1982లో ప్రఖ్యాత నటుడుగా ఉన్న ఎన్‌టీ. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 ఎన్నికలలో ఘన విజయం సాదించారు. అంతవరకు అదికారంలో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో టీడీపీకి, కోస్తా, రాయలసీమలలో 160 సీట్లు రావడం ఒక రికార్డుగా భావించాలి. ఈ ఎన్నికల నుంచి రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఆరంభమైంది ఈ ఎన్నికలలోనే. కాంగ్రెస్-ఐకి పదిహేడుసీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి ఒకటి, ఇండిపెండెంట్లు తొమ్మిది మంది గెలిచారు. (వీరిలో ఒకరు ఐసిజె పార్టీ తరపున గెలిచారు) సామాజిక వర్గాల విశ్లేషణను పరిశీలిస్తే కమ్మ సామాజికవర్గానికి చెందినవారు నలభై నాలుగు మంది ఎన్నికయ్యారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి నలభైఒక్క మంది ఎన్నిక కాగా, కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు నెగ్గారు.
రెడ్డి సామాజికవర్గం నుంచి నలభై మూడు మంది ఎన్నిక కాగా, వారిలో టీడీపీ పక్షాన ముప్పై ఒక్క మంది, కాంగ్రెస్ తరుపున ఏడుగురు, ఇండిపెండెంట్లుగా ఐదుగురు గెలిచారు. కాపు వర్గం నుంచి పదిహేను మంది గెలవగా, వారిలో పదమూడు మంది టీడీపీ వారే. కాంగ్రెస్ నుంచి ఒకరు ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. బీసీలు ముప్పై ఇద్దరు విజయం సాదించగా, వారిలో ఇరవైతొమ్మిది మంది టీడీపీ నుంచి ముగ్గురు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఎస్సీలలో 22 మందికి గాను 21 మంది టీడీపీ, ఒకరు కాంగ్రెస్ వారు. ఎస్టీలలో ఆరుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. క్షత్రియులు పద్నాలుగు మంది ఎన్నిక కాగా, పన్నెండు మంది టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్ వారు. ఇతర సామాజికవర్గాలలో ఏడుగురు టీడీపీ నుంచి ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలిచారు. వీరిలో వైశ్యులు ముగ్గురు, ఒక అగర్వాల్, ముస్లింలు ఇద్దరు, ఒక క్రిస్టియన్ గెలిచారు. వీరంతా టీడీపీ పక్షానే విజయం సాదించారు. ఇద్దరు వెలమ నేతలు ఇండిపెండెంట్లుగా గెలిచారు.
కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు...44
ఎన్‌టీఆర్.రాజకీయ పార్టీని పెట్టడం, ఆయన కమ్మ సామాజికవర్గం వారు కావడంతో ఈ వర్గం అంతా టీడీపీకి బాగా అండగా నిలిచంది.అన్ని వర్గాల వారి మద్దతు లభించినా, వీరు అధికంగా ఓన్ చేసుకున్నారు. అంతేకాక గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా టిక్కెట్లు పొందారు. నలభై మూడు మంది గెలవగా,వారిలో నలభై మంది టీడీపీవారే అయ్యారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాగా బీజేపీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ఒక ఇండిపెండెంట్ నెగ్గగా, ముప్పై ఒక్కరు కోస్తా నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్‌గా గెలిచినవారు కూడా కోస్తావారే. తొమ్మిది మంది రాయలసీమకు చెందినవారు .తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టీ.రామారావు రెండుచోట్ల నుంచి గుడివాడ, తిరుపతిల నుంచి గెలుపొందారు.
టీడీపీ కమ్మ ఎమ్మెల్యేలు-41
- ఎమ్.వి.కృష్ణారావు-ఇచ్చాపురం
- బలుసు రామారావు-పెద్దాపురం
- వి.నారాయణ మూర్తి-ఆలమూరు
- పీ.సాంబశివరావు-బూరుగుపూడి
- జీ.బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి
- పీవి.కృష్ణారావు-కొవ్వూరు
- చిట్టూరి వెంకటేశ్వరరావు-తణుకు
- కే.శ్రీని వాసరావు- ఉంగుటూరు, గారపాటి సాంబశివరావు-దెందులూరు, ముసునూరు రత్నబోస్-గన్నవరం, నందమూరి తారక రామారావు- గుడివాడ, దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)-కంకిపాడు, అడుసుమిల్లి జయప్రకాష్-విజయవాడ తూర్పు, ఎన్.సత్యనారాయణ-మలవరం, వసంత నాగేశ్వరరావు-నందిగామ, అక్కినేని లోకే శ్వరరావు-జగ్గయ్యపేట, ఎమ్.ఎస్.ఎస్.కోటేశ్వరరావు- మంగగిరి, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి-పొన్నూరు, నాదెండ్ల భాస్కరరావు-వేమూరు, యడ్ల వెంకటరావు-రేపల్లె, అన్నాబత్తుని సత్యనారాయణ-తెనాలి, మాకినేని పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కాజ కృష్ణమూర్తి-చిలకలూరిపేట, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, నన్నపనేని రాజకుమారి-సత్తెనపల్లి, కే.సుబ్బారావు-మాచర్ల, కాటూరి నారాయణస్వామి-దర్శి, దగ్గుబాటి చౌదరి-పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, గొట్టిపాటి హనుమంతరావు-మార్టూరు, పీ.కోటేశ్వరరావు-ఒంగోలు, పీ.వెంగళరావు-కావలి, వి.రాంభూపాల్ చౌదరి, డీ.నారాయణస్వామి-అనంతపురం, వేలూరి కేశన్న-గోరంట్ల, ఆర్.నారాయణరెడ్డి-మదనపల్లె, ఎమ్.వెంకట్రామనాయుడు-చంద్రగిరి, ఎన్‌టీ.రామారావు-తిరుపతి, ఝాన్సీలక్ష్మి-చిత్తూరు, గాలి ముద్దుకృష్ణమనాయుడు-పుత్తూరు, ఎన్.రంగస్వామి నాయుడు-కుప్పం.
కాంగ్రెస్ -1
పిన్నమనేని కోటేశ్వరరావు-ముదినేపల్లి.
బీజేపీ-1
ముప్పవరపు వెంకయ్య నాయుడు-ఉదయగిరి
ఇండి-1
గంగినేని వెంకటేశ్వరరావు-వినుకొండ
1983- రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు-43
ఈ ఎన్నికలలో రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు కూడా నలభై మూడు మంది ఎన్నికయ్యారు. వారిలో ముప్పై ఒక్క మంది టీడీపీ పక్షాన కాగా ఏడుగురు కాంగ్రెస్ నుంచి గెలిచారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఒకరు ఐసిజె అనేపార్టీ నుంచి గెలిచారు.టీడీపీ నుంచి ఎన్నికైనవారిలోపద్నాలుగు మంది కోస్తా జిల్లాల నుంచి గెలుపొందగా, పదిహేడు మంది రాయలసీమ నుంచి గెలిచారు.కాంగ్రెస్ లో గెలిచినవారిలో ఒకరు కోస్తా,ఆరుగురు రాయలసీమవారు.ఇతరులలో కూడా ఒకరు మాత్రం కోస్తావారు. మిగిలిన నలుగురు రాయలసీమ నుంచే గెలిచారు.
తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-31
- ఎన్.మూలారెడ్డి-అనపర్తి
- సీ.సోమసుందరరెడ్డి-కొత్తపేట
- వి.శివరామకృష్ణారెడ్డి-దుగ్గిరాల
- జూలకంటి నాగిరెడ్డి-గురజాల
- వి.నారాయణరెడ్డి-మార్కాపురం
- ఎమ్.పిరారెడ్డి-గిద్దలూరు
- ముక్కు కాశిరెడ్డి-కనిగిరి
- ఆనం వెంకటరెడ్డి-ఆత్మకూరు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి-కోవూరు, ఆనం రామనారాయణరెడ్డి-నెల్లూరు, ఎమ్.ఆదినారాయణరెడ్డి-రాపూరు, పెంచల్ రెడ్డి చెన్నారెడ్డి-సర్వేపల్లి, బెజవాడ పాపిరెడ్డి-అల్లూరు, నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి-వెంకటగిరి, ఎస్.రామమునిరెడ్డి-కడప, ఆర్.రాజగోపాలరెడ్డి-లక్కిరెడ్డిపల్లి, వి.వెంకటరెడ్డి-కమలాపురం, పీ.శివారెడ్డి-జమ్మలమడుగు, ఎమ్.వి.రమణారెడ్డి-ప్రొద్దుటూరు, ఎస్.వి.సుబ్బారెడ్డి-ఆళ్లగడ్డ, బి.వెంగళరెడ్డి-ఆత్మకూరు, సీ.రామకృష్ణారెడ్డి-పాణ్యం, సంజీవరెడ్డి-నంద్యాల, బి.నరసింహారెడ్డి-కోయిలకుంట్ల, వై.బి.రెడ్డి-ఉరవకొండ, ఎమ్.కేశవరెడ్డి-తాడిపత్రి, కే.రామచంద్రారెడ్డి-నల్లమడ,జీ.నాగిరెడ్డి-ధర్మవరం, సీ.ప్రభాకరరెడ్డి-పీలేరు, చింతల సురేంద్రరెడ్డి-వాయల్పాడు,ఎ.దశరదరామిరెడ్డి-శ్రీకాళహస్తి.
కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు-7
కే.నాగార్జునరెడ్డి-కంభం, కే.ప్రభావతమ్మ-రాజంపేట, వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల,డీ.ఎల్.రవీంద్ర రెడ్డి-మైదుకూరు, ఎమ్.తిమ్మారెడ్డి-ప్రత్తికొండ, కోట్ల విజయభాస్కరరెడ్డి-ఎమ్మిగనూరు, వై.సీ.తిమ్మారెడ్డి-మడకశిర
ఇతరులు..ఇండి-4,ఐసిజె-1
- ఎమ్.ఆదినారాయణరెడ్డి-కందుకూరు
- బిజివేముల వీరారెడ్డి-బద్వేల్-ఐసిజె
- బి.శేషశయనరెడ్డి-నందికోట్కూరు
- పీ.వేణుగోపాలరెడ్డి-రాయదుర్గం
- టీ.ఎస్. శ్రీనివాసరెడ్డి-తంబళ్లపల్లె
కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు..15
కాపు సామాజికవర్గం నుంచి పదిహేను మంది గెలుపొందగా వారిలో పదమూడు మంది టీడీపీవారే.వీరంతా కోస్తా ప్రాంతం వారే. కాంగ్రెస నుంచి గెలిచిన ఒకరు కూడా కాంగ్రెస్ కాగా,ఇండిపెండెంట్ గా నెగ్గిన ఒకరు మాత్రం రాయలసీమ వారు.
తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-13
- ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు
- వి.నాగేశ్వరరావు-పిఠాపురం
- చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు
- మెట్ల సత్యనారాయణరావు-అమలాపురం
- జీ. వెంకటస్వామి నాయుడు-కడియం
- తోట సుబ్బారావు-జగ్గంపేట
- పీ.మణెమ్మ-పెను గొండ
- ఎవి సత్యనారాయణ-పాలకొల్లు
- చేగొండి హరిరామజోగయ్య-నరసాపురం
- ఈలి ఆంజనేయులు-తాడేపల్లిగూడెం
- సీహెచ్.రంగారావు-ఏలూరు
- ఎ.విశ్వేశ్వ రరావు-పెదకూరపాడు
- నిశ్శంకరరావు వెంకటరత్నం-గుంటూరు-2
కాంగ్రెస్ -1
మండలి వెంకట కృష్ణారావు-అవనిగడ్డ.
ఇండి-1
ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటీ.
బీసీ సామాజికవర్గాల ఎమ్మెల్యేలు-32
ఆంద్ర, రాయలసీమలలో కలిపి బీసీ వర్గాల నుంచి 32 మంది ఈ ఎన్నికలలో గెలుపొందగా, వారిలో ఇరవై తొమ్మిది మంది టీడీపీ నుంచే గెలిచారు.వీరిలో ఇరవైఆరుగురు మంది కోస్తా నుంచి కాగా, ముగ్గురు రాయలసీమకు చెందినవారు.కాంగ్రెస్ పక్షాన ముగ్గురు గెలవగా ఇద్దరు కోస్తా, ఒకరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు.బీసీ వర్గాల విశ్లేషణ-కొప్పుల వెలమ-8, యాదవ-6, పొలినాటి వెలమ-5,తూర్పుకాపు-3, గౌడ-3, కాళింగ-2, గవర-1,మత్సకార-1, పద్మశాలి-1, కురుబ-1, గాండ్ల-1.
టీడీపీ బీసీ ఎమ్మెల్యేలు- 29
- ఎ.జనార్దనరావు-టెక్కలి-పోలినాటి వెలమ
- టీడీ నాయుడు-పాతపట్నం-పోలినాటి వెలమ
- తంగి సత్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ
- తమ్మినేని సీతారామ్-ఆముదాలవలస-కాళింగ
- ఎస్.ప్రభాకరరావు-నరసన్నపేట-పీ.వెలమ
- కే.ఎర్ర న్నాయుడు- హరిశ్చంద్రపురం-పీ.వెలమ
- కే.కళా వెంకట్రావు-ఉనుకూరు-తూర్పుకాపు
- ఎమ్.వెంకట్రామనాయుడు-పార్వతిపురం-కే.వెలమ
- ఎస్సీ.వి అప్పల నాయుడు- బొబ్బిలి-కే.వెలమ
- తెంటు జయప్రకాష్-తెర్లాం-కే.వెలమ
- త్రిపురాన వెంకటరత్నం- చీపురుపల్లి-తూర్పుకాపు
- కోళ్ల అప్పలనాయుడు-ఉత్తరాపల్లి- కే.వెలమ, నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు, వాసుదేవరావు-విశాఖ-2-యాదవ, పైలా అప్పలనాయుడు-పరవాడ-కే.వెలమ, జీ.ఎర్రునాయుడు-చోడవరం-కెవెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కే.వెలమ, పీ.అప్పల నరసింహం-పెందుర్తి-గవర, చింతకాయల అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కే.వెలమ, యనమల రామకృష్ణుడు-తుని-యాదవ, టిఎస్‌ఎల్ నాయకర్-సంపర-మత్స్యకార, అంకెం ప్రభాకరరావు-మల్లేశ్వరం-గౌడ, బి.వెంకటస్వామి-మచిలీ పట్నం-యాదవ, ఎమ్.నాగబూషణం-కూచినపూడి-గౌడ, చిమటా సాంబు-చీరాల-యాదవ, ఎమ్.మాలకొండయ్య-కొండపి-యాదవ, పీ.రంగనాయకులు-హిందుపూర్ -పద్మశాలి, ఎస్.రామచంద్రారెడ్డి-పెనుకొండ-కురుబ, బగ్గిడిగోపాల్-పుంగనూరు-గాండ్ల.
కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-3
- మజ్జి నారాయణరావు-సోంపేట-కాళింగ
- కే.పీ.రెడ్డయ్య -ఉయ్యూరు-యాదవ
- కే.ఇ.కృష్ణమూర్తి-డోన్ -గౌడ
1983 -ఎస్.సి ఎమ్మెల్యేలు-22
ఈ ఎన్నికలలో 22 ఎస్.సి నియోజకవర్గాలకు గాను, ఇరవై ఒక్క చోట్ల తెలుగుదేశం విజయం సాధించడం విశేషం.ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ గెలిచింది.
టీడీపీ ఎస్.సి ఎమ్మెల్యేలు-21
- కే.ప్రతిభాభారతి-ఎచ్చెర్ల
- శ్యామారావు-పాలకొండ
- గంటెల సుమన-పాయకరావుపేట
- వి.రాజా సక్కుబాయి-ముమ్మడివరం
- ఉండ్రు కృష్ణారావు-నగరం
- ఎజెబి ఉమామహేశ్వరరావు-అల్లవరం
- కే.భాస్కరరావు-ఆచంట
- కారుపాటి వివేకానంద-గోపాలపురం
- మిర్యాల పూర్ణానంద్-తిరువూరు
- జీ.మల్లి ఖార్జునరావు-నిడుమోలు
- జెఆర్ పుష్పరాజ్-తాడికొండ
- ఆరేటి కోటయ్య-సంతనూతలపాడు
- జోగి మస్తానయ్య-గూడూరు
- ఎస్.ప్రకాశం-సూళ్లూరుపేట
- ఎస్.శ్రీనివాసులు-రైల్వే కోడూరు
- కే.బసప్ప-ఆలూరు
- పీ.గురుమూర్తి-శింగనమల
- టీసీ. మారెప్ప-కళ్యాణ దుర్గం
- టీ.మనోహర్-సత్యవేడు
- టీ.రుద్రయ్య-వేపంజేరి
- ఆంజనేయులు-పలమనేరు.
కాంగ్రెస్ ఎస్.పి ఎమ్మెల్యే-1
దామోదరం మునుస్వామి-కొడుమూరు.
ఎస్టీ.ఎమ్మెల్యేలు-8
గిరిజన శాసనసభ్యులు ఎఇమిది మందికిగాను ఇద్దరు తప్ప మిగిలినవారంతా తెలుగుదేశం నుంచి ఎన్నికైనవారే.
టీడీపీ ఎస్టి ఎమ్మెల్యేలు-6
- నిమ్మక గోపాలరావు-కొత్తూరు,
- బి.రాజయ్య-సాలూరు
- ఎల్ బి దుక్కు-శృంగవరపుకోట
- కే.వెంకటరత్నం-చింతపల్లి
- చిన్నం జోగారావు-ఎల్లవరం
- ముడియం లక్ష్మణరావు-పోలవరం.
కాంగ్రెస్ ఎస్టి ఎమ్మెల్యే-2
- ఎస్.విజయరామరాజు-నాగూరు
- టీ.చిట్టినాయుడు-పాడేరు.
క్షత్రియ సామాజికవర్గం ఎమ్మెల్యేలు-14
క్షత్రియ సామాజికవర్గం నుంచి ఈసారి అత్యధిక సంఖ్యలో పద్నాలుగు మంది శాసనసభకు ఎన్నికయ్యారు.వారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా తెలుగుదేశం పార్టీవారే కావడం విశేషం.
తెలుగుదేశం క్షత్రియ ఎమ్మెల్యేలు-12
- జెఎస్ రాజు-గజపతినగరం
- పూసపాటి అశోక్ గజపతిరాజు-విజయనగరం
- పూసపాటి ఆనంద గజపతిరాజు- భీమిలి
- రాజా కన్నబాబు-అనకాపల్లి
- కెకెవిఎస్ రాజు-యలమంచిలి
- రామచంద్రరాజు-రామచంద్రపురం
- ఎవి సూర్య నారాయణరాజు-రాజోలు
- వి.కనకరాజు-అత్తిలి
- పివి నరసింహరాజు-భీమవరం
- కలిందిండి రామచంద్రరాజు-ఉండి
- సీ.విజయరామరాజు-బాపట్ల
- ఇవి గోపాల రాజు-పుత్తూరు
కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యేలు-2
- పెనుమత్స సాంబశివరాజు-సతివాడ
- కనుమూరి బాపిరాజు-కైకలూరు
వైశ్య-3: ముగ్గురూ తెలుగుదేశం పార్టీకి చెందినవారే.
- గ్రంధి మాదవి-విశాఖపట్నం
- ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ
- పీ.రాజగోపాల్-గుత్తి
మార్వాడి-1(టీడీపీ)
ప్రకాష్ జైన్-ఆదోని-టీడీపీ-మార్వాడి
వెలమ- 2: ఇద్దరూ ఇండిపెండెంట్లు...
- కోటగిరి విధ్యాధరరావు-చింతలపూడి
- కే.హనుమంతరావు-నూజివీడు
ముస్లింలు-2: ఇద్దరూ టీడీపీవారే.
- యుకే. పఠాన్-గుంటూరు
- మహ్మద్ షాకీర్-కదిరి
క్రిస్టియన్ -1:
బిఎస్ జయరాజ్-విజయవాడ- టీడీపీ.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment