
AP Elections Political Latest Updates Telugu..
8:54 PM, Mar 9th, 2024
పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు
- CM CM అని అరిసిన ఓ కాపులారా..
- CM అంటే చీఫ్ మినిస్టరా ?
- CM అంటే సెంట్రల్ మినిస్టరా ?
- CM అంటే చంద్రబాబు మనిషా
- CM అంటే చీటింగ్ మనిషా అంటూ అంబటి ట్వీట్
CM CM అని అరిసిన ఓ కాపులారా!
— Ambati Rambabu (@AmbatiRambabu) March 9, 2024
CM అంటే చీఫ్ మినిస్టరా?
CM అంటే సెంట్రల్ మినిస్టరా?
CM అంటే చంద్రబాబు మనిషా?
CM అంటే చీటింగ్ మనిషా ?@ncbn @PawanKalyan
7:38 PM, Mar 9th, 2024
తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
- యలమంచిలి అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం
- ప్రచారం నేపథ్యంలో తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
- యలమంచిలి సీటు జనసేనకు ఇవ్వొద్దని టీడీపీ నాయకులు డిమాండ్.
- ఫర్నిచర్ ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు
- కుర్చీలను గాల్లోకి లేపి ఇరగొట్టిన టీడీపీ నేతలు
- జనసేనకు సీటు కేటాయిస్తే సహకరించేది లేదన్న టీడీపీ శ్రేణులు
- పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావులు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్.
- యలమంచిలి సీటు జనసేనకిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిక
7:34 PM, Mar 9th, 2024
ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
- ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చ
- ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమావేశం
- రానున్న 20 రోజుల్లో రాష్ట్రంలో విస్తృత ప్రచారానికి సిద్ధం
- రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్‌షోలు నిర్వహించేలా ప్లాన్
- ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు ఉండేలా ప్రణాళిక
- సభలు, రోడ్ షోలపై ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చ
- కీలక నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రచారం చేయనున్న వైఎస్ జగన్
- మరోవైపు తుది దశకు చేరుకున్న మేనిఫెస్టో
- తన ప్రచారంలో మేనిఫెస్టో గురించి విస్తృతంగా చెప్పనున్న వైయస్ జగన్
6:35 PM, Mar 9th, 2024
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్
- సీఎం జగన్‌ను ఎదుర్కొనలేక టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.
- చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదు
- వైఎస్సార్‌సీపీ మినహా అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు
- అభివృద్ధిని చూసి ఓటు వేయమని సీఎం జగన్ చెబుతుంటే, మా పొత్తులును చూసి ఓటు వేయమని చంద్రబాబు పవన్ చెప్తున్నారు.
- ఎన్నికలకు మేము సిద్ధం అంటుంటే, అమిత్ షా ఇంటి ముందు పొత్తుల కోసం మేము సిద్ధమని చంద్రబాబు, పవన్ అంటున్నారు
- బీజేపీకి ఓటు వేస్తే జగన్‌కు ఓటు వేసినట్టేనని గతంలో చంద్రబాబు మాట్లాడారు.
- బీజేపీకి మాకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే చెప్పాం
- పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారు
- ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీతో పొత్తు పెట్టుకోగల సామర్థ్యం చంద్రబాబుది..
- చంద్రబాబు పొత్తులతోనే కూటమి ఓటమి మొదలైంది
- పొత్తుల గురించి ఆలోచించాల్సిన సమయం మాకు లేదు
- మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది
6:28 PM, Mar 9th, 2024
పొత్తులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసిన బీజేపీ
- టీడీపీ,జనసేనలతో కలిసి ఏపీలో పొత్తుగా పోటీచేస్తున్నట్లు ప్రకటన
- సీట్ల షేరింగ్‌పై ఒకటి, రెండు రోజులలో వెల్లడిస్తామని వెల్లడి
- బీజేపీకి 6 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లు?
- 1996 నుంచి టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది: బీజేపీ
5:46 PM, Mar 9th, 2024
టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ నేతల తీవ్ర అసంతృప్తి
- టీడీపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలను తాకట్టు పెట్టారని రగిలిపోతున్న ఆ పార్టీ ఏపీ నేతలు
- తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని ఆగ్రహం
- ఏపీ బీజేపీకి సీట్ల తగ్గింపులో చక్రం తిప్పిన సుజనా చౌదరి, సీఎం రమేష్
- అధికారంలో లేనప్పుడే 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని అంటున్న బిజెపి నేతలు
- ఇప్పుడు ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం పైన రగులుతున్న ఏపీ బీజేపీ నేతలు
- పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని తీవ్ర ఆగ్రహం
- ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి ఫెయిలయ్యారని అగ్గిమీద గుగ్గిలం
- పురందేశ్వరి చెబితే వినే వారెవరు పార్టీలో లేరని వ్యాఖ్యలు
5:02 PM, Mar 9th, 2024
పశ్చిమగోదావరి జిల్లా:
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో ముసలం
- తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలనిరాశ, నిస్పృహలు
- పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకే ఇస్తున్నట్లు చెప్పిన టీడీపీ
- తాడేపల్లిగూడెం సీటు లేదని అధిష్టానం పొత్తుకు ముందే చెప్తే బాగుండేది: వలవల మల్లిఖార్జున రావు
- 2018లో నాకు నియోజకవర్గ ఇంచార్జి ఇచ్చినప్పటి నుండి పార్టీ కోసం పనిచేశా.
- పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సీటు కోసం పట్టుపట్టారని ఈసారి మీరు సపోర్ట్ చేయాలని చెప్పారు.
- ఇది సరికాదని చెప్పి వచ్చేశా
- నిన్న చంద్రబాబు 15 నిముషాలు ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్సీ ఇస్తా అని అన్నారు
- ఏం చేయాలో నాకు అర్ధం కావట్లేదు. నా కుటుంబసభ్యులు లాంటి నా కార్యకర్తల నిర్ణయం చెప్పాలి
- క్రమశిక్షణ ఎక్కువ ఉన్న నియోజకవర్గం మనది
- అందుకే మనల్ని లోకువగా చూస్తున్నారని మన నాయకులు అంటున్నారు
- నాలుగేళ్లుగా నన్ను నమ్మి నాతో నడచిన కార్యకర్తలకు నా కృతజ్ఞతలు
- పార్టీ పిలుపునిచ్చిన ప్రతిసారి వ్యయ ప్రయాసలకు ఓర్చి పనిచేశాను
- చంద్రబాబు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పినట్లు చెయ్యాలని అనుకుంటున్నాను.
- కార్యకర్తల విషయంలో పదవుల విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు, నాకు ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారు
- కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేస్తాను
3:02 PM, Mar 9th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
పొత్తులపై కేశినేని నాని హాట్ కామెంట్స్
- చంద్రబాబు పచ్చి మోసగాడు
- అన్న నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారు
- మూడు రోజుల నుంచి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశాడు
- చంద్రబాబు తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడు
- ఎంత మంది కలిసొచ్చినా జగన్‌ను ఓడించడం కల్ల
- జగన్‌మోహన్‌రెడ్డి 175/175 సాధించడం ఖాయం
- జగన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది
- పవన జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టాడు
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడే
2:02 PM, Mar 9th, 2024
బీజేపీ పెద్దల డిమాండ్లతో చంద్రబాబు గుండెల్లో గుబులు
- రాజమండ్రి ఎంపీతో పాటు సిటీ లేదా రూరల్ సీటు కోరుతున్న బీజేపీ
- హిందూపురం ఎంపీ, పుటపర్తి, అనంతపురం ఎమ్మెల్యే సీట్లు కావాలని డిమాండ్
- నంద్యాల ఎంపీ, కర్నూల్ ఎమ్మెల్యే సీటు కోరుతున్న బీజేపీ
- రాజంపేట, తిరుపతి ఎంపీ, తిరుపతి ఎమ్మెల్యే సీటు కావాలని డిమాండ్
- ఏలూరు, నర్యాపురం ఎంపీలతో పాటు భీమవరం, నర్సాపురం, ఉంగటూరు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్న బీజేపీ
- శ్రీకాకుళం, విజయనగరం, కురపం అసెంబ్లీ సీట్లు అడుగుతున్న బీజేపీ
- కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసిన బీజేపీ
- గుంటూరు సిటీ రెండు సీట్లలో ఒకటి కోరిన బీజేపీ
- బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ సీట్లు డిమాండ్
- ఒంగోలు, నెల్లూరు సిటీ స్థానాలు కోరుతున్న బీజేపీ
- బీజేపీ డిమాండ్‌తో టీడీపీ నేతల్లో టెన్షన్
1:50 PM, Mar 9th, 2024
తూర్పుగోదావరి జిల్లా:
రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డెక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, బీసీ సంఘాలు
- మంత్రి వేణుగోపాల కృష్ణను ఎమ్మెల్యే బుచ్చయ్య దూషించడంపై మండిపడిన బీసీ సంఘాలు.
- ఐఎల్‌టీడీ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ
- బుచ్చయ్య చౌదరి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
- తమ నాయకుడు మంత్రి వేణు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు, కార్యకర్తలు
1:40 PM, Mar 9th, 2024
పశ్చిమగోదావరి జిల్లా:
వైఎస్సార్‌సీపీలో చేరిన జనసైనికులు
- భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన తోలేరు, వెంకటాపురం జనసైనికులు
- గ్రంధి శ్రీనివాస్ అంటే తనకు వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
- 2014లో తన గెలుపు కోసం పనిచేసిన వారు 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి నన్ను విడిచిపెట్టి ఆయనకు మద్దతు పలికారు
- ఇందులో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కాబట్టి తిరిగి నా దగ్గరికి రావడానికి జనసైనికులు ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు
- జన సైనికులను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము
- తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తుడుచుకుపెట్టి పోతుంది
- రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
1:30 PM, Mar 9th, 2024
నెల్లూరు జిల్లా:
టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు
- వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి కాకాణి
- చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు
1:25 PM, Mar 9th, 2024
పశ్చిమ గోదావరి జిల్లా:
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేశారు
- గణపవరం మండలం పిప్పర గ్రామంలోవైఎస్సార్ చేయూత,వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు
- సచివాలయం, రైతు భరోసా కేంద్రం ,వైయస్సార్ హెల్త్ క్లీనిక్ భవనాలను ప్రారంభించిన నాయకులు
- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది
- సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని సైతం అమలు చేశారు
- పేదల ఖాతాలకు సంక్షేమ పథకాల రూపంలో 2లక్షల 55వేల కోట్లు చేరువ చేశారు
- సంక్షేమ అభివృద్ధి కావాలా అబద్దాలు చెప్పే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కావాలా ఆలోచించండి
- చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పొత్తుల కోసం మూడు రోజుల నుంచి ఢిల్లీలో కాపలాకాస్తున్నారు
- దమ్ముంటే చంద్రబాబు ఒంటరిగా గెలవగలిగితే బీజేపీ, పవన్ కల్యాణ్‌లతో పనేముంది?
- చంద్రబాబుకు ధైర్యం లేదు
1:20 PM, Mar 9th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు: ఎంపీ కేశినేని నాని
- సీఎం జగన్ ఐదేళ్ళ పాలనలో రాష్ట్రంలో 31 లక్షల పేదలకు నివాస స్థలాలు ఇచ్చారు
- కోటి మందికి పైగా నీడ కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
- టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు
- డ్వాక్రా, రైతు రుణమాఫీ, బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు..
- ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్
- పేదల సంక్షేమానికే 2.56లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది
- భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన దాఖలలు లేవు
- 120 సార్లు పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు..
- పేదల పక్షపాతి సీఎం జగన్‌కు ఓటు అనే బటన్ ప్రజలు నొక్కాలి
1:10 PM, Mar 9th, 2024
పిఠాపురం టీడీపీలో పొత్తు చిచ్చు
- పిఠాపురం టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఇవ్వాలని నేతల పట్టు
- టీడీపీ ఆఫీసు ముందు వర్మ వర్గీయుల బలప్రదర్శన
- వర్మకు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే రెబల్గా పోటీ చేస్తారని ప్రచారం
- పిఠాపురం త్యాగం చేయాలని వర్మకు టీడీపీ సంకేతాలు
- మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటున్న వర్మ వర్గీయులు
- పిఠాపురం టీడీపీలో అసంతృప్తిపై తలలు పట్టుకున్న పార్టీ పెద్దలు
1:08 PM, Mar 9th, 2024
త్యాగానికి జనసేన సిద్ధం
- ఒక ఎంపీ సీటును బీజేపీకి త్యాగం చేయనున్న పవన్
- జనసేనకు కేటాయించే సీట్లలో సర్ధుబాటుకు పవన్ ఓకే
- 8 లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలను అడుగుతున్న బీజేపీ
- జనసేన సీట్లలో కోతపడే అవకాశం
- అనకాపల్లి, మచిలీపట్నంలో మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశం
12:30 PM, Mar 9th, 2024
ఢిల్లీ:
అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ల భేటీ.. వెలువడని సంయుక్త పొత్తు ప్రకటన
- సంయుక్త ప్రకటన లేకుండానే విడివిడిగా వెళ్లిపోయిన చంద్రబాబు, పవన్ , అమిత్ షా
- జనసేన బిజేపీకి కలిపి 8 పార్లమెంట్,30 అసెంబ్లీ స్థానాలు అని టిడిపి ప్రచారం
- జనసేన సీట్లకు కోత పెట్టిన చంద్రబాబు
- 17 లోక్ సభ,145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని అంటున్న టీడీపీ
- అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్,రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని ప్రచారం చేస్తున్న టీడీపీ
12:25 PM, Mar 9th, 2024
ఏలూరు జిల్లా:
పోలవరం నియోజవర్గంలో టీడీపీ వర్గపోరు
- టీడీపీ నేత బొరగం శ్రీనివాస్‌కి టికెట్ ఇవ్వాలని ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు
- పోలవరం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.
- పోలవరం ఎమ్మెల్యే టికెట్‌ను బొరగం శ్రీనివాస్‌కి కేటాయించకుంటే మూకమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ అల్టిమేటం జారీ
- పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఇవ్వకుండా... పొత్తుల్లో తమకు ద్రోహం చేస్తున్నారని వాపోతున్న టీడీపీ నేతలు
12:20 PM, Mar 9th, 2024
అమిత్ షాతో ముగిసిన భేటీ..
- అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ ముగిసింది.
- భేటీలో భాగంగా పొత్తులపై చర్చించినట్టు సమాచారం.
- ఎంపీ స్థానాల అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
11:50AM, Mar 9th, 2024
ఢిల్లీ:
అమిత్ షా నివాసంలోకి రఘురామ కృష్ణంరాజుకు నో ఎంట్రీ
- గేటు బయటే రఘురామ కృష్ణంరాజు
- రోడ్డు మీద ఉండి తనను అనుమతించాలని ఫోన్లు చేస్తున్న రఘురామ
- తమ వెంట రఘురామ కృష్ణంరాజును తీసుకెళ్ళని బాబు, పవన్ కళ్యాణ్
- అమిత్ షా ఇంటి గేటు బయట నిలబడ్డ రఘురామ కృష్ణంరాజు
11:30AM, Mar 9th, 2024
ఢిల్లీ:
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ
- అమిత్ షా నివాసంలో సమావేశం
- జనసేన కోటకు కోత పెట్టేందుకు సిద్ధమైన బాబు
- జనసేనకు కేటాయించిన 3 లోక్‌సభ , 24 ఎమ్మెల్యే సీట్లలో చంద్రబాబు కత్తెర
- టీడీపీ కోటా నుంచి బీజేపీకి సీట్లు ఇవ్వకుండా జనసేన ను బలి చేస్తున్న బాబు
- ఇప్పటికే తమకు తక్కువ సీట్లు ఇచ్చారన్న అసంతృప్తిలో ఉన్న జనసేన క్యాడర్
11:10AM, Mar 9th, 2024
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పై మంత్రి వెల్లంపల్లి కౌంటర్
- విజయవాడ : పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు, పవన్ పడిగాపులు
- మోదీ కంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు సిగ్గుందా?
- బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు
- జగన్‌కు భయపడే పొత్తు పెట్టుకుంటున్నారు
- చంద్రబాబు, పవన్ కంటే కేఏ పాల్ పార్టీనే బెటర్
11:05AM, Mar 9th, 2024
అమిత్ షాతో చంద్రబాబు భేటీ
- అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్
- పొత్తు ఏర్పాటు విషయంలో చర్చిస్తున్న నేతలు
- ఎంపీ స్థానాల విషయంలో తగ్గేదేలే అంటున్న బీజేపీ.
10:47AM, Mar 9th, 2024
విజయవాడ రాణిగారితోట ప్రాంత వాసులకు మౌలికా సదుపాయాల కల్పన జగన్ ప్రభుత్వంలోనే జరిగింది:
దేవినేని అవినాష్
- ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులను, 30కోట్లతో అభివృధి, 60 కోట్లతో సంక్షేమం అమలు చేశా0
- గతంలో టీడీపీ ఓటువేసి మోసపోయామని స్థానిక ప్రజలంటున్నారు
- లోకేష్‌ను సీఎం చేయడం కోసమే బిజేపీ పెద్దల వద్ద చంద్రబాబు సాగిలపడ్డాడు
- ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీతో విడిపోయామని గతంలో చంద్రబాబు అనలేదా
- బంధుత్వాలు లేని వ్యక్తి నరేంద్ర మోదీ అని చంద్రబాబు విమర్శించలేదా?
- అమిత్ షా పై కోడి గుడ్లతో దాడి చేయించింది చంద్రబాబు కాదా?
- ధర్మ పోరాట దీక్ష ద్వారా బీజేపీ పెద్దలపై అనేక అవాక్కులు పేలిన టీడీపీ నాయకులు
- మాజీ జెడ్పీటీసీ అనురాధ మోడీ, అమిత్ షా లను మట్టి కొట్టుకుపోతారు అని శాపనార్థాలు చేశారు
- ఇప్పుడు ఎందుకు బీజేపీ కి సాగిలపడ్డరో చంద్ర బాబు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి
- జనసేనతో కలిసినా టీడీపీకి దిక్కులేకనే బీజేపీతో బంధుత్వానికి బయలుదేరాడు
- బీజేపీ సాగిలపడేకంటే టీడీపీని విలీనం చేయండి
- ఎంత మంది కలసివొచ్చినా అన్ని సర్వే లు జగన్ వైపే ఉన్నాయి
- జగన్ చేసే అభివృద్ధి ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5 లకు కనపడదు
- రాష్ట్రంలో ఏ వీధికి వెళ్లి ప్రజలను అడిగినా జగన్ చేస్తున్న అభివృద్ధిపై చెబుతారు
- జగన్ ప్రభుత్వంలో కుప్పం లో జరిగిన అభివృధి పైనే టీడీపీ నాయకులు చర్చకు సిద్దమా?
10:21AM, Mar 9th, 2024
విశాఖ:
భీమిలి నియోజకవర్గ టీడీపీలో రాజుకున్న అసమ్మతి
- భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న కోరాట రాజబాబు
- రాజబాబుని కాదని ఐవిఆర్ఎస్‌లో బంగారు రాజు పేరుతో సర్వే
- ఐవిఆర్ఎస్ సర్వేపై మండిపడుతున్న రాజబాబు
- నమ్మించి మోసం చేస్తున్నారని మండిపాటు
- సర్వే వెనక గంటా శ్రీనివాసరావు హస్తముందనే అనుమానం
ఢిల్లీ:
జనసేన మరోసారి బలి
- బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోట నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
- ఇప్పటికే జనసేనకు మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన టీడీపీ
- అందులోంచి లోక్‌సభ సీట్లను కట్ చేసేందుకు పవన్‌ను ఒప్పిస్తున్న బాబు
9:00 AM, Mar 9th, 2024
చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్..
- మేము ఎన్నికలకు సిద్ధం..
- మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధం.
- అంటూ చంద్రబాబు, పవన్‌పై సెటైర్లు..
మేము ఎన్నికలకు సిద్ధం
— Ambati Rambabu (@AmbatiRambabu) March 8, 2024
మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధం !@PawanKalyan @ncbn
8:20 AM, Mar 9th, 2024
టీడీపీతో బీజేపీ పొత్తు డౌటేనా?
- ఇతర రాష్ట్రాల పొత్తుల బిజీగా ఉన్నామని బాబును కలవని అమిత్ షా, జేపీ నడ్డా.
- టీడీపీతో పొత్తుపై పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ అధిష్టానం
- తాము కోరుకుంటున్న సీట్లు ఇవ్వకపోతే పొత్తు డౌటే అంటున్న బీజేపీ వర్గాలు
- పొత్తు చర్చలు తేలకపోవడంతో రాష్ట్రానికి వెళ్లిపోవాలని పురందేశ్వరి, సోమువీర్రాజును ఆదేశించిన పార్టీ అధిష్టానం
- నేడు బిజీ షెడ్యూల్‌లో అమిత్ షా.
7:30 AM, Mar 9th, 2024
20ఏళ్ల క్రితమే బాబు భూబాగోతం..
- చంద్రబాబు అక్రమాలే వేరే రేంజ్..
- ఫేక్ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టాలని చూసిన చంద్రబాబు.
- ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం ఉత్తర్వులు.
20 ఏళ్ళ క్రితమే బాబు భూభాగోతం
— YSR Congress Party (@YSRCParty) March 8, 2024
ఫేక్ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టాలని చూసిన @JaiTDP, @ncbn
భూ కేటాయింపులను రద్దు చేస్తూ అప్పట్లో వైఎస్ సర్కార్ ఉత్తర్వులు.#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/kesQTr9ZoD
7:20 AM, Mar 9th, 2024
రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్‌లను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
- కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య
- అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్
- రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు
సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా బీవై. రామయ్య..అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్....రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ లేఖను విడుదల చేసింది.… pic.twitter.com/CbwE3X1CeE
— YSR Congress Party (@YSRCParty) March 8, 2024
7:10 AM, Mar 9th, 2024
చంద్రబాబుకు నో అపాయింట్‌మెంట్
- అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు
- ఈరోజు(శుక్రవారం) బాబుకు దక్కని అమిత్ షా అపాయింట్‌మెంట్
- రేపు (శనివారం) ఉదయం అమిత్ షా ను కలుస్తారని టీడీపీ లీకులు
- ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడి గాపులు
- ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా
- అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్
- గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు
7:00 AM, Mar 9th, 2024
టైమ్స్ నౌ-ETG లోక్‌సభ ఎన్నికల సర్వే: ఏపీలో వైఎస్సార్‌సీపీదే హవా
- మొత్తం 25 సీట్లలో వైఎస్సార్‌సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం
- టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్
- వైఎస్సార్‌సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓటింగ్ పడే అవకాశం ఉందని చెప్పిన సర్వే
6:45 AM, Mar 9th, 2024
చంద్రబాబు పొత్తుల జాగారం
- అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ట్మెంట్ ఉదయం నుంచి ఎదురుచూపులు
- ఈరోజు అపాయింట్‌మెంట్ డౌటే అని అంటున్న బీజేపీ వర్గాలు
- ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా
- అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్
- గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు
- కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం
- స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేసిన బాబు
- సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు
- 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్ డి ఎ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు
- కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి?
- ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ?
- మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు
- ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు
6:30 AM, Mar 9th, 2024
దాదాపు లక్ష కోట్లు విలువైన స్కామ్ చేసిన ఘనాపాటి చంద్రబాబు: సజ్జల
- 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయింది
- ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్ళీ రుజువయింది
- తెలంగాణ తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?
- నాలుగు రోజుల్లోనే కథంతా నడిపారు
- ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు
- 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారు
- బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని
- గచ్చిబౌలి లో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు
- కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు
- లక్ష కోట్ల ప్రాపర్టీ కైవసనికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారు
- అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు
- వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు
- లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారు
- అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదు
- అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారు
- ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారు
- చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు
- దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారు
- రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే తప్పుడు పనులు చేసి జైలు పాలయ్యారు
- 2015లోనే స్కిల్ స్కాం మొదలెట్టారు
- అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు
- అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే, ఇప్పుడు జగన్ అమరావతి స్కామ్ ని బయటపెట్టారు
- రింగ్ రోడ్డు నుండి అనేక స్కామ్ లను బయటకు తీశారు
- జగన్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు
- 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రనే కనపడదు
- అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు
- అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు
- చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు
- టీడీపీ అంపశయ్య మీద ఉంది
- ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు
- ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు
- చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు
- అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలిని చేశారు
- ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు
- పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం
- అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది
- అన్ని పార్టీల కలిసినా అధికారంలోకి రాలేవు
- ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదు
Comments
Please login to add a commentAdd a comment