ప్చ్‌.. చిన్నమ్మ! పవన్‌ చెవిలో పువ్వు!! | Andhra Pradesh Elections 2024: BJP Key Decisions On Alliance With Janasena Party And TDP - Sakshi
Sakshi News home page

ఏపీలో బీజేపీ ఒంటరి పోరు?.. పవన్‌నూ కమలం పక్కనపడేసినట్లేనా?

Published Mon, Jan 29 2024 7:23 PM | Last Updated on Mon, Feb 5 2024 5:15 PM

AP Elections 2024: BJP Key Decision Distance with Pawan TDP - Sakshi

ఎన్టీఆర్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుందా?. ఈ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని భావిస్తోందా?. టీడీపీతో పొత్తుగా వెళ్లాలన్న చంద్రబాబు వదిన, బీజేపీ ఏపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రయత్నాలకు అధిష్టానం చెక్‌ పెట్టింది!. అదే సమయంలో టీడీపీతో పొత్తు కోసం వెంప్లరాడుతున్న జనసేననూ దూరం పెట్టేయాలని నిర్ణయించుకుందా?. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.  

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం తథ్యం. అలాంటప్పుడు మునిగిపోయే నావతో ప్రయాణం ఎందుకు? అనే కంక్లూజన్‌కి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోత్తు కోసం వెంపర్లాడుతున్న పురందేశ్వరికి సమాధానం స్పష్టంగా తేల్చి చెప్పింది. అందుకే 175 నియోజకవర్గాలకు పోటీ నేపథ్యంతో పురందేశ్వరి సన్నాహక సమావేశాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు ఎన్నికల ప్రణాళిక గురించి ఆమె చర్చించనున్నారు.

అదే సమయంలో జనసేనాని చేస్తున్న మధ్యవర్తిత్వ రాజకీయాలపైనా బీజేపీ అనాసక్తితో ఉంది. పోయి పోయి జనాలు తిరస్కరిస్తున్న చంద్రబాబుతో కలమని పవన్‌ కోరుతుండడం.. అదే సమయంలో సీట్ల పంపకం దాకా వెళ్లడాన్ని సైతం బీజేపీ కేంద్ర అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పవన్‌ను పక్కకు పెట్టేయాలని డిసైడ్‌ అయిపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించడం.. అందుకే స్పష్టమైన సంకేతాలు పంపినట్లు అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఎవరితో పొత్తుగా వెళ్లకపోతేనే ఏపీ జనాల్లో కాస్తైనా విలువ ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది.

గత రెండు రోజులగా క్లస్టర్ల వారీగా బీజేపీ అగ్రనాయకత్వం సమీక్షలు జరుగుతున్నాయి. ఎన్నికల సన్నద్దతపై జాతీయ సహసంఘటన ప్రదాన కార్యదర్శి శివప్రకాష్  క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరు దిశగా బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement