమణమూర్తిరాజు-యలమంచిలి,
  • ముదునూరి ప్రసాదరాజు-నరసాపురం,
  • శ్రీరంగనాదరాజు-ఆచంట.
  • మంతెన రామరాజు-ఉండి

వైశ్యులు నలుగురు ఎన్నిక కాగా ముగ్గురు వైసీపీవారు. వీరిలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ మంత్రి అయ్యారు.2014 లో ఈ వర్గం నుంచి ఒక్కరు కూడా వైసీపీ పక్షాన నెగ్గలేదు.కాని ఈసారి ముగ్గురు గెలిచారు.

  • కోలగట్ల వీరభద్రస్వామి-విజయనగరం,
  • వెల్లంపల్లి శ్రీనివాస్‌-విజయవాడ పశ్చిమ,
  • అన్నా రాంబాబు-గిద్దలూరు.
  • మద్దాల గిరి-గుంటూరు పశ్చిమ

బ్రాహ్మణ- ఇద్దరు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. రఘుపతి 2014 లో కూడా గెలిచారు. గత రెండుసార్లుగా టీడీపీ నుంచి ఒక్క బ్రాహ్మణ నేత కూడా ఎన్నిక కాలేదు.

  • మల్లాది విష్ణు-విజయవాడ సెంట్రల్‌,
  • కోన రఘుపతి-బాపట్ల.

వెలమ-1-వైసీపీ
వెలమ సామాజికవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఎన్నిక కాగా ఆయన వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. నూజివీడు నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు మరోసారి గెలిచారు.

  • వెలమ-1-వైసీపీ- మేకా ప్రతాప అప్పారావు-నూజివీడు.


    – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement