సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, దేవినేని ఉమా తొందరపాటు చర్యల వలనే డయాఫ్రంవాల్ దెబ్బతిన్నదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ డ్యామేజీ వల్లే పోలవరం పనులు కొంచెం నెమ్మదయ్యాయని అన్నారు. వారి దుందుడుకు చర్యల వలనే ఇది దెబ్బతిన్నదని కేంద్ర నిపుణులు సైతం అంగీకరిస్తున్నారన్నారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆగస్టులో ఇచ్చే నీటిని ఈసారి ముందుగానే ఇవ్వబోతున్నాం. జూన్‌లోనే గోదావరి, కృష్ణా బేసిన్‌లో నీటిని విడుదల చేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు సిద్దంగా ఉండాలి. విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. కాలువలకు జరుగుతున్న మరమ్మత్తు పనులు రేపటితో పూర్తవుతాయి. వ్యవసాయానికి గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా ఇలా నీటిని విడుదల చేయలేదు' అని అంబటి రాంబాబు అన్నారు.
చదవండి: (నాడు తండ్రి.. నేడు తనయుడు: దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో..)
పచ్చ మీడియా విషపురాతలు
'ప్రతిరోజూ ఈనాడు రామోజీరావు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఎవరినో అధికారంలోకి తేవటానికి పచ్చమీడియా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 250కి పైగా పథకాలు పని చేయటం లేదని పచ్చ పత్రిక రాసింది. ఎన్నికలకు ముందు విషం కక్కితే జనం నమ్ముతారని వారి ఆలోచన. చంద్రబాబు ఏనాడైనా రైతులకు మేలు చేశారా?. ఒంటిమిట్టలో ఎత్తిపోతల పథకం పని చేస్తున్నా పనిచేయటం లేదని రాశారు. రామోజీ ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకడు. శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల దగ్గర టీడీపీ వారు చాలా కాలంగా రిపేర్లు చేయలేదు. మన ప్రభుత్వం వచ్చాక మరమ్మత్తులు చేస్తున్నాం. చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటూ కలలు కంటున్నారు. కానీ అవి నెరవేరవు. మేము ప్రజల దగ్గరకు వెళ్తుంటే వారిలో ఆనందం కనిపిస్తోంది' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment