1978 శాసనసభ ఎన్నికలలో అప్పటి మాజీ ప్రధాని ఇందరాగాందీ నాయకత్వంలో ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టం కట్టింది. ఏపీలో అదికారంలో ఉన్న రెడ్డికాంగ్రెస్ కేవలం ముప్పైసీట్లకే పరిమితం కాగా, 1977 ఎన్నికలలో కొత్తగా ఆవిర్భవంచిన జనతా పార్టీకి అరవై స్థానాలు దక్కాయి. అయితే ఈ రెండు పార్టీల నుంచి మెజార్టీ సభ్యులు ఇందిరా కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఇక సామాజికవర్గాలను విశ్లేషిస్తే రెడ్డి సామాజికవర్గం నేతలు కోస్తా, రాయలసీమలలో 41 మంది గెలిచారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఇరవైఏడు మంది, జనతా పార్టీ నుంచి ఎనిమిది మంది, కాంగ్రెస్ ఆర్ నుంచి ముగ్గురు ఉన్నారు. సీపీఎం ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. కమ్మ సామాజికవర్గంకు చెందినవారు ముప్పైనాలుగు మంది గెలిచారు. వారిలో22 మంది కాంగ్రెస్ ఐ కాగా, ఎనిమిది మంది జనతా, కాంగ్రెస్ ఆర్ ఇద్దరు, సీపీఎం ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు.
కాపు సామాజికవర్గం నేతలు 21 మంది గెలిచారు. వారిలో పది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది జనతా, ఇద్దరు కాంగ్రెస్ ఆర్, ఒకరు సీపీఐ ఉన్నారు. బీసీలు ఇరవైఎనిమిది మంది నెగ్గగా, పదమూడు మంది కాంగ్రెస్, పదిమంది జనతా, ఇద్దరు కాంగ్రెస్ ఆర్ నుంచి గెలుపొందారు. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. ఎస్సీసీట్లు ఇరవైరెండే అయినా,ఒక ఎస్సీ నేత జనరల్ సీటు నుంచి గెలిచారు. దాంతో ఇరవైమూడు మంది అయ్యారు. కాంగ్రెస్ నుంచి పదహారు, జనతా ఆరు, సీపీఎం ఒకరు ఉన్నారు. ఎస్టీలు నలుగురు కాంగ్రెస్‌ఐ, ముగ్గురు జనతా, ఒకరు సీపీఐ నుంచి ఎన్నికయ్యారు. క్షత్రియులలో పన్నెండు మంది గెలిచారు. కాంగ్రెస్ ఐ ఏడు, జనతా ఇద్దరు, కాంగ్రెస్ ఆర్ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. ముస్లీంలు నలుగురు కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. బ్రాహ్మణులు ఏడుగురు గెలిస్తే వారిలో ముగ్గురు కాంగ్రెస్ ఐ, ముగ్గురు జనతా, ఒకరు కాంగ్రెస్ ఆర్‌కు చెందినవారు. ఇతరులు ఐదుగురు కాంగ్రెస్ ఐవారే.
1978 రెడ్డిసామాజికవర్గం ఎమ్మెల్యేలు-38
ఈ ఎన్నికలలో రెడ్డి ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎన్నికైతే,వారిలో అత్యదికులు 25 మంది కాంగ్రెస్ ఐవారే. జనతా పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. కోస్తా జిల్లాల నుంచి కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు పది మంది గెలిస్తే, రాయలసీమ నుంచి పదిహేను మంది నెగ్గారు. జనతా పార్టీ పక్షాన గెలిచినవారిలో ముగ్గురు కోస్తావారు, మిగిలిన ఐదుగురు రాయలసీమవారు. కాంగ్రెస ఆర్ నుంచి గెలిచిన ముగ్గురు లో ఇద్దరు రాయలసీమ కాగా ఒకరు కోస్తావారు.
కాంగ్రెస్‌ఐ రెడ్డి ఎమ్మెల్యేలు..25
- కే.లక్ష్మీనారాయణరెడ్డి-ప్రత్తిపాడు
- చల్లా నారపరెడ్డి-మాచర్ల
- కే.ఓబుల్ రెడ్డి-కంభం
- బీ.రామసుబ్బారెడ్డి-కనిగిరి
- కే.యానాదిరెడ్డి-కావలి
- బీ.సుందరరామిరెడ్డి-ఆత్మకూరు
- పీ.రామచంద్రారెడ్డి-కోవూరు
- కెవిసుబ్బారెడ్డి-నెల్లూరు, సీవి శేషారెడ్డి-సర్వేపల్లి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి-వెంకటగిరి, గజ్జెల రంగారెడ్డి-కడప, జీ.రామసుబ్బారెడ్డి-లక్కిరెడ్డిపల్లె, సీ.ఓబుల్ రెడ్డి రామిరెడ్డి-ప్రొద్దుటూరు, గంగుల తిమ్మారెడ్డి-ఆళ్లగడ్డ, ఎ.వెంగళరెడ్డి-ఆత్మకూరు, బీ.శేషశయనరెడ్డి-నందికోట్కూరు, హనుమంతరెడ్డి-ఎమ్మిగనూరు, డి.వెంకటరెడ్డి-తాడిపత్రి, వైసి తిమ్మారెడ్డి-మడకశిర, ఎస్. నారాయణరెడ్డి-పెనుకొండ, పీ.బయ్యపురెడ్డి-గోరంట్ల, ఆవుల మోహన్ రెడ్డి-తంబళ్లపల్లె, ఎన్.అమరనాదరెడ్డి-వాయల్పాడు, ఎ.ఈశ్వరరెడ్డి-తిరుపతి, ఆర్. చెంగారెడ్డి-నగరి.
జనతా పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు-7
- పీ.అమ్మిరెడ్డి-అనపర్తి
- గణపా రామస్వామిరెడ్డి-పెదకూరపాడు
- పిడతల రంగారెడ్డి-గిద్దలూరు
- సీ.ఎమ్.రామనాధరెడ్డి-జమ్మలమడుగు
- ఇ.అయ్యపురెడ్డి-పాణ్యం
- బీ.వెంకటరెడ్డి-నంద్యాల
- కే.అంకిరెడ్డి-కోయిలకుంట్ల
కాంగ్రెస్ ఆర్..3
- కాసు కృష్ణారెడ్డి-నరసరావుపేట
- కే.ప్రభావతమ్మ-రాజంపేట
- వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల
సీపీఎం-1
- పుచ్చలపల్లి సుందరయ్య-గన్నవరం
ఇండిపెండెంట్లు-2
- పీ.శివారెడ్డి-కమలాపురం
- డిఎల్.రవీంద్రారెడ్డి-మైదుకూరు
కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు-36
కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు 36 మంది ఎన్నిక కాగా ,వారిలో కాంగ్రెస్ ఐ నుంచి ఇరవై నలుగురు ఉండగా, జతా పార్టీ నుంచి ఎనిమిది మంది ఉన్నారు. కాంగ్రెస్ ఆర్ ఇద్దరు, సీపీఎం ఒకరు,ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. కాంగ్రెస్‌ఐ నుంచి ఎన్నికైన వారిలో పదిహేడు మంది కోస్తా నుంచి, ఏడుగురు రాయలసీమ నుంచి నెగ్గారు. జనతా పార్టీ తరపున ఎన్నికైన కమ్మ ఎమ్మెల్యేలలో ఆరుగురు కోస్తావారు కాగా, ఇద్దరు రాయలసీమవారు.
కాంగ్రెస్ ఐ కమ్మ ఎమ్మెల్యేలు-24
- యు.నారాయణమూర్తి-పెద్దాపురం
- కంటిపూడి అప్పారావు-తణుకు
- కే.సత్యనారాయణ-ఉంగుటూరు
- గద్దె వెంకటేశ్వరరావు-చింతలపూడి
- పాలడుగు వెంకట్రావు-నూజివీడు
- నాదెండ్ల భాస్కరరావు-విజయవాడ తూర్పు
- బొద్దులూరి రామారవు-జగ్గయ్యపేట
- గోగినేని నాగేశ్వరరావు-పొన్నూరు, యడ్లపాటి వెంకటరావు-వేమూరు, సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట, రావెల వెంకటరావు-సత్తెనపల్లి, జీ.మల్లి ఖార్జునరావు-గురజాల, ఎమ్.నారాయణరావు-పర్చూరు, కరణం బలరామ కృష్ణమూర్తి-అద్దంకి, దివి కొండయ్యచౌదరి-కందుకూరు, జీ.పట్టాభి రామస్వామి చౌదరి-కొండపి, ఎన్.వెంకటరత్నం నాయుడు-రాపూరు, రాయల వేమన్న-ఉరవకొండ, బిటిఎల్ ఎన్ చౌదరి-అనంతపురం,జీ.అనంతరెడ్డి-దర్మవరం, జివి నారా యణరెడ్డి-మదనపల్లె, ఎన్.చంద్రబాబు నాయుడు-చంద్రగిరి, వి.సుబ్రహ్మణ్యం నాయుడు-శ్రీకాళహస్తి, బిఆర్ దొరస్వామి నాయుడు-కుప్పం
జనతా పార్టీ కమ్మ ఎమ్మెల్యేలు..8
- వడ్డే శోభనాద్రీశ్వరరావు-ఉయ్యూరు
- మొక్కపాటి వెంకటేశ్వరరావు-నందిగామ
- జివి రత్తయ్య-మంగళగిరి
- దొడ్డపనేని ఇందిర-తెనాలి
- జాగర్లమూడి చంద్రమౌళి-మార్టూరు
- ముప్పవరపు వెంకయ్య నాయుడు-ఉదయగిరి
- ఎన్.బీ.వెంకటేశ్వర చౌదరి-చిత్తూరు
- కెబి సిద్దయ్య-పుత్తూరు
కాంగ్రెస్ ఆర్-2
- బీపిన్నమనేని కోటేశ్వరరావు-ముదినేపల్లి
- చనుమోలు వెంకటరావు-మైలవరం
సీపీఎం-1
- కొరటాల సత్యనారాయణ-రేపల్లె
ఇండి-1
- ఆవుదారి వెంకటేశ్వర్లు-వినుకొండ
కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు-22
కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎన్నికైతే,వారిలో కాంగ్రెస్ పక్షాన పదకొండు మంది, జనతా పార్టీ తరపున ఏడుగురు, కాంగ్రెస్ తరపున ఇద్దరు, సీపీఐ నేత ఒకరు ఉన్నారు. వీరిలో ఒకరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారే.
కాపు కాంగ్రెసు ఎమ్మెల్యేలు...11
- ఆళ్వార్ దాస్-విశాఖ-తెలగ
- జీ.అప్పన్న-పెందుర్తి
- కెసిహెచ్ మోహన్ రావు-పిఠాపురం
- పంతం పద్మనాభం-జగ్గంపేట సంగీత వెంకటరెడ్డి-ఆలమూరు
- వి.పద్మరాజు-బూరుగుపూడి
- ఎమ్.వెంకటరమణ-సంపర
- వర్ధినీడిసత్యనారాయణ-పాలకొల్లు
- లింగంశెట్టి ఈశ్వరరావు-గుంటూరు-2
- జీ.సుందరరామయ్య-అల్లూరు
- కెవి పతి-పుంగనూరు
జనతా పార్టీ కాపు ఎమ్మెల్యేలు-7
- ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు
- బీ.సూర్యనారాయణ-తాళ్లరేవు
- పీవి శ్రీరామా రావు-అమలాపురం
- పీ.అమ్మిరాజు-కడియం
- బూరగడ్డ నిరంజనరావు-మల్లేశ్వరం
- వడ్డి రంగారావు-మచిలీపట్నం
- ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి
కాంగ్రెస్ ఆర్-3
- కే.అప్పడు దొర-భోగాపురం-తెలగదొర
- వి.సస్యాసి నాయుడు-యలమంచిలి
- మండలి వెంకట కృష్ణారావు-అవనిగడ్డ
సీపీఐ-1
- పూల సుబ్బయ్య-మార్కాపురం
1978- బీసీ ఎమ్మెల్యేలు..28
ఈ ఎన్నికలలో బీసీ వర్గాల నుంచి 28ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ ఐ నుంచి పదమూడు మంది, జనతా పార్టీ నుంచి పది మంది,కాంగ్రెస్ ఆర్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలుపొందారు.కాంగ్రెస్ ఐ లో ఏడుగురు మంది కోస్తా నుంచి ఆరుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. జనతా పార్టీలో గెలిచినవారంతా కోస్తావారే.
కాంగ్రెస్ ఐ బీసీ ఎమ్మెల్యేలు...13
- పీ. శ్రీరామమూర్తి-ఆముదాలవలస-కాళింగ
- డోల సీతారాములు-నరసన్నపేట-తూర్పు కాపు
- మల్లాడి స్వామి-కాకినాడ-మత్స్యకార
- జక్కంశెట్టి వెంకటేశ్వరరావు-పెనుకొండ-శెట్టి బలిజ
- ఎన్.సూర్యప్రకాశ్ రావు-ఏలూరు-విశ్వబ్రాహ్మణ
- కటారి సత్యనారాయణరావు-గుడివాడ-యాదవ
- పోతిన చిన్నా-విజయవాడ-1-నగరాలు
- ఎమ్.వెంకటేశ్వర్లు-చీరాల-పద్మశాలి-చేనేత
- కే.ఇ.కృష్ణమూర్తి-డోన్-గౌడ
- కే.బీ.నరసప్ప-ప్రత్తికొండ-కురుబ
- కెబి చినమల్లప్ప-రాయదుర్గం-కురుబ
- కే.తప్పేస్వామి-హిందుపూర్-కురుబ
- ఎ.వీరప్ప-నల్లమడ-పద్మశాలి
జనతా పార్టీ బీసీ ఎమ్మెల్యేలు-10
- గౌతు లచ్చన్న-సోంపేట-గౌడ
- బమ్మిడి నారాయణస్వామి-టెక్కలి-కాళింగ
- సీ.లక్మీ నారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ
- ఎమ్.బీ.పరాంకుశం-ఉణుకూరు-తూర్పుకాపు
- చీకటి పరుశురామానాయుడు-పార్వతీపురం-కే.వెలమ
- కేవికే నాయుడు-బొబ్బిలి-కే.వెలమ
- సీ.శ్యామలరావు-చీపురుపల్లి-కాళింగ
- వి.ఎస్. ఎ.నాయుడు -గజపతినగరం-కొప్పుల వెలమ
- ఎన్.ఎస్.ఎన్.రెడ్డి-విశాఖ-2
- రెడ్డిక ఇ.సుబ్బారావు-కూచినపూడి-గౌడ
కాంగ్రెస్ ఆర్ బీసీ ఎమ్మెల్యేలు-2
వాసిరెడ్డి వరదరామారావు-తెర్లాం-కే.వెలమ, గోపాత్రుడు బోలెం-నర్సీపట్నం-కే.వెలమ
ఇండిపెండెంట్లు-3
- కే.మోహన్ రావు-పాతపట్నం-తూర్పుకాపు
- కే.రామానాయుడు -మాడుగుల-కే.వెలమ
- పిల్లి అప్పారావు-రామచంద్రపురం-శెట్టి బలిజ
షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు-26
ఏపీలోని కోస్తా,రాయలసీమలలో 22 ఎస్సీ రిజర్వుడ్ సీట్లుఉన్నా,నలుగురు జనరల్ సీట్ లో గెలిచారు.దాంతో 26 మంది గెలిచినట్లయింది. వీరిలో పందొమ్మిది మంది కాంగ్రెస్ ఐ పక్షాన, ఆరుగురు జనతా పార్టీ నుంచి గెలుపొందారు. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు.
కాంగ్రెస్ ఐ ఎస్సీ. ఎమ్మెల్యేలు 19
- మారుతి ఆదెయ్య-పాయకరావుపేట
- ఎమ్.ఎస్.వి ప్రసాదరావు-ముమ్మడివరం
- ఎన్.గణపతిరావు-నగరం
- డి.వెంకటపతి-అల్లవరం
- కే.ధనరాజు-ఆచంట
- డి.సరోజినిదేవి-గోపాలపురం
- వక్కలగడ్డ ఆదాం-తిరువూరు
- కోనేరు రంగారావు-కంకిపాడు (జనరల్‌సీట్), టి.అమృతరావు-తాడికొండ, జీ.వేదాంతరావు-దుగ్గిరాల, (జనరల్), వి.ఎల్లయ్య-సంతనూతలపాడు,ఎన్.జీవరత్నం నాయుడు-ఒంగోలు (జనరల్) బర్రె జ్ఞానప్రకాశం-దర్శి, (జనరల్) పీ.ప్రకాష్ రావు-గూడూరు, పీ.వెంకటసుబ్బయ్య -సూళ్లూరుపేట, దామోదరం మునుస్వామి-కొడుమూరు, మసాలా ఈరన్న-ఆలూరు, సీ.దాస్-సత్యవేడు, ఎ.రత్నం-పలమనేరు.
జనతా పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు-6
- కే.నరసయ్య-ఎచ్చెర్ల
- కే.రాజారత్నం-పాలకొండ
- ఎన్.వెంకటసుబ్బయ్య-రైల్వే కోడూరు
- బీ.రుక్మిణిదేవి-శింగనమల
- హెచ్ .నరసప్ప-కళ్యాణదుర్గం
- బీ.ఆర్ముగం-వేపంజేరి
సీపీఎం-1
- జీ.బాపనయ్య-నిడుమోలు
ఎస్.టీ.ఎమ్మెల్యేలు-కాంగ్రెస్ ఐ-3, జనతా- 3,కాంగ్రెస్ ఆర్ -1, సీపీఐ- 1.
- డి.సన్యాసిదొర-ఎస్.కోట
- జీ.ప్రకాష్ రావు-ఎల్లవరం
- రసపుత్ర నాగభూషణం-పోలవరం
జనతా-3: వి.నరసింహారావు- కొత్తూరు, ఎస్.విజయరామరాజు- నాగూరు, జీ.అప్పలనాయుడు -పాడేరు
కాంగ్రెస్ ఆర్-1..డి.కొండలరావు - చింతపల్లి
సీపీఐ-1..ఎస్.ఆర్.టిపి రాజు-సాలూరు
క్షత్రియ ఎమ్మెల్యేలు-12
క్షత్రియ ఎమ్మెల్యేలు పన్నెండు మంది గెలవగా, ఏడుగురు కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. ఇద్దరు జనతా, ఇద్దరు కాంగ్రెస్ ఆర్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు.
కాంగ్రెస్ ఐ-7
- కేపీఆర్‌ఎస్ పద్మనాభరాజు-ఉత్తరాపల్లి
- పీ.సాంబశివరాజు-సతివాడ
- డి.జగ న్నాధరాజు -భీమిలి
- ఐ రామకృష్ణంరాజు-అత్తిలి
- కెవి.నరసింహారాజు-భీమవరం
- జీ.రామ చంద్రరాజు-ఉండి
- సిహెచ్ విపి మూర్తి రాజు-తాడేపల్లిగూడెం
జనతా-2: పీ.అశోక్ గజపతిరాజు-విజయనగరం, ఎమ్.వి.ఎస్.సుబ్బరాజు-కొత్తపేట.
కాంగ్రెస్ ఆర్-2: ఎమ్.విజయలక్ష్మీదేవి-తుని, రుద్రరాజు రామలింగరాజు-రాజోలు.
ఇండి-1: కనుమూరి బాపిరాజు-కైకలూరు.
ముస్లీం-4
- ఎమ్.ఎ. అజీజ్ -కొవ్వూరు
- ఇబ్రహింఖాన్ -కర్నూలు
- నిజాం వలీ-కదిరి
- సైపుల్లా బేగ్ -పీలేరు
బ్రాహ్మణ-10
కాంగ్రెస్‌ఐ-4: బీకే.ఎ.భుక్త-హరిశ్చంద్రపురం, పరకాల శేషావతారం-నరసాపురం, కోన ప్రభాకరరావు-బాపట్ల, జీ.వీరాంజనేయ శర్మ-గుంటూరు- 2.
జనత...3: బివి శర్మ-ఇచ్చాపురం, ఈ.సీతారామశాస్త్రి-చోడవరం, వి.శివ రామకృష్ణారావు-బద్వేల్, హెచ్.సత్యనారాయణ-ఆదోని
కాంగ్రెస్ ఆర్-1: భాట్టం శ్రీరామమూర్తి-పరవాడ.
సీపీఐ-1: కొటికలపూడి గోవిందరావు-అనకాపల్లి
వైశ్య-2: తటవర్తి సత్యవతి-రాజమండ్రి, కే.వెంకట్రామయ్య-గుత్తి.
ఇతరులు-1: నీలం చార్లెస్-దెందులూరు(క్రిస్టియన్)
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment