ట్యాబ్ వినియోగంపై విద్యార్థిని ఆరా తీస్తున్నరాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
చీపురుపల్లి: రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఏం ఉద్ధరించాడో చెప్పాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏ ఒక్క కార్యక్రమం అయినా చేశాడా అని నిలదీశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని చంద్రబాబు, ఎల్లో మీడియా పదేపదే చెబుతోందని, ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమని, అయితే చేసిన అప్పులు ఏమయ్యోయో చూడాలని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అప్పులన్నీ ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసమే ఖర్చు చేశారన్నారు. కానీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పులన్నీ రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించకుండా స్వంతంగా దోచుకుతిన్నాడని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేవాలయంతో సమానమని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సచివాలయానికి వెళ్తే పరిష్కారమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరో దశాబ్దకాలం తరువాత ప్రపంచంతో పోటీపడేలా ప్రస్తుతం పునాది పడుతోందని తెలిపారు.
ఎనిమిదో తరగతి నుంచే బైజూస్ వంటి విలువైన కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చి పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మనవైపు చూస్తున్నారని చెప్పారు. ఎల్లో మీడియా, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు జగన్ దిగిపోవాలి, చంద్రబాబు కుర్చీ ఎక్కాలి అనే కుట్రతో పనిచేస్తున్నారని ఆయన ఓ విద్యా ర్థిని పిలిచి ట్యాబ్ వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment