2004 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ | 2004 Andhra Pradesh Caste Equations | Sakshi
Sakshi News home page

2004 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ

Published Fri, Mar 8 2024 6:46 PM | Last Updated on Sat, Mar 9 2024 1:59 PM

2004 Andhra Pradesh Caste Equations - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. విబజిత ఏపీలో  కాంగ్రెస్‌ కు 139 స్థానాలలో విజయం సిద్దించగా, తెలుగుదేశంపార్టీకి ముప్పైఏడు స్థానాలే దక్కాయి. బిజెపికి ఒకటి, సీపీఐకి రెండు, సీపీఎం కు మూడు, నలుగురు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు.అప్పట్లో ఏపీలోని ఆంద్ర, రాయలసీమలలో కలిపి 187 నియోజకవర్గాలు ఉండేవి. సామా జికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 49 మంది, కమ్మ 32 మంది, కాపు, తెలగ, బలిజ వర్గాలకు చెందినవారు 23 మంది, బీసీలు ముప్పై నాలుగు మంది ఎస్సీ లు 22 మంది, ఎస్టీలు ఎనిమిది మంది గెలిచారు. క్షత్రియలు ఏడుగురు, ముస్లింలు నలుగురు, వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణ ఒకరు, క్రిస్టియన్‌ ఒకరు, అగర్వాల్‌ ఒకరు గెలుపొందారు.

        
బీసీ వర్గాల విశ్లేషణ

  • తూర్పు కాపు-7
  • యాదవ- 5
  • కొప్పుల వెలమ-4
  • శెట్టి బలిజ-4, పొలినాటి వెలమ-3,పద్మశాలి-3, కాళింగ-2,గవర-1,రెడ్డిక-1,మత్సకార-1, వడ్డీ-1, బోయ-1, గౌడ-1(మొత్తం పదమూడు బీసీ కులాల నుంచి ముప్పైనాలుగు మంది ఎన్నికయ్యారు)

2004-రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు
ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్‌ కు అదికారంలోకి రాగా,అత్యధిక సంఖ్యలో 49 మంది రెడ్డినేతలు శాసనసభకు ఎన్నికయ్యారు.వీరిలో కాంగ్రెస్‌ పక్షాన నలభై నాలుగు మంది,టీడీపీ తరుపున నలుగురు, ఇండిపెండెంటు ఒకరు ఎన్నిక య్యారు. వీరిలో ఇరవై మంది కోస్తా జిల్లాల నుంచి ఇరవై మంది ఎన్నిక కాగా, మిగిలిన ఇరవైనాలుగు మంది రాయలసీమ నుంచి గెలుపొందారు.టీడీపీ తరపున కేవలం నలుగురే గెలుపొందారు.గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మంది రెడ్లు టీడీపీ తరపున గెలవలేదు.

కాంగ్రెస్‌  రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు.. 44

  • టి.రామారెడ్డి-అనపర్తి
  • చిర్ల జగ్గారెడ్డి-కొత్తపేట
  • బుల్లబ్బాయిరెడ్డి-సంపర
  • గాదె వెంకటరెడ్డి-బాపట్ల
  • గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల
  • కాసు కృష్ణారెడ్డి-నరసరావుపేట
  • వై.వెంకటేశ్వరరెడ్డి-సత్తెనపల్లి
  • పీ.లక్ష్మారెడ్డి-మాచర్ల
  • వి.శ్రీనివాసులురెడ్డి-కంభం
  • బి.శ్రీనివాసరెడ్డి-ఒంగోలు, బి.మహీధర్‌ రెడ్డి-కందుకూరు, కే.పెదకొండారెడ్డి-మార్కాపురం, మాగుంట పార్వతమ్మ-కావలి, పీ.శ్రీనివాసులురెడ్డి-కోవూరు, ఎ.వివేకానందరెడ్డి-నెల్లూరు, ఎ.రామ నారాయణరెడ్డి-రాపూర, ఎ.ప్రభాకరరెడ్డి-సర్వేపల్లి, కే.విష్ణువర్ధనరెడ్డి-అల్లూరు, ఎన్‌.రాజ్యలక్ష్మి-వెంకటగిరి, ఎమ్‌.చంద్రశేఖరరెడ్డి-ఉదయగిరి, డి.సి. గోవిందరెడ్డి-బద్వేల్‌, కే.ప్రభావతమ్మ-రాజంపేట, జి.మోహన్‌ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి-పులివెందుల, సి.ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు, ఎన్‌.వరదరాజులరెడ్డి-ప్రొద్దుటూరు, డాక్టర్‌ డి.ఎల్‌.రవీంద్రరెడ్డి-మైదుకూరు, జి.ప్రతాపరెడ్డి-ఆళ్లగడ్డ, ఇ.ప్రతాపరెడ్డి-ఆత్మకూరు, గౌరు చరిత-నందికోట్కూరు, కే.రాంభూపాల్‌ రెడ్డి-పాణ్యం, ఎస్‌.మోహన్‌ రెడ్డి-నంద్యాల, చల్లా రామకృష్ణారెడ్డి-కోయిలకుంట్ల, కోట్ల సుజాత-డోన్‌, కే.చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు, వై.సాయి ప్రసాదరెడ్డి-ఆదోని, బి.నారాయణరెడ్డి-అనంతపురం, డాక్టర్‌ కే.మోహన్‌ రెడ్డి-నల్లమడ, జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి, పీ.రవీంద్రరెడ్డి-గోరంట్ల, కే.ప్రభాకరరెడ్డి-తంబళ్లపల్లె, పీ.రామచంద్రారెడ్డి-పీలేరు, ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి-వాయల్పాడు

44.ఆర్‌.చెంగారెడ్డి-నగరి. 
రెడ్డి ఎమ్మెల్యేలు- తెలుగుదేశం-4

  • జి.వీరశివారెడ్డి-కమలాపురం
  • ఎస్‌.వి.సుబ్బారెడ్డి-పత్తికొండ
  • బి.గోవిందరెడ్డి-రాయదుర్గం
  • ఎన్‌.అమరనాధ్‌ రెడ్డి-పుంగనూరు 

ఇండిపెండెంట్‌ రెడ్డి ఎమ్మెల్యే -1
బి.సుబ్బారెడ్డి-దర్శి

కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు- 2004 
2004లో కాంగ్రెస్‌ తరపున  కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికవడం విశేషం. మొత్తం 32 మంది ఎన్నిక కాగా, వారిలో కాంగ్రెస్‌ తరపున 21 మంది, టీడీపీ పక్షాన పది  మంది ఉండగా, ఒక కమ్మ నేత ఇండిపెండెంటుగా కూడా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్‌ కమ్మ ఎమ్మెల్యేల వివరాలు-21
  తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ కు కమ్మ సామాజికవర్గం నుంచి ఇంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం ఇదే అని చెప్పాలి.మొత్తం 32 మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందగా,వారిలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్‌ నుంచి పది మంది టీడీపీ నుంచి గెలవగా, ఒకరు ఇండిపెండెంటుగా గెలిచారు.వీరిలో పద్దెనిమిది మంది కోస్తా జిల్లాల నుంచి కాగా, ముగ్గురు రాయలసీమ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన పది మంది లోఐదుగురు కోస్తా జిల్లాల నుంచి , ఐదుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు

  • బి.కృస్ణార్జున చౌదరి-ఆలమూరు
  • సిహెచ్‌ రవీంద్ర-బూరుగుపూడి
  • చిట్టూరి బాపినీడు-తణుకు
  • మాగంటి వెంకటేశ్వరరావు-దెందులూరు, ఘంటా మురళరామకృష్ణ-చింతలపూడి, వై.రాజారామచందర్‌- కైకలూరు, పిన్నమనేని వెంకటేశ్వరరావు- ముదినేపల్లి, దేవినేని రాజశేఖర్‌-కంకిపాడు, చనుమోలు వెంకటరావు-మైలవరం, డి.మల్లిఖార్జునరావు-రేపల్లె, నాదెండ్ల మనోహర్‌-తెనాలి, రావి వెంకటరమణ-పత్తిపాడు, మర్రి రాజశేఖర్‌- (కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌), ఎమ్‌.మల్లిఖార్జునరావు-వినుకొండ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు, గొట్టిపాటి రవికుమార్‌-మార్టూరు, పోతుల రామారావు-కండపి, ఐ.తిరుపతి నాయుడు-కనిగిరి, గల్లా అరుణకుమారి-చంద్రగిరి, ఎస్‌.సి.వి.నాయుడు-శ్రీకాళహస్తి, జి.ముద్దుకృష్ణమనాయుడు- పుత్తూరు.

తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు..10

  • పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు
  • కొడాలి వెంకటేశ్వరరావు-గుడివాడ
  • డి. ఉమా మహేశ్వరరావు-నందిగామ
  • డి.నరేంద్ర కుమార్‌-పొన్నూరు
  • కరణం బలరాం-అద్దంకి
  • పీ.కేశవ్‌-ఉరవకొండ
  • పరిటాల రవీంద్ర-పెనుకొండ
  • జి.జయలక్ష్మమ్య-ధర్మవరం
  • డి.రమేష్‌-మదనపల్లె
  • చంద్రబాబు నాయుడు -కుప్పం.

ఇండిపెండెంట్‌-1

  • కే.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు

కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు.. 23
  కాపు సామాజకవర్గం ఎమ్మెల్యేలు 2004 లో ఇరవై మూడు మంది ఎన్నికైతే వారిలో పదహారు మంది కాంగ్రెస్‌ నుంచి, ఆరుగురు టీడీపీ నుంచి, ఒకరు బిజెపి పక్షాన ఎన్నికయ్యారు.కాంగ్రెస్‌ పక్షాన గెలిచినవారిలో కోస్తా జిల్లాల నుంచి పదహేను మంది , రాయలసీమ నుంచి ఒకరు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురిలో నలుగురు కోస్తా జిల్లాల వారు కాగా, ఇద్దరు రాయలసీమ వారు.

కాంగ్రెస్‌ కాపు,బలిజ ఎమ్మెల్యేలు-16

  • కరణం ధర్మశ్రీ-మాడుగుల
  • తోట గోపాలకృష్ణ-పెద్దాపురం
  • జక్కంపూడి రామ్మోహన్‌ రావు-కడియం
  • తోట నరసింహం-జగ్గంపేట
  • గ్రంది శ్రీనివాస-భీమవరం
  • కే.సత్యనారాయణ-తాడేపల్లిగూడెం
  • వట్టి వసంతకుమార్‌-ఉంగుటూరు
  • ఎ.కే.శ్రీనివాస్‌-ఏలూరు
  • బి.వేదవ్యాస్‌-మల్లేశ్వరం
  • పేర్ని నాని-మచిలీపట్నం
  • మండలి బుద్ద ప్రసాద్‌-అవనిగడ్డ
  • వంగవీటి రాదాకృష్ణ-విజయవాడ
  • సామినేని ఉదయభాను-జగ్గయ్యపేట
  • కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు
  • పగడాల రామయ్య-గిద్దలూరు (బలిజ)
  • ఎమ్‌.వెంకటరమణ-తిరుపతి.(బలిజ)

తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-6

  • గంటా శ్రీనివాసరావు-చోడవరం
  • పర్వత సత్యనారాయణమూర్తి-ప్రత్తిపాడు
  • సి.హెచ్‌. సత్యనారాయణమూర్తి-పాలకొల్లు
  • కే.సుబ్బారాయుడు-నరసాపురం
  • ఎస్‌.పాలకొండ్రాయుడు-రాయచోటి
  • ఎ.ఎస్‌.మనోహర్‌-చిత్తూరు (బలిజ).

బారతీయ జనతా పార్టీ

  • 1. పీ.దొరబాబు-పిఠాపురం

వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్యేలు(బీసీ)-34
 ఏపీలో 2004 లో ముప్పై నాలుగు మంది బీసీ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో కాంగ్రెస్‌ పక్షాన గెలిచినవారు ఇరవై రెండు మంది కాగా, టీడీపీ తరపున పది  మంది నెగ్గారు. ఇద్దరు ఇండిపెండెంట్లుగా విజయం సాదించారు.

ఆయా కులాల వారీగా పరిశీలిస్తే  కాళింగ ఇద్దరు( కాంగ్రెస్‌) పొలినాటి వెలమ ముగ్గురు, కొప్పుల వెలమ నలుగురు కలిపి ఏడుగురు( నలుగురు కాంగ్రెస్‌ ,ముగ్గురు టీడీపీ), తూర్పుకాపులు ఏడుగురు( ముగ్గురు కాంగ్రెస్‌ ,నలుగురు టీడీపీ), గవర ఒకరు (కాంగ్రెస్‌), రెడ్డిక ఒకరు (కాంగ్రెస్‌), శెట్టిబలిజలు నలుగురు (ముగ్గురు కాంగ్రెస్‌, ఒకరు ఇండిపెండెంట్‌), యాదవ  ఐదుగురు( ముగ్గురు కాంగ్రెస్‌, ఒకరు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్‌), బోయ ఇద్దరు( ఒకరు కాంగ్రెస్‌, ఒకరు టీడీపీ), పద్మశాలి ముగ్గురు( ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు టీడీపీ), మత్స్యకార, వడ్డీ ఒక్కొక్కరు(కాంగ్రెస్‌) గౌడ ఒకరు(టీడీపీ) ఎన్నికయ్యారు.

కాంగ్రెస్‌ బీసీ ఎమ్మెల్యేలు.. 22

  • అప్పయ్యదొర-టెక్కలి-కాళింగ
  • డి.ఫ్రసాదరావు-శ్రీకాకుళం-పొలినాటి వెలమ
  • బోడ్డేపల్లి సత్యవతి-ఆముదాలవలస-కాళింగ
  • డి.కృష్ణదాస్‌-నరసన్నపేట-పొలినాటి వెలమ
  • బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి-తూర్పు కాపు
  • పీ.మంగపతిరావు-ఉత్తరాపల్లి- కొప్పుల వెలమ, కే.సీతారామ్‌-భీమిలి-తూర్పుకాపు, గండి బాబ్జి-కొప్పుల వెలమ, కొణతాల రామకృష్ణ-గవర, పీ. గురుమూర్తి రెడ్డి-పెందుర్తి-రెడ్డి, డి.వెంకటేశ్వర్లు-తాళ్లరేవు-శెట్టి బలిజ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌-రామచంద్రపురం-శెట్టి బలిజ, రౌతు సూర్యప్రకాష్‌ రావు-రాజమండ్రి-తూర్పుకాపు, పితాని సత్యనారాయణ-ఆచంట-శెట్టి బలిజ, కే.పార్దసారధి- ఉయ్యూరు-యాదవ, ఎమ్‌.హనుమంతరావు-మంగళగిరి-పద్మశాలి, మోపిదేవి వెంకటరమణ-కూచినపూడి-మత్స్యకార, టి.వెంకట్రావు-గుంటూరు-2-వడ్డీ, జె.కృష్ణమూర్తి-గురజాల-యాదవ, ఎన్‌.నీలావతి-గుత్తి-బోయ, ఎన్‌.రఘువీరారెడ్డి -మడకశిర-యాదవ, జొన్నా రామయ్య-కదిరి-పద్మశాలి.

తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 10

  • గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ
  • కే.మోహన్‌ రావు-పాతపట్నం-తూర్పుకాపు
  • కే.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పొలినాటి వెలమ
  • కే.కళావెంకట్రావు- ఉణుకూరు-తూర్పుకాపు
  • తెంటు జయప్రకాష్‌-తెర్లాం-కొప్పుల వెలమ
  • పడాల అరుణ- గజపతినగరం-తూర్పుకాపు
  • పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు
  • సి.హెచ్‌. అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కొప్పుల వెలమ
  • యనమల రామకృష్ణుడు-తుని-యాదవ
  • పీ.రంగనాయకులు -హిందూపూర్‌-పద్మశాలి.

ఇండిపెండెంట్లు.. 2

  • కుడిపూడి చిట్టబ్బాయి-అమలాపురం-శెట్టిబలిజ
  • ఎమ్‌.వెంకటేశ్వరరావు-గన్నవరం-యాదవ.

2004 ఎస్‌.సి ఎమ్మెల్యేల వివరాలు
ఈ ఎన్నికలలో పదహారు  మంది కాంగ్రెస్‌ తరపున,ఐదుమంది టీడీపీ పక్షాన, ఒకరు సీపీఎం తరపున గెలిచారు.వారి వివరాలు..

కాంగ్రెస్‌ ఎస్‌.సి ఎమ్మెల్యేలు.. 16

  • కే. మురళీమోహన్‌-ఎచ్చెర్ల
  • పీ. విశ్వరూప్‌-అమలాపురం
  • పీ. రాజేశ్వరదేవి-నగరం
  • జి.సూర్యారావు-అల్లవరం, మద్దాల సునీత-గోపాలపురం, కోనేరు రంగారావు -తిరువూరు, డి.మాణిక్‌ వర ప్రసాద్‌-తాడికొండ, దారా సాంబయ్య-సంతనూతలపాడు, పీ.ప్రకాశ్‌ రావు-గూడూరు, ఎన్‌.సుబ్రహ్మణ్యం-సూళ్లూరుపేట, జి.వెంకటేశ్వర ప్రసాద్‌-కోడూరు, పీ.మురళికృష్ణ-కొడుమూరు, ఎమ్‌.మారెప్ప-ఆలూరు, ఎస్‌.శైలజానాద్‌-శింగనమల, కే.నారాయణస్వామి-సత్యవేడు, జి.కుతూహలమ్మ-వేపంజేరి.

టీడీపీ ఎస్‌.సి. ఎమ్మెల్యేలు-5

  • కే.జోగులు-పాలకొండ
  • చెంగల వెంకట్రావు-పాయకరావుపేట
  • పీ.సుజాత-ఆచంట
  • ఎల్‌.లలిత కుమారి-పలమనేరు
  • బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం

సీపీఎం..1
పాటూరు రామయ్య-నిడుమోలు
2004 - షెడ్యూల్‌ జాతుల ఎమ్మెల్యేలు-8
ఎస్టీవర్గాలకు చెందినవారు కాంగ్రెస్‌ పక్షాన నలుగురు, టీడీపీ తరపున ఇద్దరు, ఒకరు సీపీఐ,ఒకరు సీపీఎం పక్షాన గెలిచారు.
వారి వివరాలు.
కాంగ్రెస్‌

  • జన్నిమినతి గోమాంగో-కొత్తూరు
  • కుంభా రవి-ఎస్‌.కోట
  • పీ.బాలరాజు-పాడేరు
  • టి.బాలరాజు- పోలవరం.

రాజన్నదొర-సాలూరు (2007 లో కోర్టు ద్వారా ఎన్నికయ్యారు)
తెలుగుదేశం

  • ఆర్‌.భంజ్‌ దేవ్‌-సాలూరు (2007లో ఈయన గిరిజనుడు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది).
  • సి.రమేష్‌-ఎల్లవరం

ఇతరులు..

  • కే.లక్ష్మణమూర్తి- నాగూరు-సీపీఎం
  • సి.దేముడు-చింతపల్లి-సీపీఐ

క్షత్రియ ఎమ్మెల్యేలు-7
క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు ఏడుగురు ఎన్నిక కాగా, అంతా కాంగ్రెస్‌ కు చెందినవారే కావడం విశేషం. వారి వివరాలు..

  • ఎస్‌.విజయరామరాజు-పార్వతీపురం
  • పీ.సాంబశివరాజు-సతివాడ
  • ఎస్‌. రంగరాజు-విశాఖ-రెండు
  • యువి రమణమూర్తి రాజు-యలమంచిలి
  • ఎ. కృష్ణంరాజు-రాజోలు
  • సి.రంగనాదరాజు-అత్తిలి
  • పీ.సర్రాజు-ఉండి.

ముస్లింలు-4
నలుగురు ముస్లింలు ఎన్నిక కాగా, ఇద్దరు  కాంగ్రెస్‌, ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం పక్షాన గెలుపొందారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం లు కూటమిగా పోటీచేశాయి.

  • షేక్‌ నాజర్‌ వలి-విజయవాడ-ఒన్‌-సీపీఐ
  • షేక్‌ సుబాని-గుంటూరు -ఒన్‌-కాంగ్రెస్‌
  • అహ్మదుల్లా-కడప-కాంగ్రెస్‌
  • ఎమ్‌.ఎ.గపూర్‌- కర్నూలు- సీపీఎం

ఇతర సామాజికవర్గాలలో వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణులు ఒకరు, అగర్వాల ఒకరు ఉన్నారు.ఒక క్రిస్టియన్‌ కూడా ఉన్నారు. వారి వివరాలు. ఒక్కరు తప్ప వీరందరూ కాంగ్రెస్‌ పక్షానే ఎన్నికయ్యారు. ఒకరు మాత్రం ఇండిపెండెంట్‌ గా నెగ్గారు. ద్రోణం రాజు సత్యనారాయణ మరణించడంతో జరిగిన ఉప  ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్దిగా ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌ గెలిచారు.
వైశ్య-3 (ఇద్దరు కాంగ్రెస్‌ -ఒకరు ఇండి)

  • వీరభద్రస్వామి- విజయనగరం-వైశ్య- ఇండి
  • ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ-వైశ్య-కాంగ్రెస్‌
  • కొణిజేటి రోశయ్య-చీరాల- వైశ్య-కాంగ్రెస్‌.

వెలమ-2(ఇద్దరు కాంగ్రెస్‌)

  • సుజయ కృష్ణ రంగారావు- బొబ్బిలి-వెలమ-కాంగ్రెస్‌
  • ఎమ్‌.వి. ప్రతాప అప్పారావు- నూజివీడు- వెలమ- కాంగ్రెస్‌

బ్రాహ్మణ-1(కాంగ్రెస్‌)
ద్రోణంరాజు సత్యనారాయణ-విశాఖ-1-బ్రాహ్మణ-కాంగ్రెస్‌,

ఉప ఎన్నిక
విశాఖ-1- ద్రోణం రాజు శ్రీనివాస్‌


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement