సాక్షి, తాడేపల్లి : కొద్ది రోజులుగా మతం, దేవుళ్ల చుట్టూ రాజకీయాన్ని తిప్పుకోడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలచేత తిరస్కరించిన వారు రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని చేసే రాజకీయాలు తాతత్కాలికమని అన్నారు. ఈ మేరకు బుధవారం మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ చేతిలో ఘోర వైఫల్యం పొందారన్నారు. ఇప్పుడు వారు మతాన్ని అడ్డు పెట్టుకుని ఇది క్రిస్టియన్ ప్రభుత్వం అని చెప్పాలని విఫల ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చదవండి: హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం
చంద్రబాబు, బీజేపీ నాయకులు వంటి వారు హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మతం మనిషి ఎప్పుడు అయ్యాడని, ఆయన కులం మనిషే కదా అని వ్యంగస్త్రాలు సంధించారు. టీడీపీ పరిపాలనలో హిందువులకు చేసిందేంటని, అమరావతిపై తమకు అంత ప్రేమ ఉంటే అమరేశ్వర స్వామి బొమ్మ పెట్టుకోవాలి కదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మత మార్పిడులు చేస్తున్నారని కొత్త ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన మత మార్పిడి కాదు.. పార్టీ మార్పిడి చేస్తున్నారన్నారు. కొంతమంది టీడీపీలో ఉండలేమని వైఎస్సార్సీపీలోకి మారుతున్నారని, దేవుడిపై ఓటు బ్యాంకు రాజకీయం చెస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తారని పేర్కొన్నారు. అందరూ క్రిస్టియన్ అంటున్నారని, మీరు ఉన్నప్పుడూ అందరూ హిందువులే కదా అని టీడీపీని ప్రశ్నించారు. చదవండి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్
40 దేవాలయాలు ఎందుకు కూల్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫాస్టర్లకు 5 వేలు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పూజారులకు, ఇమామ్‌లకు ఇవ్వడం లేదా. నీ మ్యానిఫెస్టోలో చర్చ్‌లు కట్టిస్తానని, మసీదులపై హామీలు ఇవ్వలేదా. మాటలు మార్చే నిన్ను దేవుడు శిక్షిస్తాడు. ఆ రోజు ఎన్నికల్లో చర్చికి వెళ్లి బైబిల్ పట్టుకోలేదా..? పుట్టుకతోనే వైఎస్సార్, జగన్‌లు క్రిస్టియన్లే. కానీ పాలనలో అన్ని మతాలకూ ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. బండి సంజయ్ మాట్లాడుతున్నాడు.. బైబిల్ పార్టీ అంటాడు. అవును...మాది బైబిల్ పార్టీ, ఖురాన్ పార్టీ, భగవద్గీత పార్టీ. ఇక్కడ జగన్ పాలనలో మీ కుయుక్తులు చెల్లవు. విచారణలు జరుగుతున్నాయి...మతం పేరుతో రాజకీయం చేసే వారికి గుణపాఠం చెప్తారు . లోకేష్ మాపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నీకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది. అంకుల్ అనే వ్యక్తి చనిపోయాడు. ఎవరైనా సరే అరెస్ట్ చేస్తాం. శవ రాజకీయాలు, దేవాలయాలపై రాజకీయాలు చేసే వారిని ప్రజలు శిక్షిస్తారు
Comments
Please login to add a commentAdd a comment