1989 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ 1989 Andhra Pradesh Caste Equations | Sakshi
Sakshi News home page

1989 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ

Published Thu, Mar 7 2024 1:27 PM | Last Updated on Sun, Mar 10 2024 7:49 AM

1989 Andhra Pradesh Caste Equations - Sakshi

1989లో కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. అన్ని వర్గాలలో కాంగ్రెస్‌ ఆధిక్యం. ఆంద్ర, రాయలసీమలలో ఉన్న 187 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీకి 124 స్థానాలు రాగా, తెలుగుదేశం పార్టీకి ఏభై ఐదు, సీపీఎంకు ఇద్దరు, ఇండిపెండెంట్లు ఆరుగురు ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 53 మంది ఎన్నిక కాగా వారిలో కాంగ్రెస్‌కు చెందినవారు 44 మంది ఉన్నారు. టీడీపీ నుంచి ఏడుగురు గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. కమ్మ సామాజికవర్గం నుంచి ముప్పైమూడు మంది గెలవగా, వారిలో కాంగ్రెస్‌ నుంచి 19, టీడీపీ పక్షాన 14 మంది ఉన్నారు. కాపు సామాజికవర్గం నుంచి  24 మందికి గాను కాంగ్రెస్‌ తరుపున పదిహేడు, టీడీపీ నుంచి ఆరుగురు, ఒక ఇండిపెండెంట్‌ గెలిచారు.

బీసీలు మొత్తం 30 మంది గెలవగా, కాంగ్రెస్‌ 13, టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. షెడ్యూల్‌ కులాలలో 23 మందికి గాను కాంగ్రెస్‌ పదిహేను, టీడీపీ ఐదుగురు, సీపీఎం ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ గెలిచారు. కాగా ఎస్సీ సీట్లు ఇరవై రెండుసీట్లు ఉండగా, మరొక ఎస్సీ. నేత జనరల్‌ సీటులో నెగ్గారు. ఎస్టీలలో ఎనిమిది మందికి గాను ఐదుగురు కాంగ్రెస్‌, ముగ్గురు టీడీపీ వారు. క్షత్రియలు ఎనిమిది మందికి గాను నలుగురు కాంగ్రెస్‌, నలుగురు టీడీపీకి చెందిన వారు. వైశ్య ఇద్దరు, ముస్లీం ముగ్గురు, బ్రాహ్మణ ఒకరు గెలవగా, వారంతా కాంగ్రెస్‌ వారే. వెలమ నుంచి ఒకరు నెగ్గగా ఆయన టీడీపీ వారు.

1989 ఎన్నికలు- రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు-53
1989లో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. ఆ తరుణంలో ఎపిలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి ఏభై మూడు మంది రెడ్డి నేతలు రికార్డు స్థాయిలో ఎన్నికయ్యారు.వీరిలో కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా నలబై నాలుగు మంది ఎన్నిక కాగా,టీడీపీనుంచి ఏడుగురు, ఇద్దరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు.

కాంగ్రెస్‌ రెడ్డి ఎమ్మెల్యేలు-44
కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ ఎన్నికలలో 44 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలోఇరవై మంది కోస్తా జిల్లాల నుంచి గెలవగా, మిగిలిన ఇరవై నాలుగు మంది రాయలసీమ ప్రాంతం నుంచి గెలుపొందారు.

కాంగ్రెస ఎమ్మెల్యేల వివరాలు..44
టీఎస్‌ఎన్‌ రెడ్డి-విశాఖ-2
టీ.రామారెడ్డి-అనపర్తి
సీ.సోమసుందరరెడ్డి-కొత్తపేట
ఎసివై రెడ్డి-రాజమండ్రి
ఎ.బుల్లబ్బాయిరెడ్డి-సంపర
సీ.గోవర్దనరెడ్డి-బాపట్ల
గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల
డి.బాలకోటి రెడ్డి-సత్తెనపల్లి
కే.వి.నర్సిరెడ్డి-గురజాల
కెనాగార్జున రెడ్డి-కంభం, ఎస్‌.పిచ్చిరెడ్డి-దర్శి, ఎమ్‌.మఠహీదర్‌ రెడ్డి-కందుకూరు, కే.పీ.కొండారెడ్డి-మార్కాపురం, వై.వెంకటరెడ్డి-గిద్దలూరు, కే.యానాది రెడ్డి-కావలి, బీ.సుందరరామిరెడ్డి-ఆత్మకూరు, ఎన్‌.శ్రీనివాసులురెడ్డి-కోవూరు, సీ.వి. శేషారెడ్డి-సర్వేపల్లి, కే.విష్ణువర్ధన్‌రెడ్డి-అల్లూరు, నేదురుమల్లి జనార్దనరెడ్డి-వెంకటగిరి, కే.మదన్‌ మోహన్‌ రెడ్డి-రాజంపేట, కే.శివానందరెడ్డి-కడప, ఎమ్‌.నారాయణరెడ్డి-రాయచోటి, ఆర్‌.రాజగోపాలరెడ్డి- లక్కిరెడ్డిపల్లి, వైఎస్‌ వివేకానందరెడ్డి-పులివెందుల, ఎమ్‌.వి.మైసూరారెడ్డి-కమలాపురం, ఎన్‌.వరదరాజులు రెడ్డి-ప్రొద్దుటూరు, డి.ఎల్‌. రవీంద్ర రెడ్డి-మైదుకూరు, బీ.వెంగళరెడ్డి-ఆత్మకూరు, బీ.శేషశయనరెడ్డి-నంది కోట్కూరు, కే.రాంభూపాల్‌ రెడ్డి-పాణ్యం, వి.రామనాదరెడ్డి-నంద్యాల, పీ.శేషిరెడ్డి-ప్రత్తికొండ, పీ.వేణుగోపాలరెడ్డి-రాయదుర్గం, జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి,  బీ.నారా యణరెడ్డి-అనంతపురం, ఎస్‌.చెన్నారెడ్డి-పెనుకొండ, పీ.రవీంద్ర రెడ్డి-గోరంట్ల, పీ.రామచంద్రారెడ్డి-పీలేరు, ఆవుల మోహన్‌ రెడ్డి-మదనపల్లె, ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి-వాయల్పాడు, మబ్బు రామిరెడ్డి-తిరుపతి, ఆర్‌.చెంగారెడ్డి-నగరి, సీ.కే. జయ చంద్రారెడ్డి-చిత్తూరు.

తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-7

  • పీ.శివారెడ్డి-జమ్మలమడుగు
  • బీ.శేఖర్‌ రెడ్డి-ఆళ్లగడ్డ
  • కర్రా సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల
  • బివి మోహన్‌ రెడ్డి-ఎమ్మిగనూరు
  • జీ.నాగిరెడ్డి-దర్మవరం
  • ఎన్‌.రామకృస్ణారెడ్డి-పుంగనూరు
  • బీ.గోపాలకృష్ణారెడ్డి-శ్రీకాళహస్తి

ఇండిపెండెంట్లు..2

  • జె.కోదండరామిరెడ్డి-నెల్లూరు
  • కే.ప్రభాకరరెడ్డి-తంబళ్లపల్లె

1989-కమ్మ ఎమ్మెల్యేల విశ్లేషణ-33
1989లో మొత్తం ముప్పై మూడు మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి కూడా కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు గణనీయంగానే ఎన్నికయ్యారు. 19 మంది కాంగ్రెస్‌ నుంచి ఎన్నిక కాగా, టీడీపీ నుంచి 14 మంది నెగ్గారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో 17 మంది కోస్తా జిల్లాల నుంచి కాగా, ఇద్దరు రాయలసీమ నుంచి ఉన్నారు.తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వారిలో 11 మంది కోస్తా నుంచి ముగ్గురు రాయలసీమ నుంచి నెగ్గారు.కాగా కోస్తాప్రాంతానికి చెందిన ఎన్‌.టీ.రామారావు రాయలసీమలోని హిందుపూర్‌ లో గెలిచారు.

కాంగ్రెస్‌ కమ్మ ఎమ్మెల్యేలు...19

  • చావా రామకృష్ణ-ఉంగుటూరు
  • ఎమ్‌. రవీంద్ర నాద్‌ చౌదరి-దెందులూరు
  • పాలడుగు వెంకట్రావు-నూజివీడు
  • ముసునూరు రత్నబోస్‌-గన్నవరం
  • పిన్నమనేని వెంకటేశ్వరరావు-ముదినేపల్లి
  • వి.రత్నకుమారి-విజయవాడ-2
  • కే.బాస్కరరావు-మైలవరం
  • ఎమ్‌.వెంకటేశ్వరరావు-నందిగామ
  • చిట్టినేని వెంకటరావు-పొన్నూరు
  • ఆలపాటి ధర్మారావు-వేమూరు
  • నాదెండ్ల భాస్కరరావు-తెనాలి
  • నన్నపనేని రాజకుమారి-వినుకొండ
  • పీ.రాఘవరావు-అద్దంకి
  • జీ.అచ్యుతకుమార్‌-కొండపి
  • ఇ.తిరుపతి నాయుడు-కనిగిరి
  • ఎన్‌.వెంకటరత్నం నాయుడు-రాపూరు
  • మాదాల జానకీరామ్‌-ఉదయగిరి
  • వి.రాంభూపాల్‌ చౌదరి-కర్నూలు
  • గల్లా అరుణకుమారి-చంద్రగిరి

తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు-14

  • ఎమ్‌.వి.కృష్ణారావు-ఇచ్చాపురం
  • పివి కృష్ణారావు-కోవ్వూరు
  • ఎమ్‌.వి.కృష్ణారావు-తణుకు
  • డి.రాజశేఖర్‌-కంకిపాడు
  • ఎన్‌.రఘురాం-జగ్గయ్యపేట
  • ఎమ్‌.పెదరత్తయ్య-ప్రత్తిపాడు
  • కే.జయమ్మ-చిలకలూరిపేట
  • కే.శివప్రసాదరావు-నరసరావుపేట
  • ఎన్‌.శివరామప్రసాద్‌-మాచర్ల
  • దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు
  • కే.బలరాం-మార్టూరు
  • ఎన్‌.టీ.రామారావు-హిందూపూర్‌
  • జీ.ముద్దుకృష్ణమనాయుడు-పుత్తూరు
  • ఎన్‌.చంద్రబాబు నాయుడు-కుప్పం

1989- కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేల విశ్లేషణ-24
ఈ ఎన్నికలలో ఇరవై నాలుగు మంది కాపు సామాజికవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 17 మంది, టీడీపీ పక్షాన ఆరుగురు గెలవగా, ఒకరు ఉండిపెండెంటుగా నెగ్గారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో ఒక్కరు తప్ప అంతాకోస్తా జిల్లాల నుంచే గెలిచారు. తెలుగుదేశం తరుపున గెలిచినవారిలో వారు కూడా కోస్తావారే. (రాయలసీమలో బలిజలుగా పరిగణిస్తారు).

కాంగ్రెస్‌ కాపు ఎమ్మెల్యేలు..17

  • ఈటి విజయలక్ష్మి-విశాఖ-1-తెలగ
  • జీ.గురునాదరావు-పెందుర్తి(తెలగ)
  • బలిరెడ్డి సత్యారావు-చోడవరం
  • ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు
  • కెసిహెచ్‌ మోహన్‌ రావు-పిఠాపురం
  • పంతం పద్మనాభం-పెద్దాపురం
  • ఎమ్‌.గంగయ్య-రాజోలు
  • సంగీత వెంకటరెడ్డి-ఆలమూరు
  • బదిరెడ్డి అప్పన్నదొర-బూరుగుపూడి
  • జె.శ్రీరంగనాయకులు-పెనుకొండ
  • హరిరామజోగయ్య-పాలకొల్లు
  • బూరగడ్డ వేదవ్యాస్‌-మల్లేశ్వరం
  • పేర్ని కృష్ణమూర్తి- మచిలీపట్నం
  • వి.చలపతిరావు-ఉయ్యూరు
  • కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు
  • అంబటి రాంబాబు-రేపల్లె
  • బీ.బాలయ్య-ఒంగోలు(బలిజ)

తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు..6

  • పీ.చలపతిరావు-యలమంచిలి
  • చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు
  • తోట సుబ్బారావు-జగ్గంపేట
  • కొత్తపల్లి సుబ్బరాయుడు-నరసాపురం
  • పీ.కనకసుందరరావు-తాడేపల్లిగూడెం
  • సింహ్దా సత్యనరాయాణ-అవనిగడ్డ

ఇండిపెండెంట్‌-1
జక్కంపూడి రామ్మోహన్‌ రావు-కడియం

1989-బీసీ వర్గాల ఎమ్మెల్యేల విశ్లేషణ..30
ఈ ఎన్నికలలో ముప్పై మంది బీసీ వర్గాల ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి 13 మంది, తెలుగుదేశం పక్షాన పదిహేను మంది గెలుపొందారు.ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు..కొప్పుల వెలమ నుంచి ఆరుగురు, తూర్పు కాపు నుంచి దుగురు, పొలినాటి వెలమ ముగ్గురు, యాదవ ముగ్గురు, గౌడ ముగ్గురు, కాళింగ ఇద్దరు, శెట్టిబలిజ ఇద్దరు, పద్మశాలి ఇద్దరు, మత్సకార,కళావంతుల, కురుబ, గవర ల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు.

కాంగ్రెస్‌ బీసీ ఎమ్మెల్యేలు-13
పదమూడు మంది బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలవగా వీరిలో తొమ్మిది మంది కోస్తా జిల్లాలలోను, మిగిలిన నలుగురు రాయలసీమ నుంచి గెలిచారు.

  • పైడి శ్రీరామమూర్తి-ఆముదాలవలస-కాళింగ
  • దర్మాన ప్రసాదరావు-నరసన్నపేట-పీ.వెలమ
  • పీ.జగన్మోహన్‌ రావు-బొబ్బిలి- కే.వెలమ
  • మల్లాడి స్వామి-కాకినాడ-మత్స్యకార
  • పీ.సుభష్‌ చంద్రబోస్‌-రామచంద్రపురం-శెట్టిబలిజ
  • కుడిపూడి ప్రభా కరరావు-అమలాపురం-శెట్టిబలిజ
  • కే.ఈశ్వర్‌ కుమార్‌-గుడివాడ-యాదవ
  • జీ.వీరాంజనేయులు-మంగళగిరి-పద్మశాలి
  • సిహెచ్‌ జయరాంబాబు-గుంటూరు-2-కళావంతుల లేదా సూర్య బలిజ
  • కే.ఇ.కృష్ణమూర్తి-డోన్‌-గౌడ
  • గోపినాద్‌-ఉరవకొండ-కురుబ,
  • ఎన్‌.రఘువీరారెడ్డి యాదవ్‌-మడకశిర-యాదవ
  • అగిశం వీరప్ప-నల్లమడ-పద్మశాలి

తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు..15
అదికారం రాకపోయినా బీసీలలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ తరపున గెలిచారు. మత్తం పదిహేను మంది బీసీ ఎమ్మెల్యేలు కోస్తా జిల్లాలవారే.

  • డి.నాగావళి-టెక్కలి-కాళింగ
  • కే.మోహన్‌ రావు-పాతపట్నం-తూర్పు కాపు
  • జీ.ఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ
  • కే.కళా వెంకట్రావు-ఉణుకూరు-తూర్పుకాపు
  • ఇ.కృష్ణమూర్తి-పార్వతిపురం-కే.వెలమ
  • తెంటు జయప్రకాష్‌-తెర్లాం-కే.వెలమ
  • టీ.సరస్వతమ్మ-చీపురుపల్లి-తూర్పు కాపు
  • పీ.అరుణ-గజపతినగరం-తూర్పు కాపు
  • కే.అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కొప్పుల వెలమ
  • నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు
  • బండారు సత్యనారాయణమూర్తి-పరవాడ-కే.వెలమ
  • రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కే.వెలమ
  • దాడి వీరభద్రరావు-అన కాపల్లి-గవర
  • వై.రామకృష్ణుడు-తుని-యాదవ
  • ఇ.సీతారావమ్మ-కూచినపూడి-గౌడ.

ఇండిపెండెంట్లు-2
గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ
కింజారపు ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రపురం-పీ.వెలమ

1989-షెడ్యూల్‌ కులాల ఎమ్మెల్యేలు..23
కోస్తా-రాయలసీమలతో కలిపి 22 రిజర్వ్‌డ్‌ సీట్లు ఉన్నా, ఒక జనరల్‌ సీటు లో కూడా ఎస్సీ అభ్యర్ది గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి పదహారు మంది, టీడీపీ నుంచి ఐదుగురు, సీపీఎం పక్షాన ఇద్దరు, ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారి వివరాలు..

కాంగ్రెస్‌ ఎస్సీ ఎమ్మెల్యేలు-15

  • పీజే.అమృతకుమారి-పాలకొండ
  • బత్తిన సుబ్బారావు-ముమ్మడివరం
  • ఎన్‌.గణపతిరావు-నగరం
  • పివి రాఘవులు-అల్లవరం
  • కోనేరు రంగారావు-తిరువూరు
  • టీ.వెంకయ్య-తాడికొండ
  • జివి శేషు-సంతనూతలపాడు
  • పీ.ప్రకాశ్‌ రావు-గూడూరు
  • పీ.పెంచలయ్య-సూళ్లూరుపేట
  • జీ.లోక్‌ నాధ్‌-ఆలూరు
  • ఎ.జగదీష్‌-గుత్తి (జనరల్‌ సీటు)
  • పిశమంతకమణి-శింగనమమల
  • ఎమ్‌.లక్ష్మీదేవి-కళ్యాణదుర్గం
  • సీ.దాస్‌-సత్యవేడు
  • జీ.కుతూహలమ్మ-వేపంజేరి.

టీడీపీ ఎస్సీ-ఎమ్మెల్యేలు-5

  • కే.ప్రతిభా భారతి-ఎచ్చర్ల
  • కే.నూకరాజు-పాయకరావుపేట
  • కే.వివేకానంద-గోపాలపురం
  • టీ.పెంచలయ్య-రైల్వే కోడూరు
  • పీ.సుబ్బయ్య-పలమనేరు

సీపీఎం ఎస్సీ-ఎమ్మెల్యేలు- 2

  • డి.రాజగోపాల్‌-ఆచంట
  • పీ.రామయ్య-నిడుమోలు

ఇండి పెండెంట్‌-1

  • మదన్‌ గోపాల్‌-కొడుమూరు

ఎస్టీ.ఎమ్మెల్యేలు-8
కోస్తా-రాయలసీమలలో ఎనిమిది మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు కాంగ్రెస్‌ ఐ నుంచి ముగ్గురు టీడీపీ పక్షాన గెలిచారు. వారి వివరాలు..

కాంగ్రెస్‌ ఎస్టీ ఎమ్మెల్యేలు..5

  • ఎస్‌.చంద్రశేఖరరాజు-నాగూరు
  • ఎల్‌.ఎన్‌.సన్యాసిరాజు-సాలూరు
  • పీ.బాలరాజు-పాడేరు
  • ఎమ్‌.బాలరాజు-చింతపల్లి
  • బీ.దుర్గారావు-పోలవరం

టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు-3

  • నిమ్మక గోపాలరావు-కొత్తూరు
  • ఎల్‌.బీ.దుక్కు-ఎస్‌.కోట
  • ఎస్‌.వెంకటేశ్వరరావు-ఎల్లవరం

క్షత్రియ ఎమ్మెల్యేలు-8

  • ఎనిమిది మంది క్షత్రియ ఎమ్మెల్యేలు గెలవగా
  • నలుగురు కాంగ్రెస్‌ నుంచి
  • నలుగురు టీడీపీ నుంచి గెలిచారు

కాంగ్రెస్‌ క్షత్రియ ఎమ్మెల్యేలు-4

  • పీ.సాంబశివరాజు-సతివాడ
  • ఎస్‌.కృష్ణమూర్తిరాజు-నర్సీపట్నం
  • ఎ.సుభాష్‌ చంద్రబోస్‌-భీమవరం
  • కే.బాపిరాజు-కైకలూరు

టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-4

  • పీ.అశోక్‌ గజపతిరాజు-విజయవగరం
  • ఆర్‌.డి.ఎ.నరసింహరాజు-భీమిలి
  • డి.శివరామరాజు-అత్తిలి
  • కే.రామచంద్రరాజు-ఉండి

ఇతర సామాజికవర్గాలు..8
ఇతరసామాజికవర్గాలలో ముస్లీంలు ముగ్గురు ఉండగా, వారంతా కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. వైశ్యులు ముగ్గురు గెలవగా వారు కూడా కాంగ్రెస్‌ వారే. ఒక బ్రాహ్మణ నేత గెలిచారు. ఆయన కాంగ్రెస్‌ నేతే. కాగా వెలమ వర్గం నుంచిగెలిచిన ఒకరు మాత్రం టీడీపీకి చెందినవారు. వారి వివరాలు..

ముస్లీం-3

  • ఎమ్‌.కే.బేగ్‌-విజయవాడ-1-కాంగ్రెస్‌
  • ఎమ్‌.డి.జాని-గుంటూరు-1-కాంగ్రెస్‌
  • షాకీర్‌-కదిరి-కాంగ్రెస్‌.

వైశ్య-3
నేరెళ్ల రాజా-ఏలూరు-కాంగ్రెస్‌, కే.రోశయ్య-చీరాల-కాంగ్రెస్‌.రాయచోటి రామయ్య-ఆదోని-కాంగ్రెస్‌

బ్రాహ్మణ-1
శివరామకృష్ణరావు-బద్వేల్‌-కాంగ్రెస్‌.

వెలమ-1
కోటగిరి విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement