సాక్షి, ఢిల్లీ: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై మరోసారి ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, రాష్ట్ర బీజేపీ నేతలు హస్తినకు బయలుదేరారు.
కాగా, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నేడు దాదాపు ఒక్కొక్క అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇక, ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఇక, బీజేపీ కీలక భేటీ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ హస్తినకు పయనమయ్యారు. కాగా, అభ్యర్థుల ఎంపికపై వీరు అధిష్టానంలో తుది చర్చలు జరుపనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఎవరెవరు ఎక్కడెక్కడంటే..
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
- సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి
- కరీంనగర్: బండి సంజయ్
- నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి
- ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్
- మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్రెడ్డి
- జహీరాబాద్: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత
- చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి
- మహబూబ్‌నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్
- భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి
- మెదక్: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి
- వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి
- నాగర్‌కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం
- హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు,
- పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం
- నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి
- మహబుబాబాద్: హుస్సేన్‌నాయక్ / మరొకరికి
- ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు, రంగా కిరణ్
Comments
Please login to add a commentAdd a comment